![Fashion Designer Amulya Krishna Kochhar Wedding Season Contrasting colors](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/fashion.jpg.webp?itok=YfhAHq3V)
వివాహ వేడుక అనగానే ఆ సందడి, ఆ వైభవం మన కళ్ల ముందు ఇట్టే నిలుస్తుంది. వేదికపై వధూవరులిద్దరూ ప్రత్యేక అందంతో వెలిగిపోతుంటారు.అందుకు, వారి డ్రెస్ డిజైన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ‘ఈ వెడ్డింగ్ సీజన్‌కి కాంట్రాస్ట్ కలర్స్, కాన్సెప్ట్ థీమ్స్‌నితమ డ్రెస్సుల్లో ఉండేలా కోరుకుంటున్నారు’ అంటూ ప్రస్తుత ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నారు హైదరాబాద్ వాసి సెలబ్రిటీ, బ్రైడల్ అండ్ గ్రూమ్ ఫ్యాషన్ డిజైనర్ అమూల్య క్రిష్ణ కొచర్.
‘‘వెడ్డింగ్‌తో తోపాటు ప్రతి ఈవెంట్‌కి స్పెషల్‌గా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో రీసెర్చ్ చేస్తుంటాం. ఆ డిజైన్స్ కస్టమర్ల ముందు పెడుతుంటాం. వారు ఏయే స్టైల్స్, కలర్ కాంబినేషన్స్ కోరుకుంటున్నారో దానిని బట్టి ప్రస్తుతం వేటిని ఇష్టపడుతున్నారో అర్ధమైపోతుంది.
కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్
కిందటేడాది వరకు వధూవరులిద్దరికీ ఒకే కలర్ డ్రెస్సింగ్ ఎంపిక ట్రెండ్‌లో ఉండేది. ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్ అయ్యింది. ఉదాహరణకు.. అబ్బాయి గోల్డెన్ కలర్ కుర్తా పైజామా దానికి కాంట్రాస్ట్‌గా అమ్మాయి లావెండర్ లేదా, రెడ్, గ్రీన్‌లో గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఉండేలా ఎంచుకుంటున్నారు.
అబ్బాయి సూట్‌కి తగినట్టు అమ్మాయి లెహంగా బార్డర్‌లోనో, ఎంబ్రాయిడరీలోనో చిన్న మార్పు కోరుకుంటున్నారు కానీ ఒకే కలర్‌లో కాదు. దీంతో ఇద్దరి డ్రెస్సింగ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రతీ వెడ్డింగ్ సీజన్‌కి కలర్ కాంబినేషన్స్‌లో మార్పులు వస్తుంటాయి.
రీ యూజబుల్ కాన్సెప్ట్
పెళ్లికి చాలా ఖర్చు పెట్టి ఒక డ్రెస్‌ని డిజైన్ చేసుకుంటారు. తిరిగి దానిని మళ్లీ ఎప్పుడూ ధరించరు. ఇది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మాత్రం పెళ్లి, సంగీత్, రిసెప్షన్ డ్రెస్సులను చిన్న చిన్న మార్పులతో మళ్లీ మళ్లీ ధరించేలా కాన్సెప్ట్స్‌ని ఇష్టపడుతున్నారు.
దీంతో ఒక ట్రెడిషనల్ డ్రెస్‌ను వెస్ట్రన్ స్టైల్‌తో ఎన్ని విధాలుగా మార్చులు చేసి ధరించవచ్చో స్టైలింగ్ చేసి చూపిస్తాం. పెళ్లికే కాకుండా ఇతర ఫంక్షన్స్‌కు కూడా అదే డ్రెస్‌ను మళ్లీ ధరించవచ్చు. ప్రతిసారి ఆ డ్రెస్ కొత్త స్టైల్‌తో ఆకట్టుకుంటుంది.
సంప్రదాయ చేనేత–ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్
సాధారణంగా పెళ్లికి మన చేనేతలనే ఇష్టపడతారు. వాటిలో కంచిపట్టుదే ప్రథమ స్థానం. పట్టు బ్లౌజ్‌కే కాదు చీరకూ ఎంబ్రాయిడరీని ఇష్టపడేవారున్నారు. పూర్తి సంప్రదాయబద్దమైన చీరకట్టు అయినా డ్రేపింగ్‌లో మార్పులు ఉన్నాయి. రిసెప్షన్ ఇతర వెస్ట్రన్ స్టైల్స్‌కి మాత్రం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్‌కి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఇటలీ ఫ్యాబ్రిక్‌ని వెస్ట్రన్‌స్టైల్స్‌కి ఉపయోగిస్తున్నాం. మన డిజైన్స్
ఇంటర్నేషనల్ టెక్నిక్స్
పెళ్లి అనగానే మనదైన సంప్రదాయ కళ ఉట్టిపడేలా ఏనుగులు, మామిడిపిందెలు. పల్లకి.. కాన్సెప్ట్ డిజైన్స్ ఉంటాయి. ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డిజైన్స్. ఈ డిజైన్స్‌కి ఇంటర్నేషనల్ ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ ఉపయోగిస్తుంటాం. వర్క్ నీటుగా, ఆకర్షణీయంగా, కోరుకున్న కాన్సెప్ట్ ఉండటంతో ఈ టెక్నిక్స్‌ను ఇష్టపడుతున్నారు’’ అని వివరించారు అమూల్య క్రిష్ణ కొచర్.
(చదవండి: ఇంట్లోనే ఇన్‌స్టంట్ గ్లో..!)
Comments
Please login to add a commentAdd a comment