హీరోయిన్ స్వాసిక విజయ్ (Swasika Vijay) మళ్లీ పెళ్లి చేసుకుంది. ప్రియుడు, నటుడు ప్రేమ్‌తో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ గతేడాది జనవరి 26న పెళ్లి జరిగింది. అయితే కేరళ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం జరిగింది. దీంతో తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ఆచరణలో పెట్టారు.
మరోసారి వేలు పట్టుకుని..
వధూవరుడిలా ముస్తాబై మండపంలో కూర్చున్నారు. ప్రేమ్.. మరోసారి అర్ధాంగితో కలిసి ఏడడుగులు వేశాడు. భార్య కాలికి మెట్టలు తొడిగాడు. ఈ వీడియోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. మేము తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకోసం సహకరించిన అందరికీ థాంక్యూ. దీన్ని నిజమైన పెళ్లిలా అందంగా, అద్భుతంగా జరిపారు అని ప్రేమ్ రాసుకొచ్చాడు. స్వాసిక, ప్రేమ్ 'మనంపోలే మాంగళ్యం' సీరియల్‌లో కలిసి నటించారు.
(చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)
హీరోయిన్‌గా కెరీర్ మొదలు
స్వాసిక అసలు పేరు పూజా విజయ్ (Pooja Vijay). వైగై (2009) అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఫిడల్ చిత్రంతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రభువింటే మక్కళ్, కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, పొరింజు మరియమ్ జోస్, చతురం, వాసంతి వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత సీరియల్స్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. పలు రియాలిటీ షోలలోనూ మెరిసింది. చివరగా లబ్బర్ పందు సినిమాతో అలరించింది.
సూపర్ హిట్‌గా లబ్బర్ పందు
లబ్బర్ పందు సినిమా విషయానికి వస్తే.. రూ.5 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. హరీశ్ కల్యాణ్, దినేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
చదవండి: మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్
Comments
Please login to add a commentAdd a comment