గుంటూరు: ఓ వివాహితను అత్తింటివారు గెంటివేస్తే, ఆమె పోరాటానికి దిగింది. వినుకొండలో సుజాత అనే అమె భర్త వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు కోడలే కారణమని అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటివేశారు.
సుజాత ఊరుకోలేదు. అత్తవారి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.