నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని శేషాద్రి నగర్‌లో నివాసముంటున్న సుజాత హత్యకేసు మిస్టరీ వీడింది. భర్త గొల్ల మల్లేష్ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.
కర్నూలు, న్యూస్‌లైన్: నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని శేషాద్రి నగర్‌లో నివాసముంటున్న సుజాత హత్యకేసు మిస్టరీ వీడింది. భర్త గొల్ల మల్లేష్ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావని సుజాత భర్తతో తరచూ వా గ్వాద పడేవారు. ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం ఇదే విషయం వారి మధ్య చర్చకు వచ్చి గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన మల్లేష్ కత్తి పీటతో ఆమె తల వెనుక భాగంలో బాదడంతో కుప్ప కూలిపోయింది. వెంటనే గొంతు నులిమి హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. సా యంత్రం పాఠశాల నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలు తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతను ఇంటికి చేరుకుని ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదం కింద నమోదు చేసుకున్నారు. గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో బయట పడటంతో మల్లేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని సీఐ అబ్దుల్ గౌస్ తెలిపారు. ఈ మేరకు అతనిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.