Sujata
-
సుజాత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గట్టు: మావోయిస్టు అగ్రనేత సుజాత అలియాస్ పద్మ అలియాస్ మైనా అలియాస్ కల్పన ఎక్కడున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆమెను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం మొదలైంది. విప్లవ పోరాటంలో 40 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న సుజాత ఇటీవల అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం తెలంగాణకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె లొంగుబాటుకు ప్రయత్నించారా లేక మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఒడు పుగా అదుపులోకి తీసుకుని రహ స్యంగా విచారిస్తున్నారా అన్న అంశంపై భిన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే సుజాత పోలీసుల అదుపులో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇటు పోలీసుల నుంచి గానీ, అటు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో మావోయిస్టు పార్టీలో సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యురాలైన సుజాత ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భద్రాద్రి జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జిల్లాలో సుజాతను పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.అందరి చూపూ ఆ ఊరి వైపే..నక్సల్స్ ఉద్యమంలో సాధారణ స్థాయి నుంచి కీలక నేతగా ఎదిగిన సుజాత పోలీసులకు పట్టుబడ్డారనే వార్తల నేపథ్యంలో అందరి దృష్టి ఆమె స్వగ్రామం పెంచికలపాడు వైపు మళ్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, యంకమ్మ దంపతుల రెండో సంతానం సుజాత. సుమారు 40 ఏళ్ల క్రితం గద్వాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న క్రమంలో అన్న శ్రీనివాసరెడ్డితో కలిసి నక్సల్స్ ఉద్యమంలోకి అడుగుపెట్టారు.కొన్నేళ్ల తర్వాత తండ్రి తిమ్మారెడ్డి మరణంతో అన్న శ్రీనివాసరెడ్డి స్వగ్రామానికి వచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులు వివాహం జరిపించడంతో ఆయన మళ్లీ ఉద్యమం వైపు వెళ్లకుండా గ్రామంలోనే ఉండిపోయారు. అయితే సుజాత మాత్రం తండ్రి మరణం తర్వాత కూడా స్వగ్రామం వైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు తెలిపారు. మావోయిస్టు పార్టీలో ఒకప్పుడు అగ్రనేతగా పేరున్న కిషన్‌జీని సుజాత పెళ్లి చేసుకున్నారు. సుజాతకు కుమార్తె కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ఆమె ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లో రూ.కోటికి పైగా రివార్డు ఉంది. -
మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. లొంగుబాటుకు ప్రయత్నాలు? సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం. కిషన్జీతో వివాహం? మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్‌జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్కౌంటర్లో చనిపోయారు. -
Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం మాజీ భార్యాభర్తల మధ్య రాజకీయ యుద్ధానికి వేదికగా మారింది! బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ సౌమిత్రఖాన్పై ఆయన మాజీ భార్య సుజాత మోండల్ బరిలో దిగారు. ఆమె టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సౌమిత్ర విజయం కోసం అన్నీ తానై కష్టపడ్డ సుజాత, ఈసారి తన గెలుపు గ్యారంటీ అంటున్నారు. ఈ మాజీ దంపతుల దంగల్‌లో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. బిష్ణుపూర్‌లో మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది... రాజకీయ విడాకులు...! సౌమిత్ర ఖాన్ 2014లో తృణమూల్ పార్టీ తరఫున విజయం సాధించి బిష్ణుపూర్పై వామపక్షాల పట్టును బద్దలు కొట్టారు. తరువాత బీజేపీలో చేరి 2019లోనూ గెలిచారు. అనంతరం ఆయన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. ఉద్యోగాల ఆశ చూపి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ముందు సౌమిత్రపై కేసు నమోదైంది. బీజేపీలోకి మారినందునే మమత సర్కారు తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసు కారణంగా 2019 ఎన్నికలప్పుడు ఆయన బంకురా జిల్లాలోకి ప్రవేశించకుండా కలకత్తా హైకోర్టు నిషేధించింది. దాంతో భర్త కోసం సుజాత అన్నీ తానై బిష్ణుపూర్‌లో ప్రచారం చేశారు. ఆమె కారణంగానే 2019లో ఖాన్ విజయం సాధించారంటారు. అయితే బీజేపీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ సుజాత 2020లో పార్టీని వీడారు. ఈ విషయంలో భర్త తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయనకూ దూరమయ్యారు! ఆమె టీఎంసీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో సౌమిత్ర విడాకులిచ్చారు. ఆ వెంటనే సుజాత తన పేరు నుంచి ఖాన్‌ను తొలగించుకున్నారు. స్థానిక ఎన్నికల బరిలో దిగి బంకురా జిల్లా పరిషత్ సభ్యురాలిగా గెలిచారు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట బిష్ణుపూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2014 దాకా సీపీఎంకు కంచుకోట. దీని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి! తృణమూల్ రెండింట్లోనే గెలిచింది. ఈసారి సీపీఎం శీతల్ కెబర్టా అనే టీచర్‌ను బరిలో దింపింది. ఆమెకు కూడా నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాను గొప్ప పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుద్యోగం, నీటి కొరత సమస్యలను పరిష్కరిస్తానన్న హామీలకు ప్రజలు బాగా స్పందిస్తున్నారు. సౌమిత్రపై అసంతృప్తి... తాగునీటి ఎద్దడి, రోడ్ల దుస్థితి బిష్ణుపూర్‌లో ప్రధాన సమస్యలు. ఎంపీగా ఇచ్చిన హామీలేవీ సౌమిత్రా నెరవేర్చలేదనే విమర్శ ఉంది. ఎన్నికల తర్వాత ఆయన కని్పంచనే లేదన్నది స్థానికుల ఆరోపణ. రోడ్ల దుస్థితికి తోడు నేత కార్మికుల దుస్థితి కూడా ఈ చారిత్రాత్మక పట్టణంలో మరో పెద్ద సమస్య. బిష్ణుపూర్ పట్టు చీరలకు ప్రసిద్ధి. కానీ చేనేత ఉత్పత్తులను సేకరణకు ఏర్పాట్లే లేవని కారి్మకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు తనదేనని సుజాత విశ్వాసంతో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెండర్ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోలేవు
సాక్షి, అమరావతి : టెండర్ నిబంధనలను బిడ్డర్లు సంతృప్తిపరిచారా లేదా అన్న విషయాలు పూర్తిగా బిడ్ ఆహ్వానించిన అధికారుల పరిధిలోనివని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని చెప్పింది. టెండర్ ప్రక్రియలో కోర్టుల జోక్యం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వం, ప్రజలు రెండు విధాలుగా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, పనుల్లో అసాధారణ జాప్యం వల్ల ప్రజలు మౌలిక సదుపాయాలకు దూరమవుతారని వెల్లడించింది. రూ. 148 కోట్లతో చేపట్టిన రాజుపాళెం – అమరావతి రోడ్డు టెండర్ ప్రక్రియలో ఎలాంటి దోషం లేదని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఈ పనులను వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కేబీసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్–కేబీసీ) జాయింట్ వెంచర్‌కు అప్పగించడాన్ని సమర్థించింది. ఈ టెంటర్లపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు. టెండర్ల తిరస్కరణపై పిటిషన్లు గుంటూరు జిల్లా రాజుపాళెం – అమరావతి రోడ్డు విస్తరణ, బలోపేతానికి ఆర్ అండ్ బీ టెండర్లు ఆహా్వనించగా, నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు, కొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో పృథ్వీ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను, సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో శ్రీసాయినాథ్ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను అధికారులు తిరస్కరించారు. దీనిపై ఇరు కంపెనీలు వేర్వురుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటు వల్ల అనుభవ ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయలేదన్నారు. దీనిపై వివరణ ఇచ్చినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్ అండ్ బీ తరఫున ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపిస్తూ.. అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన బాధ్యత బిడ్డర్లదేనన్నారు. బిడ్డర్లను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆన్లైన్ ద్వారానే అన్ని పత్రాలు ఇవ్వాలని, ఆఫ్‌లైన్‌లో స్వీకరించే అధికారం అధికారులకు లేదని తెలిపారు. బిడ్ తెరిచిన ఐదు రోజుల తరువాత అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని పిటిషనర్లు ఇచ్చారన్నారు. నిబంధనల ప్రకారమే తమ బిడ్‌ను ఆమోదించారని వీఎస్–కేబీసీ జేవీ తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుజాత ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలతో ఏకీభవించారు. అప్లోడ్ చేయని డాక్యుమెంట్ విషయంలో బిడ్డర్‌ను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్లు చేసిన జాప్యానికి మొత్తం టెండర్ ప్రక్రియను రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. -
జీపీఏ హోల్డర్ పన్ను ఎగవేసినా ఆస్తిని రిజిస్టర్ చేయాలి
సాక్షి, అమరావతి: జీపీఏ హోల్డర్ ఆదాయ పన్ను ఎగవేశారన్న కారణంతో అసలు యజమానికి చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించడం చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆస్తి జీపీఏ హోల్డర్ది కానప్పుడు రిజిస్ట్రేషన్‌కు నిరాకరించకూడదని చెప్పింది. ఆ భూములు నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ)లో కూడా లేవని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్ట విరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని స్పష్టం చేసింది. పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసి, విడుదల చేయాలని విశాఖపట్నం జిల్లా సబ్బవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖ జిల్లా పెదగంట్యాడకు చెందిన జానపరెడ్డి వెంకట భారతి అనకాపల్లి జిల్లా రేబాకలో తనకున్న 2.50 ఎకరాలకు మర్రిపాలేనికి చెందిన నెట్టిమి ఉదయ భాస్కర్‌కు జీపీఏ ఇచ్చారు. ఈ భూమిలో 5,402 చదరపు గజాలు నీలంశెట్టి మల్లమ్మకు, 3,418 చదరపు గజాలు కోడూరు రూపకు 2014 సెప్టెంబర్‌లో జీపీఏ హోల్డర్ ద్వారా భారతి విక్రయించారు. అయితే సబ్బవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వారి డాక్యుమెంట్లను విడుదల చేయలేదు. దీంతో 2015 జూలైలో మల్లమ్మ, రూప జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేశామని, ఆదాయ పన్ను శాఖ ఆమోదం లభించిన తరువాతే రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ వారికి లేఖల ద్వారా తెలిపారు. దీనిని సవాలు చేస్తూ రూప, మల్లమ్మ 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.శివకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఆదాయ పన్ను శాఖ జప్తు చేసిన ఉదయ భాస్కరరావు ఆస్తులు తాము కొన్న భూములు కూడా ఉన్నాయని తెలిపారు. 2014 సెప్టెంబరు 11న తాము రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్లు సమర్పించగా, అధికారులు ఆ నెల 29న జప్తు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. ఆదాయ పన్ను శాఖ జప్తు ఉత్తర్వుల కాల పరిమితి 2 సంవత్సరాలేనని, వాటిని అడ్డంపెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ తమ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయకుండా అట్టిపెట్టుకోవడం చెల్లదన్నారు. ఆదాయ పన్ను శాఖ తరఫున సీనియర్ న్యాయవాది కె.రాజిరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కొన్న భూములు నిషేధిత జాబితాలో లేవని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
బాయ్స్ హాస్టల్ నిర్వాహకురాలి మృతి.. అతనిపైనే అనుమానం!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఇంటికి వేసిన తలుపులు వేసినట్టుగానేఉన్నాయి. లోపలకు ప్రవేశించేందుకు మరొకరికి అవకాశం లేదు. అయినా ఓ వివాహిత హత్యకు గురైంది. నాలుగు నెలలైనా ఈ కేసులో మిస్టరీ వీడలేదు. ఏం జరిగిందంటే.. అనంతపురంలోని జీసస్ నగర్లో నివాసముంటున్న బయపురెడ్డి, సుజాత దంపతులు. బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డికి ఈ ఏడాది ఆగస్టు 14న గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన నిహారికరెడ్డితో వివాహమైంది. అదే నెల 24న రాత్రి కొడుకు, కోడలితో సరదాగా ముచ్చటించిన తర్వాత సుజాత తన గదిలోకి వెళ్లి నిద్రకుపక్రమించింది. మరో గదిలో కొడుకు, కోడలు నిద్రపోయారు. సుజాత తండ్రి సైతం రోజూ మాదిరిగానే ఇంటి బయట తలుపునకు తాళం వేసి వరండాలో నిద్రించాడు. ఇంటి వెనుక తలుపునకు లోపలి నుంచి గడియ పెట్టారు. ఉదయం కొడుకు విష్ణువర్దన్‌రెడ్డి నిద్ర లేచి హాల్లోకి వచ్చేసరికి తల్లి కనిపించలేదు. మొక్కలకు నీళ్లు పోసేందుకు మేడపైకి వెళ్లి ఉంటుందనుకుని తన పనిలో నిమగ్నమయ్యాడు. ఈలోపు ఇంటి ముందు తలుపు తాళం తీసుకుని తాత లోపలకు వచ్చాడు. ఎంతసేపటికీ సుజాత కనిపించక పోయేసరికి అందరిలో ఆందోళన మొదలైంది. వెనుకవైపు తలుపు తీసేందుకు ప్రయత్నిస్తే రాలేదు. బయట గడియ పెట్టినట్లుగా ఉంది. దీంతో ప్రహరీ ఆవరణలో నుంచి ఇంటి వెనుకకు వెళుతుండగా విగతజీవిగా పడి ఉన్న సుజాత కనిపించింది. మెడకు ఉరి బిగించి చంపినట్లుగా తెలుస్తోంది. బాధ్యులు ఎవరు? సుజాత హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది మిస్టరీగానే ఉంది. నాలుగు నెలలుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తొలుత కుమారుడిని పరిపరివిధాలుగా ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు ఇంట్లోకి ఎవరైనా రావాలంటే ఇంటి వెనుక ఉన్న తలుపు ఎవరో ఒకరు తీసి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలోనే కుమారుడిని విచారణ చేశారు. విష్ణువర్దన్‌రెడ్డి వివాహ సమయంలో పుట్టింటి వారు సుజాతకు ఒడి బియ్యం పెట్టారు. ఆ సమయంలో సంప్రదాయాన్ని అనుసరించి ఆమె మెడలో పసుపు తాడు వేశారు. అయితే విగతజీవిగా పడి ఉన్న సుజాత మెడలోని పసుపు తాడుకు పసుపు కొమ్మ కట్టి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం అంతు చిక్కడం లేదు. డబ్బు కోసమేనా? సుజాత, బయపురెడ్డి దంపతుల మధ్య లోపించిన సఖ్యతను బాయ్స్ హాస్టల్ వ్యవహారాలు చక్కబెట్టేందుకు వచ్చిన ఓ వ్యక్తి తెలివిగా సొమ్ము చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే సుజాతను లోబర్చుకుని పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెతో ఘర్షణకు దిగాడు. బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తుండడంతో ఆ వ్యక్తిని సుజాత దూరం పెట్టింది. రెండేళ్లకు పైగా అతని జాడ లేదు. ఉన్నఫళంగా విష్ణువర్దన్‌రెడ్డి పెళ్లిలో అతను ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో తన డబ్బు ఎలాగైనా సర్దుబాటు చేయాలని అతనికి సుజాత సూచించింది. అందుకు అతను గడువు కోరాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బు వెనక్కు ఇవ్వడం ఇష్టం లేక ఆ వ్యక్తే సుజాతను హతమార్చి ఉంటాడా? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అవమాన భారం తాళలేకా? సుజాత హత్య వెనుక మరో యువకుడి ప్రమేయాన్ని సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. సుజాత వ్యవహారం తెలిసిన ఓ యువకుడు కొన్ని నెలల క్రితం ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. దీనిపై అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె చెప్పు తీసుకుని ఆ యువకుడిని కొట్టింది. అనంతరం ఒత్తిళ్లకు తలొగ్గి కేసును ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అవమాన భారం తాళలేక సుజాతను ఆ యువకుడు హతమార్చి ఉంటాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో రెండు మూడ్రోజుల్లో ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించనున్నారు. -
రామలింగారెడ్డి భార్యకే దుబ్బాక టికెట్?
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నికలో దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. టికెట్ కేటాయింపునకు సంబంధించి పార్టీ అధిష్టానం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఖరారైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్‌ను సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంతో పాటు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆశిస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ నాయకులు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడు సతీష్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య సుజాత కోరుతున్నా, పార్టీ నాయకులు మాత్రం సుజాత అభ్యర్థిత్వంవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ సోకడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు కోలుకుని సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. క్వారంటైన్ సమయంలో ఫోన్ ద్వారా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులను సమన్వయం చేసిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం నుంచి క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. -
కోమేషా కరోనా
ఉహురు కెన్యాట్టా – కెన్యా అధ్యక్షుడు, మార్గరెట్ వాంజిరు గకువో – కెన్యా తొలి మహిళ, వాళ్ల ముందు భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ప్రసంగించారు ఓ మహిళ. మన వివాహ వ్యవస్థను చప్పట్లతో అభినందిస్తూ మళ్లీ మళ్లీ విన్నారు వాళ్లు. కెన్యాలో ఉన్న హిందువుల పెళ్లిని నిర్ధారించాల్సిన బాధ్యత ఆమెకే అప్పగించారు. ఇప్పుడు... దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తున్నాయి... యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యతనూ ఆమె భుజాల మీదనే పెట్టింది కెన్యా. ఇప్పుడామె... ఆ దేశంలో వాళ్లకు మన నమస్కారాన్ని నేర్పిస్తున్నారు. చిలుక పచ్చ బోర్డరున్న నేవీ బ్లూ చేనేత చీర కట్టుకుని, చెవులకు బుట్ట జూకాలు ధరించిన ఓ అచ్చమైన తెలుగింటి మహిళ చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడి చివరగా స్వాహిలి భాషలో ‘కోమేషా కరోనా’ అంటూ నమస్కారంతో పూర్తి చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కెన్యా దేశ ప్రజలకు వివరించడానికి రూపొందించిన వీడియో అది. ఇరవై ఏడేళ్ల కిందట భర్త ఉద్యోగ రీత్యా ఆరు నెలలు మాత్రమే ఉండడానికి కెన్యాలో అడుగుపెట్టారు కోటంరాజు సుజాత. ‘ఇరవై ఏడు క్యాలెండర్లు మారినా నాకింకా ఆరు నెలలు పూర్తికాలేద’న్నారామె నవ్వుతూ. స్వాహిలి భాష నేర్చుకుని కెన్యా ప్రజలతో మమేకమైపోయారామె. కరోనాసంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కెన్యా తీసుకుంటున్న రక్షణ చర్యల్లో భాగంగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సుజాత దగ్గరకు వచ్చింది. భౌతికదూరం పాటించడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, షేక్‌హ్యాండ్‌కు బదులు నమస్కారం చేయడం ద్వారా కరోనాను దూరంగా ఉంచవచ్చనే సందేశాన్ని సుజాత మాటల్లో చెప్పించుకుంది కెన్యా. ఆ దేశ టీవీల్లో ఆమె సందేశమిచ్చిన వీడియో ప్రసారమవుతోంది. బందరమ్మాయి కోటంరాజు సుజాత పుట్టింది, పెరిగింది మచిలీపట్నంలో. పెళ్లి తరవాత హైదరాబాద్‌కి వచ్చి చైల్డ్ సైకాలజీలో కోర్సు చేశారు. భర్త కోటంరాజు రుద్రప్రసాద్ బరోడాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఉద్యోగంలో భాగంగా కెన్యాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశం వెళ్లడానికి మొదట్లో ఏ మాత్రం ఇష్టపడని సుజాత... కొన్నాళ్ల తర్వాత అయిష్టంగానే కెన్యాలో అడుగుపెట్టారు. అది కూడా ఆరునెలల్లో వచ్చేయవచ్చనుకుంటూ విమానం ఎక్కారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది ప్రసవం కోసమే. ‘గృహిణిగా కెన్యాలో అడుగుపెట్టిన సుజాత... ఇప్పుడక్కడ కీలకమైన బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. కెన్యా సమాజ నిర్మాణంలో కూడా ఆమె సేవలందిస్తున్నారు. జర్మనీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన అంతర్జాతీయ శాంతిసదస్సుకు కెన్యాప్రతినిధిగా హాజరయ్యారు. ‘ఆఫ్రికా ఉమెన్ ఫెయిత్ నెట్వర్క్’, కెన్యా హెల్త్‌కేర్, లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, యాంటీ కరప్షన్ స్టీరింగ్ కమిటీలలో మెంబరుగా విశేషంగా సేవలందిస్తున్నారు. కెన్యాలోని హిందూ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ, సత్యసాయి సేవా సమితి వైస్‌ప్రెసిడెంట్‌గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఉపాధికి దూరమైన వాళ్లను ఆదుకోవడానికి కెన్యాలో ఉన్న హిందూ కౌన్సిల్ ప్రభుత్వానికి వంద మిలియన్ షిల్లింగులను (సుమారు ఏడు కోట్ల పదిలక్షల రూపాయలు) విరాళంగా ఇవ్వడంలో సుజాత చొరవ ప్రధానమైనది. ఇవి కాకుండా స్వయంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి బాధితుల శరణాలయాలకు వెళ్లి విరాళాలను పంపిణీ చేశారామె. మనవాళ్లే స్ఫూర్తి ‘‘1992లో మా వారు కెన్యాలో కొంతకాలం పని చేయాలని చెప్పగానే ప్రపంచ పటం తీసుకుని కెన్యా ఎక్కడ ఉందోనని చూసుకున్నాను. అన్యమనస్కంగానే బయలుదేరాను. అప్పటికి కెరీర్ ప్లాన్లు కూడా ఏమీ లేవు. అక్కడికి వెళ్లిన తర్వాత నాలో మార్పు వచ్చింది. సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది. కెన్యాలో నూరుశాతం అక్షరాస్యత ఉంది. ఇళ్లలో పని చేయడానికి వచ్చిన వాళ్లు కూడా మంచి ఇంగ్లిష్ మాట్లాడతారు. రెండు–మూడు తరాల కిందట మనదేశం నుంచి వెళ్లిన అనేక కుటుంబాలు నాలో ఇండిపెండెంట్‌గా జీవించగలగాలనే కోరిక కలిగించాయి. ముఖ్యంగా గుజరాత్ వాళ్లయితే ముసలి వాళ్లు కూడా సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తుంటారు. దాంతో నేను ఇండియాలో చదివిన మాంటిస్సోరీ చైల్డ్ సైకాలజీలోనే అడ్వాన్స్డ్ కోర్సు చేసి అదే విద్యాసంస్థలో టీచర్‌గా చేరాను. పిల్లలతోపాటు నేనూ స్కూలుకెళ్లేదాన్ని. కొన్నేళ్లకు మా వారు ఉద్యోగం మానేసి నైరోబీ (కెన్యా రాజధాని)లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. తరచూ మారిపోయే ఉద్యోగులతో ఆయనకు ఇబ్బంది ఎదురవుతుండేది. దాంతో నేను టీచర్ ఉద్యోగం మానేసి మా సంస్థలో హెచ్ఆర్, అకౌంట్స్ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాను. సంస్థ నిర్వహణలో నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయమేమిటంటే... కరోనా లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగాల కోత, జీతాల కోతను ఆశ్రయిస్తున్నాయి. కానీ నేను ఆ పని చేయలేదు. కెన్యా భాష స్వాహిలి నేను సరదాగా స్వాహిలి భాష నేర్చుకున్నాను. నేను మాట్లాడే స్వాహిలి విన్న వాళ్లు నేను కెన్యాలో పుట్టి పెరిగాననుకుంటారు. వాళ్ల భాష నేర్చుకోవడం వల్ల స్థానికంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో వాళ్లతో సులభంగా కలిసిపోగలిగాను. ప్రస్తుతం కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి కరోనా నియంత్రణ, నివారణ కోసం పని చేస్తున్నాను. చాలా బాగా కట్టడి చేయగలిగామనే చెప్పాలి. మా దగ్గర కోవిడ్ కేసులు పదకొండు వందల దగ్గరే ఆగిపోయాయి. మరణాలు యాభై దాటలేదు’’ అన్నారు సుజాత. రెండూ సొంత దేశాలే మన భారతదేశంలో పుట్టి, కెన్యా గురించి మాట్లాడేటప్పుడు ‘మా దగ్గర’ అన్నారామె. అంతగా ఆ దేశంతో మమేకమైపోయారు సుజాత. ‘‘మరి ఈ దేశం (కెన్యా) మాకు పౌరసత్వం కూడా ఇచ్చింది. ‘మా’ అనుకోకుండా ఉండలేను. ఇండియా ఎంతో నాకు కెన్యా కూడా అంతే’’ అన్నారు సుజాత. కరోనా తగ్గిన తర్వాత ఫ్రాన్స్‌లో ఉన్న పెద్ద కొడుకు, యూఎస్‌లో ఉన్న చిన్న కొడుకుకీ సెలవు చూసుకుని అందరం ఒకసారి ఇండియాకి రావాలని ఉందన్నారామె. – వాకా మంజులారెడ్డి ‘కరోనాను కట్టడి చేద్దాం’ అని కెన్యా ప్రజలకు పిలుపునిస్తున్న కోటంరాజు సుజాత -
బాల్రాజా మజాకా!
ప్లీడర్ బాల్‌రాజు దగ్గరికి పెద్దగా క్లయింట్లు రారు. ఆ వచ్చినవాడు కూడా రూపాయి చేతిలో పెట్టి ‘‘ఎలాగైనా సరే కేసు గెలిపించాలి. నీదే పూచీ’’ అంటాడు. ఇలాంటి బాల్రాజుకి గట్టి కేస్ ఒకటి తగిలితే! కమ్మని సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యం విందు చేసే సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘ఇదేనా ప్లీడర్ ఇల్లు?’’ అని ప్రశ్నించి ‘‘ఇదే అయ్యుంటుందిలే’’ అని సమాధానం చెప్పుకున్నాడు రాకరాక వచ్చిన క్లయింటు.ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నల్లకోటుతో బయటకు వచ్చాడు. క్లయింట్గారి సందేహానికి నల్లకోటే సమాధానం చెబుతుంది. అయినా సరే...‘‘ఏయ్... ప్లీడర్ బాల్‌రాజు ఇల్లు ఇదేనా?’’ అని సాక్షాత్తు ప్లీడర్నే పట్టుకొని అడిగాడు క్లయింటు.ప్లీడర్‌గారు లైట్‌గా నొచ్చుకొని...‘ఏందయ్యా మంచీమర్యాద లేకుండా. కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా’’ అన్నారు.ఇప్పటికైనా క్లయింటు ఊరుకున్నాడా? ఎక్కడ ఊరుకుంటాడు. మళ్లీ అలాగే అడిగాడు...‘‘ప్లీడర్ బాల్‌రాజు ఇల్లుఇదేనా?’’‘‘నేనేనయ్యా బాల్రాజును. కావాలంటే చూడు ఒక కేసు స్టడీ చేస్తున్నాను’’ అని క్లయింట్‌ను నమ్మించడానికి కళ్లలోని భావాల సహాయ సహకారాలతో తెగ ప్రయత్నించాడు ప్లీడరు.అయినా సరే...‘‘నాకు డౌటే బావా!’’ అన్నారు క్లయింట్గారి బామ్మర్దిగారు.ఇలా కొంచెంసేపయ్యాక... అతడు ప్లీడరేనని, అతని పేరు బాల్రాజేనని, అతడి ఇల్లు ఇదేనని క్లయింట్గారు బలహీనంగా నమ్మారు. తాను ఎందుకొచ్చింది ఇలా చెప్పారు...‘‘ఇంతకీ కేసేమిటంటే, నాకో అరటితోట ఉంది. అందులో రోజూ ఒకడు అరటిగెల మాయం చేస్తున్నాడు. ఆడ్ని చితగ్గొట్టాను...’’‘‘ఓస్ అంతేగా... ముందు ఫీజు ఇవ్వు’’ క్లయింట్‌కు ధైర్యం చెప్పాడు బాల్‌రాజు.క్లయింట్గారు చాలా జాగ్రత్తగా రూపాయి బిళ్లను ప్లీడర్ చేతిలో పెట్టాడు. ప్లీడర్‌గారు నవ్వలేడు. ఏడ్వలేడు. అలా అని మౌనంగానూ ఉండలేడు.... అయ్యో! అంతమాత్రాన మీరు అతడిని చెవిలో దూదిలా తేలిగ్గా తీసిపారేయకండి... ఈ సీన్లలో చూడండి ఎలా విజృంభిస్తున్నాడో... ‘‘యువరానర్ ఇది గోపాలకృష్ణ–సుజాత మ్యారేజి సర్టిఫికెట్. వాళ్లిద్దరికీ పెళ్లైందనడానికి ఇదే ఆధారం’’ అన్నాడు ప్లీడర్ బసవరాజు.‘‘వందరూపాయలకు కూడా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు దొరికే ఈరోజుల్లో ఇలాంటివి బోలెడు సంపాదించవచ్చు’’ అని తేలికగా ఆ సర్టిఫికెట్‌ను తీసేశాడు ప్లీడర్ బాల్‌రాజు. అంతేకాదు...‘‘నా కేసులో నిజం తేల్చడానికి బసవరాజును ఎగ్జామిన్ చేయాలి. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ’’ అని జడ్జివైపు గౌరవపూర్వకంగా చూశాడు బాల్‌రాజు.ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆబగా...‘‘యస్. యూ కెన్ ప్రొసీడ్’’ అని అనుమతి ఇచ్చారు జడ్జిగారు.బసవరాజు బోనులోకి వచ్చాడు. బాల్‌రాజు ప్రశ్నల ఆయుధం అందుకున్నాడు...‘‘మీకు గోపాలకృష్ణగారు ఎంతకాలంగా తెలుసు?’’‘‘పది పదిహేనేళ్లుగా తెలుసు. వాళ్ల కంపెనీకి నేనే లీగల్ అడ్వైజర్‌ని. పైగా... హీ వాజ్ క్లోజ్‌ఫ్రెండ్ ఆఫ్ మైన్’’‘‘ఐసీ. అంత క్లోజ్ఫ్రెండై ఉండి ఈ లీగల్ అడ్వైజర్గారు పెళ్లికి ఎందుకు వెళ్లలేకపోయారు?’’‘‘వెళ్లేవాణ్ణే. కానీ వాళ్లకు పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే’’‘‘ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్లారా లేదా?’’‘‘వెళ్లలేదు’’బసవరాజు చెప్పింది అబద్ధమని పదినిమిషాల్లో నిరూపించాడు బాల్‌రాజు.‘‘మీ ముందు మరో బలమైన సాక్ష్యం ప్రవేశపెడతాను’’ అని జడ్జిగారి అనుమతి కోరాడు. ఆ సాక్షి మనిషి కాదు.టీవీ! ఆ టీవీ ఠీవిగాకోర్టుహాలులోకి వచ్చి నిజమేమిటో చెప్పింది... కాదు... కాదు... చూపించింది. టీవీలో గోపాలకృష్ణ పెళ్లి వీడియో రన్ అవుతోంది. అందులో ప్లీడర్ బసవరాజు చాలా స్పష్టంగా కనిపించాడు!‘పోల్చుకున్నారా బసవరాజుగారూ. ఇది డ్యూయెల్ రోల్ కాదు. మీరే’’ బసవరాజును వెక్కిరింపు ధోరణిలో అన్నాడు బాల్‌రాజు.తేలుకుట్టిన దొంగైపోయాడు బసవరాజు!‘‘ఈ కేసును నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకు వారసురాలిని చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా ఆస్తుల కంటే మించిన సౌభాగ్యం ఏముంటుంది? కానీ, ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడిచేసిన దుర్మార్గుల్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది.ఒక ఆడదాన్ని ఎంతమంది హింసించారు? ఆమె కన్నీటికే గనుక శపించే శక్తి ఉంటే వీళ్లందరినీ సర్వనాశనం చేసి ఉండేది’’ బాల్‌రాజు డైలాగులకు కోర్టు హాలు అదిరిపడింది. బాల్రాజా మజాకా! మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి.నిందితుడు కోర్టు బోనులో ఉన్నాడు.‘‘మీకు పెళ్లై ఎంత కాలమైంది?’’‘‘23 ఏళ్లు. నా భార్య పేరు వర్ధనమ్మ’’‘‘మీకెంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు. ఆదిబాబు, గోపాలకృష్ణ’’‘‘జనరల్‌గా పెద్దపిల్లాడి పేరు మొదట చెబుతారు. ఆ.. అది వదిలేయండి. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేనా?’’‘‘ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది?’’‘‘అలా అని రుజువులేమీ లేవు కదా.అయినా కోర్టువారు నమ్ముతారు లెండి. మీ పిల్లలే అని. మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలవుతుంది?’’‘‘ఆ... డిసెంబరు.... 1965’’‘‘అంతసేపు ఆలోచించారు. మరుపు సహజం. వయసు కదా, సరే 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా...అంటే గోపాలకృష్ణా, ఆదిబాబు కవలపిల్లలా?’’‘‘కాదు... గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు’’‘‘ఎన్నేళ్లు?’’‘‘పదకొండు’’‘‘అంటే, పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మకు మీకు శారీరక సంబంధం ఉందన్నమాట!’’‘‘బాబూ... ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది’’‘‘పొరపాటు, సమాధానం చెప్పడంలోనా? పిల్లల్ని కనడంలోనా? చెప్పండి ఎన్నేళ్ల నుంచి?’’‘‘పెళ్లికి ముందు ఐదేళ్ల నుంచి’’‘‘ఐసీ. ఇంతవరకు గోపాలకృష్ణ మీకు అక్రమసంతానం అనుకున్నా. అసలు మీ కొడుకే కాదన్నమాట’’. ∙ -
నీరవ్ మోదీని చెప్పుతో కొడతా
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) భారీ కుంభకోణం కేసు నేపథ్యంలో గీతాంజలి జెమ్స్‌కు చెందిన పలువురు అధికారులతో పాటు, నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని నిన్న సీబీఐ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో వీరిని మార్చి 5 వరకు పోలీసు కస్టడీలో ఉంచనున్నట్టు సీబీఐ సెషన్స్ కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైర్ స్టార్ గ్రూప్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య సుజాత పాటిల్ తీవ్రంగా స్పందించారు. నీరవ్ మోదీ భారత్‌కు వస్తే, తన చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు. సెషన్స్ కోర్టు వెలుపల సుజాత పాటిల్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓయూల దరఖాస్తులను రూపొందించారనే క్రమంలో ఫైర్ స్టార్‌కు చెందిన ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఎల్‌ఓయూలతోనే నీరవ్ మోదీ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ''అర్జున్ నెలకు రూ.30వేలు మాత్రమే సంపాదిస్తారు. ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోరు. ఏం చెప్తే అదే చేస్తారు. ఆయన ఎలాంటి అక్రమాలు పాల్పడలేదు'' అని సుజాత చెప్పారు. రేప్, మర్డర్ చేసిన వారు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారు, కానీ అమాయకుడైన తన భర్తను మాత్రం అరెస్ట్ చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సీబీఐ తమ ఇంట్లో సోదాలు చేసిందని, కానీ ఏం దొరకలేదన్నారు. ఈ విషయంలో తామేమీ దాయడం లేదని కుండబద్దలు కొడుతున్నట్టు చెప్పింది. ప్రస్తుత పరిణామాలు టీవీ సీరియల్ మాదిరి ఉన్నాయంటూ ఆమె సీబీఐ, మోదీ, మీడియాను నిందించారు. -
జవహర్‌కు చోటు.. సుజాతకు ఉద్వాసన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన పీతల సుజాతకు ఉద్వాసన పలికిన చంద్రబాబు నాయుడు ఆమె స్థానంలో అదే వృత్తి నుంచి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఎస్ జవహర్‌కు పట్టం కట్టారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి ఎవరికి స్థానం కల్పిస్తారనే దానిపై శనివారం అర్ధరాత్రి వరకూ హైడ్రామా నడిచింది. అదివారం ఉదయం 9,22 గంటలకు మంత్రి వర్గ విస్తరణ ముహూర్తాన్ని నిర్ణయించినా అర్ధరాత్రి వరకూ కసరత్తుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైడ్రామా నడిపారు. దీంతో అశావాహులు మంత్రివర్గ జాబితాలో తమ పేరు ఉంటుందన్న ఆశతో ఎదురుచూశారు. పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పీతల సుజాతను మంత్రివర్గంలో కొనసాగిస్తారంటూ వార్తలు వచ్చాయి. చివరకు అమె పదవిని వదులుకోక తప్పలేదు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేశారు. చినబాబు లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో తనకు పదవి వస్తుందని ఆయన ఆశించారు. దీనికోసం ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్దఎత్తున ముఖ్యమంత్రిని కలిశారు. అయితే కుల సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పడంతో అదే సామాజిక వర్గం వారందరూ తమ రెండో ఆప్షన్‌గా జవహర్ పేరు చెప్పడంతో అతనికి పదవి దక్కినట్టు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన రావెల కిషోర్‌బాబుపై అరోపణల నేపథ్యంలో అతని పదవి పోవడంతో ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన జవహర్‌కు చోటు దక్కింది. మరోవైపు ఎస్టీ కోటాలో ఇప్పటివరకూ ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. తెలుగుదేశం తరపున ఎస్టీ శాసనసభ్యునిగా పోలవరానికి చెందిన మొడియం శ్రీనివాస్ ఒక్కరే గెలిచారు. దీంతో అతనికి మంత్రి పదవి ఖరారు చేసినట్టు ప్రచారం సాగింది. పార్టీ కార్యాలయం నుంచి కూడా అందుబాటులో ఉండాలంటూ సమాచారం వచ్చింది. చివరి నిముషంలో ఆయనకు పదవి దక్కలేదు. మరోవైపు మైనారిటీ కోటా కింద నరసాపురానికి చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌కు చోటు దక్కిందని ప్రచారం సాగినా చివరకు ఆయనకు పదవి రాదని తేలిపోయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేరు కూడా చర్చకు వచ్చింది. సీనియర్ నేత అయిన పితానికి బీసీ కోటాలో తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. కాపు సామాజిక వర్గం తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టిబలిజ కులానికి చెందిన పితానికి పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో పితాని సత్యనారాయణముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. చివరి నిమిషంలో పితానికి చోటు దక్కింది. ఇదిలావుంటే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)కూ స్థానం దక్కవచ్చని ప్రచారం జరిగినా ఇటీవలే అదే సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజుకు ఎమ్మెల్సీ రావడం, శివ కుటుంబ సభ్యులకు వెమ్ ఏరోసిటీ ప్రాజెక్టు దక్కడంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. -
సేఫ్... సమ్మర్ ఫుడ్!
పెనాన్ని స్టవ్ మీద పెట్టి గుప్పెడు నీళ్లు జల్లితే ‘సుయ్...’ అంటూ చుక్క చుక్కా ఆవిరైపోతుంది. కానీ... సగానికి కోసిన ఉల్లి ముక్కతో ఒకసారి పెనాన్ని తుడిచి అట్టు పోస్తే... అట్టులోంచి నీరంతా ఆవిరికాదు. అట్టు పెనానికి అంటుకోదు. ఉడికి తేలిగ్గా ఊడి వస్తుంది. ఇదో టెక్నిక్. వంటలోనే కాదు... ఒంటికీ కావాలి టెక్నిక్స్. వంట వేళే కాకుండా... పదార్థాలూ, తిండి వ్యవహారాల్లోనూ ఒంట్లోంచి నీరు కోల్పోకుండా ఉండాలంటే ఏం తినాలో ఏం చేయాలో... టెక్నిక్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. కమ్మటి సమ్మర్ తిండ్లు తీరుగా తినండి. కూల్ కూల్‌గా ఉండండి! వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. అప్పుడే వేసవిలో వచ్చే అనారోగ్యాల బారి నుంచి రక్షణ పొందవచ్చు. పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, దేహాన్ని... డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. గ్రిల్డ్ వెజిటబుల్స్: ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి తయారుచేసుకోవచ్చు. వెజిటబుల్, చిల్డ్ సూప్స్: దోసకాయ వంటి వాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. అదేవిధంగా క్రంచీ వెజిటబుల్స్‌తో తీసుకునే సూప్స్ కూడా మంచివి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచి, దేహాన్ని తగినంత హైడ్రేట్ చేస్తాయి. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన శనగలు (స్ప్రౌట్స్) వంటి వాటిని తింటే మంచిది. వీటిని అతి తక్కువసమయంలోనే తయారుచేసుకోవచ్చు. పచ్చికూరలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ ఆరోగ్యాన్ని వేసవిలో పొందవచ్చు. బీన్ అండ్ స్ప్రౌట్ సలాడ్: బీన్స్ స్ప్రౌట్స్‌ను కూరగాయల ముక్కలు, పండ్ల ముక్కలతోపాటు తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువ మోతాదులో అందుతాయి. వెజిటబుల్ పనీర్ సలాడ్: పనీర్‌ను తరిగిన కూరలతో కలపటం వల్ల సలాడ్ రుచిగా ఉంటుంది. క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణం పెరుగుతుంది. వేసవి రాగానే..: తియ్యగా, చిక్కగా సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఏరియేటెడ్ డ్రింక్స్ వల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని పూర్తి ఉపశమనం అందదు. అందువల్ల – మజ్జిగ, లస్సీ, లో ఫ్యాట్ పాలు వంటివి తీసుకోవాలి. ఫ్రూట్ డెజర్ట్స్: వేసవిలో పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన క్యాల్షియం, ప్రోటీన్లను అందిస్తాయి. టొమాటో సాస్, టొమాటో కెచప్‌లు, బొప్పాయి, రెడ్ క్యాప్సికమ్ నుంచి ‘విటమిన్ ఎ’ లభిస్తుంది. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. అదేవిధంగా వేసవిలో లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. చల్లని కుకుంబర్: దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలోనూ వాడటం మంచిది. మామిడి: ఇవి వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు): ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో వీటిని తినటం మంచిది. అంతేకాక వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీమ్ లాంటి వాటిలోను వాడవచ్చు. పనీర్: ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం అధికం. వాల్నట్స్: వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా ఆక్రోట్లు (వాల్నట్) , చేపలు తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే నూనెలో మునిగేటట్లు వేయించిన చేపల కంటే ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు మంచిది. ఓట్స్: ఇందులో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే తీసుకోవటం మంచిది. తృణధాన్యాలు – పొట్టు తీసేసినవి కాకుండా పొట్టుతో కూడిన పప్పుధాన్యాలు, గింజలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు తీసుకోవాలి. నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్ఫుడ్ని, వేయించిన పదార్థాలను వాడటం మానేయడం మంచిది. చర్మం, గుండె: ఈ రెండింటికీ కావలసిన కెరటనాయిడ్స్ క్యారట్లలో ఉండే విటమిన్ ఎ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక చక్కటి కంటిచూపుకు కూడా సహాయపడుతుంది. ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు: గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెంగళూరు మిర్చి (క్యాప్సికమ్)... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు: దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. పిల్లలకు ►వేసవి అంటే పిల్లలు ఇంటి దగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసే రోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటì శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి. ►పాల ఉత్పత్తులు – లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. అయితే ఇందులో చక్కెర పరిమితంగానే వాడాలి. ►తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి. ►పిజ్జాలు, శాండ్విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు. ►గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. మైదా బదులు గోధుమ పిండితో చేసిన పదార్థాలనే పెట్టాలి. ►ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. పెద్దలకు ►బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు. ►తాజా పండ్లు, కూరలు తీసుకోవాలి. తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. ►మజ్జిగను వీలయినన్ని ఎక్కువ సార్లు తాగుతుండాలి. ► తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది. ►క్యారట్లు, బీట్రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది. ఈ కాలంలో దొరికే తాజా ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది. ►మధ్యాహ్నం, రాత్రి వేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి. ►ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వృద్ధులకు ►వయసు మీద పడేకొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సమతుల ఆహారం తీసుకుంటే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ►ఆరోగ్యకరమయిన బరువుతో ఉండటానికి క్రమపద్ధతిలో తీసుకునే ఆహారం మంచిది. అందుకే వీరు తీసుకునే ఆహారంలో... ►గంజిలాంటి కార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు ►ప్రొటీన్లు, కొవ్వుతక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు ►ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు ►తగినంత ఉప్పు (వృద్ధులు రోజుకి ఆరు గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు) ►ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువ కాబట్టి లవణాలను భర్తీ చేసేలా పోటాషియమ్, సోడియమ్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పండ్లు తీసుకోవాలి. ► పీచుపదార్థాలు (ఫైబర్) పేగు సంబంధిత సమస్యలు వయసు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్దకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. వీటిని తీసుకోవటం మంచిది... ►పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్స్ హోల్‌గ్రెయిన్ బ్రెడ్ గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్ ►బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు ►తాజా పండ్లు, కూరగాయలు... ఉండాలి. ప్రధానమైన పోషకాలు ►వయసు పైబడుతున్న కొద్దీ కొన్ని పోషకాలు తీసుకోవటం చాలా అవసరం. మీరు వీటిని తీసుకుంటున్నారా లేదా గమనించుకోండి... ►విటమిన్ డి అనేది... క్యాల్షియాన్ని అందిస్తుంది. డి విటమిన్ అనేది సూర్యకాంతి ద్వారా శరీరానికి లభిస్తుంది. అయితే తీసుకునే ఆహారం కూడా చాలా ప్రధానం. గుడ్లు, నూనెతో ఉండే చేపలు మంచిది. ఉదయం తీసుకునే అల్పాహారంలో తృణధాన్యలు ఉండేలా చూసుకోవాలి. ►ఆరోగ్యంగా జీవించడానికి క్యాల్షియం తప్పనిసరి. వయసు మీద పడేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వ్యాధి బాధిస్తూంటుంది. ముఖ్యంగా ఇది స్త్రీలలో కనిపిస్తుంది. క్యాల్షియం శరీరానికి అందాలంటే తక్కువ కొవ్వు ఉండే పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు, పనీర్ వంటివి తీసుకోవాలి. ఇంకా స్కిమ్డ్ పాలు కూడా మంచిది. ఇంకా పచ్చగా ఉండే కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి. అదేవిధంగా క్యాల్షియం ఉండే ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. ►ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ కూడా ప్రధానం. ఇది తక్కువగా ఉంటే శక్తిహీనులుగా ఉంటారు. అయితే ఆయిలీ ఫిష్‌లో, తృణధాన్యాలలో, పప్పుధాన్యాలలో కూడా ఉంటుంది. ►ఫోలేట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. వయసు మీద పడేకొద్దీ శరీరంలో పోషకాలు తగ్గుతుంటాయి. రోజూ గోధుమ అన్నం, ఆకుపచ్చ కూరలు తీసుకోవడం చాలా మంచిది. తీసుకోకూడని ఆహారాలు ►వేసవిలో స్వేదం చిందే వృత్తుల్లో ఉన్న వారు మినహా మిగిలిన వారు ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలి. ► ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ ఉపయోగాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలి. ►కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. అందుకే అవి డీహైడ్రేషన్ కలిగిస్తాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. ► రెడ్‌మీట్ వంటి మాంసాహారం నుంచి దూరంగా ఉండటం ఈ సీజన్లోనే కాదు... ఏ సీజన్లో అయినా మంచిదే. ► ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►చక్కెర ఎక్కువగా ఉండే అన్ని రకాల పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. - సుజాత స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్, హైదరాబాద్ -
ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'
నాటి సినిమా సృష్టిలో ఏమీ ఆశించినవి కొన్ని ఉంటాయి. పైగా ఇవ్వడమే వాటి ధర్మమనుకుంటాయి. పూలు సువాసననిచ్చి వాడిపోతాయి. మబ్బులు చినుకులు రాల్చి కరిగిపోతాయి. ఏరు దప్పిక తీర్చి కదిలెళ్లిపోతుంది. పంట ఫలాన్ని ఇచ్చి లుప్తమైపోతుంది. పురుషుల విషయంలో కొందరు స్త్రీలు కూడా ఇలాగే ఉంటారు. వారి జీవితాన్ని నిస్వార్థంగా పండించి తాము మాత్రం నిశ్శబ్దంగా రాలిపోతారు. రాము (శోభన్‌బాబు) తన జీవితంలో ఇద్దరు స్త్రీలను అలాంటివాళ్లుగా చూశాడు. ఒకరు తల్లి (సావిత్రి). మరొకరు స్నేహితురాలు స్వప్న (సుజాత). తల్లికి భర్త వల్ల జీవితంలో ఎటువంటి సంతోషమూ లేదు. అతడు తాగుబోతు. వ్యసనపరుడు. ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని బంగారం లాంటి ఇంటిని అలక్ష్యం చేసినవాడు. చివరకు ముక్కుపచ్చలారని కన్నకూతురు ఒక రోజు ముచ్చటపడి గోరింటాకు పెట్టుకుంటే అదే రోజున ఆ పిల్ల చావుకు కారణమవుతాడు. అయినా సరే తల్లి అతని బాగే కోరింది. భర్తలో మార్పే ఆశించింది. అతడి కోసం తన జీవితాన్ని గోరింటాకులా మార్చడానికి ప్రయత్నించింది. స్వప్న కూడా అంతే. మెడికల్ కాలేజీలో రాము క్లాస్మేట్. అతడి కాలేజీ ఫీజు ఆమే కట్టింది. అతడు హాస్టల్లో ఉండి అవస్థలు పడుతుంటే తన ఇంటికి తెచ్చి ఔట్‌హౌస్‌లో చోటు చూపించింది. బట్టలు ఉతకడానికి పని మనిషిని పెట్టింది. చెంబు ఇస్త్రీతో అవస్థలు పడుతుంటే కొత్త బట్టలు కొనిచ్చింది. అతడి పట్ల ఆమె మనసులో ఎంతో అనురాగం. ఆమె పట్ల కూడా అతడి మనసులో ఎంతో అనుబంధం. కాని వాళ్లు ఒకటి తలిస్తే స్వప్న తండ్రి మరొకటి తలిచాడు. అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు పెళ్లయ్యాక ఇంకా పెద్ద ఇంటి కోడలు కావాలని భావించాడు. ఇది రాముకు తెలిసింది. తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డాడు. అతడు భయపడటంతో ఆమె తెగువ చూపలేకపోయింది. మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాము డాక్టర్ కావడంలో కీలకపాత్ర పోషించిన ఆమె అతణ్ణి వదులుకొని దూరం వెళ్లిపోయింది. కాని వెళ్లిన ఆమె సుఖంగా లేదు. పెళ్లి చేసుకున్నవాడు ఇది వరకే మరొకరికి తాళి కట్టి ఉన్నాడు. ఇది పెద్ద దెబ్బ. కాని ఆమె భీరువు కాదు. అతడి భరతం పట్టి తిరిగి వచ్చింది. కాని అప్పటికే రాము తనకు ఎదురు పడిన ఒక డిస్ట్రబ్డ్ పేషంట్ (వక్కలంక పద్మ)కు సన్నిహితం అయి ఉంటాడు. నిజమే కావచ్చు. కాని పెళ్లి పెటాకులై తిరిగి వచ్చిన స్వప్నను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. చేసుకోమని కోరే హక్కు ఆమెకూ ఉంది. కాని ఆమె అలా చేయదు. రామును చేసుకుంటే అతడు సన్నిహితమైన అమ్మాయికి క్షోభ కలగవచ్చు. ప్రాణం కోల్పోవచ్చు. అందుకే స్వప్న తను ‘కుమారి’గానే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటుంది. రాము జీవితం నుంచి శాశ్వతంగా అడ్డుతొలగిపోతుంది. అతని జీవితాన్ని అన్ని విధాల పండించి ఆమె మాత్రం విధి తరంగాలలో ఎక్కడో తప్పిపోయింది. 1979లో వచ్చిన ‘గోరింటాకు’ ఇప్పటికీ తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచి ఉంది. నిర్మాత మురారి, కథకురాలు కె.రామలక్ష్మి, దర్శకుడు దాసరి నారాయణరావు, సంగీతకారుడు కె.వి. మహదేవన్... ఇంకా నటీనటులు అందరూ కలిసి ఆ సినిమాను తెలుగువారికి ప్రియమైన సినిమాగా మార్చారు. స్త్రీ కోరుకునేది పురుషుడి అనురాగం. అతడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా వంచన చేసినా ఆమె సహనంగా అతడిని ఆదరిస్తుంది. మార్పు కోరుకుంటుంది. అతడి బాగు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుంది. స్త్రీ తాలూకు లోతైన ఈ భారతీయ స్వభావాన్ని చూపడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అయితే అదే సమయంలో స్త్రీ ఎదురు తిరిగితే ఏమవుతుందో స్వప్న పాత్ర ద్వారా చూపిస్తారు. తనను మోసం చేసి తాళి కట్టిన దొంగ మొగడి ముఖాన తాళి తెంచి విసిరి కొట్టే సన్నివేశం గొప్ప ఇంపాక్ట్ చూపుతుంది. శోభన్‌బాబు, సుజాత ఈ సినిమాలో ఎంతో ముచ్చటగా అందంగా కనిపిస్తారు. నటిస్తారు. అలనాటి సూపర్‌స్టార్ సావిత్రి కథకు నిండుదనం తెస్తుంది. కథకు పెద్ద రిలీఫ్‌గా రమాప్రభ–చలం జంట. ఉత్తరాంధ్ర యాసలో వాళ్లిద్దరూ ఆకట్టుకుంటాడు. ‘ఏటంటావంటే నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను’ అని రమాప్రభ విజృంభిస్తుంది. దేవులపల్లి – గోరింటా పూచింది కొమ్మా లేకుండా, వేటూరి– కొమ్మకొమ్మకో సన్నాయి, ఆత్రేయ– చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది, శ్రీశ్రీ– ఇలాగ వచ్చి అలాగ తెచ్చి వంటి పాటలు ఈ సినిమాలో మహదేవన్ వల్ల నిలిచి వెలిగాయి. వెలుగుతున్నాయి. విశాఖ అందాలు, ఔట్‌డోర్‌లో తీసిన సన్నివేశాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా ఉంటాయి.దాసరి సినిమాలు చాలా ఉండొచ్చు. కాని ఇది ప్రత్యేకం. ఎంతో బాగా పండి ఎప్పటికీ రాలిపోని గోరింటాకు ఇది. కూనిరాగం వస్తోంది... ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం... మీరూ కాడుకోండి. – కె -
దేవుడా..!
లీగల్ స్టోరీస్ దోపిడి కోసం మగాడు ఏమైనా చేస్తాడు! ఇల్లు, వాకిలే కాదు దేవుడి కోవెల కూడా వాడికి అడ్డం రాదు! ఇలాంటి దుర్మార్గపు దోపిడీకి అందరి అంగీకారం పొందాలంటే దానికి ఆచారం అని పేరు పెడితే పోలా..! అలా ఆ దోపిడీ దురాచారాన్నే మగాడు ‘జోగిని’ అనే ఆచారంగా మార్చాడు! దాన్ని మనం మార్చుదాం. సంకల్పం ఉంటే చాలు.. చేయూతగా చట్టం ఉంది. ‘ఇంకొంచెం పెట్టుకో బాలమ్మా..’ అంటూ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని తింటున్న బాలమ్మ కంచంలో కొసరి కొసరి వడ్డించింది పదహారేళ్ల సుజాత.‘ఊ.. పెట్టు’ అంటూ కంచంలోంచి తలెత్తకుండా ఆకలిగా.. ఆబగా తింటున్న బాలమ్మ కేసి జాలిగా చూసింది. ఒకప్పుడు చాలా అందగత్తె అట బాలమ్మ. ఊర్ల అందరూ అనుకుంటుండగా విన్నది మస్తుసార్లు. పద్నాలుగేళ్లకే దేవుడితో పెండ్లి చేసిండ్రట. దేవుడి పేరు మీదున్న ఆమె కోసం ఊళ్లో పెద్దపెద్దోళ్లంతా అంగలార్చేటోళ్లట. ఒక అయిదేళ్లు ఆమెదే రాజ్యం. పిల్లల్లేరు. అప్పటి సర్పంచ్ ఆమెను బాగానే చూసుకొని పైసలూ మంచిగనే ఇచ్చిండట. ఆ పైసల్తోనే ఇల్లు కట్టిందని.. ఆ ఇంటిని ఆమె తమ్ముడు తన పేరు మీద చేసుకున్నాడని... ఆమెకు వయసు మీద పడంగానే ఇంట్లోంచి ఎల్లగొట్టిండని చెప్పుకుంటరు ఊర్లే. గప్పటి నుంచి ఆమె ఆడ.. ఈడ తిరిగుతూ.. ఇండ్లల్ల అడుక్కుంటూ బతుకుతోంది.‘ఏందే.. మల్లా బాలమ్మను పిల్చినవా?’ అప్పుడే బీడీ కార్ఖానా నుంచి వచ్చిన తల్లి అరుపుకి బాలమ్మ ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చింది సుజాత.‘అమ్మా.. పాపం ముసల్ది. ఆకలి అని ఇంటికొచ్చిందే..ఇంకోసారి పెట్టగని.. ఈ పూటకి తిననియ్యే’ అని తల్లిని బతిమాలుకుంటూ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.‘ఏందీ పోనీ.. ఈసారి గనుక పిల్చినవంటే సూడు మల్లా.. ’అని బిడ్డను కొరకొర చూస్తూ.. ‘ఏయ్ ముసల్దానా.. మల్లోపారి ఇటెంకలమర్లేవ్..చెప్తున్నా’ అని తర్జని చూపిస్తూ బాలమ్మను బెదిరించి లోపలికెళ్లిపోయింది. చిన్న దొర కన్నేశాడు! ‘అక్కా.. చిన్న దొర మల్లా పిలిచిండే ఇయ్యాల?’ ఇంట్లోకి వస్తూ వస్తూనే అన్నాడు శేఖర్. ఆ మాటకు గుండెలో రాయి పడ్డట్టయింది దేవకికి. ‘ఏమన్నడ్రా?’ భయంభయంగానే అడిగింది తమ్ముడ్ని.‘ఎందుకు లేట్ చేస్తున్నర్రా ఇంకా? వచ్చే వారం ముహూర్తం మంచిగుంది అన్నడక్కా’.‘మొన్న నన్ను సుత సర్పంచ్ అటకాయించిండురా.. ఇంకా సప్పుడు చేస్తలేరేమే అని’ విచారంగా చెప్పింది దేవకి. లోపల గదిలో ఉన్న సుజాతకు ఈ మాటలు స్పష్టంగా వినపడకపోయినా వాటి భావం అర్థమవుతోంది. మనసులో ఆందోళన. తెలియని ఉక్రోషం. చేస్తున్న పనివదిలేసి విసురుగా బయటి గదిలోకి వచ్చింది.‘ఇగో మామా.. ఆ చిన్నదొరకు చెప్పు.. నాతో పెట్టుకోవద్దని! నేను సదువుకుంటా.. గిట్లాంటి ఆలోచనలు చెయ్యకుండ్రి. బలవంతం చేస్తే.. పారిపోతా.. లేకపోతే ఉరేసుకొని సస్తా ఏందనుకుంటున్నరో’ అని అల్టిమేటం ఇచ్చి అంతే విసురుగా లోపలికి వెళ్లిపోయింది సుజాత.‘హు..’ అని నిట్టూరుస్తూ ‘చూసినవ్ గదరా.. అదెట్ల మాట్లాడుతుందో? ఆ జోలి తీసినప్పుడల్ల గిదే వర్స. అటేమో.. ఆల్ల బలవంతం ఎక్కువైతుంది. ఏం జేయాల్నో అర్థమైతలేదు’ అంటూ తల పట్టూకూర్చుంది దేవకి.‘అక్కా.. ఊర్ల పెద్దోళ్లు ఊరుకోరు. గాల్లు జబర్దస్తీ చేసేదాకా చూసేకంటే మనమే ముందుగల్ల ఆల్ల దార్ల వడ్డమనుకో డిమాండ్ చేసిన పైసలన్నా అస్తయ్. ఆలోచించుకో’అని చెప్పి వెళ్లిపోయాడు తమ్ముడు. తమ కులంలో ఇది కొత్తేం కాదు. తరతరాలుగా వస్తున్నది. కుటుంబంలోని పెద్ద బిడ్డ పెద్ద మనిషి కాంగనే దేవుడికిచ్చి మనువు జెయ్యాలే. ఇది తన బిడ్డకూ తప్పుతలేదు. విచారం నుంచి తేరుకొని ఒక నిర్ణయానికి వచ్చింది దేవకి. ముహుర్తం దగ్గరపడింది వారం రోజులు గడిచాయి. ఊర్లో పెద్దలు నిర్ణయించిన ‘దేవుడికి అంకితం’ ముహూర్తం రానే వచ్చింది. ఆ పెద్దలే ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఆర్థిక బాధ్యతను ఉదారంగా నెత్తికెత్తున్నారు. అమ్మాయికి ఖరీదైన బట్టలు, నగలు సిద్ధం చేశారు. ఆ పిల్ల కుటుంబానికి కొంత పెద్దమొత్తమే డబ్బు సమర్పించారు. అన్నిటికీ అతీతమైన దేవుడికి, ఎన్నో లక్ష్యాలు సాధించాలనే ఆరాటంతో ఉన్న సామాన్య పిల్లతో పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. పిల్ల ఇంట్లో... ‘ఏయ్.. పోరీ.. చెప్పింది విను. ఈ చీర కట్టుకో. టైమ్ అయితుంది. పెద్దోళ్లు ఇంటి మీదికి రాకముందే తయారై గుడికి పోదాం!’ కర్కశంగానే ఉంది తల్లి గొంతు.‘నేను రాను. దేవుడితో నాకు పెళ్లేంది? సదువుకుంటా. అమ్మా.. నా బతుకు కూడా బాలమ్మ లెక్క అయితదే. నాకొద్దు. నేను సదువుకుంటా. నన్ను ఇడిచిపెట్టుండ్రే .. మీకు దండం పెడతా..!’ తల్లి కాళ్లు పట్టుకొని ఏడుస్తోంది సుజాత.‘చల్.. నీ యవ్వ.. కథలు వడకు. నడువ్ సక్కగా..’ అంటూ మేనమామ ఎంటరయ్యాడు.‘మామా.. నీకు కాళ్లు మొక్కుతా.. మామా.. నేను సదువుకుంటా.. నేను జోగినిగా కాను మామా.. మంచిగ సదువుకొని ఉద్యోగం చేసి పైసలు సంపాదిస్తా.. మామా.. గాని గీ పనికి నన్ను వెట్టకుండ్రి మామా.. మీకు దండం పెడతా... ’ మేనమామ కాళ్ల మీద పడింది సుజాత బోరున ఏడుస్తూ!‘ఇడ.. నీ అయ్య సంపాదించి పోయిండని నిన్ను సదివిస్తం? నడువ్.. మర్యాదగా తయారుగా’ నిర్దయగా అనేసి.. ‘అక్కా.. లేట్ అయితే ఆల్లు ఇంటి మీదికొచ్చి పోరిని గుంజ్కపోతరు.. పెళ్లయినంక వచ్చే పైసలు సూత రావ్. నీ ఇష్టం’ దేవకిని హెచ్చరించి బయటకు వెళ్లిపోయిండు.‘ఇన్నవ్గదే.. ఆల్లే వచ్చి గుంజ్కపొయ్యేదాకా ఉంటవా? తయారయితవా?’ అంటూ కూతురు జుట్టు పట్టి పైకి లేపింది. ఆ పిల్ల మొహమ్మీద చీర విసిరేసి బయటకు వెళ్లిపోయింది దేవకి. కళ్ల ముందు బాలమ్మ! తలుపేసుకుంది సుజాత. ఆమె కళ్ల ముందు బాలమ్మ కనిపిస్తోంది. బాలమ్మలాంటి ఇంకెందరో జోగినులు బిచ్చగత్తెలుగా, మానసిక ఆరోగ్యం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతూ, ఇళ్లల్లో పాచి పని చేస్తూ.. రోగాల పుట్టలుగా మారి రోడ్ల మీద బతుకీడుస్తూ.. మనసులో మెదిలారు. తన భవిష్యత్‌ను ఊహించుకొని కంపించిపోయింది. చావనన్నా ఛస్తుంది కాని దీనికి ఒప్పుకోదు.. స్థిరంగా నిశ్చయించుకుంది. వాళ్లది రెండుగదుల ఇల్లు. ఆ రెండు గదులను కలుపుతూ తలుపుంది. వంటింటికి ముందు ద్వారం కాక వెనక దొడ్లోకి ఓ తలుపుంది. ముందు గదిలోంచి వంటింట్లోకి వెళ్లి.. బయట ద్వారానికి లోపలినుంచి గడవేసి దొడ్డి ద్వారం గుండా బటయ పడింది సుజాత. అక్కడ మొదలుపెట్టిన పరుగు ఆ ఊరి అంగన్వాడీ కార్యకర్తను చేరేదాకా ఆపలేదు. గుడిలో ఆగ్రహావేశాలు ఇక్కడ గుడిలో దేవుడి పెళ్లికి ముహూర్తం దాటిపోతున్నా సుజాత కుటుంబం జాడలేదని ఆగ్రహావేశాలతో ఇంటిమీదకు వెళ్లారు ఊరిపెద్దలు. అప్పటికే సుజాత ఇంట్లోంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న దేవకి, శేఖర్లు వణికిపోతున్నారు పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక. ఇక ఇంటి ముందు.. ఊహించిన ఉపద్రవం కనిపించే సరికి బిక్కచచ్చిపోయారు. ‘ఏంరా.. దేవుడినే మోసం చెయ్యాలనుకుంటున్నరా’ అంటూ శేఖర్ మీదకి చేయి లేపాడు చిన్న దొర. ‘దేవుడికి ఇస్తామన్న కన్యను ఇవ్వకుండా మాయం చేయడం మహాపాతకం. ఈ కుంటుంబం మీదే కాదు మొత్తం ఊరిమీదే కన్నెర్ర చేస్తాడు దేవుడు’ అంటూ ముహూర్తం పెట్టిన పూజారీ వంత పాడాడు. దాదాపు ఊరంతా ఏకమైంది సుజాత ఇంటి మీద దాడికి. ఈలోపే అంగన్వాడీ కార్యకర్త ఇచ్చిన కంప్లయింట్‌తో పోలీసులు రంగప్రవేశం చేశారు. సుజాత జోగినిగా మారే వ్యవహారానికి ఫుల్స్టాప్ పెట్టారు. ఊళ్లో పెద్దలకు, సుజాత కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయిని షెల్టర్హోమ్కి తరలించారు. ఎనిమిది వరకు ఆగిపోయిన చదువును కొనసాగించింది సుజాత. జోగినిగా మారిస్తే జైలు తప్పదు దేవుడికి లేక దేవస్థానానికి, ప్రార్థనా ప్రదేశానికి సేవచేసే నిమిత్తం ఆడపిల్లను అంకితమిచ్చే దురాచారం మన సమాజంలో ఉంది. ఈ వ్యవహారాన్నే ప్రాంతాలను బట్టి జోగిని, దేవదాసి, బసివిని, మాతమ్మ ఆచారంగా పిలుస్తుంటారు. దేవుడితో పెళ్లి చేస్తారు కాబట్టి ఆమె ఊరుమ్మడి సొత్తు. మిగతా స్త్రీలలా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని గౌరవప్రదమైన జీవితం గడిపే వీలుండదు. ఆమెను ఊళ్లో పెద్దలు తమ శారీర కోరికల కోసం ఉపయోగించుకుంటారు. దేవాలయానికి సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు, జాతర్లలో కొంత సొమ్ము ఇస్తుంటారు ఆమెకు. అదే ఆమె జీవనాధారం. పెళ్లికాకుండానే తల్లులై.. ఆ పిల్లలకు తండ్రి ఎవరో చెప్పుకోలేక దుర్భర జీవితాలు గడిపిన, గడుపుతున్న జోగినిలెందరో. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు 1988లో దేవదాసి నిషేధ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక స్త్రీని దేవదాసిగా చేయడం నేరం. దేవదాసికి దేవుడితో జరిగే పెళ్లి చెల్లదు. అమ్మాయిని దేవుడికి అంకితం మిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించినా, అందులో పాల్గొన్నా, దాన్ని ప్రోత్సహించినా అది నేరమే. రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. తల్లిదండ్రులే స్వయంగా తమ కూతురిని దేవదాసిగా మార్చి దేవుడికి అంకితమిస్తే ఆ శిక్ష రెండు నుంచి అయిదేళ్లు ఉంటుంది. జరిమానా కూడా విధిస్తారు. – ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ – సరస్వతి రమ -
భర్త ఇచ్చిన కానుక
లీగల్ స్టోరీస్ కానుకలు సంతోషాన్నిస్తాయి. కాని ఆ కానుక భార్యే అయితే..? గిఫ్ట్ర్యాప్ ఉల్లిపొర చీర అయితే? ఆ సంతోషం ఇంకోవరికో ఇస్తే? భార్యను పణంగా పెట్టిన ధర్మరాజు గురించి చదివాం... నడివీథిలో భార్యను అమ్మిన సత్య హరిశ్చంద్రుడి గురించి విన్నాం... వెగటనిపిస్తోంది.. వేదన కలుగుతోంది..అసహ్యం పుడుతోంది! ఈ కథ రాయాలన్నా.. చదవాలన్నా..అలాగే అనిపిస్తోంది.. కానీ తప్పదు! మన సమాజంలో ఇలాంటి భర్తలూ కొందరున్నారు... భార్యను కానుకగా ఇస్తున్నారు! దీన్ని నిలువరించడానికి బలమైన సెక్షన్లున్నాయి.. అంతకన్నా బలమైన సమాజం ఉంది!! ‘సుజాతా! మా బాస్ వాళ్ల ఫ్యామిలీ ఇంకా ఇక్కడికి షిఫ్ట్ కాలేదు కదా.. పాపం భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేపు ఎలాగూ సండే... అందుకే లంచ్‌కి ఇన్వైట్ చేశాను’ చెప్పాడు భార్యతో ఆనంద్. చిర్రెత్తుకొచ్చింది సుజాతకు ఆ మాట వినగానే. అయినా తమాయించుకుంది. ‘బోలెడన్ని హోటల్స్ ఉన్నాయి. వెళ్లి తినడం నచ్చకపోతే పార్సిల్ తెచ్చివ్వడానికి అటెండర్స్ ఉన్నారు’ అంది... బాస్ తమ ఇంటికి భోజనానికి రావడం తనకు ఇష్టం లేదనే భావన వినిపించేట్టుగా! ‘సుజాతా! ఆయన మా బాస్. అతనితో చాలా పనులుంటాయి’ అన్నాడు తన నిర్ణయానికి తిరుగుండదు అనే అర్థం వచ్చేలా! నిస్సహాయత మౌనాన్ని మిగిల్చింది సుజాతకు. ఫ్రిజ్‌లోంచి కూరగాయలు తీసి తరగసాగింది. మెదడు ఖాళీ లేకుండా ఆలోచనలు ముసురుకున్నాయి. ఈ మధ్య తన భర్త ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. తను పేదింటి పిల్ల. తండ్రి లేడు. డబ్బు లేకపోయినా గుణం ఉంది, అందం ఉంది అని ఆనంద్ వాళ్ల మేనత్త ఈ సంబంధాన్ని కుదిర్చింది. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయి కావడంతో తన వాళ్లూ కాదనలేదు. కానుకలు తప్ప కట్నం అడగలేదు కాబట్టి వద్దు అనడానికి ఏ కారణమూ కనిపించలేదు. అందుకే మూడుముళ్లూ పడ్డాయి ఏడేళ్ల కిందట. పెళ్లయిన ఏడాదికే భర్త నైజం పూర్తిగా అర్థమైంది. విపరీతమైన ఆశ... డబ్బు సంపాదించాలని. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, ఇంకోవైపు వ్యాపారం చేయాలనే ఆరాటం. దానికోసం అందిన చోటల్లా అప్పులు చేశాడు. ఇప్పుడు తన పనికి ‘ఎప్పుడో ప్రమోషన్ రావాలి.. ఇంకా రాలేదు.. ఎలాగైనా రాబట్టుకోవాలి’ అని ప్రయత్నం చేస్తున్నాడు. భర్త తీరుతో ఒక్కోసారి తను చాలా భయపడుతోంది. ఈ మధ్య అయితే మరీ. అదీ కొత్త బాస్ విషయంలో. ప్రమోషన్ కోసం బాస్‌ను ఇంప్రెస్ చేయడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి, బాధ, చిరాకు, కోపం.. ఏవగింపూ కలుగుతున్నాయి. తనను తాను మరిచిపోతున్నాడు. వ్యక్తిత్వం లేని మనిషిలా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటో... అవసరం లేకపోయినా బాస్‌కి తనని పరిచయం చేశాడు. కొలీగ్ కొడుకు బర్త్ డే అయితే అలాంటి గేదరింగ్స్‌కి ఎన్నడూ తనను తీసుకెళ్లని మనిషి కేవలం తన బాస్ వస్తున్నాడని తీసుకెళ్లాడు. ఆ బాసేమో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వెకిలి నవ్వులతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆనంద్‌తో తను చెప్పింది కూడా. ‘సోషల్ పార్టీల్లో అవి కామన్. వాటిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు’ అని కొట్టిపారేశాడు. ఇప్పుడేమో ఏకంగా ఇంటికే తీసుకొస్తున్నాడు భోజనానికి అని. తను భరించలేకపోతోంది. ‘దేవుడా! దీనికి ఎండ్ ఎక్కడా’ అనుకుంది తరిగిన కూరగాయలను చాప్ బోర్డ్ మీద నుంచి గిన్నెలోకి వేస్తూ... మెదడులోని ఆలోచనలకు నిట్టూర్పుతో ఫుల్స్టాప్ పెడుతూ! లంచ్ అవర్ తింటున్నంతసేపూ సుజాతను పొగుడుతూనే ఉన్నాడు ఆనంద్ బాస్. అతనికి వంత పాడుతున్నట్టుగా ఉంది ఆనంద్ వ్యవహారం. వంటింట్లో ఉన్న సుజాతకు ఒళ్లు మండిపోతోంది. సందర్భం లేకపోయినా మాటిమాటికీ భార్యను పిలుస్తూ, ‘బాస్‌కు అది వడ్డించు.. ఇది వడ్డించు’ అని ఆర్డర్ వేస్తున్నాడు. తను వడ్డించొచ్చు కదా... కళ్లల్లో ఆమె మండిపాటు కనపడుతున్నా లెక్క చేయట్లేదు ఆనంద్. భోజనం వంకతో దాదాపు మూడు గంటలు గడిపాడు వాళ్లింట్లో బాస్. యాన్ ఈవెనింగ్ అవర్... ‘మీరసలు మనిషేనా? బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? మీ కొలీగ్స్ అంతా వాళ్ల పెళ్లాలను ఇలాగే ... ’ దుఃఖంతో మాట రావట్లేదు సుజాతకు భర్త ఆలోచన విన్నాక. ‘ఎవరి సంగతి నాకక్కర్లేదు. వాళ్లకు ఈ ఉద్యోగం తప్ప ఇంకే ఆశలు లేవేమో. కాని నేనలా కాదు. ఉన్నదాంతో సర్దుకుపోయే రకం కాదు. అయినా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నేను నిన్ను పెళ్లిచేసుకోక ముందు నీ పరిస్థితేంటో తెలుసు కదా.. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు మీ అమ్మానాన్నలు నీకు. నా దగ్గర... ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావ్? ఎప్పుడైనా అనుకున్నావా ఇలాంటి జీవితం నీ సొంతమవుతుందని. నేను చేసుకోకపోతే.. ఏ గంతకు తగ్గ బొంతో దొరికుండేవాడు. అలాగే ఓ పూట తింటూ ఓ పూట మాడుతూ చచ్చేదానివి’ ...చాలా తీవ్రంగా ఉంది భర్త గొంతు. ఖంగుతింది సుజాత... అతని మనసులో తన పట్ల ఉన్న అభిప్రాయానికి. ‘పతివ్రత మాటలు మాట్లాడక నేను చెప్పింది చెయ్. నోర్మూసుకొని మా బాస్ దగ్గరకు వెళ్ళు ఈ రాత్రి. అంతే!’ ఆజ్ఞాపించాడు. సుజాత మొహం పాలిపోయింది. నోట మాట రావట్లేదు. నేల కుంగిపోయి తాను అందులోకి జారిపోతే బాగుండు అనుకుంటోంది. వాళ్ల అరుపులు ఎందుకో అర్థం కాని ఆరేళ్ల కొడుకు బిత్తరపోతున్నాడు. బీరువాలో నుంచి ఓ చీర తీసి సుజాత మీదకు విసిరాడు... ‘వెళ్లు.. వెళ్లి చీర మార్చుకురా..’ అన్నాడు. ‘ఏంటీ. మార్చుకునేది’ నిలదీసింది. ఈసారి కోపం ఆనంద్‌కు షిఫ్ట్ అయింది. ‘నేను పెడుతున్న తిండి తింటూ నా మాటకే ఎదురు తిరుగుతావా?’ అంటూ చెంప మీద కొట్టాడు. భర్తను తోసేసింది. అహం దెబ్బతిన్న ఆనంద్ సుజాత జుట్టు పట్టుకొని బాత్రూమ్లోకి ఈడ్చుకెళ్లాడు. ఈ హఠాత్పరిణామానికి భయపడ్డ వాళ్ల అబ్బాయి ఏడవడం మొదలుపెట్టాడు. ఓ చేత్తో వాడిని ఎత్తుకుంటూ ‘బాబును తీసుకొని బయటకు వెళ్తున్నా. త్వరగా రెడీ అవ్వు. ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్‌లో బాస్ వస్తాడు’... బెదిరింపు, ఆజ్ఞాపన కలగలిసి ఉన్నాయి ఆ మాటలో. యూ ఛీట్.... ‘మిస్టర్ ఆనంద్! వాట్ డు యూ థింక్ ఎబౌట్ మి?’ ఫోన్లో అరుస్తున్నాడు బాస్. ‘వాట్.. సర్.. వాట్ హ్యాపెన్డ్?’ అయోమయంతో ఆనంద్. ‘ఏయ్! ఏమీ తెలీనట్టు మాట్లాడకు. నువ్వు, నీ భార్య కలిసి నాటకం ఆడుతున్నారా? లేక నన్ను పట్టిద్దామనుకున్నారా?’ బెదిరిస్తున్నా... బాస్ గొంతులో భయంతో కూడిన వణుకుంది. ‘అయ్యో.. సర్! నిజంగా నాకేం తెలియదు. మా ఆవిడ ఏమన్నా..’ ఆగాడు. ‘యూ.. ’ఆవేశంతో మాట రాక ఆగాడు బాస్. ‘ఇంట్లో నీ పెళ్లాం లేదు ఇడియట్’...గొంతు కాస్త తగ్గించి చెప్పాడు.ఈ సారి ఆనంద్ ఆశ్చర్యపోయాడు.సహాయం కావాలి...రాత్రి పది గంటలు.‘ముందు ఈ నీళ్లు తాగండి’.. నీళ్ల బాటిల్ ఇస్తూ చెప్పింది లాయర్. బాటిల్ నీళ్లను గటగటా తాగేసింది. చీర కొంగుతో మొహానికి, మెడకు పట్టిన చెమటను తుడుచుకుంటూ. ‘సారీ మేడమ్! ఈ టైమ్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నా సమస్య అలాంటిది. దారిన వెళ్తూ మీ ఇంటి ముందున్న మీ బోర్డ్ చూసి వచ్చాను’ ... సంజాయిషీ చెబుతున్నట్లుగా అంటోంది సుజాత. ‘పర్లేదు.. అర్థం చేసుకున్నా. ముందు మీరు స్థిమితపడండి..’ అనునయించింది లాయర్. కాస్త ఆగి.. విషయం చెప్పింది సుజాత. ‘భయపడకు.. నీకు ఎలాంటి పరిష్కారం కావాలన్నా సహాయం చేస్తా’...భరోసా ఇచ్చింది లాయర్. పరిష్కార మార్గం కూడా చూపించింది. ఏమిటా పరిష్కారం? భార్య పట్ల ఆనంద్ ప్రవర్తన క్రూరత్వం, మానసిక వేదనకు గురి చేయడం కిందకు వస్తుంది. భార్యను అలా ఇంకొకరి దగ్గరకు వెళ్లమని బలవంతం చేయడం క్రూరత్వంగా పరిగణిస్తుంది చట్టం. అంతేకాదు మానసిక వేదనకు గురిచేయడం కూడా అవుతుంది. అందుకే అలాంటి కారణాల కింద మహిళలకు హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 13 విడాకులు తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఒకవేళ విడాకులు తీసుకోకుండా... భర్త నుంచి రక్షణ మాత్రమే కావాలనుకునే వాళ్లకు డొమెస్టిక్ వయెలెన్స్ యాక్ట్ ప్రకారం రక్షణ ఉత్తర్వునూ మంజూరు చేసి, భద్రతను కల్పిస్తుంది. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ Parvathi advocate2015@gmail.com - సరస్వతి రమ -
క్వారీలో పేలుడు..మహిళ మృతి
కొడకండ్ల మండలం రామవరం గాయత్రి క్వారీలో ఆదివారం పేలుడు సంభవించింది. ఇద్దరు దంపతులు క్వారీలో రాళ్లకు డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో కుంచం సుజాత(30) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. బండరాళ్ల మధ్య ఉంచిన పాత జిలెటిన్ స్టిక్స్ పేలి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచాడు గ్రామం. కూలీ పనుల నిమిత్తం అక్కడకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చీకట్లో ఒకరోజు...
పట్టుకోండి చూద్దాం ‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి. జానకిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిశోర్. ఈ పెళ్లి వాళ్ల ఇంట్లో వాళ్లకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కిశోర్ మేనత్త సుజాత కోటీశ్వరురాలు. భర్త చిన్నవయసులోనే చనిపోయినా అధైర్యపడకుండా నలుగురు గొప్పగా చెప్పుకునే పారిశ్రామికవేత్తగా ఎదిగింది. చిన్నస్థాయి నుంచి కోట్లు సంపాదించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన సుజాత అంటే చుట్టాలు పక్కాలలో చాలా గౌరవం. ఆమె జీవితాన్ని పిల్లలకు పాఠాలుగా చెబుతుంటారు. సుజాతకు ఒకే కూతురు. పేరు సృజన. సృజనకు కిశోర్ అంటే చెప్పలేనంత ఇష్టం. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని పట్టుబట్టింది. అతి కష్టం మీద కూతురు కోరికను మన్నించింది సుజాత. అయితే మరోవైపు పరిస్థితి భిన్నంగా ఉంది. కిశోర్ తన కొలిగ్ అయిన జానకిని ప్రేమించాడు. సృజన ప్రపోజల్‌ని తిరస్కరించి జానకిని పెళ్లి చేసుకున్నాడు. ‘‘కిశోర్ తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు’’ అంటూ చాలామంది తిట్టారు. ఇక కుటుంబ సభ్యులైతే కిశోర్‌తో మాట్లాడడమే మానేశారు. ఒక విధంగా చెప్పాలంటే తమ నుంచి బహిష్కరించారు. తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్యతో పాటు ఉంటున్నాడు కిశోర్. ‘‘కిశోర్ స్థానంలో వేరే ఎవరినీ భర్తగా ఊహించలేను. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను’’ అంది సృజన. కూతురికి రకరకాలుగా చెప్పి చూసింది సుజాత. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా చేయించింది. అయినా ఫలితం లేదు. ‘‘కిశోర్‌ను తప్ప ఎవరినీ భర్తగా ఊహించలేను’’ అని ఎప్పటిలాగే చెబుతుంది తప్ప ‘పెళ్లి చేసుకుంటాను’ అనడం లేదు సృజన. తన కూతురి జీవితాన్ని ఎడారి చేసిన కిశోర్ అంటే సుజాతకు అసహ్యం ఏర్పడింది. ‘‘ఏ భార్యను చూసి అయితే మురిసిపోతున్నావో... ఆ భార్య వల్లే చనిపోతావు’’ అని కిశోర్‌ను కసిగా తిట్టుకుంది సుజాత. ఆరోజు కిశోర్, జానకీల పెళ్లి రోజు. పెళ్లి చేసుకోవడానికి తాము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తుతెచ్చుకున్నారు ఇద్దరు. ‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి. ‘‘నీ మనసు చూసి పెళ్లి చేసుకున్నాను. మంచి మనసును కోట్లతో కొలవలేము’’ అన్నాడు కిశోర్. కొద్దిసేపటి తరువాత.... ‘‘నేను క్రికెట్ మ్యాచ్ చూస్తాను’’ అంటూ టీవి ముందు వాలిపోయాడు కిశోర్. జానకి తన గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటుంది. కొద్దిసేపటి తరువాత కరెంట్ పోయింది. కొత్తగా ఇల్లు మారారు. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్‌ఫోన్ రిపేర్‌లో ఉంది. కరెంట్ వచ్చేలోపే కిశోర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. జానకిని ఎంక్వ్యేరీ చేశారు. ‘‘ఆయన టీవీ చూస్తున్నారు. కొద్దిసేటి తరువాత కరెంట్ పోయింది. నేను గది నుంచి బయటకు రాలేదు. పుస్తకం చదువుతూ కూర్చున్నాను’’ అని చెప్పింది జానకి. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్‌ఫోన్ రిపేర్‌లో ఉంది. మరి ఆ చీకట్లో ఆమె పుస్తకం ఎలా చదవగలిగింది? పోలీసులు జానకిని ఎందుకు అనుమానించలేదు? Ans: పోలీసులు జానకిని అనుమానించకపోవడంలో ఎలాంటి తప్పులేదు. జానకి అంధురాలు. ఆ చీకట్లో ఆమె చదివింది బ్రెయిలీ బుక్. దీన్ని చదవడానికి వెలుగుతో పని లేదు కదా! -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి భర్త నుంచి తనను దూరం చేయడమే కాకుండా.. సహజీవనం చేసి కొడుకును కూడా కన్న తర్వాత పెళ్లికి ముఖం చాటేస్తున్న యువకుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. భగత్‌సింగ్ కాలనీకి చెందిన ఎస్.పీ.అశోక్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సుజాత (27) అనే యువతిని ప్రేమించాడు. సుజాతకు 2014లో సురేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే పాతపరిచయాన్ని పెంచుకున్న అశోక్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కట్టుకున్న భర్తకు దూరం చేసి నవనిర్మాణనగర్లో కాపురం పెట్టాడు. కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న అనంతరం ఆమె వద్దకు రావడం మానేశాడు. ఇదేంటని నిలదీస్తే ముఖం చాటేశాడు. దాంతో ఆమె తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడే గత యేడాది జూన్ 29న అశోక్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతుంది. ఈ నేపధ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ శుక్రవారం భవానినగర్‌లోని అశోక్ ఇంటి ముందు బైఠాయించింది. -
పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య
బంధువుల శూలాల్లాంటి మాటలు ఆ మాతృమూర్తి హృదయాన్ని గాయపరిచాయి. ఇద్దరు కుమారుల అంగవైకల్యం గురించి సూటి పోటీ మాటలు వినలేక ఆమె అఘాయిత్యానికి పాల్పడింది. ఇద్దరు కుమారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, ఓ కుమారుడు మృతి చెందగా, మరో కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘోర విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి సుజాత(24), మద్దిలేటి దంపతులకు మహేశ్ (9), సుబ్బయ్య (7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ అంగవైకల్యంతో పుట్టారు. ఏ వేడుకకు వెళ్లినా బంధువులు వారి కుమారుల వైకల్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతుండడంతో సుజాత హృదయం తట్టుకోలేకపోయింది. మంగళవారం ఉదయం భర్తతోపాటు అత్త, మామలు పొలం పనులకు వెళ్లగా... ఇంట్లో ఉన్న సుజాత ఇద్దరు కుమారులకు పురుగుల ముందు ఇచ్చి తాను కూడా తాగింది. ఇది గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుబ్బయ్య మృతి చెందాడు. వైద్యుల సూచన మేరకు సుజాతను ఢోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా... ఆమె అక్కడ ప్రాణాలు విడిచింది. మహేశ్ ప్రాణాపాయ పరస్థితుల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కరెంట్ షాక్ తో విద్యార్థినికి గాయాలు
కళాశాల ఆవరణలో విద్యుదాఘాతం కారణంగా ఓ విద్యార్థిని గాయాలపాలైంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న డి.సుజాత కళాశాల ఆవరణలో ఉన్న వేపచెట్టును పట్టుకోవడంతో విద్యుత్ ఎర్త్ వైరు తగిలి షాక్‌తో కింద పడిపోయింది. అక్కడే ఉన్న రాయి తగలడంతో గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్ట్
అనుమానం పెనుభూతమై భార్యను అంతమొందించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక బుద్ధిపోచమ్మ వీధికి చెందిన రాంరెడ్డి, సుజాత(45) భార్యాభర్తలు. ఉపాధి కొరకు ఇరాక్ వెళ్లిన రాంరెడ్డి ఈ మధ్యకాలంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో భార్య ఓ పత్రికా విలేకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు నులిమి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
అనుమానం పెనుభూతమై..
భార్యను కడతేర్చిన భర్త అనాథలుగా మిగిలిన పిల్లలు పోలీసుల అదుపులో నిందితుడు! పెందుర్తి: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. కన్న పిల్లలకు తల్లి ఆప్యాయతను దూరం చేసి వారి జీవితాల్లో విషాదాన్ని నింపా డు. పెందుర్తి సమీపంలోని గాంధీనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి.. కరాస ప్రాంతానికి చెందిన వాస గురునాథరెడ్డి, సుజాత(28) దంపతు లు ఆరేళ్ల కిందట గాంధీనగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. అతను తాపీమేస్త్రిగా పనిచేస్తుండగా ఆమె కూలి పనులకు వెళుతోంది. కాగా గురునాథరెడ్డికి భార్యపై అనుమానం ఉంది. దీంతో చాలాకాలంగా ఇరువురికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట భర్త వేధింపులకు తాళలేక ఆమె గృహహింస కేసు పెట్టింది. అప్పట్లో ఇరువురికి పోలీసులు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో మరోసారి మంగళవారం రాత్రి ఇద్దరు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. తాగిన మత్తులో గురునాథరెడ్డి సుజాతను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత తన భార్య ఉరేసుకుందని కేకలు వేశాడు. అయితే స్థానికులు వచ్చేసరికి అతను పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్, ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పరిశీలిం చి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు గురునాథరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. తల్లి హత్యకు గురై, తండ్రి దూరం కావడంతో పిల్లలు విఘ్నేష్, అంజలి అనాథగా మిగిలారు. తల్లి మృ తదేహం వద్ద వారు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సీఐ జె.మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడికి అత్తింటి వేధింపులు
భర్త వేధింపులకు తాళలేక పోలీసులను ఆశ్రయించిన మహిళలను చూశాం....అత్త ఆరళ్లు భరించలేని కోడళ్ల గోడు విన్నాం.. కానీ, అత్తింటి వారు తనను భయపెట్టి, భార్యను కాపురానికి రాకుండా చేస్తున్నారంటూ ఓ అల్లుడు పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన గురువారం కాటేదాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మైలార్‌దేవ్‌పల్లి వినాయక్‌నగర్ బస్తీకి చెందిన నర్సింహకు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుజాతతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉండగా, భార్యను రెండో కాన్పు కోసం తీసుకువెళ్లిన అత్తింటివారు ఏడాది దాటినా తిరిగి పంపించడం లేదు. ఇదేమని అడిగితే తనపై దాడి చేయడమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కాపురానికి రాకపోవడంతో.. గత్యంతరం తాను కూడా అత్తారింట్లోనే ఉండేందుకు నిర్ణయించుకన్నాననీ.. ఇటీవల నాలుగు రోజులు అక్కడే ఉనన్నీ తెలిపాడు. రెండు రోజులు బాగానే చూసుకున్నా.. తర్వాత తనంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించాడు. తన భార్యను కాపురానికి పంపించేలా చూడాలని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. -
నాన్నలాంటోడే కాటేశాడు
మహిళతో సహజీవనం ఆమె కూతురిపై లైంగికదాడి సింగరేణి కాలనీలో దారుణం సైదాబాద్: అమ్మకు ఆరోగ్యం బాగాలేదు.. కొద్దిరోజులు ఆసరాగా ఉందామని ఆ బాలిక స్కూలు వదలి వచ్చింది.. అయితే ఆ అమాయకురాలిపై మృగాడి కళ్లు పడ్డాయి.. మానవమృగంలా లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తల్లికి తెలిసి పోలీసులను ఆశ్రయించింది.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో సింగరేణికాలనీ గుడిసెలలో బుధవారం ఈ సంఘటన జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. నల్గొండజిల్లా దేవరకొండ మండలం తాటికొల్లు గ్రామానికి మందపల్లి సుజాతకు బాపట్లకు చెంది న శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె(13) ఉంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణికాల నీ గుడిసెలలో నివా సం ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ మృతి చెందాడు. అనంతరం ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ అమ్జత్(32) సుజాతతో పరిచయం పెంచుకుని సహజీవనం చేస్తున్నాడు. సుజాత కుమార్తె పరిగిలో ఉంటూ ఏడో తరగతి చదువుతోంది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే దసరా సెలవుల్లో తల్లికి ఆసరాగా ఉందామని వచ్చింది. కొద్దిరోజులుగా చింతల్‌బస్తీలోని అమ్మమ్మ వద్ద ఉంటుంది. రెండు రోజుల క్రితం తల్లివద్దకు వచ్చింది. అయితే కుమార్తెను ఇంటి నుంచి పంపించి వేయాలని అమ్జత్ సుజాతను కొడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరూ గొడవ పడగా తల్లి బయటకు వెళ్లింది. ఎవరూలేని సమయంలో అమ్జత్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె స్థానికులతో కలిసి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీ సులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా లైం గికదాడి ఘటనలు పునరావృతమవుతూ నే ఉన్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. జంటనగరాలలో రోజూ ఎక్కడో చోటు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బాలికలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని కోరారు. లైంగికదాడికి పాల్పడ్డ అమ్జత్ను కఠినం గా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
'ఆడపిల్ల’కు అన్యాయం జరిగింది
సుజాత: తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్లు అనుకునే అమాయకురాలు నా బిడ్డ. నా బిడ్డ ఎక్కడో అన్యాయానికి గురైంది.. అదే తెలియాలి. ఏ విషయం దాచని నా తల్లి ఎలాంటి కష్ట సమయంలో ఈ పెళ్లికి తలవంచిందో.. అంతుపట్టడం లేదు. తన భవిష్యత్తు ఏమవుతుందో అనే నా బెంగ. నా మధు నన్ను బాధపెట్టి వెళ్లిపోయింది. కాదు కాదు.. రాకాసులు తనను ఎత్తికెళ్లిపోయారు. అబద్ధాలు కాదు... తనకు వచ్చిన సమస్య ఏంటో చెప్పకుండా అబద్ధాలాడుతోంది. అదే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గంగిరెద్దులా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఏ కారణం వల్ల అనేది తెలియడం లేదు. తనను ఒక వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దాం. తన జీవితం బాగుండాలని ఎన్నో విధాలుగా కష్టపడ్డాం. ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నా మా దృష్టి అంతా మధుప్రియ మీదనే పెట్టాం. కానీ, తను మా గుండెల మీద తన్ని వెళ్లింది. నా ప్లేస్‌లో ఏ తల్లి ఉన్నా ఈ పాటికి చచ్చిపోయేది. ఇంకా బతుకున్నానంటే మధుప్రియ బతుకు ఏమైపోతుందో అనే.. బెంగతోనే. కాళ్లు కడిగి ఇచ్చుకునేవాళ్లం తను ఏరి కోరి ఆ అబ్బాయిని ఎంచుకోలేదు. ఏదో జరిగింది. అదే బయటకు రావడం లేదు. తను అంతగా ఇష్టపడి ఉండి ఉంటే.. మాకు నిజాలు చెప్పి ఉంటే.. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేవాళ్లం. చుట్టాలను పిలిచి వేడుకగా పెళ్లి చేసేవాళ్లం. మనసు చాలా సున్నితం మధుప్రియ మనస్తత్వం చాలా సున్నితమైంది. మేం ఏ కాస్త బాధపడినా తట్టుకోలేదు. ఏ విషయాన్నీ తను ఇప్పటిదాకా దాచలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగిందో చెప్పమంటే చెప్పడం లేదు. అన్నీ దాచిపెట్టి... తన జీవితాన్ని పణంగా పెట్టింది. ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు ప్రేమ త్యాగాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ, అతని ప్రేమ స్వార్థపూరితమైంది. అందుకే మా బిడ్డను మా నుంచి లాక్కుపోయాడు. బిడ్డలే ప్రాణంగా బతికిన మాక న్నా తనకు ఎవరూ ఎక్కువ కాదు. ఆ విషయం మాకు తెలుసు, తనకూ తెలుసు. మాకు కులం పట్టింపులులేవు. డబ్బు ఉన్నవాళ్లా లేనివాళ్లా అని పట్టించుకోం. మా పెద్దమ్మాయిది ప్రేమవివాహమే. మంచి చెడ్డలు చూసి ఘనంగా పెళ్లి జరిపించాం. మధుప్రియ పెళ్లికి మేం ఒప్పుకోలేదంటే బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడే కదా! మధుకి వాక్చాతుర్యం ఉంది కానీ, జీవితానుభవం లేదు. నా కూతురిని నమ్మించి మోసం చేశారు. నిజంగా ప్రేమించి ఉంటే.. మా అనుమతి దొరికే వరకు ఎదురుచూసేవారు. అన్నెంపున్నెం ఎరుగని నా బిడ్డను రాకాసులు వచ్చి ఎత్తికెళ్లిపోతుంటే ఏం చేయలేకపోయానే అని నా బాధ. ధైర్యంగా బతుకు బిడ్డా! ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ధైర్యం లేనివారమయ్యాం. ‘మధూ ఇన్నాళ్లూ నీ కోసమే కష్టపడ్డాం. మా కోసం ఏం చేశావని మిగతా ఇద్దరు బిడ్డలు అడిగితే నేనేమని సమాధానం చెప్పను. అయినా బిడ్డా ... నీకే కష్టం వచ్చినా... మేమున్నాం. ఎలాగైనా నిన్ను కాపాడుకోవడానికి పోరాడతాం. ధైర్యంగా ఉండు. ధైర్యంగా బతుకు.’ అంటూ దీవించారు సుజాత. తల్లి-కూతురు బంధం ఎప్పటికీ బలంగా ఉండాలంటే ఏమేం పాటించాలో ఇలా సూచిస్తున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి... పెళ్లికి ముందు టీనేజ్‌లో కూతురు మొండిపట్టు, అలక, గొడవలు పెట్టుకోవడం సహజం. వాటిని ఓరిమితోనే సహించాలి. ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాలు పిల్లలు వినకపోయినా సాధ్యమైనంతవరకు వారికి జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి విషయాన్ని తప్పుపట్టకుండా, జోక్యం చేసుకుండా ఒక సూపర్ వైజర్‌గా మాత్రమే తల్లి ఉండాలి. పెళ్లి తర్వాత పెళ్లి చేసుకున్నాక చాలా మంది అమ్మాయిలు భయపడేది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుందనే! బాధ్యతలను గౌరవంగా స్వీకరించడానికి అమ్మాయి ఇష్టపడాలి. అత్తవారింట అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనే విషయాన్ని తెలియజెప్పాలి. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా అమ్మాయికి తల్లివైపు నుంచి రక్షణ ఉండాలి. ఒకరి మీద ఒకరు డిమాండింగ్‌గా ఉండకూడదు. ఈ ధోరణి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. సొంత నిర్ణయం తీసుకుంటే...! ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు తమను కాదని వెళ్లిపోతే.. అక్కడ కారణాలనే తప్పు పట్టాలే తప్ప కూతురును కాదు. తమ కూతురుకు తమ మీద వ్యతిరేకత లేదు అని గుర్తించాలి. యవ్వనదశలో ఇలాంటివి సహజమే అనుకోవాలి. పదేపదే ‘ఇలా ఎందుకు జరిగిందా’ అని బాధపడకుండా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఆలోచించాలి. తమ మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దగ్గరవడానికి కలిసి వచ్చే సందర్భాలెన్నో ఉంటాయి. వాటిని తల్లీకూతుళ్లిద్దరూ తప్పక ఉపయోగించుకోవాలి.