ఎన్నికలు ముగిసినా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తమకు గట్టి పోటీయిచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నేలగంగవరంలో టీడీపీ కార్యకర్తల దాడిలో మునయ్య అనే వైఎస్సార్ సీపీ మృతి చెందాడు. ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యహరించాడనే అక్కసుతో మునయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో ఉన్న మునయ్యను ఈ ఉదయం విచక్షణారహితంగా కొట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం అతడు ప్రాణాలు వదిలాడు. ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్ ఎత్తివేసిన 24 గంటల్లోనే ఈ దారుణం చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.