
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
గుంటూరు (వినుకొండ) : వినుకొండ పట్టణంలోని కుమ్మరి బజార్‌లో ఓ నాలుగంతస్తుల భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఇల్లు ఒక వైపు ఒరిగినట్లు ఉండటంతో ఇంటి యజయాని రాజ్యం మంగళవారం ఉదయమే ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లర్ లేకుండా కట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇల్లు కూలి మరో మూడిళ్లపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.