గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం కొత్తపేట ఏరియాలో చోరీ జరిగింది.
వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం కొత్తపేట ఏరియాలో చోరీ జరిగింది. స్థానికంగా ఉండే బొడ్డపాటి లింగారావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 25 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు స్థానిక కృష్ణవేణి కాలేజీ డెరైక్టర్. పొద్దున్నే కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.