నాన్నలాంటోడే కాటేశాడు | Sexual assault on a woman in a relationship with her daughter | Sakshi
Sakshi News home page

నాన్నలాంటోడే కాటేశాడు

Published Thu, Dec 3 2015 12:09 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

నాన్నలాంటోడే కాటేశాడు - Sakshi

నాన్నలాంటోడే కాటేశాడు

మహిళతో సహజీవనం ఆమె కూతురిపై లైంగికదాడి
 సింగరేణి కాలనీలో దారుణం

 
సైదాబాద్:  అమ్మకు ఆరోగ్యం బాగాలేదు.. కొద్దిరోజులు ఆసరాగా ఉందామని ఆ బాలిక స్కూలు వదలి వచ్చింది.. అయితే ఆ అమాయకురాలిపై మృగాడి కళ్లు పడ్డాయి.. మానవమృగంలా లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తల్లికి తెలిసి పోలీసులను ఆశ్రయించింది.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో సింగరేణికాలనీ గుడిసెలలో బుధవారం ఈ సంఘటన జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. నల్గొండజిల్లా దేవరకొండ మండలం తాటికొల్లు గ్రామానికి  మందపల్లి సుజాతకు బాపట్లకు చెంది న శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె(13) ఉంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణికాల నీ గుడిసెలలో నివా సం ఉంటున్నారు.

ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ మృతి చెందాడు. అనంతరం ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ అమ్జత్(32) సుజాతతో పరిచయం పెంచుకుని సహజీవనం చేస్తున్నాడు. సుజాత కుమార్తె పరిగిలో ఉంటూ ఏడో తరగతి చదువుతోంది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే దసరా సెలవుల్లో తల్లికి ఆసరాగా ఉందామని వచ్చింది. కొద్దిరోజులుగా చింతల్‌బస్తీలోని అమ్మమ్మ వద్ద ఉంటుంది. రెండు రోజుల క్రితం తల్లివద్దకు వచ్చింది.  అయితే కుమార్తెను ఇంటి నుంచి పంపించి వేయాలని అమ్జత్ సుజాతను కొడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరూ గొడవ పడగా తల్లి బయటకు వెళ్లింది. ఎవరూలేని సమయంలో అమ్జత్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె స్థానికులతో కలిసి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీ సులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా లైం గికదాడి ఘటనలు  పునరావృతమవుతూ నే ఉన్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు.  జంటనగరాలలో రోజూ ఎక్కడో చోటు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బాలికలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని కోరారు. లైంగికదాడికి పాల్పడ్డ అమ్జత్‌ను కఠినం గా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement