Symbiosis
-
మనువాడమన్నందుకు.. మట్టుబెట్టాడు
కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను వదిలేసి ఆమె ప్రియుడి వెంట వచ్చేసింది. వారిద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చారు. ఇలా ఎంతకాలం.. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమె తన మనసులోని మాటను ప్రియుడి ముందు చెప్పింది. అంతే.. ఆమెను వదిలించుకోవాలని పథకం పన్ని.. నిద్రిస్తున్న సమయంలో హతమార్చాడు. కడప అర్బన్: ఆంధ్ర పదేశ్లోని కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడపలో నివాసం ఉంటున్న యశోద(29) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటనపై చిన్నచౌక్ పోలీసులు, మృతురాలి సోదరి గోవిందమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవుని కడపకు చెందిన యశోద గత నాలుగేళ్లుగా మాసాపేటకు చెందిన నిత్యపూజయ్య అలియాస్ సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కాగా, మృతురాలికి పదేళ్ల క్రితం జయశంకర్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగి విడిపోయారు. పిల్లలు భర్త జయశంకర్ వద్దే ఉన్నారు. చదవండి: ప్రియుడితో సహజీవనం.. వేధింపులతో.. ఈ క్రమంలోనే నిత్యపూజయ్య అలియాస్ సురేష్, యశోదలు గత నాలుగేళ్లుగా దేవునికడపలోని ఓ ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె తనను వివాహం చేసుకోవాలని నిత్యపూజయ్యను అడుగుతోంది. ఈ విషయమై పరస్పరం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి యశోద మంచంపై పడుకుని ఉన్న సమయంలో నిత్యపూజయ్య దిండును ఆమె తలపై పెట్టి ఊపిరాడకుండా చేసి, హత్య చేశాడు. తరువాత ఇంటికి తాళం వేసి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం వరకు తనకు ఫోన్ చేయకపోవడం, ఎలాంటి సమాచారం లేకుండా పోయేసరికి, మృతురాలి చెల్లెలు గోవిందమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లింది. అనుమానం వచ్చి స్థానికుల సహకారంతో తాళం పగులగొట్టించింది. తన అక్క మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ అమర్నాథ్రెడ్డి పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. చదవండి: సోఫా కొంటామని రూ. 63 వేలకు టోకరా -
ప్రియుడితో సహజీవనం.. వేధింపులతో..
వారిద్దరి మధ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్నేహం చిగురించింది.. అదికాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. ఇళ్లలో తమకంటే పెద్దవారు ఉన్నారనే కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వీరి సహజీవన ప్రయాణంలో అనుమానపు పొరలు అలుముకున్నాయి. వేధింపులు భరిస్తూ బతకడం కంటే తనువు చాలించడమే మేలనుకున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కడప అర్బన్: ప్రేమించిన యువకుడు తనను వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడప నగరం బుడ్డాయపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఆంథోనీ గీత(25) కడపలోని నాగరాజుపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలోని మరో ప్రైవేట్ హాస్పిటల్లో అనిల్‌కుమార్ ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. చదవండి: 15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర వీరిరువురు గతంలో క్రిస్టియన్‌లేన్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటిలో తమకంటే పెద్ద వయసు వారు ఉన్నారని, వారి పెళ్లిళ్లు కాగానే వివాహం చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడ్డాయపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటిలో ఇద్దరూ సహజీవనం చేసేవారు. ఈ మధ్య కాలంలో ఆంథోనీ గీతపై అనుమానం పెంచుకున్న అనిల్‌కుమార్ ఆమెను చచ్చిపో అంటూ వేధించేవాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె మంగళవారం అనిల్‌కుమార్ ఇంటిలో లేని సమయంలో ఇంటిపై భాగంలోకి వెళ్లి, ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి మల్లికను పోలీసులు పిలిపించారు. కేసు నమోదు చేసినట్లు రిమ్స్ సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. చదవండి: బెంగళూరులో దంపతుల హత్య... అనంతపురంలో నిందితుల అరెస్టు -
పీటల మీద పెళ్లి ఆగిపోయింది!
గణపురం: పెళ్లికి సిద్ధమైన వరుడి గుట్టు బయటపడడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వేరొక మహిళతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో శనివారం జరిగింది. రాంప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి చెల్పూరులో ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం ఎలాగో బయటకు పొక్కడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మానవ మృగం
బాలికలపై తండ్రికాని తండ్రి అఘాయిత్యం తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణం భయంతో వణికిపోతున్న బాధితులు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అతడో మానవ మృగం... తండ్రిలా నటించే మేకవన్నె పులి. పగలు ప్రేమ ఒలకబోస్తూ అదును కోసం ఆరాటపడే పచ్చి దుర్మార్గుడు. కూతురు వరుసైన ఆడపిల్లలపై విరుచుకు పడి కోర్కెలు తీర్చుకున్న కీచకుడు. వావి వరుసలు విస్మరించి సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి కాని తండ్రి వికృత చేష్టలివి. జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పలేక భయంతో బిక్కుబిక్కుమంటోన్న బాలికలు రెండ్రోజుల కిందటే ధైర్యాన్ని కూడదీసుకుని అసలు సంగతి బయట పెట్టారు. దీంతో బిడ్డలతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎక్కడో జరిగిన దారుణం కాదిది. తిరుపతి శివారు ప్రాంతంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి : తమిళనాడుకు చెందిన లక్ష్మి అనే మహిళ పదిహేనేళ్ల కిందట భర్తతో కలిసి తిరుపతి చేరుకుంది. ఈ దంపతులకు అప్పటికే ముగ్గురు సంతానం. పదేళ్ల కిందట గుండె జబ్బుతో భర్త కన్నుమూశాడు. దీంతో కుటుంబం ఆలనా పాలనా కష్టమైంది. ఆడపిల్లలను పెంచడం పూర్తిగా భారమైంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వంశీ అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం కాస్తా చనువుగా మారడంతో ఇద్దరూ కలిసి ఏడేళ్ల నుంచి సహజీవనం సాగిస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. అయితే అడ్డమైన ఆలోచనలు కలిగిన వంశీ చూపులు మొదటి భర్తకు పుట్టిన ఆడపిల్లలపై పడింది. ఇటీవల తల్లి ఊరెళ్లిన సమయంలో పెద్దమ్మాయి(13)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు మృగాడు కీచకుడిగా మారాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల అనంతరం చిన్నమ్మాయి పైనా ఇదేవిధంగా పైశాచికం ప్రదర్శించాడు. దీంతో తండ్రి కాని తండ్రి కనిపిస్తే ఆడపిల్లలు చిగురుటాకులా వణికిపోవడం మొదలైంది. ఇదేమీ తెలియని తల్లి ఈ మధ్య పిల్లలందరినీ వెంటబెట్టుకుని చంద్రగిరి మండలంలోని తన సొంతూరు వెళ్లింది. రెండు రోజుల తరువాత తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఆడపిల్లలు మొండికేశారు. తిరుపతి రామని తేల్చి చెప్పారు. ఎందుకు రారని తల్లి నిలదీస్తే అసలు విషయాన్ని బయట పెట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి పిల్ల లను వెంటబెట్టుకుని మంగళవారం సాయంత్రం ఎమ్మార్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల కోసం బాలికలను ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలికలకు వైద్యం అందుతోంది. వైద్యులిచ్చే రిపోర్టుల ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి కాని పెళ్లి...
అన్‌మ్యారీడ్ మ్యారేజ్ పెళ్లి కాని పెళ్లిలో సుఖాలెన్ని? కష్టాలెన్ని? తంతుకి తాళం వెయ్యక్కర్లేదు. తాళి అడ్డం రాదు. మెట్టెలు ఇబ్బంది పెట్టవు. అదేంటో... ఒక రకమైన ఫ్రీడమ్! పెళ్లికాకపోయినా పెళ్లయిన ఫీలింగ్! పెళ్లయినా పెళ్లికాని థ్రిల్లింగ్. కానీ మొగుడు కాని ఆ మొగుడు తోక లేపితే? గుర్రుమంటే? కరుస్తానంటే? క్యా కర్నా? ఏం చేయాలి? డోన్ట్ వర్రీ. ‘సుప్రీం’ మొట్టికాయలు వెయ్యొచ్చు. సహజీవనం కూడా పెళ్లిలాంటి పెళ్లే. ‘ఇప్పుడేడిస్తే ఏమొస్తదే? పాతభావాలు, చాదస్తపు పద్ధతులంటూ మమ్మల్ని తన్ని వెళ్లిపోయావ్? అరే.. మీనాన్న ఎంత బతిమాలాడు.. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని మా ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటున్నాం తల్లీ.. కాని ఇలా వద్దు.. పెళ్లితో ఒకింటి వారవండి అని! విన్నావా? మీ అన్నయ్య ఎంత నచ్చజెప్పాడు.. అర్భాటంగా నచ్చకపోతే గుడిలో అయినా పెళ్లి చేస్తాం.. పోనీ రిజిష్టర్ మ్యారేజ్ అయినా అని! చస్ పొండి.. గుడి.. దండలు మార్చుకోవడం ఇదంతా పెళ్లే కదా.. అసలు మాకు ఆ తంతే వద్దు పొమ్మంటుంటే...’ ‘అవును అన్నాను.. నా నెత్తిమీద జేజమ్మ కూర్చుందప్పుడు.. తప్పయింది.. క్షమించండి.. బుద్ధి వచ్చింది.. మీ కాళ్లు పట్టుకోనా’... మేనత్త మాటలను మధ్యలోనే తుంచేస్తూ ఆవేశంగా తన ఆవేదనను వెళ్లగక్కింది వారిజ. వారిజ వేదన అర్థమైంది ఆమె మేనత్తకు. రెండు మోకాళ్ల మధ్య తల దాచుకొని పొట్టలో దాగిన దుఃఖాన్ని వెళ్లగక్కుతున్న వారిజ పక్కన కూర్చుంది మేనత్త. ఆ పిల్ల తలమీద చేయివేసి చిన్నగా నిమురుతూ... ‘వారిజా.. పుట్టెడు కష్టంతో నా గడపలోకి అడుగుపెట్టావనే చిన్నచూపుతో అనలేదే. అప్పుడు మా మాట వినుంటే మా బంగారానికి ఈ రోజు ఈ అవమానం జరిగేది కాదు కదా అనే బాధతో అన్నాను’ అంది. అంతే ఆ సాంత్వనకు అత్తను అల్లుకుపోయింది వారిజ. ‘ఊరుకో.. ఏడిస్తే జరిగిన అవమానం సన్మానంగా మారదు.. ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం.. మీ అన్నయ్యకు చెప్పమంటావా?’ అనునయంగా కోడలి వీపును తడుముతూ అన్నది వారిజ మేనత్త. ‘లేదత్తా.. మీ మాటలను ఖాతరు చేయకుండా చేసిన తప్పును నేనే కరెక్ట్ చేసుకుంటా.. అన్నయ్యకేం చెప్పకు. ఒక్క హెల్ప్ చేయి చాలు’ అని. ‘ఏంటే..’ అంతే అనునయం ఆమె మేనత్త మాటల్లో.‘నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేవరకు నాకు, నా కూతురికి మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వు చాలు అత్తా’ అంటూ రెండు చేతులు జోడించింది వారిజ. ఆమె చేతులను పట్టుకుంటూ ‘అవేం మాటలే? నేను మీ అమ్మలాంటిదాన్ని కానా? షెల్టర్ ఇవ్వమని అడగడమేంటి? నీ హక్కు. నీ ఇష్టమొచ్చినన్నాళ్లు ఉండొచ్చు.. అసలు ఎప్పుడూ ఉండిపో ఎవరొద్దాన్నారే!’ అంటే కళ్లనీళ్లతో అక్కున చేర్చుకుంది వారిజను. అసలేం జరిగింది? అనాథ పిల్లలు, వృద్ధుల కోసం నడుపుతున్న ఓ ఎన్జీవోలో పనిచేస్తోంది వారిజ. అదే ఎన్జీవోలో పనిచేసే సురేష్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఏంటి అనే ప్రస్తావన వచ్చింది వాళ్ల మధ్య ఒకరోజు.. ‘వారిజా.. నాకు ఈ పెళ్లి వ్యవస్థ మీద నమ్మకం లేదు. రోజూ గొడవ పడుతూ, ఒకరి మీద ఒకరు కారాలు మీరియాలు నూరుకుంటూ వందేళ్ల శత్రువులుగా ఒకే రూఫ్ కింద ఉండడం ఎంత నరకం చెప్పు? అసలు అదేం లైఫ్?’ అన్నాడు. ‘నిజమే.. కాని పెళ్లి ఓ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్లా మారిపోయింది. ఇప్పుడు నువ్వు, నేను వ్యతిరేకిస్తే మారిపోదు కదా’ అంది వారిజ. ‘వ్యతిరేకించొద్దు. అలాగని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదుకదా’ అన్నాడు. ‘అంటే? అర్థంకానట్టు అడిగింది. వారిజకు దగ్గరగా వస్తూ ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ‘మనమిద్దరం ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఇరుక్కోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో కలకాలం కలిసి ఉందాం’ అన్నాడు. ఆ కాన్సెప్ట్ వారిజకూ నచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పింది. సురేష్ అంటే వారిజకున్న ప్రేమపట్ల ఆమె ఇంట్లో వాళ్లెవరికీ అభ్యంతరం లేదు. ఎటొచ్చి సురేష్ చెప్పిన ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ థాట్ పట్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ‘అసలు ఈ పిల్ల ఆ పిల్లాడి మాయలో పడి.. తన భవిష్యత్ గురించి పట్టించుకోవట్లేదు. ఏ భరోసాలేని ఆ బంధాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తోంది? ఇరువైపు పెద్దలు, మంత్రాలు, మంగళ సూత్రాధారణ, వందలమంది అతిథుల సమక్షంలో జరిగే పెళ్లంటేనే విలువ లేనివాడు కేవలం నోటి మాటే నమ్మకంగా సాగే కాపురాన్ని మాత్రం ఎలా గౌరవిస్తాడు అనే ఆలోచనలేదేంటి నాన్నా చెల్లికి’ అంటూ వారిజ అన్నయ్య వాపోయాడు. వారిజ తల్లి తల్లడిల్లింది. తండ్రి అయితే చెప్పి చెప్పి విసిగి పోయాడు. మేనత్తా ససేమీరా అంది. ‘మీరంతా ఇంకా పాత చింతకాయ పులుపునే ఆస్వాదిస్తున్నారు’ అంటూ కొత్త దారి వైపు పరుగుతీసింది వారిజ సురేష్ చేయి పట్టుకొని! పాప పుట్టేదాకా... కొత్తలో చాలా బాగా ఉంది. అరమరికల్లేకుండా ఉంటూనే ఎవరి స్పేస్ వాళ్లు తీసుకుంటూ కాపురం చేయడం... భలే అనిపించింది వారిజకు. వాళ్ల నాన్న దగ్గర అమ్మకు దక్కని గౌరవం సురేష్ దగ్గర తనకు దక్కుతున్న ఫీలింగ్.. గర్వంగా ఉండింది. కాలం గడుస్తోంది. పాప పుట్టింది. మెల్లగా అభద్రత మొదలవసాగింది వారిజకు. కారణం.. సురేష్‌లో వచ్చిన మార్పే. ఇంటిని, ఇల్లాలిని, పాపనూ పట్టించుకోవడం మానేశాడు. ఎన్జీవోలో ఉద్యోగం వదిలి ఏదో కార్పోరెట్ కంపెనీలో చేరాడు. జీతం బాగానే వస్తోందని తెలిసింది వారిజకు.. కాని ఎంతో భర్త చెప్పలేదు. ఆయన జీవన శైలీ మారింది. ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలంటూ తప్పతాగి తెల్లవారు జామున ఎప్పుడో ఇంటికి చేరేవాడు. కారు కొన్నాడు. ఈఎమ్ఐలు.. ఇతర లోన్లూ ఎక్కువయ్యాయి. దేనికీ లెక్క చెప్పట్లేదు. ఇంటి బాధ్యత అంతా వారిజ నెత్తిన పడింది. ఓపిక పట్టినన్నాళ్లూ పట్టి ఒకరోజు నిలదీసింది. ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’ అన్నాడు సురేష్. ఇంకా గట్టిగా మాట్లాడితే.. ‘అసలు నువ్వెవరు? నేనెందుకు నీ ఇంటి బాధ్యత మోయాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘నేను నీ భార్యను’ అంది ఆవేశంగా వారిజ. ‘అని ఎక్కడుంది? సాక్ష్యమేంటి?’ అన్నాడు నింపాదిగా. ఖంగు తిన్నది. ‘అవును.. మన పెళ్లయినట్టు.. నువ్వు నా భార్య అన్నట్టు, ఇది నా బిడ్డే అన్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురా.. ఒప్పుకుంటా.. అంతేకాని ఇట్లా పెళ్లాంలా పెత్తనం చేయకు.. నా జోలికి రాకు’ అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చంటిదాన్ని దగ్గర తీసుకొని ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోయింది వారిజ. సురేష్ స్నేహితుడి ద్వారా అతని అడ్రస్ కనుక్కొని వెళ్లింది. అక్కడా ఇదే అవమానం. తనకు వచ్చే జీతంతో ఇంటి అద్దె, పాప పెంపకం.. ఖర్చులు.. భరించలేకపోయింది. ఎటూ దిక్కుతోచని స్థితిలో మేనత్త ఇంటికి చేరింది. న్యాయం కోసం... మేనత్తను తీసుకొని అడ్వకేట్‌ను కలిసింది వారిజ. ఆమె కథంతా విన్న అడ్వకేట్ ముందుగా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేయించింది. దాని ద్వారా వారిజ రెసిడెన్షియల్ ఆర్డర్స్, మెయిన్టెనెన్స్ సాధించుకుంది. కోర్టులో కూడా సురేష్ వారిజ తన భార్యకాదని, పాప తన లెజిటిమేట్ చైల్డ్ కాదని సిగ్గు లేకుండా వాదించాడు. అయితే వారిజ గతే ఏడేళ్లుగా భార్యభర్తలుగా ఒకే రూఫ్ కింద కలిసి జీవిస్తున్నామని, ఆ బిడ్డ తమ బిడ్డే అని సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచడంతో తోక ముడిచాడు సురేష్. - సరస్వతి రమ సహజీవనంలో భార్యకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాహిత మహిళకు ఎలాంటి హక్కులుంటాయో సహజీవన బంధంలోని మహిళకూ అలాంటి హక్కులే ఉంటాయి. మోసపోయినా, హింసకు గురైనా కోర్టును ఆశ్రయించవచ్చు. పోషణ భృతి పొందవచ్చు. వారి పిల్లలకు ఆస్తి హక్కులూ సంక్రమిస్తాయి. సహజీవనంలో పురుషుడు మధ్యలో వదిలేసి వెళితే మహిళా భాగస్వామికి చట్టబద్ధంగా ప్రశ్నించే, నిలదీసే అధికారం ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించినా అది పెళ్లే అవుతుంది. కొందరు సహజీవన బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు సహజీవనం అని దేన్నంటారు? ఇద్దరూ మేజర్లై ఉండాలి, అవివాహితులై ఉండాలి, విడాకులు పొందిన వారైనా, వితంతువులైనా అయి ఉండాలి, కొన్ని యేళ్లు నిరంతరాయంగా కలిసి జీవించాలి. అంతేకాని భార్య ఉండగా మరో స్త్రీతో, భర్త ఉండగా మరో పురుషుడుతో సంబంధం ఏర్పర్చుకుంటే అది సహజీవనం కాదు. మొన్నటి వరకు వివాహిత మహిళలకే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎమ్‌టీపీ) యాక్ట్ ప్రకారం అబార్షన్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఇటీవలకాలంలో సహజీవనంలోని మహిళలకూ ఆ వెసులుబాటు కల్పించేలా చట్టాన్ని సవరించారు. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
ప్రేమ ముసుగులో..!
► ప్రియురాలితో సహజీవనం పెళ్లికి పట్టుబట్టడంతో బెదిరింపులు ► వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య ► కేసును ఛేదించిన పోలీసులు . కర్నూలు: ప్రేమ ముసుగులో ఓ యువతిని వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. నిందితున్ని అరెస్ట్ చేసి శనివారం.. ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఒకటో పట్టణ సీఐ కృష్ణయ్యతో కలసి శనివారం మధ్యాహ్నం వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. నందికొట్కూరు మండలానికి చెందిన కిషోర్.. 2013లో కర్నూలు నగరం ఐడియా టెలికాంలో టెరిటోరి సేల్స్ మేనేజర్(టీఎస్ఎం)గా పనిచేసేవాడు. అదే సంస్థలో కర్నూలు మేదారి వీధికి చెందిన గొల్ల సురేఖ కూడా పనిచేసేది. ఆమెతో పరిచయం ఏర్పడి కొంతకాలం తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో సహజీవనం చేశాడు. రెండేళ్ల తర్వాత సురేఖ ఐడియా సంస్థ నుంచి ఎయిర్‌టెల్‌కు మారింది. ఆ క్రమంలో వారిద్దరి సహజీవన వ్యవహారం కిషోర్ భార్యకు తెలిసింది. ఈ నేపథ్యంలో కాపురాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రికి మా ర్చాడు. తరచూ కర్నూలుకు వచ్చి వెళ్తున్న కిషోర్‌తో పెళ్లి చేసుకోవాలని సురేఖ ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఫోన్లో పెళ్లి ప్రస్తావన చేస్తుండేది. అందుకు కిషోర్ నిరాకరించి మరోసారి పెళ్లి ప్రస్తావన చేస్తే సహజీవనం చేసిన అసభ్యకరమైన ఫొటోలను మహాజర్ గ్రూప్‌లో అప్లోడ్ చేస్తానని, ఆ ఫొటోలను ఆమె సెల్‌ఫోన్ వాట్సప్‌కు పెట్టి బెదిరించాడు. అసభ్యకరమైన పదజాలంతో ఎస్ఎంఎస్లు పెట్టి సురేఖను తీవ్రమైన మనోవేదనకు గురిచేసి మానసికంగా హింసించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఏప్రిల్ 27వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సంబంధాలు చెడిపోతున్న కారణంగానే తన కూతురు అఘాయిత్యానికి పాల్పడిందని తండ్రి వన్నప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల తర్వాత సురేఖ సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు, వాట్సాప్‌లో ఉన్న అసభ్యకర ఫొటోలను గుర్తించి ఆధారాలతో సహా తండ్రి పోలీసులకు సమర్పించారు. సీఐ బి.ఆర్.కృష్ణయ్య, ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి కేసును ఛేదించారు. కల్లూరులోని తల్లిదండ్రుల ఇంట్లో నింది తుడు కిషోర్ ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు: ఎస్పీ మహిళలకు సంబంధించిన సమస్యలేవైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాని నేరుగా తనకు కాని ఫిర్యాదు చేయవచ్చునని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. చిన్నచిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని సూచించారు.ప్రేమ పేరుతో వంచనకు గురిచేసే మాయగాళ్ల మాటలు నమ్మవద్దని మహిళలకు సూచించారు. ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులకు మనోవేదన మిగిలించవద్దని సూచించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కేసు మిస్టరీని ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినందుకు సీఐ, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
స్టాండప్
స్కూల్లో పిల్లలు సరిగా చదువుకోకపోతే ‘స్టాండప్ ఆన్ ది బెంచ్’ అని పనిష్మెంట్ ఇస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికోసం నిలబడాలంటారు.. అదేనండీ.. స్టాండప్ అంటారు. ఈ సమాజంలో ఎవరికైనా, ఎప్పుడైనా కష్టం వస్తే... వాళ్ల కోసం కూడా నిలబడాలని అంటారు. ఈ అమ్మాయిలిద్దరికీ అమ్మానాన్నలు విధించిన పనిష్మెంట్... స్టాండప్ ఆన్ ది బెంచ్. అంటే ఏకాకుల్ని చేసేశారు! అయితే ఈ అమ్మాయిలు.. ‘మాకు చదువు కావాలి’ అని రెవెన్యూ దర్బారులో ధైర్యంగా లేచి నిలబడి అడిగారు. ఈ కథనం చదివి మనలో ఎంత మంది... ఇలాంటి చిన్నారుల కోసం లేచి నిలబడతారో చూడాలి. మహబూబ్‌నగర్ జిల్లా.. నవాబుపేట.. ఎప్పటిలాగే ఆరోజూ రెవెన్యూ దర్బార్ జరుగుతోంది. ఆ మండల గ్రామాల్లోని చాలామంది ఆ దర్బారుకు హాజరయ్యారు. రకరకాల సమస్యల గురించి మొరపెట్టుకుంటున్నారు. వినతిపత్రాలను అందజేస్తున్నారు. ఇంతలో అక్కడ కూర్చున్న గుంపులోంచి ఇద్దరు అమ్మాయిలు లేచినిలబడ్డారు. ఒక అమ్మాయికి ఎనిమిదేళ్లు, ఇంకో అమ్మాయికి అయిదేళ్లుంటాయి. ‘సర్ .. మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్నలేడు. మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. అనాథలం. మేనత్త దగ్గరుంటున్నం. మాకు బాగా చదువుకోవాలనుంది. కాని మా మేనత్త దగ్గర పైసలు లేవు. మీరు బడిల చేర్పించి.. పుస్తకాలు కొనిస్తే.. మంచిగ చదువుకుంటం.. మమ్మల్ని చదివించండి సార్’ అంటూ తమ మనసులో మాటను విన్నవించుకున్నారు. ఆ మేరకు ఓ వినతిపత్రాన్నీ తహశిల్దార్‌కు అందచేశారు. ఆ మాటలు తహశిల్దార్నే కాదు దర్బారునంతటినీ కదిలించాయి. కంటనీరు పెట్టించాయి. ఆ పిల్లలకు చదువు చెప్పిస్తామంటూ కొంతమంది ముందుకొచ్చారు. అయితే వాళ్లు ఈ పిల్లలను తమ వెంట హైదరాబాద్ తీసుకెళ్లి చదివిస్తామంటున్నారు. హైదరాబాద్ వెళ్లడానికి పిల్లలు భయపడ్తున్నారు. అందుకే వాళ్ల మేనత్తంటోంది.. ‘పదవ తరగతి వరకు నవాబుపేటలోనే చదివిస్తా.. అప్పటికి వాళ్లకు కొంచెం తెలివొస్తది. అప్పుడు వాళ్లకు నచ్చిన చోట చదువుకుంటరు’ అని. ‘మేం పేటలోనే చదువుకుంటం.. అమ్మను (మేనత్తను అమ్మా అని పిలుస్తారు) వదిలి ఎక్కడికీ వెళ్లం’ మేనత్త భుజాల చుట్టూ వేసిన ఆ చిట్టి చేతుల పట్టును మరింత బిగుతు చేస్తూ అన్నారు పిల్లలు పిల్లల భయానికి కారణం వాళ్ల నేపథ్యం కావచ్చు! వాళ్ల తండ్రి పేరు చింతికింది కుమార్. నవాబుపేట్ మండలం.. గురుకుంట సొంతూరు. ఈ ఊళ్లో కుమార్‌కు రెండు ఎకరాల పొలం ఉంది. ఓవైపు పొలం చూసుకుంటూనే ఇంకోవైపు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో వంటమాస్టర్‌గా పనిచేసేవాడు. గురుకుంటకే చెందిన అముర్తతో అతనికి పెళ్లయింది. పెళ్లయిన మొదట్లో ఆలుమగలిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. యేడాదికే పెద్దమ్మాయి శృతి పుట్టింది. పట్టరాని సంతోషమైంది కుమార్‌కి. బిడ్డ అంటే ఎనలేని ప్రేమ తండ్రికి. ‘మమ్మీ’ అని పిలుచుకుంటూ ప్రాణం పెట్టేవాడు. శృతి పుట్టాక భార్య, బిడ్డను ఊళ్లోనే ఉంచి... ఉద్యోగరీత్యా తాను మాత్రం హైదరాబాద్‌లో ఉండసాగాడు కుమార్. వారానికి రెండుసార్లు గురుకుంట వెళ్లేవాడు. ఇక్కడ ఊళ్లో అముర్త పొలం పనికి వెళ్లేది. సాఫీగానే కాలం సాగిపోతోంది. మూడేళ్లు గడిచాయి. చిన్న కూతురు అనిత పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ వెళ్లడం మానేశాడు కుమార్. వ్యవసాయ పనులే చూసుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఓరోజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు కుమార్. అప్పుడు పెద్దపాపకు మూడేళ్లు.. చిన్నపాప మూడునెలల పసికందు. కుమార్ చనిపోయిన అయిదురోజులకే అముర్త ఆ పిల్లలిద్దరినీ తీసుకొని కుమార్ చిన్న అక్కయ్య ఉండే కొండాపూర్‌కు చేరుకుంది. ఆ ఊళ్లోని బడిలో ఈ పిల్లలిద్దర్నీ వదిలేసి వెళ్లిపోయింది. ఈ సమాచారాన్ని ఆ బడిలోనే చదువుకుంటున్న కుమార్ సోదరి పిల్లలు తమ తల్లికి అందించారు. ఆమె హుటాహుటిన బడికి వచ్చింది. ఈ విషయం ఆ ఊరంతా వ్యాపించింది. ఊళ్లో వాళ్లంతా గుమిగూడారు అక్కడ. ‘ఏ తల్లి అయినా పిల్లల్ని ఇలా వదిలేసి వెళ్లిపోతదా? పైగా ఇద్దరు ఆడపిల్లలు’ అంటూ తలోమాట మాట్లాడసాగారు. ఎవరేం మాట్లాడినా పిల్లల్ని ఎవరు పెంచాలన్నది ప్రశ్నగా మిగిలింది. ఆమె వెంటనే తన అక్కయ్య పద్మమ్మకు కబురు పెట్టింది. పద్మమ్మ కొండాపూర్ వచ్చి పిల్లల్నిద్దరినీ తెచ్చేసుకుంది. తండ్రి చనిపోయేనాటికి శృతికి కాస్త ఊహ తెలుస్తోంది కాబట్టి.. తదనంతరం జరిగిన ఈ పరిణామాలను చూసి భయపడి మేనత్తను వదిలి హైదరాబాద్ వెళ్లడానికి పిల్లలిద్దరూ సుముఖంగా లేకపోవచ్చు. కూలికి వెళితేనే కూటికొస్తుంది పిల్లల్ని సాకుతున్న పద్మమ్మది కలిగిన కుటుంబమేమీ కాదు. ఆ మాటకొస్తే మగతోడులేని సంసారం ఆమెది. భీమారం గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యింది. పిల్లలు లేరు. భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తుండేవాడు. ఉన్నట్టుండి చనిపోయాడు. అప్పటినుంచి పద్మమ్మ గురుకుంటలోనే ఉంటోంది. వితంతు పింఛన్, కూలీ తప్ప ఇంకో జీవనాధారం లేదు. రోజూ పనికి వెళితేనే కూటికి వస్తది. ‘పిల్లల్ని తెచ్చుకున్నప్పుడు చిన్న పిల్ల మూడునెలలది కదా.. పాలకోసం రాత్రంతా ఏడ్చేది. పెద్దదేమో.. వాళ్ల నాన్న ఫోటో చూసుకుంటా ఏడ్చేది. గోస అనిపించేది. వీళ్లను వదిలిపెట్టి పనికి పోయేటట్టు లేకుండే పరిస్థితి... పని చేయకపోతే వీళ్లను సాకలేను. చాలా యాతన పడ్డ. లాస్ట్‌కి మా అమ్మ దగ్గర పిల్లల్ని వదిలి పనికిపోయేదాన్ని. అయినా ధ్యాసంతా పిల్లల మీదనే ఉంటుండే’ అంటూ కంటనీరు పెట్టుకుంది పద్మమ్మ. ఎల్ఐసీ డబ్బులూ.. ‘ఇద్దరి పిల్లల్ని బాగా చదివించాలే.. వాళ్లకు అండగా ఉండేలే’ అని కలలు కనేవాడట కుమార్. ముందు జాగ్రత్తతో జీవిత బీమా చేశాడు. అయితే కుమార్ చనిపోయాక వచ్చిన డబ్బులను నామినీగా ఉన్న అముర్తే తీసుకెళ్లిందని, కనీసం ఆ డబ్బులున్నా పిల్లల చదువుకు పనికివచ్చేవని బాధ పడుతుంది పద్మమ్మ. ‘వాళ్ల నాన్న ఉంటే అన్నీ చూసుకునేవాడు. నాకంత స్థోమత లేదు.. ఉన్నదాంట్లోనే ఏ లోటూ రాకుండా పిల్లల్ని చూసుకుంటా. కాలం బాగున్నప్పుడు చానా పనిదొరికేది. నాట్లు, కలుపు, వరికోతలకు పోయేదాన్ని. ఇప్పుడు కాలం లేదు..పనులు లేవు. ఫించన్, దొరికిన నాడు కూలీ తప్ప ఇంకేం లేదు’ అంటూ తన ఆర్థికస్థితిని వివరించింది ఆమె. ‘బాగా చదువుకొని నాకు టీచర్ కావాలని ఉంది’ అని పెద్దమ్మాయి శృతి అంటే.. ‘నేను పోలీస్ అయితా’ అని చిన్నపాప అనిత చెప్తుంది. ఈ చిన్నారుల చేయి పట్టుకొని నడిపించేందుకు మార్గదర్శకులు మందుకు వస్తారని ఆశిద్దాం.. దత్తత తీసుకొని కొత్త జీవితాల్ని ప్రసాదించే వరప్రదాతలూ ఉంటారని కోరుకుందాం. వీళ్ల చదువుకోసం ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు పైన ఇచ్చిన అకౌంట్‌నెంబర్‌కి పంపగలరు - కొడిగంటి వీరేశం, నవాబుపేట, మహబూబ్‌నగర్ బ్యాంక్ అకౌంట్‌నంబర్ చింతికింది పద్మమ్మ, అకౌంట్‌నంబర్ : 62451543770 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, నవాబుపేట, మహబూబ్‌నగర్ జిల్లా -
నాన్నలాంటోడే కాటేశాడు
మహిళతో సహజీవనం ఆమె కూతురిపై లైంగికదాడి సింగరేణి కాలనీలో దారుణం సైదాబాద్: అమ్మకు ఆరోగ్యం బాగాలేదు.. కొద్దిరోజులు ఆసరాగా ఉందామని ఆ బాలిక స్కూలు వదలి వచ్చింది.. అయితే ఆ అమాయకురాలిపై మృగాడి కళ్లు పడ్డాయి.. మానవమృగంలా లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తల్లికి తెలిసి పోలీసులను ఆశ్రయించింది.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో సింగరేణికాలనీ గుడిసెలలో బుధవారం ఈ సంఘటన జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. నల్గొండజిల్లా దేవరకొండ మండలం తాటికొల్లు గ్రామానికి మందపల్లి సుజాతకు బాపట్లకు చెంది న శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె(13) ఉంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణికాల నీ గుడిసెలలో నివా సం ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ మృతి చెందాడు. అనంతరం ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ అమ్జత్(32) సుజాతతో పరిచయం పెంచుకుని సహజీవనం చేస్తున్నాడు. సుజాత కుమార్తె పరిగిలో ఉంటూ ఏడో తరగతి చదువుతోంది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే దసరా సెలవుల్లో తల్లికి ఆసరాగా ఉందామని వచ్చింది. కొద్దిరోజులుగా చింతల్‌బస్తీలోని అమ్మమ్మ వద్ద ఉంటుంది. రెండు రోజుల క్రితం తల్లివద్దకు వచ్చింది. అయితే కుమార్తెను ఇంటి నుంచి పంపించి వేయాలని అమ్జత్ సుజాతను కొడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరూ గొడవ పడగా తల్లి బయటకు వెళ్లింది. ఎవరూలేని సమయంలో అమ్జత్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె స్థానికులతో కలిసి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీ సులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా లైం గికదాడి ఘటనలు పునరావృతమవుతూ నే ఉన్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. జంటనగరాలలో రోజూ ఎక్కడో చోటు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బాలికలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని కోరారు. లైంగికదాడికి పాల్పడ్డ అమ్జత్ను కఠినం గా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
యువతిని మోసగించిన కానిస్టేబుల్ అరెస్టు
- ఏడు సంవత్సరాలుగా సహజీవనం - ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ - మరో యువతిని పెళ్లాడిన నిందితుడు పటమట : ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుందామంటూ సహజీవనం చేశాడు. కొంతకాలం గడిచాక నువ్వు నాకు నచ్చలేదన్నాడు... తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.. చివరికి కటకటాలపాలయ్యాడు. ఇదీ ఓ కానిస్టేబుల్ వ్యవహారం. పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంకలోని సత్యనారాయణ నగర్లో నివసిస్తున్న ఎ.శ్రీరామ్‌కుమార్(31) మాచవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో మొగల్రాజ పురంలోని ఒక కంటి ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే యువతితో చనువు ఏర్పడింది. గతంలోనే ఒక ప్రయివేట్ పాఠశాలలో ఆ యువతికి కానిస్టేబుల్‌తో ముఖపరిచయం ఉంది. ఆ యువతితో మాటలు కలిపి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతో సహజీవనం ప్రారంభించాడు. తొలుత హెచ్‌బీ కాలనీలో కాపురం పెట్టాటు. ఆ తరువాత హైదరాబాద్ తీసుకెళ్లి ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగంలో చేర్పించాడు. హైదరాబాద్‌లో ఉండగానే ఒకసారి గోవా తీసుకెళ్లాడు. అక్కడ తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తరువాత తిరిగి విజయవాడ పటమటలంక లంబాడీపేటకు మకాం మార్చాడు. ఏడేళ్లు సహజీవనం చేసిన తరువాత ‘నువ్వంటే ఇష్టం లేదు, నేను మరొకరిని పెళ్లి చేసుకున్నా’నని ఆ యువతితో చెప్పాడు. ఈ విషయం బయటకు చెబితే గోవాలో తీసిన వీడియోలు నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు జూలై 31వ తేదీన ఫైర్ కంట్రోల్ రూమ్ వద్ద బందరుకాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫైర్ సిబ్బంది గమనించి ఆమెను రక్షించారు. అనంతరం కానిస్టేబుల్ శ్రీరామ్‌కుమార్ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి నివసిస్తున్న పరిధి పటమట పోలీస్ స్టేషన్లో ఉండటంతో ఆ కేసును పటమట సీఎస్‌కు బదిలీ చేశారు. కేసు విచారణ ప్రారంభించిన సీఐ దామోదర్ నిందితుడు శ్రీరామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
ఎవరికీ చెప్పలేక...
చాలా పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో పుట్టింది అక్షర. చదువైపోగానే మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిపో యింది. అక్కడ నాలుగైదేళ్లు ఉన్న తర్వాత తమ మాట కాదనదన్న నమ్మకంతో తలి దండ్రులు ఆమెకు ఒక అబ్బాయితో పెళ్లి కుదిర్చారు. ఆమెని ఇండియాకు పిలిపించి, పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన మర్నాడే అక్షర స్నేహితులను కలిసొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాక పోవడంతో ఫోన్ చేశారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అందరూ టెన్షన్ పడసాగారు. మర్నాడు అక్షర ఫోన్ చేసి, అమెరికాలో తాను ఇష్టపడ్డ వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోన్న విషయం చెప్పింది. ఆ విషయం చెబుదామనుకునేలోపే తనకు పెళ్లి కుదిర్చారనీ, తలిదండ్రుల పరువు తీయడం ఇష్టం లేక పెళ్లికి తలవంచా ననీ, ఇప్పుడు చేసుకున్న వ్యక్తితో కలిసి జీవిం చడం ఇష్టం లేక వెళ్లిపోతున్నానని తెలియ జేసింది. దాంతో ఏమి చేయాలో తోచక ఆమె తలిదండ్రులు తలలు పట్టుకున్నారు. అంతలో వరుడి తల్లిదండ్రులు నానా రభసా చేశారు. దాంతో జరిగిన దానికి విచారిస్తు న్నాననీ, జరిగినదంతా మరచిపోయి వేరే పెళ్లి చేసుకోమని వరుడికి అక్షరతో ఉత్తరం రాయించారు ఆమె తలిదండ్రులు. ఫోన్ ద్వారానూ చెప్పించారు. వారికి అమెరికన్ కోర్టు ద్వారా విడాకులు కూడా మంజూరై నాయి. అయితే అవి ఇక్కడ చెల్లవనీ ఇండియాలో విడాకులు ఇప్పించాలని వరుడి తలిదండ్రులు అభ్యర్థించారు. రెండు కుటుంబాల మధ్య పరస్పర అవగాహన ఉంది కాబట్టి, వారి మధ్య కంజుమేషన్ జరగలేదు కాబట్టి వెంటనే విడాకులు మంజూరయ్యాయి. అబ్బాయి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరూ ఎవరి దారిన వారు హాయిగా జీవిస్తున్నారు. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే, కూతురి అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి సెటిల్ చేయడం పెద్దవాళ్ల తప్పు. సహజీవనం చేస్తున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టడం అక్షర చేసిన తప్పు. కనీసం పెళ్లి పీటల మీదయినా విషయం చెప్పి, పెళ్లి ఆపు చేయించివుంటే బాగుండేది. అలా కూడా చేయకండా పెళ్లయ్యాక చెప్పకుండా పారిపోవడం పెద్ద తప్పు. ఏది ఏమయినా మూర్ఖత్వానికి పోకుండా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత ఎవరి దారిన వారు జీవించడం ఒక్కటే ఇక్కడ ప్లస్ పాయింట్. -
ఫేస్బుక్లో వివాహితకు వల
'హైదరాబాద్ మహిళతో ఉపాధ్యాయుడి సహజీవనం, అరెస్ట్ బంజారాహిల్స్ : ఫేస్బుక్లో పరిచయమైన వివాహిత (48)కు ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో వల వేసి సహజీవనం చేస్తున్నాడు. నిందితుడిని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన ఓ ట్రాఫిక్ ఎస్సై భార్యను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో నివాసం ఉంటూ కాసిపేట మండలంలోని మల్కేపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చల్లా జ్ఞానేశ్వర్ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెకు వల వేసి మంచిర్యాల తీసుకెళ్లి పద్మావతి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నాడు. తన భార్య కనిపించడం లేదంటూ ట్రాఫిక్ ఎస్సై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత శుక్రవారం మంచిర్యాల వెళ్లి సదరు వివాహితను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన జ్ఞానేశ్వర్ విషయం వెల్లడించింది. తన భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వివాహిత భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జ్ఞానేశ్వర్‌పై గతంలో యువతులకు ప్రేమపేరుతో వల వేసి మోసం చేసిన కేసులున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
సహజీవనంతో పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఓ పురుషుడు, ఓ మహిళ దీర్ఘకాలం పాటు భార్యాభర్తల మాదిరి కలిసి జీవించడం వల్ల పుట్టిన పిల్లలను అక్రమ సంతానంగా పిలవరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది. సహజీవన సంబంధాలపై మద్రాసు హైకో ర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలను సవాల్ చేస్తూ ఉదయ్‌గుప్తా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో.. న్యాయమూర్తులు బి.ఎస్.చౌహాన్, జె.చలమేశ్వర్‌లు గురువారం ఈ స్పష్టత ఇచ్చారు. చట్టబద్దమైన వివాహమంటే.. సాధారణంగా పెళ్లైన జంటకు ఉండే సంప్రదాయపరమైన హక్కులన్నిటినీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు అభిప్రాయం చట్టరీత్యా సమర్థనీయం కాదని పేర్కొంటూ ఉదయ్ గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
సహజీవనం సాగించడంలో తప్పేముంది?
నటి గౌతమికి ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నట్లు ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. కమల్ హాసన్, సారికలు మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. నటి సారిక ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు. కమల్ మాత్రం గౌతమితో సహజీవనం చేస్తున్నారు. అయితే కమల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపరు. అలాంటిది ఇటీవల మలయాళ పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూలో నటి గౌతమితో సహజీవనం గురించి వివరించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- గౌతమి తనతోనే ఉంటున్నారని తెలిపారు. ఆమె భయాందోళనలు తాను అర్థం చేసుకున్నానని, ఆమెకు కావలసిన ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నానని చెప్పారు. కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే బంధం బలపడుతుందన్నారు. మనసుకు నచ్చిన ఆడ, మగ కలిసి జీవించడంలో తప్పేముందంటూ ప్రశ్నించారు. విమర్శకులు ఎలాగో విమర్శిస్తూనే ఉంటారన్నారు. ‘మనసులు కలిసిన వాళ్ళు సహజీవనం సాగించడాన్ని ఇతరులెందుకు వ్యతిరేకించాలి?’ అంటూ తనదైన శైలిలో కమల్ స్పందించారు.