అసెంబ్లీలో ఆటవిక పాలనను నిలదీస్తాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Comments At Vinukonda After Visits Rashid Family | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు.. ఆటవిక పాలన సాగుతోంది: వైఎస్‌ జగన్‌

Published Fri, Jul 19 2024 6:27 PM | Last Updated on Fri, Jul 19 2024 9:07 PM

YS Jagan Comments At Vinukonda After Visits Rashid Family

సాక్షి, పల్నాడు: ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ అనేది లేనేలేదని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక.. హత్యలు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అయినా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన.

వినుకొండలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం..  వైఎస్‌ జగన్‌  మీడియాతో మాట్లాడారు.  ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ఈనెల 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేస్తామని పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు. రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయి. టీడీపీ వేధింపులో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితయ్యారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారు. 

అమాయకుడు, సామాన్యుడైన రషీద్‌ అనే వ్యక్తిని అతి కిరాతకంగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే నరికాడు. కేవలం వైఎస్సార్‌సీపీ కోసం పని చేశాడనే ఈ హత్య చేశారు. హత్య చేసిన జిలానీ వైఎస్సార్‌సీపీ వ్యక్తి అని ప్రచారం చేశారు. రెండేళ్ల కిందట బైక్‌ కాలిన కేసులో.. ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ ఈనాడు ఓ కథనం ఇచ్చింది. ఆ బైక్‌ అసిఫ్‌ అనే వైఎస్సార్‌సీపీ వ్యక్తికి చెందింది. 

. ఈనాడు అసలు పేపరేనా?.. సిగ్గుతో తలవంచుకోవాలి. రషీద్‌ కేసు ఒక ఎగ్జాంపుల్‌ మాత్రమే. మిథున్‌ రెడ్డి తన నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు. మిథున్‌ రెడ్డి, రెడ్డుప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు.

వినుకొండకు ఎస్పీగా రవిశంకర్‌ ఉన్నారు. ఎన్నికల వేళ పలుకుబడితో ఆ ఎస్పీని మార్చేశారు. ఎన్నికల అధికారులు మల్లికా గర్గ్‌ను నియమించారు. టీడీపీ ప్రభుత్వం ఆ ఎస్పీని కూడా మార్చేసింది’ అని పేర్కొన్నారు. 

ఏపీలో అరాచక పాలనపై నిరసనగా ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడతాం. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ ధర్నా చేస్తాం. ఇందులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరతాం. రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేస్తాం’’ అని అన్నారాయన.  

వైఎస్‌ జగన్‌ ఇంకా మాట్లాడుతూ.. 

  • రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. 
  • ప్రతి సామాన్యుడిలో ఇదే అభిప్రాయం ఉంది
  • గవర్నన్స్‌ అనేది లేదు.
  • తెలుగుదేశం పార్టీవారు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా హత్య  చేయొచ్చు, హత్యాయత్నం చేయొచ్చు, ఆస్తులను ధ్వంసం చేయొచ్చు.
  • పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
  • పల్నాడు జిల్లాకు గతంలో రవిశంకర్ రెడ్డి ఉండేవాడు.
  • ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో బదిలీ చేయించారు.
  • బిందుమాధవ్‌ అనే అధికారిని వేయించుకున్నారు
  • ఈ అధికారి చాలా అన్యాయంగా ప్రవర్తించారు.
  • చివరకు ఎన్నికల కమిషనే సస్పెండ్‌ చేసింది.
  • తర్వాత మల్లికా గార్గ్‌ను ఈసీ తీసుకు వచ్చింది.
  • తర్వాత ఈమెను కూడా పంపించేశారు:.
  • తర్వాత వాళ్ల పార్టీకి మద్దతు పలికే వ్యక్తిని ఎస్పీగా తెచ్చుకున్నారు.
  • ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2 రోజులకే రషీద్‌ హత్య జరిగింది.
  • ప్రజలంతా చూస్తుండగా.. దారుణ మత్య జరిగింది:
  • హత్యకు గురైన సాధారణ ఉద్యోగస్తుడు.
  • అలాంటి వ్యక్తిని కిరాతకంగా నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగానే నరికి చంపారు.
  • రాష్ట్రవ్యాప్తంగా సంకేతం ఇవ్వడానికి ఈదారుణానికి పాల్పడ్డారు.
  • పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది.
  • హత్యా ఘటనపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది.
  • ఘటన జరిగిన వెంటనే హత్య వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందని పోలీసులు అవాస్తవాలు చెప్తున్నారు.

ఇదీ చదవండి: దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ ధర్నా

ఎంపీ మిథున్‌ తన నియోజకవర్గంలో తిరగకూడదా?:

  • ఆ నియోజకవర్గానికి తన తండ్రి ఎమ్మెల్యే.
  • మాజీ ఎంపీ ఇంట్లో కూర్చొని ఉంటే దాడులు చేశారు
  • మా మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేశారు
  • ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడైనా జరిగాయా?
  • మళ్లీ మా పార్టీ వాళ్లపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు.
  • శాంతి భద్రతలను పట్టించుకునే పరిస్థితుల్లో పోలీసులు లేరు.
  • బాలికలమీద అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు.
  • మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోడడంలేదు.
  • వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. టీడీపీ వాళ్లపై దాడులు చేయమని మేం ఏరోజూ చెప్పలేదు.
  • ప్రతి మహిళకూ రక్షణ విషయంలో రాజీపడలేదు.
  • దిశలాంటి వ్యవస్థ ద్వారా వారికి రక్షణ విషయంలో భరోసా కల్పించాం.

చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు

  • గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికీ విద్యాదీవెన అందించేవాళ్లం.
  • జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి ఇప్పటివరకూ ఇవ్వలేదు.
  • ఆతర్వాత కూడా ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికం వచ్చేసింది.
  • ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన ఇచ్చేవాళ్లం.
  • మేం ఉండి ఉంటే.. ఇప్పటికే రైతు భరోసా వచ్చి ఉండేది.
  • అమ్మ ఒడి డబ్బులు ఇవ్వాళ్టికే తల్లులకు వచ్చి ఉండేవి.
  • ప్రతి జూన్‌లో అమ్మ ఒడి కింద తల్లులకు తోడుగా నిలిచాం.
  • మహిళలకు సంబంధించి సున్నావడ్డీ డబ్బు కూడా ఇవ్వాళ్టికి వచ్చి ఉండేది.
  • మత్స్యకార భరోసాకూడా సకాలానికే అంది ఉండేది.
  • ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలు ఉంటే.. అంతమందికీ రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు.
  • ప్రతి ఇంట్లో ప్రతి అక్క చెల్లెమ్మకూ నెలకు రూ.1500 ఇస్తామన్నారు.
  • వీళ్లంతా ఇప్పుడు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును అడుగుతున్నారు.
  • ఈ అంశాలనుంచి ప్రజల దృష్టిని మరిల్చేందుకు, ప్రజలెవ్వరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఈ మాదిరిగా దాడులు చేస్తున్నారు.
  • రాష్ట్రంలో ఆటవిక పాలనపై నిరసన తెలుపుతాం
  • అసెంబ్లీలో ఆటవిక పాలనను నిలదీస్తాం.
  • ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో నిలదీస్తాం.
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్తాం.
  • బుధవారం… ఢిల్లీలో ధర్నా ద్వారా నిరసన తెలుపుతాం.
  • రాష్ట్రంలో అరాచకపాలనను, హింసను దేశం దృష్టికి తీసుకెళ్తాం.
  • ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాగారి అపాయింట్‌మెంట్లు కోరాం.
  • అపాయింట్‌మెంట్‌ రాగానే వారికి పూర్తి వివరాలు ఇస్తాం.
  • రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలను అంశాన్ని దృష్టికి తీసుకెళ్తాం.
  • రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరాన్ని నివేదిస్తాం.
  • హత్యకు గురైన వ్యక్తి కుటుంబంపై వ్యక్తిత్వ హననానికి పోలీసులు దిగుతున్నారు.
  • ఇది సరైన విధానం కాదు.
  • రాష్ట్రంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాలి.
  • జరిగిన ఘటనలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.
  • టీడీపీకి ఓటు వేయనివారి రక్షణ బాధ్యతకూడా ప్రభుత్వానిదే అన్న విషయాన్ని గుర్తించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement