కారు, బస్సు ఢీ: ఇద్దరి మృతి | Two Died In Road Accident At Vinukonda In Guntur | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Published Sun, May 12 2019 9:10 PM | Last Updated on Sun, May 12 2019 9:23 PM

Two Died In Road Accident At Vinukonda In Guntur - Sakshi

గుంటూరు: వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు గుంటూరుకు చెందిన శ్రీను(40), రాంబాబు(45)గా గుర్తించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement