vinukonda
-
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
రషీద్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు
-
వినుకొండ రషీద్ కుటుంబానికి సర్కార్ వేధింపులు
పల్నాడు, సాక్షి: ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పొగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలుపాలు చేసుకుంది. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా.. అతని సోదరుడు ఖాదర్ బాషా తో పాటు కొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రెండున్నరేళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో.. మూడు వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే.. రషీద్ హత్య కేసులో ‘పరారీలో ఉన్న నిందితుడి’ ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా, ఇతరులను అరెస్ట్ చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వొకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో ఈయనే వాదనలు వినిపిస్తున్నారు. ‘రషీద్ హత్య కేసులో ఆరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు.. 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. అలాగే.. ఈ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని ఎంఎం ప్రసాద్ అంటున్నారు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ పల్నాడ్ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ళ మాధవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేత రషీదును హత్య చేస్తే.. ఆయన సోదరుడ్ని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. తన తమ్ముడి కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఖాదర్ భాషాను అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుతంత్రాల ప్రభుత్వం. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కులకు వంతపలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక కొడుకును నడిరోడ్డు పైన చంపేశారు మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమే నా?. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని అక్రమ కేసు నమోదు చేసి నా పెద్ద కొడుకును జైలుకు పంపారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు?. పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నా కొడుకుని జైలుకు పంపి మమ్మల్ని వేధిస్తోంది. ::రషీద్ తల్లి శంషాద్ ఆవేదన -
రంగంలోకి వైఎస్ జగన్.. ఇక బాబు అండ్ కోకు చుక్కలే!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభం అయితే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక తప్పలేదు. తెలుగుదేశంవారు హింసకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఏమి వ్యాఖ్యానించేవారంటే.. వైఎస్సార్‌సీపీవారు దాడులు చేసినా ప్రతిదాఢులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీవారు హింసాకాండకు దిగవద్దని బాబు ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు నోరే విప్పలేదు. హోం మంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న పాలనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారని అనుకోవాలి.వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా అక్కడకు వెళ్లడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలనర్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా, వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాలపాలవుతున్నా, పార్టీపరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్మోహన్రెడ్డి వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునే వారు. కానీ జగన్మోహన్రెడ్డి తొందరపడకుండా ఉండాలని భావించినట్లు ఉన్నారు. అవసరమైనప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు.ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ పరిస్థితి రోజు, రోజుకు దిగజారి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురి అయ్యారు. 36 మంది హత్యలకు గురి అయ్యారు. వందల మందిపై హత్యాయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. రెండువేలమందికి పైగా ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటివద్ద కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారిద్దరి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయంగా ఉంది.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రోజులలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుంది. దానికి తగ్గట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటివారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో వ్రజలకు రక్షణలేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టరమ్‌లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైఎస్సార్సీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ యువ నేత రషీద్ జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకుని మరుసటి రోజు వినుకొండకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పదిహేను చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయిని పోలీసులు నిలువరించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీ ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతది, సరిగా పనిచేయనిది అని వైఎస్సార్సీపీ వర్గాలు చెప్పాయి. తత్పలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది.సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయా చోట్ల గుమికూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో కాన్వాయి బాగా ఆలస్యం అయింది. వినుకొండ జనసంద్రమే అయింది. వంద కిలోమీటర్ల దూరం కూడా లేని వినుకొండకు చేరుకోవడానికి ఏడుగంటలకుపైగా పట్టింది. దీనితో వైఎస్సార్సీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండదండగా ఉంటుందన్న ధీమా వచ్చింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందినవారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది.రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందలమందిపై హత్యాయత్నం చేయడం, వందల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ తెగబడడంలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి ఈ డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. డిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసివచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం.ఇంతకాలం వైఎస్సార్సీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి సహకరించినా, అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్డీఏని వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. బీజేపీనేమో తమ సొంత రాజకీయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఏవైనా ఈ ధర్నాకు వస్తే విశేషమే అవుతుంది.అలాగే వైఎస్సార్సీపీని దగ్గర చేసుకుంటే ఉపయోగం ఉంటుందని భావించి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఏవైనా డిల్లీలో జరిగే దర్నాకు హాజరైతే ప్రధాన వార్తే అవుతుంది. ఈ రెండు కూటమిలలో లేని పార్టీలవారు ఎందరు వస్తారో చూడాలి. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ధర్నా జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక సూచన అవుతుంది. ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనుసరించవలసిన ప్రక్రియలే. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రజలకు, రాజకీయవర్గాలకు తెలుస్తుంది. ఎంత మిత్రపక్షమైనా బీజేపీ కూడా టీడీపీకి హెచ్చరికలు పంపించే అవకాశం ఉంటుంది.శాసనసభలో సైతం గవర్నర్ ప్రసంగ టైమ్‌లో కానీ, ఇతర సంధర్భాలలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలలోకి ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్త అయినా జంకు వస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డుమీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎన్ని విమర్శించినా, రషీద్ హత్య గురించి ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతిభద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను మాటవరసకైనా కోరక తప్పలేదు. అది వైఎస్ జగన్మోహన్రెడ్డి పవర్! గెలిచినా, ఓడినా.. సింహం, సింహమే!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులుఇదీ చదవండి: అరాచక పాలనపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా.. ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్ -
నా బిడ్డది ముమ్మూటికీ రాజకీయ హత్యే: రషీద్ తల్లిదండ్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: ముమ్మాటికీ తన బిడ్డది రాజకీయ హత్యేనని రషీద్ తల్లిదండ్రులు ఆరోపించారు. రషీద్‌ను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్ అంజనేయులే చంపించారని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాడనే టీడీపీ నేతలు తన బిడ్డను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె కూడా ఓ మహిళే కదా.. తల్లి కడుపు కోత తెలియదా అని ప్రశ్నించారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.ప్రభుత్వం న్యాయం చేసేదే అయితే ఎందుకు తమ దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పలేదని రషీద్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కొంతమంది ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి వచ్చి న్యాయం చేస్తానని చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో రషీద్ హత్యపై వైఎస్ జగన్ పోరాడుతుంటే పోలీసులు ఎందుకు ప్లే కార్డులు లాక్కున్నారని ప్రశ్నించారు.‘వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎందుకు మాట్లాడను ఇవ్వటం లేదు. ఒక మనిషిని అన్యాయంగా చంపితే ఆయన తరుపున మాట్లాడే హక్కు లేదా?. పార్టీ పరంగా అడిగే హక్కు వైఎస్ జగన్‌కు లేదా?. ఎందుకు ప్రభుత్వం, పోలీసులు పదేపదే నా బిడ్డది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు -
రషీద్‌ది రాజకీయ హత్యే..
-
యావత్ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్ జగన్
ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ పోరాటంలో మనతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోదాం. ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్దాం. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతోందో వివరిద్దాం. ధర్నా అనంతరం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను అందరి దృష్టికి తీసుకెళ్లాలి. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన తాడే పల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్లు కోరాం. అపాయింట్మెంట్లు రాగానే.. వారికీ ఇక్కడి పరిస్థితిని వివరిస్తాం. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీ ఒక్కో బాధ్యత తీసుకోవాలి. వెంటనే ఢిల్లీ వెళ్లి ఆ పనుల్లో నిమగ్నం కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. అందుకే మనం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాం. అలా చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రజాస్వామ్య మనుగడకే పెను ప్రమాదం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అవి ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బ. అందుకే అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. వినుకొండలో రషీద్ హత్యే ఇందుకు పరాకాష్ట. ఆ హత్య వీడియో దృశ్యాలు.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపిన తీరు అత్యంత అమానుషం. తమ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది.రషీద్ హత్యపై వక్రీకరణకు యత్నం వినుకొండలో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ ఒక వైన్ షాపులో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఆ రాజకీయ హత్య ఘటనను వక్రీకరించడానికి ఎల్లో మీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, ఇప్పుడు జరిగిన దారుణ హత్యకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆ కాలిన బైక్.. వైఎస్సార్సీపీ వాళ్లది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. దాన్ని కూడా ట్విస్ట్ చేసి, నానా తప్పుడు రాతలు రాస్తున్నారు. అసలు తమ కొడుకు ఏం తప్పు చేశాడని రషీద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘సీఎంగా వైఎస్ జగన్ ఉంటే.. అంతా మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. హంతకుడైన జిలానీ.. లోకేశ్ పుట్టిన రోజున, స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలను రషీద్ తల్లిదండ్రులు చూపారు. స్థానిక ఎమ్మెల్యేతో కూడా కలిసి దిగిన హంతకుడి ఫొటోలను వారు చూపించారు.హత్యలు.. హత్యాయత్నాలు.. వేధింపులు.. విధ్వంసాలు పల్నాడు జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే హత్యతో సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు మల్లికా గార్గ్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆమె సమర్థురాలు. అందుకే ఆమెను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని నియమించుకుని ఈ దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది.ఎంపీపైనా యథేచ్ఛగా దాడి మరోవైపు తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఒక న్యాయవాది. ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరులో ఆయన ఇంటికి వెళ్తే, రాళ్లతో దాడి చేసి.. వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన వాహనాన్ని దగ్ధం చేశారు. అన్ని తప్పులు చేసిన వారే, తిరిగి మన పార్టీ వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా?రాష్ట్రంలో 15 ఏళ్లుగా వైఎస్సార్సీపీ ప్రస్థానం సాగుతోంది. చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్సీపీని అణగదొక్కలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయడం ధర్మమా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? ప్రభుత్వాలు చేసే మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి. గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం. అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై ఎవరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన. అందుకే దగ్గరుండి విధ్వంసకాండను ప్రోత్సహిస్తున్నారు. పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి. కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. -
రషీద్ ఘటనపై వినుకొండ ప్రజలు ఫైర్
-
ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్య అత్యంత కిరాతకం. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతోనే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయి. నామీద కూడా దాడులు చేశారు. గతంలో యాక్టివ్‌గా పని చేసిన నేతలందరినీ టీడీపీ టార్గెట్ చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?. పార్లమెంటులో వీటిపై చర్చిస్తాం. దేశమంతా ఏపీలోని దారుణాల గురించి విస్తుపోతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు నోరుమెదపటంలేదు?. .. బుధవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీపై దాడులపై ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.దేశమంతా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై చర్చించేలా చేస్తాం’ అని అన్నారు.చదవండి: మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ -
KSR Live Show: 45 రోజులకే విసిగి పోయారు ప్రజలు.. జగన్ కోసం పోటెత్తిన జనం
-
వైఎస్ జగన్ భరోసా.. పోరాటం ఆగదు..
-
కూటమి సర్కార్ పై పోరుకు సిద్ధమైన వైఎస్ఆర్ సీపీ
-
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోంది... రాష్ట్రపతి పాలన విధించాలి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం’’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం… pic.twitter.com/lVcgXOuo8N— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్ఆర్కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు.శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్ కాలనీ మీదుగా రషీద్ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మహిళలు జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. -
తాడేపల్లి టు వినుకొండ.. ఏడున్నర గంటలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ సాక్షి అమరావతి: వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగ నరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఈ విషయం తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి గురువారం సాయంత్రానికి చేరుకున్నారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరగానే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు ఆయన్ను అనుసరించారు. దారి పొడవునా వేలాది మంది పలు కూడళ్ల వద్ద జగన్ కోసం వేచి చూశారు. ఎక్కడికక్కడ జగన్.. వాహనాన్ని ఆపి రెండు చేతులు పైకి ఎత్తి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రతి చోటా వేలాది మంది మేము సైతం మీ వెంటే అంటూ చేతులెత్తి సంఘీభావం తెలిపారు. తాడేపల్లి నుంచి వినుకొండకు వెళ్లాలంటే సాధారణంగా రెండు.. రెండున్నర గంటలు పడుతుంది. కానీ వైఎస్ జగన్ ఉదయం పది గంటలకు బయలుదేరితే వినుకొండలోని రషీద్ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం ఐదున్నర గంటలు అయ్యింది. అభిమాన జడి తాడేపల్లి నుంచి వినుకొండ వరకు వర్షం పడుతూనే ఉన్నా, దారి పొడవునా అశేష జనవాహిని జగన్ వెంట కదలి వచ్చింది. కాజ టోల్ గేట్, పెదకాకాని వై.జంక్షన్లో పార్టీ సమన్వయకర్తలు అంబటి మురళీ కృష్ణ, షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు జగన్‌కు స్వాగతం తెలిపారు. కాన్వాయ్ వెంట ఉన్న పలు వాహనాలను పెదకాకాని వై.జంక్షన్ వద్ద బారికేడ్లు అడ్డుపెట్టి నిలిపి వేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 30 నిమిషాల తర్వాత వాహనాలను అనుమతించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తలు ఏటుకూరు వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. 144 సెక్షన్ అమలులో ఉందంటూ పోలీసులు మైక్‌లో హెచ్చరికలు చేస్తున్నా వెరవక జనం వేలాదిగా తరలి వచ్చారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఎన్ఆర్టీ సెంటర్ వద్ద జై జగన్ నినాదాల హోరు నడుమ ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని బ్యాంక్ కాలనీ పార్టీ కార్యాలయం వద్ద గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు జగన్‌కు స్వాగతం పలికారు. చిలకలూరిపేట మండలం కావూరు, లింగంగుంట్ల గ్రామాల మధ్య ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. కోమటినేని వారిపాలెం వద్ద, అమీన్‌సాహెబ్‌పాలెం, బసికాపురం గ్రామాల మధ్య కనపర్రు, తదితర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అభిమానం చాటుకున్నారు. జగన్ కోసం జనం ఎదురుచూపులునరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్ఆర్కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు. శావల్యాపురం నుంచి వినుకొండ వరకు జనం ప్రతిచోటా రోడ్లపైకి వచ్చారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి వెళ్లడానికి గంటన్నర సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్ కాలనీ మీదుగా రషీద్ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. పలు చోట్ల యువకులు, మíßహిళలు జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. -
వినుకొండ: రషీద్‌కు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ.. అండగా ఉంటానని భరోసా (ఫొటోలు)
-
అసెంబ్లీలో ఆటవిక పాలనను నిలదీస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పల్నాడు: ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది లేనేలేదని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక.. హత్యలు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అయినా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన.వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ఈనెల 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయి. టీడీపీ వేధింపులో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితయ్యారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారు. అమాయకుడు, సామాన్యుడైన రషీద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే నరికాడు. కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడనే ఈ హత్య చేశారు. హత్య చేసిన జిలానీ వైఎస్సార్సీపీ వ్యక్తి అని ప్రచారం చేశారు. రెండేళ్ల కిందట బైక్ కాలిన కేసులో.. ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ ఈనాడు ఓ కథనం ఇచ్చింది. ఆ బైక్ అసిఫ్ అనే వైఎస్సార్సీపీ వ్యక్తికి చెందింది. . ఈనాడు అసలు పేపరేనా?.. సిగ్గుతో తలవంచుకోవాలి. రషీద్ కేసు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మిథున్ రెడ్డి తన నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి, రెడ్డుప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు.వినుకొండకు ఎస్పీగా రవిశంకర్ ఉన్నారు. ఎన్నికల వేళ పలుకుబడితో ఆ ఎస్పీని మార్చేశారు. ఎన్నికల అధికారులు మల్లికా గర్గ్‌ను నియమించారు. టీడీపీ ప్రభుత్వం ఆ ఎస్పీని కూడా మార్చేసింది’ అని పేర్కొన్నారు. ఏపీలో అరాచక పాలనపై నిరసనగా ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడతాం. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ ధర్నా చేస్తాం. ఇందులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరతాం. రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం’’ అని అన్నారాయన. వైఎస్ జగన్ ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతి సామాన్యుడిలో ఇదే అభిప్రాయం ఉందిగవర్నన్స్ అనేది లేదు.తెలుగుదేశం పార్టీవారు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, హత్యాయత్నం చేయొచ్చు, ఆస్తులను ధ్వంసం చేయొచ్చు.పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.పల్నాడు జిల్లాకు గతంలో రవిశంకర్ రెడ్డి ఉండేవాడు.ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో బదిలీ చేయించారు.బిందుమాధవ్ అనే అధికారిని వేయించుకున్నారుఈ అధికారి చాలా అన్యాయంగా ప్రవర్తించారు.చివరకు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది.తర్వాత మల్లికా గార్గ్‌ను ఈసీ తీసుకు వచ్చింది.తర్వాత ఈమెను కూడా పంపించేశారు:.తర్వాత వాళ్ల పార్టీకి మద్దతు పలికే వ్యక్తిని ఎస్పీగా తెచ్చుకున్నారు.ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2 రోజులకే రషీద్ హత్య జరిగింది.ప్రజలంతా చూస్తుండగా.. దారుణ మత్య జరిగింది:హత్యకు గురైన సాధారణ ఉద్యోగస్తుడు.అలాంటి వ్యక్తిని కిరాతకంగా నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగానే నరికి చంపారు.రాష్ట్రవ్యాప్తంగా సంకేతం ఇవ్వడానికి ఈదారుణానికి పాల్పడ్డారు.పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది.హత్యా ఘటనపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది.ఘటన జరిగిన వెంటనే హత్య వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందని పోలీసులు అవాస్తవాలు చెప్తున్నారు.ఇదీ చదవండి: దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాఎంపీ మిథున్ తన నియోజకవర్గంలో తిరగకూడదా?:ఆ నియోజకవర్గానికి తన తండ్రి ఎమ్మెల్యే.మాజీ ఎంపీ ఇంట్లో కూర్చొని ఉంటే దాడులు చేశారుమా మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేశారుఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడైనా జరిగాయా?మళ్లీ మా పార్టీ వాళ్లపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు.శాంతి భద్రతలను పట్టించుకునే పరిస్థితుల్లో పోలీసులు లేరు.బాలికలమీద అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు.మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోడడంలేదు.వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. టీడీపీ వాళ్లపై దాడులు చేయమని మేం ఏరోజూ చెప్పలేదు.ప్రతి మహిళకూ రక్షణ విషయంలో రాజీపడలేదు.దిశలాంటి వ్యవస్థ ద్వారా వారికి రక్షణ విషయంలో భరోసా కల్పించాం.చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడుగత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికీ విద్యాదీవెన అందించేవాళ్లం.జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి ఇప్పటివరకూ ఇవ్వలేదు.ఆతర్వాత కూడా ఏప్రిల్ - జూన్ త్రైమాసికం వచ్చేసింది.ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన ఇచ్చేవాళ్లం.మేం ఉండి ఉంటే.. ఇప్పటికే రైతు భరోసా వచ్చి ఉండేది.అమ్మ ఒడి డబ్బులు ఇవ్వాళ్టికే తల్లులకు వచ్చి ఉండేవి.ప్రతి జూన్‌లో అమ్మ ఒడి కింద తల్లులకు తోడుగా నిలిచాం.మహిళలకు సంబంధించి సున్నావడ్డీ డబ్బు కూడా ఇవ్వాళ్టికి వచ్చి ఉండేది.మత్స్యకార భరోసాకూడా సకాలానికే అంది ఉండేది.ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలు ఉంటే.. అంతమందికీ రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు.ప్రతి ఇంట్లో ప్రతి అక్క చెల్లెమ్మకూ నెలకు రూ.1500 ఇస్తామన్నారు.వీళ్లంతా ఇప్పుడు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును అడుగుతున్నారు.ఈ అంశాలనుంచి ప్రజల దృష్టిని మరిల్చేందుకు, ప్రజలెవ్వరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఈ మాదిరిగా దాడులు చేస్తున్నారు.రాష్ట్రంలో ఆటవిక పాలనపై నిరసన తెలుపుతాంఅసెంబ్లీలో ఆటవిక పాలనను నిలదీస్తాం.ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో నిలదీస్తాం.ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్తాం.బుధవారం… ఢిల్లీలో ధర్నా ద్వారా నిరసన తెలుపుతాం.రాష్ట్రంలో అరాచకపాలనను, హింసను దేశం దృష్టికి తీసుకెళ్తాం.ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాగారి అపాయింట్మెంట్లు కోరాం.అపాయింట్మెంట్ రాగానే వారికి పూర్తి వివరాలు ఇస్తాం.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలను అంశాన్ని దృష్టికి తీసుకెళ్తాం.రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరాన్ని నివేదిస్తాం.హత్యకు గురైన వ్యక్తి కుటుంబంపై వ్యక్తిత్వ హననానికి పోలీసులు దిగుతున్నారు.ఇది సరైన విధానం కాదు.రాష్ట్రంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాలి.జరిగిన ఘటనలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.టీడీపీకి ఓటు వేయనివారి రక్షణ బాధ్యతకూడా ప్రభుత్వానిదే అన్న విషయాన్ని గుర్తించాలి. -
దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు. గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం... ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
వాడు బతకొద్దు.. ఉరితీయండి లేదా మేమే చంపేస్తాం..
-
రషీద్ ఇంటి వద్ద ఉద్విగ్న పరిస్థితి
-
మరికాసేపట్లో రషీద్ ఇంటికి జగన్
-
శిరస్సు వంచుతున్నాం ఎంతమందిని నరుకుతారో చూస్తాం
-
పోలీసు ఆంక్షలున్నా.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
వినుకొండకు చేరుకుంటున్న జగన్
-
మొరాయిహించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. మరో వాహనం ఎక్కి వినుకొండకు ప్రయాణం
-
వ్యక్తిగతం కాదు.. రాజకీయ హత్యే
-
ఘటనపై కుటుంబ సభ్యుని షాకింగ్ నిజాలు.. రషీద్ చివరి మాటలు..
-
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే: రషీద్ తల్లిదండ్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ నేతలే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలే రషీద్‌ను చంపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే. వైఎస్సార్సీపీలో రషీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే టీడీపీ నేతలు చంపేశారు. హత్య సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకోలేదు’’ అని రషీద్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పోలీసులు పదేపదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలవల్లే జరిగిందని చెప్తున్నారు. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ హత్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎందుకు స్పందించలేదు.రాజకీయ కారణాలతోనే హత్య చేయించారు. హత్య వెనుక ఎవరున్నారో తేలాల్సిందే. జిలానీకి గంజాయి తాగించి.. పక్కా పథకం ప్రకారం హత్య చేయించారు. రషీద్ వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడని కక్ష పెంచుకున్నాడు. జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తే.. ఎమ్మెల్యే జీవీ చెప్తున్నవనీ అబద్ధాలే. వ్యక్తిగత కక్షలతో హత్య జరగలేదు.’’ అని స్థానికులు అంటున్నారు. -
వినుకొండకు వైఎస్ జగన్.. కార్యకర్తల ఘన స్వాగతం (ఫొటోలు)
-
వినుకొండ ఘటనపై రషీద్ స్నేహితుడి మాటల్లో
-
వినుకొండ రషీద్ కుటుంబానికి భరోసా
-
Watch Live: రషీద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
బరువెక్కిన గుండెతో వినుకొండ రషీద్ తల్లి
-
రాజకీయ కక్షతోనే హత్య.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటానన్న వైఎస్ జగన్
పల్నాడు,సాక్షి: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రంలో అన్నీ దారుణాలకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వినుకొండలో టీడీపీ గుండా చేతిలో రెండ్రోజుల కిందట అతికిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్‌ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికిలోనూ కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చంపేసేంత కక్షలు లేవు.. ఎందుకిలా జరిగింది? అని ఆరా తీశారాయన. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలే అని రషీద్ తల్లి జగన్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ కోసమే రషీద్ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకును బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుల పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారు. జిలానీ కాల్ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నది తెలిసిపోతుంది. నా కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్ తల్లిదండ్రులు కోరారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్‌కు రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. ‘‘హత్య వెనుక ఎవరున్నా వదలం. మీ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ దారుణాలే. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు’ అని అన్నారాయన. అలాగే.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.ఆ టైంలోనూ ఆ కుటుంబ సభ్యుల్ని ఆయన ఓదార్చారు. అంతకు ముందు రషీద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. అడుగడుగునా ఆంక్షలు.. ఆటంకాలుపోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా వాళ్లు కల్పించిన ఆంటకాలతో వైఎస్ జగన్ వినుకొండ పర్యటన కొనసాగింది. దారి మధ్యలో ఆయన వెంట పార్టీ నేతలు రాకూడదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 15 చోట్ల ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన పర్యటన ఆలస్యంగా కొనసాగింది. అయినప్పటికీ ఆయన ఓపికగా ముందుకు సాగారు.దారివెంట అభిమాన గణంజగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించినా.. అభిమానులు మాత్రం పోటెత్తారు. దారి పొడవునా జై జగన్ అంటూ నీరాజనాలు పట్టారు. వినుకొండలో ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు వెళ్లింది. అయితే పరామర్శ కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ.. అంత పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ కేడర్‌ను నిరుత్సాహపర్చడం ఇష్టం లేని వైఎస్ జగన్.. బయటికి వచ్చి అభివాదం చేశారు. జగన్ భద్రతపై నిర్లక్ష్యంమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ చేరుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ వాహనం కండిషన్లో ఉందని చెప్పడం కొసమెరుపు. -
నేడు వినుకొండకు వెళ్లనున్న వైఎస్ జగన్
-
నేడు వినుకొండకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ రాను న్నారు. టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు.టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదు..రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూ టమి సర్కారు ఘోర వైఫల్యం, టీడీపీ నేతల అరాచక పర్వంపై వైఎస్ జగన్ గురువారం ‘ఎక్స్’ వేదిక గా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగు తోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘వైఎస్సార్ సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పా ల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్న వినుకొండ లో నరమేథం ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గు చేటు’ అని పేర్కొ న్నారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశా లతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నే రగాళ్లు, హంతకులు చెలరేగి పోతున్నారు’ అని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధా నాలు వీడాలని సీఎం చంద్రబా బును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పా రు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై న తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వ ఏజెన్సీ లతో ప్రత్యేక విచారణ నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. టీడీపీ మూక చేతిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ అరాచకాలకు చంద్రబాబుదే బాధ్యతపుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వినుకొండలో నరమేధానికి తెగబడి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైందని చెప్పేందుకు ఈ అరాచకాలే నిదర్శనమని, వీటికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
రాక్షస పాలనపై ప్రజా పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో సాగుతోన్న రాక్షస పాల నపై ప్రజాపోరాటం చేద్దామని వైఎస్సార్సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ నడిరోడ్డుపై పాశ వికంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘట న గురించి తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. రషీద్ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు.గురు వారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివా సానికి చేరుకున్న వైఎస్ జగన్.. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అధికారంలోకి వచ్చిన పార్టీ దృష్టి పెట్టాలిగానీ.. వైఎస్సార్సీపీని అణగదొక్కాలనే కోణంలో దారు ణాలకు పాల్పడటం హేయమన్నారు.కొత్తగా కొలు వుదీరిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ అధికారంలోకి వచ్చిన నెల న్నరలోనే హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారని తెలిపారు. వినుకొండలో రషీద్‌ను పాశవికంగా హత్య చేయడం అందుకు పరాకాష్ట అన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి నెలన్నర రోజులుగా సాగుతున్న అరాచకాలే తార్కాణమన్నారు. ప్రజ లందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ సీఎం సహా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులే రాజకీయ దురు ద్దేశాలతో వెనకుండి ప్రోత్సహిస్తుండటం వల్లే ఇ లాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని.. అంద రికీ అండగా నిలుస్తామని జగన్ భరోసా ఇచ్చారు. -
రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
-
రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యే: కనుమూరు రవిచంద్రారెడ్డి
తాడేపల్లి, సాక్షి: ఏపీలో పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ దారుణ హత్యా ఘటన, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి.. అని కోరుతున్నారాయన. ‘‘.. వినుకొండలో నడిబజారులో రషీద్ ని నరికి చంపారు. రషీద్‌కు ముమ్మాటికీ రాజకీయ హత్యే. అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా ఘటనతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ కార్యకర్తకు అండగా వైఎస్సార్సీపీ అధిష్టానం ఉంటుంది అని భరోసా ఇచ్చారాయన. ఇదీ చదవండి: వినుకొండకు జగన్.. రషీద్ కుటుంబానికి పరామర్శ.. తాజాగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేశారు. కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది?. వారంలోగా శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలి. చేయలేక పోతే కూటమి నేతలంతా రాజీనామాలు చేయాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. -
రేపు వినుకొండకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని బ్రహ్మనాయుడికి వైఎస్ జగన్ తెలిపారు.కాగా, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.’’ అని ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
TDP రాక్షసానందానికి ఇంకెంతమంది బలి కావాలి..?
-
ఆయన ఉంటే ఇలా జరిగేది కాదు.. వినుకొండ ఘటనపై అంబటి ట్వీట్
సాక్షి, పల్నాడు జిల్లా: సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది.ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.వినుకొండ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ‘‘మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు!’’ అంటూ ట్వీట్ చేశారు.మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు !— Ambati Rambabu (@AmbatiRambabu) July 17, 2024 ఇదీ చదవండి: గూండారాజ్.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య -
నరరూప రాక్షసుల్లా టీడీపీ గూండాలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూపరాక్షసుల్లా తయారయ్యారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. వినుకొండ వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై టీడీపీకి చెందిన గూండా జిలానీ పాశవికంగా కత్తితో దాడిచేసి హతమార్చారని ఆరోపించింది. అందరూ చూస్తుండగా, దారుణంగా రెండు చేతులు నరికి మెడపై కూడా పదేపదే కత్తితో వేటువేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడని తెలిపింది. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొంది. టీడీపీతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి? అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. -
రాబందుల రాజ్యంలో 'రాక్షస కాండ'.. పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు
రాష్ట్రంలో రక్తం ఏరులైపారుతోంది.. మధ్యయుగాల నాటి మారణకాండను తలపిస్తూ నడిరోడ్డు పైనే, అదీ అందరూ చూస్తుండగానే మనుషులను నరికిపారేస్తున్నారు. తాలిబన్లను మించి అత్యంత పాశవికంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మారణకాండను సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు.. నెల రోజులుగా పచ్చ మూక ఉన్మాదానికి నెత్తురు కట్టలు తెంచుకుంటోంది.. తలకాయలు తెగిపడుతున్నాయి. వారి అధికార మదానికి ప్రాణాలు దూదిపింజల్లా రాలిపోతున్నాయి. సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను బుధవారం రాత్రి టీడీపీ నేత జిలానీ కత్తితో దాడి చేసి రెండు చేతులు తెగనరికాడు.. అదే కత్తితో తలపైనా, మెడపైనా విచక్షణారహితంగా నరికాడు. ఇంతటి దారుణ హత్య ఎక్కడో చీకట్లోనో.. దొంగచాటుగానో చేయలేదు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఇంతటి ఘోరానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ హోర్డింగుల సాక్షిగా స్పష్టం చేశారు.. దీంతో పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుని టీడీపీ అరాచకాలకు రాచబాట పరిచింది.. అంతకంటే ఇంకేం కావాలని టీడీపీ రౌడీలు మారణాయుధాలు చేతబట్టి కాలకేయుళ్లా రాష్ట్రంపై దండెత్తారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖచిత్రం.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో నెలకొన్న అరాచక రాజ్యం. మధ్యయుగాలనాటి గజినీ, ఘోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబన్ మూకలను మించి పచ్చ మూకలు స్వైరవిహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నాయి. తమ పదఘట్టనల కింద యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. నడిరోడ్లపై రాక్షసరాజ్యం కరాళ నృత్యం చేస్తోంది. 75ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే టీడీపీ మూకల దాడుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. మరో 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇళ్లు, ఆస్తులు, మహానేత విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూలుస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకునేవారే లేరు. నెల రోజుల్లోనే 31 హత్యలు మహాభారతంలో బకాసురుడి కథ అందరికీ తెలిసిందే. అతడికి ఒక ఎడ్ల బండి నిండుగా అన్ని రకాల ఆహార పదార్థాలను పంపేవారు. ఆ ఆహార పదార్థాలను, బండికి కట్టిన ఎద్దుల్ని, బండిని తోలుకొచ్చిన మనిషిని కూడా కరకరానమిలి పారేసేవాడు. ఇలా రోజూ ఎడ్లబండి నిండుగా ఆహార పదార్థాలను నింపి మనిషితో పంపాల్సిందే. భీముడు వెళ్లి బకాసురుడిని సంహరించే వరకు ఈ అరాచకం కొనసాగింది. ఇప్పుడు బకాసురుడి రీతిలోనే చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ రౌడీలు రోజుకొకరిని అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రంలో 31 మందిని పచ్చ నేతలు, కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. వీరి దాడులు, వేధింపులను తట్టుకోలేక 35 మంది తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు నమోదైన అధికారిక లెక్కలు. కానీ వాస్తవంగా అంతకుమించిన రాక్షస కాండలో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండ కావడంతో ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. వీరంతా ఫిర్యాదు చేస్తే మరిన్ని కేసులు వెలుగుచూసేవి.నెల రోజుల్లో వేయికిపైగా దాడులు.. 300 హత్యాయత్నాలుటీడీపీ రౌడీ మూకలు రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు వ్యాపారులు, సాధారణ ప్రజలపై కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 1,050 దాడులకు తెగబడటం టీడీపీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనం. వాటిలో 300కుపైగా హత్యాయత్నాలే కావడం గమనార్హం. అంటే టీడీపీ గూండాలు రోజుకు సగటున 100 దాడులు.. 10 హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఒక్క ప్రాంతమని లేదు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్రవ్యాప్తంగా రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. ఎస్సీ కాలనీలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు.ఊళ్లు వదిలిపోయిన వేలాది కుటుబాలుటీడీపీ రౌడీమూకలు హత్యాకాండకు తెగబడుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో తమ గ్రామాలు వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500, అనంతపురం జిల్లాలో 350, శ్రీసత్యసాయి జిల్లాలో 100, అన్నమయ్య జిల్లాలో 120, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ సొంత ఊళ్లను విడిచిపెట్టేశాయి. వ్యాపారులను కూడా టీడీపీ మూకలు వదిలిపెట్టడం లేదు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 560 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికే పోలీస్ శాఖ సలాం..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ నారా లోకేశ్ విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతోంది. రెడ్‌బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాల అడుగులకు మడుగులొత్తుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్‌ను అనుసరిస్తూ నియోజకవర్గ స్థాయిల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ హింసాకాండను అడ్డుకుంటే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. -
అవినీతి జీవి
సాక్షి, నరసరావుపేట/వినుకొండ/నూజెండ్ల: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘జీవీ’ నీరు–చెట్టు, ఇసుక, మట్టిని అడ్డంగా దోచేశారు. బంధువులు, బినామీల ద్వారా పోరంబోకు, అగ్రహారం భూములను కబ్జా చేశారు. పేదలకు ప్రభుత్వం అందించిన భూములను స్వాహా చేసి చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు. ♦ బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెంలో 4,450 ఎకరాల కొత్త చెరువులో సర్వే నం.438లో 180 ఎకరాలు జీవీ బావమరిది కె.నరసింహారావు బినామీల ద్వారా ఆక్రమించుకున్నారు. ♦ గుమ్మనంపాడులో ఈనాం భూములను జీవీ, ఆయన బినామీలు వదలలేదు. పాలడుగు వెంకటరాయుడు, చిరుమామిళ్ల రామకృష్ణయ్య అగ్రహారికులుగా వ్యవహరిస్తున్న సమయంలో వారి పరిధిలో సర్వే నంబర్ 1 నుంచి 54 వరకు 5,968 ఎకరాల భూమి ఉంది. ఇందులో దేవుని మాన్యం భూమి సర్వే నం.43లో చెన్నకేశవస్వామి భూమి 200 ఎకరాలు, బంగారమ్మ తల్లి భూమి 16 ఎకరాలు, ఆంజనేయ స్వామి మాన్యం 13 ఎకరాలు, మరో కబ్జాలో భాగంగా ఊరచెరువు కింద 17 ఎకరాలను ఆక్రమించుకున్నారు. ♦ రేమిడిచర్ల గాలెయ్యకుంట సమీపంలోని ఎస్సీ భూములను గుంటూరుకు చెందిన జీవీ అనుచ రుడు కృష్ణ 110 ఎకరాలు చౌకగా చేజిక్కించుకున్నారు. బొల్లాపల్లి మండలంలోనే జీవీ బంధువులు, బినామీలు ఆక్రమించుకున్న భూము ల విలువ రూ.వందల కోట్లకు పైగా ఉంటుంది. కొప్పుకొండలో కబ్జా పర్వం వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ పరిధి కొప్పుకొండలోని వాగు పోరంబోకు భూములను 1940లో బ్రిటీష్ ప్రభుత్వం మత్స్య సహకార సంఘానికి పంపిణీ చేసింది. 1980లో అదే గ్రామానికి చెందిన రైతుల నుంచి 17.80 ఎకరాల భూమిని జేవీఎస్ ఆక్వా కల్చర్ రాజ్యలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. జీవీ మేనమామ, ఒంగోలు వెంకటేశ్వర్లు, మరో బినామీ రామకోటేశ్వరరావును అడ్డుపెట్టుకొని చుక్కల భూమిగా ప్రకటించి ఈ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ మూడు కిలోమీటర్ల మేర దాదాపు 25 చేపల చెరువులను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఖాతా నం.585లో 136 ఎకరాలు, ఖాతా నంబరు 571లో 30 ఎకరాలతోపాటు సర్వే నంబరు 281లో మరికొంత భూమిని కలిపి సుమారు 300 ఎకరాల పోరంబోకు భూములను కబ్జా చేశారు. వీటి విలువ రూ.50 కోట్లు. శివశక్తి పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా శివశక్తి బయో కంపెనీ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. రైతులకు అందించే సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం సల్ఫేట్, జింకు, బోరాన్, ఫెర్రస్ సల్ఫేట్ కొనుగోలుకు అప్పట్లో ప్రభుత్వం టెండర్లు వేయగా వరుసగా నాలుగేళ్లు కిలో రూ.35 లు, జీఎస్టీ లేకుండా రూ.28తో మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మల్టినేషనల్ కంపెనీలైన కోరమండల్, నాగార్జున, టాటా వంటి కంపెనీలు ఎరువులు తయారు చేస్తున్నప్పటికీ ప్రాచుర్యం లేని శివశక్తి కంపెనీకి టెండర్లను మార్క్‌ఫెడ్ ఖరారు చేసింది. ఏటా రూ.33.97 కోట్లు అదనంగా రాయితీ పొందింది. ఇలా నాలుగేళ్లు దాదాపు రూ.100 కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో బొక్కేశారు. శివశక్తి బయో టెక్నాలజీ లిమిటెడ్, విజయ గ్రోమిన్, నవభారత్ పలు కంపెనీల పేర్లతో నెల్లూరు జిల్లా వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి, కర్నూలు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో నకిలీ బయో ఎరువులు విక్రయించి రైతులను మోసగించారు. ఉద్యాన సబ్సిడీ స్వాహా ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు అమలవుతున్న సబ్సిడీని రూ.10 కోట్లకు పైగా జీవీ స్వాహా చేశారు. వెల్లటూరు, మేళ్లవాగు, వడ్డెంగుంట, చీకటీగలపాలెం ప్రాంతాల్లో టమాటా, బొప్పాయి, పుచ్చ, నిమ్మ పంటలకు షేడ్‌నెట్, పాలి హౌస్, కూరగాయల పందిళ్ల పేరుతో వచ్చే సబ్సిడీని ఆయనే కైంకర్యం చేశారు. నూజెండ్ల, ఈపూరు మండలాల్లో మిర్చి రైతులు నష్టపోవడంతో రైతులకు ఇచ్చిన పరిహారాన్ని కాజేశారు. జీవీ అనుచరులు, బినామీలు బొల్లాపల్లి, వినుకొండ, రూరల్ మండలాల్లో ఉన్న అప్పటి అధికార పార్టీ నాయకులు రేషన్ మాఫియాగా ఏర్పడి రూ.200 కోట్లు దోపిడీ చేశారు. గుండ్లకమ్మలో ఇసుక దందా, ఉపాధి హామీ పనులు, నీరు చెట్టు పనులు, చెక్‌డ్యామ్‌లు, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పేరుతో కోట్లల్లో స్వాహా చేశారు. ఈ అక్రమాలపై అప్పటి ఎంపీడీవో రవికుమార్‌తో పాటు 9 మంది ఉపాధి హామీ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. 2014లో నూజెండ్ల మండలం మూర్తింజాపురంలో 10 గ్రామాలకు తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి జరిగింది. పనులు నాసిరకంగా చేయడంతో చెరువు నీరు నింపే క్రమంలోనే చెరువుకట్ట కొట్టుకుపోయింది. ఎన్ఎస్పీ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా నాగార్జున సాగర్ మేజర్, మైనర్ కెనాల్స్ పనులు నాసిరకంగా చేపట్టి రూ.90 కోట్లు వెనకేసుకున్నారు. వినుకొండలో తాగునీటి సమస్య నెలకొనడంతో మంచినీటి సరఫరా కోసం రూ.2 కోట్లు మంజూరైంది. మంచినీటి ట్యాంకర్ల పేరుతో రోజూ లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులను దోచుకున్నారు. ఈపూరు మండలంలోని ఊడిజర్ల గ్రామ మరుగుదొడ్ల లబి్ధదారులకు తెలియకుండా రూ.35 లక్షల మేర దోచుకున్నారు. 15 ఎఫ్ఐఆర్లు తన వ్యాపార భాగస్వామిని హత్యచేయించడంలో జీవీపై కేసు నమోదైంది. తర్వాత హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులను బెదిరించి కేసులను రాజీ చేసుకొని 2009 ఎన్నికల్లో వినుకొండ నుంచి పోటీ చేశారు. జీవీపై ఇప్పటివరకు దౌర్జన్యం, ప్రభుత్వ విధుల నిర్వహణకు ఆటంకం తదితర నేరాలపై 15 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో తొమ్మిది, శావల్యాపురం 3, ఈపూరు, బండ్లమూడి, సత్తెనపల్లి ఒక్కో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. ♦ వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెందిన వల్లభ డెయిరీలోకి జీవీ అనుచరులతో చొరబడి వస్తువులను ద్వంసం చేశారు. దీనిపై వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో జీవీపై 25–7–2023న క్రైం నంబర్ : 163/23తో 143, 447, 379, 506 రెడ్‌విత్ ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ♦ వినుకొండలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించినందుకు జీవీపై వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో 17–5–2023న క్రైం నంబర్ 130/23తో 143, 341, 188, రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ♦ ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు ఈపూరు పోలీస్ స్టేషన్లో జీవీపై 12–12–2021న క్రైం నంబర్ 169/2021తో 341, 353 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదైంది. -
పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం
-
మీరంతా ఆశీర్వదిస్తే నరసరావుపేట ఎంపీగా గెలుస్తా: అనిల్
-
Vinukonda: రెండుసార్లు ఎమ్మెల్యేను... నాకేందుకు సీటివ్వరు..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ల రాజకీయ భవిష్యత్తుకు బంధుత్వం అడ్డుగా నిలిస్తోందా..? చంద్రబాబు విభజించు పాలించు రాజకీయాలు తెలిసిన వారు అవుననే అంటున్నారు. ఆర్థికంగా బలమైన నేతలు అందుబాటులోకి వస్తే అప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలనైనా సునాయసంగా అడ్డు తప్పించేయడం చంద్రబాబు నైజం. అందుకు బాబు ఎంచుకున్న ఎత్తు... కుటుంబానికి ఒకటే సీటు. ఇప్పటికే రాష్ట్రంలో పరిటాల, చింతకాయల, భూమా వంటి కుటుంబాలలో ఒకరికే సీటు ఇస్తానంటూ, నాలుగున్నరేళ్లుగా పార్టీకి పనిచేసిన వారిని పక్కనపెట్టే పనిలో ఉన్నాడు. తాజాగా వియ్యంకులైన జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లకు అదే కారణం చెప్పి శ్రీధర్‌ను సైడ్ చేసే పనిలో బాబు నిమగ్నమయ్యాడు. పెదకూరపాడు అసెంబ్లీ టికెట్ తన వియ్యంకుడైన కొమ్మాలపాటి శ్రీధర్‌కు కేటాయించాలని జిల్లా పార్టీ ఽఅధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చంద్రబాబును ఇటీవల కలిశారట. ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాట మాజీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగేలా చేసిందంట. వియ్యంకుల్లో ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఇద్దరిలో ఎవరో మీరే తేల్చుకోండని బంతిని వియ్యంకుల కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నాడట. వియ్యంకుడి సీటు కోసం వెళితే తన సీటుకే ఎసురు వచ్చేలా ఉండటంతో ఆంజనేయులు సందిగ్దంలో పడ్డాడట. ఇంతలో చంద్రబాబు కలుగజేసుకొని.. పెదకూరపాడులో ప్రజాబలం అధికంగా ఉన్న నంబూరు శంకర్రావును ఎదురించాలంటే ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్ అయితేనే సరిపోతుందన్నట్టు చెప్పకనే చెప్పారట. రెండుసార్లు ఎమ్మెల్యేను... నాకేందుకు సీటివ్వరు..? వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు 2009, 2014లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పెదకూరపాడు నుంచి కూడా అదే సమయంలో కొమ్మాలపాటి శ్రీధర్ కూడా రెండుసార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు ఇద్దరు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. 2014లో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వియ్యంకులుగా మారిపోయారు. కొమ్మాలపాటి కొడుకుకు జీవీ ఆంజనేయులు కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. అయితే గత ఎన్నికల తర్వాత కొమ్మాలపాటి ఆర్థికంగా కొంత బలహీనపడ్డాడనే టాక్ టీడీపీలో ఓ వర్గం బలంగా ప్రచారం చేస్తోంది. దీంతో పెదకూరపాడు నుంచి లోకేష్‌కు సన్నిహితుడు, ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్‌ను ఆ స్థానంలో పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇది గమనించి అధినేత వద్దకు వెళ్లిన జీవీ, కొమ్మాలపాటిలతో చంద్రబాబు మాత్రం ఇద్దరిలో ఒకరికే సీటు ఇస్తా... అదికూడా ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండంటూ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారట. దీంతో వియ్యంకులిద్దరూ ఏం చెయ్యాలో అర్థంకాక ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కొమ్మాలపాటి శ్రీధర్ మాత్రం పార్టీ తరపున మూడు సార్లు పోటీ చేశాను, రెండు సార్లు గెలిచిన వ్యక్తిని నాకు ఎందుకు టికెట్ ఇవ్వరంటూ తన వర్గీయులతో వాపోతున్నాడట. చంద్రబాబు మోసం చేస్తే నా దారి నేను చూసుకుంటా, భాష్యం ప్రవీణ్‌కు సహకరించేది లేదంటూ తేల్చేశాడట. స్థానికుడికే టికెట్ ఇవ్వాలి... అధినేత అభిప్రాయం తెలుసుకున్న కొమ్మాలపాటి శ్రీధర్ తన అనుచరులతో బాబుపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం పేరిట తన వర్గీయులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొన్న టీడీపీ నేతలు స్థానికుడు, మూడుసార్లు పోటీ చేసిన శ్రీధర్‌కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు మూటలు చూసి స్థానికేతరుడికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మీటింగ్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడగా వారిని శ్రీధర్ ముఖ్య అనుచరులు వారించినట్టు తెలుస్తోంది. అధికారికంగా భాష్యం ప్రవీణ్‌కు టికెట్ కేటాయించే వరకు సంవయనం పాటించాలని సూచించారట. -
వినుకొండ బహిరంగ సభలో ఆలీ పంచులే పంచులు..!
-
ఆరు నూరైనా మళ్లీ జగనే సీఎం: వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వివరించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎంతో చేశాడు. ఇవాళ ఆయా వర్గాలకు చెందినవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కారణం. వినుకొండలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు. కానీ, అధికారం ఇస్తే మాత్రం బెంజ్ కారు ఇస్తానంటారు.. రైతు రుణ మాఫీ చేస్తానంటారు. వినుకొండలో ఒక్క అభివృద్ధి పని చేశామని టీడీపీ నేతలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సామాజిక విప్లవం రావాలని విప్లవకారులు కోరుకున్నారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు దళిత హక్కులను కాలరాశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి ముళ్ళపొదల్లో చంద్రబాబు కడితే.. విజయవాడ నడిబొడ్డున జగన్ అంబేద్కర్‌కు భారీ విగ్రహం పెట్టారు. వైఎస్ జగన్ మరో అంబేద్కర్.. పూలే. చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. మోసకారి. ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాలు సాధికారితకు నిదర్శనం. జాషువా పుట్టి పెరిగిన గడ్డ వినుకొండ. జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడా?. బ్రహ్మన్నకు(ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడును ఉద్దేశించి..) మరోసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. మంచి చేయకపోతే ఎవరినైనా ఏట్లో వేస్తామని వినుకొండ ప్రజలు గత ఎన్నికల్లో చెప్పారు. ఈ ప్రాంతం వెనుకబడిన ఉండటానికి ప్రధాన కారణం నీళ్ళు లేకపోవడమే. వరికిపూడిసెల తీసుకొచ్చి బొల్లాపల్లి మండలానికి సాగు త్రాగు నీరు ఇస్తామని చెప్పాం. ఇందులో భాగంగానే అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 17న మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభిస్తాం. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. జగన్ అన్న కటౌట్ చూపించి సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తాం. జగన్ లేకుండానే ఇంతమంది వస్తే.. జగనన్న వస్తే జనసునామీ వచ్చేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. పదవుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు. వార్డు మెంబర్ నుండి రాజ్యసభ ఎంపీ వరకూ అవకాశం ఇచ్చారు. రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే) ద్వారా పేదలకు పంచారు. ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసి.. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తోకను బీసీలు కత్తిరించబోతున్నారు. చంద్రబాబును దళితులు ఓడించి.. ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా చేయబోతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ మాట్లాడుతూ.. బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. వైఎస్ తోనూ ఆయన కుమారుడు జగన్ తోనూ నా ప్రయాణం సాగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఎక్కడికైనా వెళ్తాను. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు. -
సీఎం జగన్ పాలనపై బీసీ లీడర్లు, కార్యకర్తల కామెంట్స్
-
వినుకొండలో సామాజిక సాధికార యాత్ర
-
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పసుపులేరు బ్రిడ్జిపై లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారంతా వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల వారుగా గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఏకకాలంలో 15 చోట్ల దాడులు -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై దాడి!
సాక్షి, గుంటూరు: వినుకొండలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ సంద్బరంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని టీడీపీ శ్రేణులు అరగంటపాటు అడ్డుకున్నారు. వారి రాళ్ల దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో వినుకొండలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. నేను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే దాడికి దిగారు. టీడీపీ నేతలు నా కారుపై రాళ్ల దాడి చేశారు. కావాలనే వారు ప్లాన్ ప్రకారం నాపై దాడి చేశారు. నాపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేశారు. టీడీపీ కుట్రలను తిప్పి కొడతాం. ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను. రెండు రోజుల క్రితం నా డెయిరీ ఫామ్‌ను ధ్వంసం చేశారు. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారు. ప్రజల తిరుగబాటుతో తోక ముడిచారు. జీవీ ఆంజనేయులుకు ప్రజాభిమానం లేదు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలది నీచమైన సంసృతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇది కూడా చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్ -
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్.. ఎమ్మెల్యే ధీటైన జవాబు
సాక్షి పల్నాడు: వినుకొండ మండలం శావల్యాపురంలో తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్‌కు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా శావల్యపురంలో జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేశారు. అయితే.. ఈ క్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ యాత్రకు తారసపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వాహనానికి టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని చుట్టుముట్టి పార్టీ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో బయటకు వచ్చారు. ‘రండిరా.. చూసుకుందాం..’ అంటూ యెల్లో బ్యాచ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు కలుగజేసుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు. -
సీఎం జగన్ గొప్ప మనసు.. సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు..
సాక్షి, వినుకొండ(పల్నాడు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వినుకొండ పర్యటనలో బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు. మస్తానమ్మ.. రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కాలిపోయిందని, ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినుకొండకు చెందిన మస్తానమ్మ సీఎం జగన్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకుంది. వెంటనే సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. తేజ.. బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి కుమారుడు తేజ థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి తేజ తండ్రి విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు. చదవండి: ముసలాయనపై పేలిన సీఎం జగన్ పంచ్‌లు ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, స్ధానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి మస్తానమ్మకు వినుకొండ పట్టణ పరిధిలో అనువైన చోట ఇంటి స్ధలము, ఇల్లు కట్టుకోవడానికి నగదు మరియు తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు. అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందించారు. చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌తో చర్చించి సీఎంఆర్ఎఫ్ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ -
వరుసగా మూడో ఏడాది.. ‘జగనన్న చేదోడు’ (ఫొటోలు)
-
ముసలాయనపై పేలిన సీఎం జగన్ పంచ్‌లు
సాక్షి ప్రత్యేకం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో చేసిన ప్రసంగం ధాటిగా సాగింది. చేదోడు స్కీమ్ కింద లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన కొన్ని కొత్త డైలాగులు వాడారు. వాటిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాగా ఇబ్బంది కలిగించే అంశం కూడా ఒకటి ఉంది. చంద్రబాబును జగన్ ముసలాయన గా అభివర్ణించారు. ఆ మాట అంటున్నప్పుడు సభికుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. వచ్చే ఎన్నికలలో ముసలాయన కావాలా? రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడుతున్న యువకుడైన తాను కావాలా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ అని చెప్పడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది. దీనితో పాటు మరో కొత్త పోలిక తెచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నది కాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ అని ప్రకటించారు. పేదలకు, పెత్తందారులకు మద్య జరుగుతున్న యుద్దం అని ఆయన చెప్పారు. పేదలు ఒకవైపు ఉంటే, పెత్తందార్లు మరో వైపు ఉన్నారని జగన్ చెప్పడం ద్వారా పేదవర్గాలను మరింతగా ఆకట్టుకునే యత్నం చేశారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే, తన ప్రత్యర్దులు మోసాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంలో ముసలాయనకు దుష్టచతుష్టయం అండగా ఉందంటూ ఈనాడు, ఆంద్రజ్యోతి, టివీ5 లకు తోడు దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్య,వైద్య, వ్యవసాయం తదితర రంగాలలో తాను తీసుకు వచ్చిన మార్పులను గమనించాలని ఆయన కోరారు. మీ బిడ్డ అంటూ పలుమార్లు ప్రస్తావించి సభికులను ఆయన ఓన్ చేసుకోగలిగారు. తోడేళ్లు ఒకటవుతున్నాయని, తాను సింహంలా సింగిల్ గానే నడుస్తున్నానని జగన్ చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో జరగనున్న రాజకీయ పరిణామాలను ప్రజలకు తెలియచెప్పారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, పేదలను నమ్ముకున్నానని ప్రకటించడం ద్వారా వారంతా తనవైపే ఉన్నారని చెప్పకనే చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ప్రస్తావించకపోవడం విశేషం. లోకేష్ కు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదని ఆయన చెప్పినట్లయింది. అదే సమయంలో లోకేష్ తాను ముఖ్యమంత్రి అభ్యర్దిని అని చెప్పలేకపోతున్నారు. తన తండ్రిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పాదయాత్ర అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముసలాయన కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్న భావం స్ఫూర్తించేలా జగన్ మాట్లాడారనుకోవచ్చు. గతంలో చంద్రబాబు పాలనలో గజదొంగల్లా దోచేశారని, తన ప్రభుత్వ హయాంలో లంచాలకు తావులేని పాలన సాగుతోందని ఆయన చెప్పారు. తాను బటన్ నొక్కి ప్రజలకు సాయం చేస్తున్నానని, తద్వారా ఎక్కడా అవినీతికి తావుకు,లంచాలకు అవకాశం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలా వరకు వాస్తవమే. గతంలో జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం అమలు అయ్యేది కాదు. వారికి లంచాలు ఇచ్చుకోవల్సిన పరిస్థితి ఉండేది. కాని జగన్ అధికారంలోకి వచ్చాక పార్టీ చూడకుండా,ప్రాంతం, కులం, మతం ఏవీ చూడకుండా అర్హులైనవారందరికి సంక్షేమ ఫలాలు అందించడం ఆయనకి ప్లస్ పాయింట్ అయింది.రాష్ట్రం ప్రగతి పధంలో పయనిస్తోందని చెప్పడానికి కూడా ఆయన యత్నించారు. అందుకు దేశంలోనే అగ్రస్థానంలో గ్రోత్ రేట్ ఉండడాన్ని ఆయన ఉదాహరించారు. రాష్ట్రం 11.43 శాతం వృద్ది రేటు సాధిఆంచిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. లోకేష్ కొద్ది రోజుల క్రితం కుప్పంలో పాల్గొన్న సభకు, వినుకొండలో జగన్ హాజరైన సభకు అసలు పొంతనే లేదంటే ఆశ్చర్యం కాదు.లోకేష్ సభలో జనం పాసివ్ స్పెక్టేటర్స్ మాదిరి అంటే కేవలం ఏదో మొక్కుబడిగా వచ్చిన ప్రేక్షకుల మాదిరి కూర్చుంటే, జగన్ సభలో పాజిటివ్ స్పెక్టేటర్స్ కనిపించారు. జగన్ వేదిక ఎక్కినప్పటి నుంచి, ఆయన దిగేవారు సభికులు పదే,పదే హర్షద్వానాలు చేయడం కనిపించింది. జగన్ ప్రసంగిస్తున్నప్పుడైతే జనం కేరింతలు కొట్టడం ఆయన ఇమేజీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యేకించి కాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ అని అన్నప్పుడు, పేదలకు,పెత్తందార్లకు మధ్య యుద్దం అన్నప్పుడు, తాను పొత్తులు లేకుండా సింహంలా సింగిల్ గా వస్తానని చెప్పినప్పుడు, అలాగే తోడేళ్లు కలుస్తున్నాయని అన్నప్పుడు జనం బాగా స్పందించారు. ఈ సభను బాగా గమనిస్తే తెలుగుదేశం వారికి ముచ్చెమటలు పట్టే విధంగానే జరిగిందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. :::హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
తోడేళ్లంతా ఒక్కటయ్యాయి.. సింహం సింగిల్‌గానే నడుస్తోంది
సాక్షి, పల్నాడు: గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. అక్కడి బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారు. సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు?. ఎందుకంటే వాళ్ల విధానం డీపీటీ కాబట్టి. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి.. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవు, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే.. సింహాంలా ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు. ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా?. మీ అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నా. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
చేదోడు ద్వారానే రాష్ట్రం పరిగెడుతోంది: సీఎం జగన్
సాక్షి, పల్నాడు: నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ(సోమవారం) జిల్లాలోని వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ.. ‘‘వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో నవరత్నాలులోని ప్రతీ పథకాన్ని, సంక్షేమ పథకాల్లోని ప్రతీ పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు చేసేలా మన అందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో భాగంగా.. సొంత షాప్ ఉన్న రజక సోదరుడికి, నాయీబ్రాహ్మణుడికి, దర్జీ అక్కాచెల్లెలకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చాం. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నాం. వరుసగా ఈ మూడేళ్లలో అక్షరాల మూడు లక్షల ముప్పై వేల మందికి మంచి చేస్తూ.. నేడు రూ. 330 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మొత్తంగా.. జగనన్న చేదోడు కార్యక్రమంతో రూ. 927 కోట్లు జమ చేసినట్లు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది. మొత్తం 43 నెలల కాలంలోనే నేరుగా 1.92 లక్షల కోట్లు అందించామని, టీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్లు అందించామని సీఎం జగన్ వినుకొండ వేదిక నుంచి ప్రకటించారు. ఇవాళ మన రాష్ట్రం దేశంలోనే జీడీపీ జీఎస్డీపీ(గ్రాస్ స్టేట్ డెమోస్టిక్ ప్రొడక్ట్) ప్రకారం.. మన గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వం చెప్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా పరిగెడుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని పట్టించుకోకుండా.. గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదంతా గమనించాలని ఏపీ ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నప్పుడే ఇలాంటి ఘనత సాధ్యమవుతుందన్నారు. రైతులు, అక్కాచెల్లెమ్మలు.. ఇలా అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సాయం, చేయూత ఇస్తున్నామని.. తద్వారా వాళ్లు వాళ్ల కాళ్ల మీద నిలబడుతూ రాష్ట్రాన్ని ముందుకు పరిగెట్టిస్తున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
వినుకొండ: జగనన్న చేదోడు.. సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్
Jagananna Chedodu.. అప్డేట్స్ ► జగనన్న చేదోడు పథకం.. మూడో విడత నిధుల జమ కార్యక్రమం ముగియడంతో వినుకొండ నుంచి తిరిగి తాడేపల్లికి బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► బహిరంగ సభలో ప్రసంగం అనంతరం.. జగనన్న చేదోడు మూడో విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్ నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోంది. వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో చేసి చూపించాం. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా భరోసా అందిస్తున్నాం. దేశంలోనే జీడీపీ జీఎస్డీపీ(గ్రాస్ స్టేట్ డెమోస్టిక్ ప్రొడక్ట్) ప్రకారం.. ఏపీ గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే.. ఇలాంటి ఫలితం సాధ్యమవుతుంది. ఏపీ శ్రీలంక అయిపోతోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఏపీ దేశానికే ఓ దిక్సూచిలా నిలుస్తోంది. సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఏనాడూ సంక్షేమం గురించి ఆలోచించలేదు. దోచుకోవడం గురించే ఆలోచించింది. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు. దోపిడీ పాలన కావాలా? లంచం, అవినీతి లేని పాలన కావాలా? జాగ్రత్తగా ఆలోచించుకుని ఎంచుకోండి. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయని.. ► జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ► అన్నా.. మా నాయీ బ్రాహ్మణుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను గత పది, పన్నెండు ఏళ్ళుగా నా కులవృత్తి చేసుకుంటున్నాను, నా షాప్ డెవలప్ చేయడం ఎలాగా అనుకునేవాడిని, నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి చెబితే నేను నమ్మలేదు, కానీ మాకు అకౌంట్లో నేరుగా జమ అయ్యాయి. ఏ లంచం లేకుండా నా అకౌంట్లో డబ్బు పడింది. షాప్ డెవలప్ చేసుకున్నాను, ఇప్పటికి రెండు సార్లు సాయం అందింది, ఇది మూడోసారి నాకు అందుతుంది, మా అమ్మకు ఫించన్ వస్తుంది, తెల్లవారగానే వాలంటీర్ మా ఇంటికి వచ్చి రూ. 2,750 ఇస్తుంటే మా అమ్మ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో చాలా అవస్ధలు పడ్డారు, ఇప్పుడు మా ఇంటికే ఫించన్ వస్తుంటే మా అమ్మ సంతోషంగా ఉంది, మా అమ్మ ఒక మాట చెప్పింది, ఇక నుంచి మీరు నన్ను చూసుకోకపోయినా నా పెద్ద కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, మేం కన్న బిడ్డలమే కానీ మాకంటే మీరే మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. మీరు మా ఇంటిలో పెద్దకొడుకులాగా, మా సొంత అన్నలా ఉంటున్నారు. చేయూత పథకం ద్వారా కూడా లబ్ధిపొందాం, మేం లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులు పడితే చేయూత పథకం ద్వారా ఆదుకున్నారు. మాకు చాలా సాయం చేశారు, ధ్యాంక్యూ అన్నా. :::సైదులు, లబ్ధిదారుడు, కొచ్చర్ల, ఈపూరు మండలం ► సాయి కుమారి వినుకొండలో టైలరింగ్ వృత్తిలో ఉంది. జగనన్న చేదోడు లబ్ధిదారు ఈమె. గత రెండు దఫాలు అందిన ప్రభుత్వ సాయంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు అయినట్లు వేదికపై మాట్లాడిందామె. ఇప్పుడు మూడో విడత సాయంపై సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తనతో పాటు తమ కుటుంబ సభ్యులు జగనన్న ప్రభుత్వంలోలని సంక్షేమ పథకాలతో ఎలా ముందకు వెళ్తోందన్నది వివరించారామె. తనలాంటి వాళ్లెందరికో ఆర్థికంగా ఎదగడానికి సాయం అందిస్తున్న సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ► జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. జగనన్న చేదోడు సాయం.. లబ్ధిదారుల పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడడంపై మంత్రి వేణుగోపాల్ ప్రసంగించారు. జగనన్న చేదోడు పథకం దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఓ వరం. వాళ్లకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేణుగోపాల్ తెలియజేశారు. 11.42AM ► వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమం ప్రారంభం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు. 11.35AM ► వేదికపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం.. జ్యోతి ప్రజ్వలనతో జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం నిధుల జమ కార్యక్రమం ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. 11.25AM ► వినుకొండలో జగనన్న చేదోడు పథకం మూడో విడుత నిధుల కార్యక్రమం సందర్భంగా.. వినుకొండ సభా స్థలికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి నేతలు, అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు. 11:20AM ► జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. 11.10AM బస్సులో జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి బయల్దేరిన సీఎం జగన్. రోడ్లకిరువైపులా స్వాగతం పలుకుతున్న ప్రజలు. ప్రతిగా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్. 11:00AM ► వినుకొండ చేరుకున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీలు స్వాగతం పలికారు. స్వాగతలం పలికిన వాళ్లలో.. ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, కిలారు రోశయ్య, నంబూరి శంకర్ రావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, కలెక్టర్ శివ శంకర్, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాసేపట్లో జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. 10:22 AM ► వినుకొండ బయలుదేరిన సీఎం జగన్ ► జగనన్న చేదోడు పథకంలో భాగంగా.. మూడో విడత సాయం నిధుల విడుదల కార్యక్రమం కోసం వినుకొండలో నేడు(సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ► జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేసింది జగన్ ప్రభుత్వం. ► సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పర్యటనకు భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు.. బారికేడింగ్స్ లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారాయన. అలాగే.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నామని, వినుకొండ పట్టణంలో వ్యాపార కలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ► లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించాలని తపన పడుతూ.. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిని అందజేస్తోంది. -
Jagananna Chedodu: వరుసగా మూడో ఏడాది.. జగనన్న చేదోడు
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కానుక అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో నేడు బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండ చేరుకుంటారు. వెల్లటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం వారితో, స్థానిక నేతలతో కొద్ది సేపు మాట్లాడి, తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.30,000 అందించినట్లవుతుంది. ఈ లెక్కన ఈ మూడేళ్లలో ఈ పథకం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.927.39 కోట్లు. లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మిస్ కాకుండా అందించాలని తపన పడుతూ.. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిని అందజేస్తోంది. -
సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. షెడ్యూల్ ఇదే.. సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం -
టీడీపీ నేతల రాళ్ల దాడి
వినుకొండ (నూజెండ్ల): గ్రామ దేవత పోలేరమ్మకు పొంగళ్లు పెట్టుకుని ఇంటికి వస్తున్న వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడి కుటుంబం, బంధువులపై టీడీపీ నాయకులు రాళ్లదాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ గ్రామంలో గురువారం జరిగింది. బాధితులు, వినుకొండ పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పూర్ణి శ్రీను కుటుంబ సభ్యులతోపాటు బంధువులు పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించేందకు మొక్కుబడి ప్రభను కట్టుకుని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. టీడీపీ నాయకులు బోడేపూడి గోవిందరాజులు, వాసు, సత్యం, కిషోర్, చంద్రబాబు, గాడిపర్తి రాంబాబు, మహేష్, వెంకటేశ్వర్లు, యండ్రపల్లి శ్రీను, కోండ్రు అశోక్, సతీష్, మరో 50 మందికిపైగా జనం వైఎస్సార్సీపీ వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన పూర్ణి పెదనాసరయ్య, పాల ఆదిలక్ష్మి, వేల్పుల నాగమల్లేశ్వరి, పూర్ణి నాసరయ్య, బ్రహ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వినుకొండ సి.ఐ. అశోక్‌కుమార్ సిబ్బందితో గ్రామలోకి వెళ్లి పరిస్థితులను అదుపు చేశారు. గాయపడినవారిని 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
శావల్యాపురం(వినుకొండ) : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించడంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు సోమవారం మీడియాతో చెప్పారు. మండల కేంద్రం శావల్యాపురంలో టీడీపీ నాయకులు జాతీయ రహదారి మార్గంలో గుంపులుగా ఏర్పడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడమే కాకుండా.. ట్రాఫిక్, ఎన్నికల నిబంధనలు అతిక్రమించినందున మాజీ ఎమ్మెల్యేతో పాటు.. టీడీపీ నేతలు గుంటూరు సాంబశివరావు, గడుపూడి విశ్వనాథం, చెరుకూరి చౌదరి, గోరంట్ల హనుమంతరావు, యరమాసు కోటేశ్వరరావు, పారా చౌదరి, చింతా గంగయ్య, అమృతపూడి కోటయ్య, మాదాల చిరంజీవి, బొల్లా పేరయ్య, దొడ్డా ఏడుకొండలు తదితరులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
కమ్యూనిటీ హాలే.. టీడీపీ కార్యాలయం
వినుకొండ(నూజెండ్ల): వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారని, కులధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండకూడదని కోర్టుల్లో కేసులు వేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నాయకులు మాత్రం ఏకంగా ప్రభుత్వ భవనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మార్చారు. వినుకొండ నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో అవుదారి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రధాన సెంటర్లో స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పనులకు ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకున్నారు. అయితే టీడీపీ హయాంలో సుమారు రూ.15లక్షల ఎంపీ నిధులు, గ్రామస్తుల ఆర్థిక సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. టీడీపీ పార్టీ రంగులు వేయించి ఎన్టీఆర్, టీడీపీ గుర్తులను కూడా వేయించుకుని యథేచ్ఛగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్లను వేయించుకుని స్థలదాత పేరును ఒక మూలన రాశారు. గ్రామ సచివాలయాలు నిర్మాణదశల్లో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం అద్దె భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అయితే కారుమంచి గ్రామంలో ప్రభుత్వ భవనాన్ని గ్రామపంచాయతీకి అప్పగించాలని గ్రామస్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవీ చదవండి: ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
వినుకొండలో ఆన్లైన్ వివాహం
-
వినుకొండ యువకుడి ప్రతిభ: పరుగు పందెంలో పసిడి పతకం!
వినుకొండ (నూజెండ్ల): అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. భూటాన్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 3వ సౌత్ ఏషియన్ రూరల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 4 దేశాల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, అబ్దుల్లా గతంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యూత్ రూరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించిన జాతీయస్థాయి రన్నింగ్ పోటీల్లో 2 సార్లు, అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన పోటీల్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే.... అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అబ్దుల్లాకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సమక్షంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్దుల్లాకు అందజేశారు. దీనిపై అబ్దుల్లా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రోత్సహిస్తే 2024 ఒలింపిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం
-
Corona: చిన్న ఊరు.. నిశ్చింతగా ఉన్నారు
వినుకొండ (నూజెండ్ల): ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లాడుతుంటే.. గుంటూరు జిల్లా వినుకొండకు ఆనుకుని ఉన్న చిన్న పల్లెటూరు మాత్రం నిశ్చింతగా ఉంటోంది. ఆ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా రహిత గ్రామంగా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తులు, యువత, అధికారులు కలిసికట్టుగా కట్టడి చర్యలు చేపట్టడమే దీనికి కారణం. వినుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపాలెంలో 4 వేల జనాభా ఉన్నారు. సర్పంచ్ గోపు కృష్ణ ఆధ్వర్యంలో యువత కమిటీలుగా ఏర్పడి ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బయటి నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎవరికి వారు స్వచ్ఛందంగా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఉప్పరపాలెం గ్రామంలో ఎక్కువగా వలస కూలీలు ఉన్నారు. ఆ గ్రామం వినుకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలో కరోనాపై అవగాహన సదస్సులతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. ఇకపై కూడా ఎలాంటి కేసులు రాకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాం. – వేముల వెంకట శివయ్య, ఎంపీడీవో యువత సహకారంతో.. కరోనా కట్టడికి గ్రామంలోని యువత అంతా కమిటీలుగా ఏర్పడి నడుం బిగించారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయిస్తున్నాం. రేషన్, పింఛన్ పంపిణీ సమయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల వైరస్ కట్టడి సాధ్యమైంది. ఇకపై కూడా ఎలాంటి కేసులూ రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నాం. – గోపు కృష్ణ, సర్పంచ్ -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల రాళ్ల దాడి
వినుకొండ: గుంటూరు జిల్లాలో సర్పంచ్ల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బొగిరి చినకోటేశ్వరరావు సర్పంచ్‌గా ఎన్నికైన తన వదిన ప్రమాణస్వీకారం సందర్భంగా గ్రామంలోని ప్రధాన సెంటర్‌కు రాగా, ఆయనపై టీడీపీ వర్గీయులైన పూర్ణి చినలింగారావు, నంబుల ఆదినారాయణ, శ్రీను, యరబోతుల శివ, సత్యం దాడి చేశారు. వీరిని అడ్డుకున్న పోగుల కోటయ్యపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. దీంతో వారు ప్రాణభయంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బెల్లం శివ ఇంటి వద్దకు వెళ్లగా, టీడీపీ వర్గీయులు ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై కూడా రాళ్ల దాడి చేశారు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు రావడంతో టీడీపీ వర్గీయులు పరారయ్యారు. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక రావడం కొంత లేటవుతోందని చెప్పా..
-
‘సీఎంపై రాయపాటి వ్యాఖ్యలు అర్థరహితం’
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయపాటి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్ టెక్స్టైల్స్ పార్క్‌ను ఎందుకు రద్దు చేయించారో చెప్పాలని బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. నిస్వార్థంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై చంద్రబాబు కులముద్ర వేయిస్తున్నారని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న జన్మభూమి కమిటీల వల్లే చంద్రబాబు 23 సీట్లుకు దిగజారారని ఆయన మండపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అది ఓర్వలేక రాయపాటిని చంద్రబాబు అస్త్రంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన చరిత్ర రాయపాటిదని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హామీ ఇచ్చారు. -
రెండు ప్రాణాలను రక్షించిన సమయస్పూర్తి..
ఈపూరు(వినుకొండ): ఎదురుగా నీళ్లలో ఇద్దరు యువకులు కొట్టుకుపోతున్నారు.. వారిని కాపాడాలి.. చేతిలో ఏమీ లేదు.. మరేం ఆలోచించకుండా తను కట్టుకున్న లుంగీనే తీసి వారికోసం కాల్వలోకి విసిరాడు. అది వారికి అందలేదు.. అంతలోనే ఓ మహిళా కూలీ వచ్చి తను కట్టుకున్న చీరనే తీసిచ్చింది.. లుంగీ, చీరను ముడివేసి వాటిసాయంతో ఆ ఇద్దరు యువకుల ప్రాణాలు నిలిపారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో గురువారం జరిగిన ఈ ఘటన మనుషుల్లో ఇంకా బతికి ఉన్న మానవత్వానికి ప్రతీకలా నిలిచింది. శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన గుంటుపల్లి శివశంకర్, శివసాయికిరణ్ అన్నదమ్ములు. ఇద్దరూ బైక్‌పై వెళుతుండగా బొగ్గరం సమీపంలో వాహనం అదుపుతప్పి అద్దంకి బ్రాంచ్ కెనాల్లో పడిపోయారు. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న చేకూరి వెంకటనర్సయ్య హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. వారిని కాపాడేందుకు చేతిలో ఏమీ లేకపోవడంతో తన లుంగీనే తీసి వారికి అందించాడు. అయినా అది వారి చేతికి అందలేదు. అటుగా మిర్చి కోతకు వెళుతూ ఆటోల నుంచి దిగిన ఓ మహిళా కూలీ.. ఇది గమనించి తన ఒంటిపై ఉన్న చీరను కూడా ఇవ్వడంతో రెండింటి సాయంతో అతికష్టం మీద వారిని బయటకు తీసి వారి ప్రాణాలను రక్షించారు. అనంతరం స్థానికులు బైక్‌ను బయటకు తీశారు. రెండు ప్రాణాలు కాపాడేందుకు రైతు, మహిళా కూలీ తెగువను.. సమయ స్ఫూర్తిని గ్రామస్తులు అభినందించారు. -
బాలికపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు(వినుకొండ) : బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో మంళవారం చోటు చేసుకుంది. వినుకొండ టౌన్ సీఐ చినమల్లయ్య వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కన వాళ్లు వచ్చారు. అంతలోకి నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయాల్లో రాజర్షి!
సాక్షి, గుంటూరు: నిస్వార్థం ఎంత గొప్పదో నిరూపించాడు.. నిశీధి మాటున వెలుగులు పంచాడు.. దాహార్తిని తీర్చగా జలసిరులను పొంగించాడు.. బీడు భూముల్లో పసిడి కాంతుల కోసం జలయజ్ఞం సంకల్పించాడు.. పేదవాడి గోడువిని గూడు నిర్మించాడు.. అనారోగ్యానికి ఆరోగ్యశ్రీతో వైద్యం చేశాడు.. కార్పొరేట్ విద్యను పేదలకు దాసోహమనిపించాడు.. ముగింపు లేని కథలా.. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా.. మనుష్యులందు మహర్షిలా.. రాజకీయాల్లో రాజర్షిలా.. కీర్తిగడించాడు. చెరగని జ్ఞాపకాలను పంచి.. ప్రవేశపెట్టిన పథకాలకు వందేళ్ల ఆయుష్షునిచ్చి.. జనహృదయాల్లో నిలిచాడు. నేడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వైఎస్సార్ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. తొలి ఐదేళ్ల కాలంలో ఏకంగా 57 సార్లు జిల్లాలో పర్యటించారు. ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2.26 లక్షల ఇళ్లు నిర్మించి గూడు లేని నిరుపేదకు ఆశ్రయం కల్పించారు. పులిచింతలతో డెల్టాను సస్యశామలం చేశారు. సాగర్ చివరి ఆయకట్టు వరకూ నీళ్లందించి పల్నాట ఫ్యాక్షన్ రక్కసిని రూపుమాపారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన ఘణత వైఎస్‌కే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్ద పీట వేశారు. నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి జిల్లాను మిని కేబినెట్‌గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. 12 మున్సిపాల్టీల్లో వైఎస్సార్ మార్క్.. పొన్నూరు పట్టణంలో మున్సిపాల్టీ నూతన భవన నిర్మాణానికి దివంగత మహానేత వైఎస్సార్ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రూ.1 కోటి వ్యయంతో హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేశారు. తెనాలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో మహానేత శంకుస్థాపన చేశారు. మంగళగిరి పట్టణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వైఎస్సార్ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆయన మరణానంతరం పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాజీవ్ గృహకల్ప ద్వారా వెయ్యి మంది నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు వైఎస్సార్ ప్రణాళిక రూపొందించి తొలి విడతలో 504 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆయన అకాల మరణంతో రెండో విడత రాజీవ్ గృహకల్ప నిలిచిపోవడంతో 500 మంది నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాల్టీగా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాల్టీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత హయాంలో అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద కృష్ణానది నుంచి పిడుగురాళ్లకు రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్సార్ అకాల మరణంతో ఆ పథకం అంశం మురుగున పడింది. వైఎస్సార్ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్ హయాంలో రూ.14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువును తవ్వించారు. అంతేకాకుండా రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌హె డ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం పట్టారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్ల నిధులను అందించారు. చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ హయా ంలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్ల నిధులను మంజూరు చేశారు. 2005లో మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, నిరుపేదలకు నివాస గృహాలు నిర్మించుకునేందుకు, ఇల్ల పట్టాలు ఇచ్చేందుకు రూ.8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు. నరసరావుపేట మున్సిపాల్టీలో మురుగు రోడ్లపైకి చేరకుండా శాశ్వత పరిష్కారం కోసం 2008లో మహానేత రూ.44 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పథకానికి శంకుస్థాపన చేశారు. అంతే కాకుండా రూ.22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, నిరుపేదలకు సొంతింటి కళ సాకరం అయ్యేందుకు రాజీవ్ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు. బాపట్ల పట్టణంలో వైఎస్సార్ హయాంలో మురుగునీరు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ. 49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల వ్యయంతో నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప పేరుతో గృహ సముదాయాలు నిర్మించారు. దివంగత మహానేత వైఎస్సార్ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాల్టీగా మార్చి రూ.30 కోట్లతో పట్టణంలో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రజల దామార్తిని తీర్చేందుకు రూ.15 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. రేపల్లె పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించారు. చివరి సంతకం కూడా రైతుల కోసమే 2009లో రెండో సారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్.. మరణానికి ముందు రోజు మిర్చి రైతులకు బీమా పరిహారం ఫైల్ పైనే సంతకం చేశారు. 2009 సెప్టెంబరు 1న వాతావరణ ఆధారిత బీమా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. వైఎస్ హెలికాఫ్టర్ ఎక్కే ముందు వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డికి ఈ విషయాన్ని గుర్తు చేయడంతో ఆ సమయంలో ప్రభాకరరెడ్డి గుంటూరు జిల్లా వ్యవసాయాధికారులతో వాతావరణ ఆధారిత భీమాతో రైతులకు రూ.22 కోట్లు పరిహారం అందించాలని సూచించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేశారు. 15వేల మంది రైతులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఎకరాకు పరిహారం అందింది. ఆరోగ్య శ్రీ ఇక్కడి నుంచే నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాట, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర ప్రభ వంటి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఇక్కడే జరిగాయి. దేశంలో రెండో స్పైసెస్ పార్క్ భారతదేశంలోనే రెండో స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల)పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా కేంద్రం మూడు స్పైసెస్ పార్క్‌లను మంజూరు చేసింది. అందులో ఒక స్పైసెస్ పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేయడానికి వైఎస్ విశేష కృషి చేశారు. సుమారు రూ.1.5 కోట్లతో 124.79 ఎకరాల్లో ఈ పార్క్‌ను నిర్మించారు. కొండవీడు కోట అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. సుమారు రూ.100కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగా 2007లో జులైలో రూ.5కోట్లతో కొండవీడుకోట పైకి ఘాట్‌రోడ్డు ఏర్పాటు కోసం నిధులను మంజూరు చేశారు. -
కారు, బస్సు ఢీ: ఇద్దరి మృతి
గుంటూరు: వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు గుంటూరుకు చెందిన శ్రీను(40), రాంబాబు(45)గా గుర్తించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
దుష్ట పాలనపై చర్చ జరగకుండా కుట్రలు..
-
చంద్రబాబు పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు
-
నీరు-చెట్టు పేరుతో దోచేస్తున్నారు : వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు/వినుకొండ : నాగార్జున సాగర్ ఉన్నా.. సాగు, తాగు నీరు లేదని.. ఆ సమస్యను పరిష్కరించకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సప్లయ్ చేస్తూ.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. నీరు-చెట్టు పేరుతో దోచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వినుకొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఈ నియోజక వర్గంలో దాదాపు 50 గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి పంటకు వైరస్ వచ్చి దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోయారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నానా అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు తమకు ఎలాంటి సాయం చేయలేదని రైతులు తనతో చెప్పారన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ.. ‘ఇంటెలిజెన్స్ అధికారిని విధుల నుంచి తప్పిస్తూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఎన్నికల సంఘం ఆర్డర్‌ను బాబు పక్కన పెట్టించారు. ప్రజల్లో ఉన్న నన్ను హత్య చేయించడానికి యత్నించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో నాపై హత్యాయత్నం చేయించారు. హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఉంటుందా? వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించి..ఆ నేరాన్ని కుటుంబ సభ్యులపైకి నెట్టే కుట్రలు చేస్తున్నార’ని విమర్శించారు. దుష్ట పాలనపై చర్చ జరగకుండా కుట్రలు.. ‘బాబుకు మేలు చేసేలా విలువలు లేని పార్ట్నర్, యాక్టర్‌తో పార్టీ పెట్టిస్తారు. కుట్రలో భాగంగా మరో పార్టీని స్థాపించి ఆ పార్టీ గుర్తు, కండువా, అభ్యర్థుల పేర్లు కూడా ఒకేలా ఉండేలా చేశారు. హెలికాప్టర్ గుర్తుతో కుట్రలు, మోసాలు చేస్తున్నవారిని గమనించాలి, కుట్రలు చేసే బాబుకు ఓటేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. దుష్ట పాలనపై చర్చ జరిగితే తాను ఔట్ అవుతానని బాబుకు తెలుసు. ఆయన బినామీలు, ఎల్లో మీడియాకు కూడా అదే గతి పడుతుందనీ తెలుసు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా పూటకో కుట్రను తెరపైకి తెస్తున్నారు. కుట్రలో భాగంగానే ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నార’ని అన్నారు. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి.. ‘ఎన్నికల తేదీ వచ్చనాటికి బాబు కుట్రలు తారాస్థాయికి చేరుకుంటాయి. ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటును కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి.. ప్రతి ఒక్కరికీ చెప్పండి.. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపొవద్దని.. కొన్ని రోజులు ఓపిక పడితే.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభ్తుత్వం వస్తుందని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండ’ని ప్రజలను కోరారు.