building collapsed
-
విశాఖలో కుప్పకూలిన ముడు అంతస్తుల భవనం
-
పేకమేడలా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు, అగ్ని మాపక విభాగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #WATCH | A four-storey building collapsed in North Delhi's Shastri Nagar. There was no loss of life as the house was already empty. As soon as the information was received, vehicles of Delhi Police, Fire and Ambulance reached the spot. (Video Source: Local, confirmed by Police) pic.twitter.com/WLTdt8lvl8 — ANI (@ANI) December 5, 2022 ఇదీ చదవండి: బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు: కేంద్ర మంత్రి -
విషాదం: భవనం కుప్పకూలి సజీవ సమాధైన కుటుంబం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఓ భవనం కుప్పకూలి ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అమరావతిలోని ప్రభాత్ సినిమా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. భవనం కూలిపోయిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇదీ చదవండి: తుపాకులతో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లిన దుండగులు -
కడపలో అర్ధరాత్రి కూలిన భవనం
కడప అర్బన్: కడపలోని ఎన్జీవో కాలనీలో విద్యామందిర్ స్కూల్ సమీపాన బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఆధునికీకరణ చేస్తున్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబంలో తల్లి, ఆమె ఇద్దరు కుమారులను పోలీస్, అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం సమష్టిగా కృషి చేసి సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చాయి. స్థానిక ఎన్జీవో కాలనీలో విద్యామందిర్ స్కూల్ సమీపాన ఉన్న రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. మొదటి అంతస్తులో రాయచోటిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజు, అతని భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. తొలుత బుధవారం అర్ధరాత్రి గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తిగా కిందకి పడి కూలిపోయింది. దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు ఫస్ట్ ఫ్లోర్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న సుబ్బరాజు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న చిన్నచౌక్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బాలరాజు వెంటనే అప్రమత్తమై పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిన్నచౌక్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్ఐ అమర్నాథ్రెడ్డి, అగ్నిమాపక శాఖ ఇన్చార్జ్ అఫీసర్ షంషీర్ అహ్మద్, లీడింగ్ ఫైర్మెన్లు సంజీవరాజు, పవన్‌కుమార్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని స్వప్న, ఆమె పిల్లలను రక్షించారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. తమను రక్షించిన పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సుబ్బరాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
వర్షాల ఎఫెక్ట్.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్
Four Storey Building Collapsed In Shimla: దేశవ్యవాప్తంగా ఎడతెరిపలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో నదులు పొర్లొపొంగుతున్నాయి. పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సిమ్లాలోని చౌపల్ బజార్లో ఓ భవనంతో బ్యాంకు, రెండు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఆ భవనం కూలిపోయింది. అయితే, వర్షాల నేపథ్యంలో ముందగానే భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు.. కొద్దిరోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. A four story building collapsed in Chopal in #Shimla district in #HimachalPradesh on Saturday Thank God, No loss of life is reported pic.twitter.com/8HjpNfLPc0 — Rajinder S Nagarkoti रजिन्दर सिंह नगरकोटी (@nagarkoti) July 9, 2022 ఇది కూడా చదవండి: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. సీఎం కేసీఆర్ హెచ్చరిక ఇదే.. -
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 19 మంది మృతి
ముంబై: ముంబై: ముంబైలోని కుర్లా ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటనలో 19 మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు. నాయక్ సాగర్ సొసైటీలో ఉన్న ఈ భవనం సోమవారం అర్థరాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో ఒకవైపు పూర్తిగా కుప్పకూలిపోయిందని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. కూలిపోకుండా మిగిలిన భాగంలోని వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింది వెలికితీత మొదలు పెట్టారు. 10 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 9 మంది ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. భవనం బాగా పాతబడిందని, ఎప్పుడైనా కూలే ప్రమాదముందని కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నా ఎవరూ ఇళ్లు వదల్లేదని అధికారులు తెలిపారు. 2013 నుంచి బీఎంసీ నోటీసులిస్తున్నా మరమ్మతులకు కూడా అంగీకరించలేదన్నారు. రిస్క్ తీసుకొని భవనంలోనే ఉంటామని, ఖాళీ చేయబోమని చెప్పినట్టు అదనపు మున్సిపల్ కమిషనర్ అశ్విని భిండే వెల్లడించారు. -
యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
యాదగిరిగుట్ట: ఓ భవనం బాల్కనీ కుప్పకూలడంతో నలుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు కలసి చదువుకున్న స్నేహితులు కాగా.. మరొకరు ఇంటి యజమాని. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లోని ఆంధ్రా బ్యాంక్ పక్కన గుండ్లపల్లి దశరథ గౌడ్ (70)కు రెండంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో సుంచు శ్రీనివాస్ (40) బట్టల దుకాణం, గిరి బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సుమారు 6.34గంటల సమయంలో దశరథ, గిరి, సుంచు శ్రీనివాస్ చల్ల గాలికి బయట కూర్చున్నారు. ఇదే సమయంలో శ్రీనివాస్ స్నేహితులు సుంగి ఉపేందర్ (40), తంగళపల్లి శ్రీనాథ్ (40) అక్కడికి వచ్చారు. అంతా సరదాగా మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా భవనం మొదటి అంతస్తు బాల్కనీ కుప్పకూలి కిందకూర్చున్న వారిపై పడింది. దశరథగౌడ్, శ్రీనివాస్, శ్రీనాథ్, ఉపేందర్‌లు అక్కడికక్కడే మృతి చెం దగా.. గిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉలిక్కిపడిన ‘గుట్ట’వాసులు బాల్కనీ కుప్పకూలడంతో భారీ శబ్దం వచ్చిం ది. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలోనే కరెంట్ పోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శిథి లాల కింద ఉన్న ఐదుగుర్నీ గమనించారు. అప్పటికే నలుగురు మరణించగా..తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిని అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు జేసీబీ సహాయంతో గంటసేపు తీవ్రంగా శ్రమించారు. 35 ఏళ్ల కిందటి భవనం.. గుండ్లపల్లి దశరథకు చెందిన ఈ భవనం సుమారు 35 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనానికి మొదట్లో బాల్కనీ లేదు. పదేళ్ల క్రితమే ఏర్పాటు చేయించి, దానిపై పూజ గదిని కూడా నిర్మించారు. అయితే పిల్లర్లు, బీమ్‌లు లేకుండా బాల్కనీ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి 15 నిమిషాల ముందే దశరథ గౌడ్ భార్య కౌసల్య అక్కడనుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కౌసల్య రోదిస్తూ తెలిపారు మరణంలోనూ కలిసే.. శ్రీనివాస్, ఉపేందర్, శ్రీనా«థ్లు కలిసి చదువుకున్నారు. స్థానికంగా ఉంటూ ఎప్పుడూ కలసిమెలసి ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చినా కలసి చర్చించుకునే వాళ్లని వారి తోటి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి పరిశీలించారు. సీఐ జానకిరెడ్డి, ఎస్సై సుధాకర్‌రావులు సహాయక చర్యలు పర్యవేక్షించారు. గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టలో భవనం బాల్కనీ కుప్పకూలడంపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తీవ్ర ఆందోళనకు గురుయ్యానని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుం బానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించా లని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. v -
ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. సత్యనికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం సోమవారం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. చారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 25 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఎన్డిఆర్ఎఫ్ అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. అయితే భవనం కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ये हादसा बेहद दुखद है। ज़िला प्रशासन राहत और बचाव के काम में जुटा है। मैं ख़ुद घटना से सम्बंधित हर जानकारी ले रहा हूँ। https://t.co/dO8l2zEWon — Arvind Kejriwal (@ArvindKejriwal) April 25, 2022 ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయనతోపాటు జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ ప్రమాదం చాలా బాధాకరం. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను' అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Delhi | NDRF personnel rescued one person from the debris of an under-construction building that collapsed in Satya Niketan, this afternoon pic.twitter.com/aYjXXFsXk3 — ANI (@ANI) April 25, 2022 చదవండి: దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్ Delhi | A call about the collapse of an under-construction building in the Satya Niketan area has been received. 6 fire tenders rushed to the spot. 5 labours feared to be trapped; rescue operation underway: Delhi Fire Service pic.twitter.com/lZ3XgFTl7G — ANI (@ANI) April 25, 2022 -
మృత్యుంజయుడు ఆ బాలుడు
Boy Rescued From the Debris of a Collapsed Building in Chagalamarri: పై చిత్రంలో మట్టి శిథిలాల మధ్య రోదిస్తున్న బాలుడి పేరు చరణ్.. ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లి శుక్రవారం సాయంత్రం చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తన స్వగృహానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు వంట రూంలో ఉండగా.. చరణ్ మరో రూంలో సోఫాలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిమిద్దె తడిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో చరణ్ ఉన్న గది కూలిపోయింది. శిథిలాల కింద బాలుడు కూరుకుపోయాడు. తండ్రి పుల్లయ్య అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతికష్టం మీద బాలుడిని బయటకు తీశారు. చరణ్ స్వల్ప గాయాలతో బయట పడడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
కుప్పకూలిన మూడు భవనాలు
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శనివారం వేకువజామున మూడు భవనాలు కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ పసికందు సహా ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. మరో నలుగురు ఆస్పత్రి పాలవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో సైదున్నీసా (2), ఫారున్నీసా (8 నెలలు), యాషికా(3)తోపాటు ఫైరోజా (65), భాను (30), ఫాతిమాబీ (65) ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో జిలాన్ అనే వ్యక్తి తన పాత భవనంపై ఎటువంటి పిల్లర్లు వేయకుండా మరో రెండంతస్తుల నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆ భవనంలోని కింది భాగం పాత నిర్మాణం కావడంతో కొత్తగా నిర్మించిన రెండంతస్తుల బరువును మోయలేక శనివారం వేకువజామున 3 గంటల సమయంలో కుప్పకూలింది. దాని శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండంతస్తుల భవనంతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంకో భవనంపైనా పడటంతో అవి కూడా నేలమట్టమయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని కింది పోర్షన్లో నిద్రిస్తున్న ఇంటి యజమాని జిలాన్ తల్లి ఫైరోజా (65), పక్క భవనంలోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న టీవీ చానల్ విలేకరి సోమశేఖర్ సతీమణి భాను (30), వీరి మూడేళ్ల చిన్నారి యాషికా, అత్త ఫాతిమాబీ (65) శిథిలాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమశేఖర్ ఇంటి కింది పోర్షన్లో కాపురముంటున్న వంట మాస్టర్ రాజు, కదిరి మండలం రామదాసు నాయక్ తండాకు చెందిన ఉదయ్ నాయక్, మీటేనాయక్ తండాకు చెందిన గౌతమ్ నాయక్, చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్ నాయక్ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరంతా ఓ మూలన ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. తరుణ్ నాయక్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, 108 సిబ్బంది వారిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే పక్కనే ఉన్న మరో ఇంటిపైనా భవన శిథిలాలు పడటంతో ఆ ఇల్లు కూడా కూలింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న హబీబుల్లా, కలీమున్నీసా, హిదయతుల్లా, దంపతులు కరీముల్లా, హబీబున్నీసా బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కరీముల్లా దంపతుల రెండేళ్ల చిన్నారి సైదున్నీసా, 8 నెలల చిన్నారి ఫారున్నీసా శిథిలాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో వంట మాస్టర్ రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి ఉదయం నుంచీ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
కుప్పకూలిన 21 అంతస్తుల భవనం: 36కు చేరిన మృతుల సంఖ్య
లాగోస్: నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లో నిర్మాణంలో ఉన్న 21 అంతస్తుల భవనం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం కూలిన భవనశిథిలాల నుంచి మరో 14 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 36కు చేరింది. ఘటనాస్థలంతో వరుసగా నాలుగో రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్ తాజాగా గురువారం వెలికితీసిన మృతదేహాలతో కలుపుకొని మొత్తం మృతుల సంఖ్య 36కి చేరింది. మృతిచెందిన వారిలో 33 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
తౌక్టే తుపాను: చూస్తుండగానే కుప్పకూలిన భవనం
-
భారీ వర్షం.. క్షణాల్లో కుప్పకూలిన భవనం
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో ఇల్లు కూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పాతబస్తీలో ఓ మహిళకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. (చదవండి : రోడ్లన్నీ జలమయం.. హై రెడ్ అలర్ట్) ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె పక్కనే శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో మహిళ భయంతో పక్కకి జరిగి పరుగులు తీసింది. లేదంటే ఇంటి గోడ కూలి ఆమె మృతి చెందేది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అనంతరం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని పాత భవనాన్ని పరిశీలించారు. (చదవండి : వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) -
పంజాబ్: బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
చండీగఢ్: పంజాబ్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొహాలి జిల్లాలోని డేరా బస్సీలో గురువారం ఉదయం ఒక భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు వెల్లడించాయి. వారిని వెలికి తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
‘మహా’ విషాదంలో 13 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్థుల భవనం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. రాయ్‌గఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ నదీమ్ బతికి బయటపడ్డాడు, శిథిలాల నుంచి ఇప్పటికి 12 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. భవనం కూలేటప్పుడు ఎగిరివచ్చిన రాయి ఒకటి తలకు తగిలి మరో వ్యక్తి మరణించినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతానికి 9 మందిని కాపాడామని అధికారులు చెప్పారు. మరో ముగ్గురి జాడ ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 304, 338 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. కేసులో బిల్డర్ ఫరూక్ ఖాజీ, ఆర్కిటెక్ట్ గౌరవ్ షా సహా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు. కళ్లముందే పిల్లర్లు బద్దలు భవనం కూలే సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్తంభాలు బీటలిచ్చి ముక్కలవడం చూశానని ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్షసాక్షి ముస్తఫా ఛపేకర్ చెప్పారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనం కూలడానికి ముందు తనకు ప్రకంపనలు తెలిశాయని, దీంతో బాల్కనీలోకి పరిగెత్తి ఏం జరుగుతుందో తెలుసుకునే యత్నం చేశానని చెప్పారు. బయటున్న వారు వెంటనే తనను భవనం వెలుపలకు రమ్మని చెప్పారని, దీంతో తాను, కుటుంబ సభ్యులు బయటకు పరిగెత్తామని తెలిపారు. బయటకు వచ్చేముందు తన పొరుగువారికి విషయం చెప్పి హెచ్చరించానన్నారు. దాదాపు బయటకు వచ్చాక వెనక్కు చూస్తే గ్రౌండ్‌ఫ్లోర్‌లో పిల్లర్లు పెద్ద శబ్దంతో ముక్కలవడం కనిపించిందన్నారు. భవన నిర్మాణంలో లోపాలను పలుమార్లు బిల్డర్‌ను కలిసి వివరించినా, తను రిపేరు పనులు చేయించడానికి సుముఖత చూపలేదని విమర్శించారు. భవనం కట్టాక తనకేమీ సంబంధంలేదన్నాడని తెలిపారు. అన్నిరకాలుగా సాయం బిల్డింగ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీములు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 50 వేల రూపాయల సాయం అందించనుంది. మృత్యుంజయుడు... ఏం జరిగిందో తెలియదు. అమ్మ ఎక్కడుందో తెలియదు. చిమ్మచీకటి. చుట్టూ శిథిలాలు. ఏకంగా 19 గంటల పాటు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఓ నాలుగేళ్ల బాలుడు... చివరకు సురక్షితంగా బయటపడ్డాడు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో మహమ్మద్ నదీమ్ బాంగీని సజీవంగా చూడగానే ఒక్కసారిగా ఆనందం. గ్యాస్ కట్టర్లు, ఇతర యంత్ర సామగ్రిని ఉపయోగించి శిథిలాలను తొలగించారు. జాగ్రత్తగా బయటకు తెచ్చారు. ఊపిరిబిగపట్టి చూస్తున్న స్థానికుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు. ‘గణపతి బప్పా మోరియా’అంటూ నినదిస్తూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నచిన్న గాయాలు తప్పితే... నదీమ్ బాగానే ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే... మరో 20 నిమిషాల తర్వాత అతని మాతృమూర్తి శిథిలాల కింద విగతజీవిగా కనిపించింది. ఈ బాలుడి తల్లి నౌషీన్ నదీమ్ బాంగీ (30), అక్క అయేషా (7), చెల్లెలు రుకయ్యా (2) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్‌లో పనిచేస్తున్న తండ్రి నదీమ్ హుటాహుటిన బయలుదేరి మహద్‌కు చేరుకున్నారు. 26 గంటలపాటు శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల మహిళ మెహరున్నీసాను సహాయక సిబ్బంది రక్షించారు. కూలిన భవనంలో ఆమె ఐదో అంతస్తులో నివసించేవారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా... మంగళవారం రాత్రి 9.35 గంటలకు శిథిలాల్లో ఎవరో కదులుతున్నట్లు గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మెహరున్నీసాను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. -
ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు నగరంలోని ఓ అయిదంతస్తుల భవనం కూలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటికి తీసింది. సుమారు 20 మందికిపైగా శిధిలాల కింద ఇరుక్కుని ఉంటారని భావిస్తున్నారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు -
కుప్పకూలిన భవనం
సాక్షి,కావలి(నెల్లూరు) : పట్టణంలో సుమారు 90 ఏళ్ల నాటి కాలం చెల్లిన శిథిల భవనం శనివారం రాత్రి కుప్పకూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిల భవనం కూలిన వేళ రాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. పగలు కూలిపోయి ఉంటే పరిస్థితి ఊహకే అందడం లేదు. దేశానికి స్వాతంత్రం రాక ముందే నిర్మించి ఈ భవనం శిథిలమైపోయింది. ఈ భవనంలో పండ్లు, పూలు అమ్మకాలు చేసే వ్యాపారులు ఉంటారు. నిత్యం ఈ భవనం వద్ద కొనుగోలుదారులు కిక్కిరిసి ఉంటారు. ట్రంక్‌రోడ్డులోని నిత్యం జనాలతో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలి ప్రాంతంలోనే ఈ శిధిల భవనం ఉండడం గమనార్హం. శిథిలమైన ఈ భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చని మునిసిపాలిటీ అధికారులు 2013లోనే గుర్తించారు. అయితే 2015లో మునిసిపాలిటీ అధికారులు ఈ కాలం చెల్లిన భవన యజమాని నల్లూరి రమేష్‌కు నోటీసులు జారీ చేసి, కూల్చేయాలని తెలియజేశారు. అయితే భవన యజమాని ఈ భవనాన్ని పండ్లు, కూరగాయలు అమ్మకాలు చేసే వారికి అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దెలకు కక్కుర్తి పడిన భవన యజమాని నల్లూరి రమేష్‌తో మునిసిపాలిటీ అధికారులు అమ్యామ్యాలతో చేతులు తడుపుకుని, ఇక ఈ భవనం వైపు కన్నెత్తి చూడడం మానుకొన్నారు. ఇలా ఆరేళ్లుగా మునిసిపాలిటీ ఈ కాలం చెల్లిన శిథిల భవనం సంగతిని పట్టించుకోకపోవడంతో, భవన యజమాని నల్లూరి రమేష్ అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలో భవనం కుప్ప కూలిపోయింది. శిథిలమైన భవనం కూలిపోగా, మిగిలిన భవనంతోనే పండ్లు అమ్మకాలు చేసే వారితో వ్యాపారాలు చేయిస్తూ అద్దె రాబడిని శిథిల భవన యజమాని కొనసాగిస్తున్నాడు. రద్దీగా ఉన్న వాణిజ్య ప్రదేశంలో శిథిలమైపోయిన కాలం చెల్లిన భవనం కూలిపోతే వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన మునిసిపాలిటీ, ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం భవన యజమాని విదిల్చే కాసులకు కక్కుర్తిపడి మునిసిపాలిటీ ప్రజల ప్రాణాలకు ముప్పుతో ముడిపడి ఉన్న కాలం చెల్లిన భవనాన్ని తొలిగించేందుకు చర్యలు తీసుకోవలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గురుగ్రామ్‌లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
-
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
గురుగ్రామ్ : గురుగ్రామ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సైబర్హౌజ్కు 12 కిలోమీటర్ల దూరంలో గల ఉల్లవాస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
36 గంటలపాటు... మైనస్ 22 డిగ్రీల చలిలో
మాస్కో : రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో పురాతన బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇప్పటికే 9 మరణించగా... శిథిలాల కింద ఇరుక్కున వారి జాడ ఇంకా తెలియడం లేదు. సోమవారం ఉదయం భవనంలో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు తగ్గిపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఈ క్రమంలో రక్షణా బృందాలు తీవ్రంగా శ్రమించి శిథిలాల కింద ఇరుక్కున్న పదకొండు నెలల బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. సుమారు 36 గంటలపాటు రాళ్ల కింద ఇరుక్కున్న ఆ బాలుడు చలికి గడ్డకట్టుకుపోయినప్పటికీ ఇంకా శ్వాస ఆడుతోందని తెలిపాయి. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న బాలుడి తండ్రి రక్షణా బృందాలకు కృతఙ్ఞతలు తెలిపాడు. అంతటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా ప్రాణాలతో బయటపడ్డ తన కుమారుడు మృత్యుంజయుడని, అతడు కచ్చితంగా బతుకుతాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కాగా సోమవారం ఉదయం ఒక్కసారిగా భవనంలో పేలుడు సంభవించడంతో మూడేళ్ల కుమారుడితో కలిసి తాను బయటికి పరిగెత్తానని సదరు బాలుడి తల్లి పేర్కొంది. ఆ సమయంలో తన భర్త ఇంట్లో లేకపోవడంతో చిన్న కుమారుడుని బయటికి తీసుకువెళ్లాడేమోనని భావించానని తెలిపింది. ఈ కారణంగానే తన చిన్నారి ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక... గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్ఎస్బీ నిర్ధారించింది. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
కుప్పకూలిన భవనం.. ఐదుగురి మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భవనం కూలిన ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉంది. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్3లో ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో పదేళ్ల లోపు వయసు గల ఇద్దరు అన్నదమ్ములు, ఐదేళ్లలోపు వయస్సు గల ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు. కాగా భవనం 20 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకి చేరుకోవడంతోనే ప్రమాదం జరిగిందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. భవన శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీమ్ పనిచేస్తోందని పేర్కొన్నారు. -
కుంగిపోయిన భవనం వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందం
కాజీపేట : కాజీపేట పట్టణంలోని భవానీ నగర్లో మంగళవారం రాత్రి బహుళ అంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోయిన ఘటనలో సహాయక చర్యలను జిల్లా అధికార యంత్రాంగం వేగవం తం చేసింది. ఈ భవన శిథిలాల్లో వాచ్మెన్ మేడ భిక్షపతి (60) చిక్కుకున్నట్లుగా గుర్తించిన అధికా రులు కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. భూపాల్పల్లి, హైదరాబాద్‌ల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారుల బృందాలను ఘటన స్థలానికి రప్పించి సహాయక చర్యలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఈ సహా యక బృందాలు అత్యాధునిక పరికరాలతో వాచ్మెన్ ఆచూకీని కనుక్కునేందుకు శ్రమిస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకం... జనావాసాల మధ్య నిర్మితమవుతున్న బహుళ అంతస్థుల భవనం ఒక్కసారిగా భూమిలోకి దాదాపు 20ఫీట్ల లోతుకు కుంగిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం సహాయక బృందాలకు కష్టంగా మారింది. ఈ భవనం కుంగిపోవడంతో పక్కపక్కనే ఉన్న నాలుగు భవనాలకు తీరని నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. చుట్టూ ఇండ్లు ఉండడంతో భవనాన్ని కూల్చడం, శిథిలాల కింద చిక్కుకుపోయిన వ్యక్తిని బయటకు తీయడం ఏలా అనే సందిగ్ధంలో అధికారులు పడిపోయారు. భవనం ముందు, వెనుక.. పెద్ద, పెద్ద గోతులు నీటితో నిండి ఉండడంతో ప్రొక్లెయినర్లను ఉపయోగించడం కష్టమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి జేసీబీలు, క్రేన్లను తెప్పించి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ భవనం చుట్టూ ఉన్న నాలుగు ఇండ్లు కూడా పగుళ్లు పట్టిపోయాయి. దీంతో ఆయా ఇండ్ల యజ మానులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. లోపించిన అధికారుల పర్యవేక్షణ... మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారే తప్ప పనులను పర్యవేక్షించిన దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పిల్లర్లు వేసి అతి పెద్ద భవంతిని ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో కడ్తున్నప్పటికీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోకపోవడం బాధాకరమంటున్నారు. పనులు సాగిన వైనంపై సమగ్రమైన విచారణ జరిపించి, బాధ్యుడైన రవీందర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంటి యజమాని రిటైర్డు ఉపాధ్యాయుడు.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పుల గ్రామానికి చెందిన కొత్త రవీందర్‌రెడ్డి రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. పింఛన్ డబ్బులను వెచ్చించి నగరంలో సొంత ఇళ్లు ఉండాలనే ఆకాంక్షతో జీ ప్లస్ 2 పర్మిషన్తో భవన నిర్మాణ పనులను ఏడాది కింద మొదలు పెట్టాడు. బంధు, మిత్రుల సలహా మేరకు మరో రెండంతస్థులకు మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుని బహుళ అంతస్తుల భవనానికి శ్రీకారం చుట్టాడు. ఘటనా స్థలినిసందర్శించిన కలెక్టర్ భవానీనగర్‌లో భవనం కృంగిపోయిన సమాచారం అందుకున్న కలెక్టర్ అమ్రపాలితో పాటు జేసీ దయానంద్, సీపీ విశ్వనా«థ రవీందర్, డీసీపీ వెంకటరెడ్డి, ఏసీపీ సత్యనారాయణ, తహసీల్ధార్ రవీందర్, డివిజనల్ అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి, ఏడీఎఫ్‌ఓ జైపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిట్ సివిల్ ఇంజనీర్ల బృందం సభ్యులను రప్పించి చేపట్టాల్సిన సహాయక చర్యలపై కలెక్టర్ చర్చించారు. ఎలాగైనా వాచ్‌మెన్‌ను కాపాడాలని సహాయక బృందాలను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పట్టించుకోని అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్న జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) సభ్యులను, సిబ్బందిని ఎవరూ పట్టించుకోకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల విన్నపం మేరకు హైదరాబాద్, భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి దాదాపు 40 మంది సిబ్బంది కాజీపేటకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. క్షణం తీరిక లేకుండా సహాయక చర్యల్లో బిజీబిజీగా ఉన్న సిబ్బందికి కనీసం మంచినీరు, టీ వంటి సౌకర్యాలు కల్పించడానికి స్థానిక అధికారులు ప్రయత్నించిన దాఖలాలు లేవని వారు విలేకరులతో వాపోయారు. వాచ్‌మన్ కుటుంబ సభ్యుల ఆందోళన కాజీపేట: భవనంలో చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్న వాచ్‌మన్ మేడ భిక్షపతి (60) ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మంగళవారం రాత్రి భార్యకు జాగ్రత్తలు చెప్పి పడుకోవడానికి భవనంలోకి వచ్చిన పది నిమిషాల్లోనే పెద్ద శబ్ధంతో కుంగిపోయింది. భార్య, పిల్లలు ఘటనా స్థలికి చేరుకుని భిక్షపతి కోసం భవనం చుట్టూ తిరుగుతూ పిలుస్తున్నారు. స్పందన లేకపోవడంతో లోపల చిక్కుపోయి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవనం మొదటి అంతస్తులోనే భిక్షపతి నిద్రిస్తాడని భార్య మణెమ్మ చెప్పగా ఆ దిశగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన భిక్షపతి ఏడాది కాలంగా కుటుంబంతో కాజీపేటకు వలస వచ్చి ఈ ఇంటి యజమాని వద్ద వాచ్‌మన్‌గా చేరినట్లు చెబుతున్నారు. భిక్షపతికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు బుధవారం రాత్రి వరకు ఒక కొలిక్కి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. భవనం భద్రమేనా ?అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు వరంగల్ అర్బన్: ఎక్కడ ఎలాంటి భవనం కడుతున్నారు. భవన నిర్మాణానికి ఆ నేల తగినదేనా ? లేదా ? నిర్మాణంలో సరైన రక్షణ చర్యలు ఉన్నాయా ? లేవా? అన్న కనీస పర్యవేక్షణ కరువైంది. పలుకుబడి ఉంటే ఏదైనా చేయచ్చు. అనుమతి ఉన్నా లేకున్నా దర్జాగా ఎన్ని అంతస్తులెనా నిర్మించవచ్చు. ఒక వైపు మామూళ్లే పెట్టుబడిగా నాణ్యత, అనుమతి లేని భవనాలు అడ్డగోలుగా నిర్మిస్తుంటే... మరోవైపు శిథిల భవనాలు నేలమట్టమవుతున్నాయి. లంచాలకు ఆశపడి మహా నగర పాలక సంస్థ కింది స్థాయి అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేస్తుండటంతో నిర్మాణ లోపాలు, మానవ తప్పిదాలతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మంగళవారం రాత్రి కాజీపేట భవానీ నగర్లో నాలుగు అంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోవడంతో ఓ వ్యక్తి దాని కింద ఉండి పోయాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. బహుళ అంతస్తుల భవనాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఖాళీ స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతోపాటు.. నిర్మాణ సామగ్రి ధరలను దృష్టిలో ఉంచుకొని అపార్టుమెంట్ల వైపే మధ్య తరగతి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో మొదలుకొని.. ప్రధాన రహదారుల వెంట భారీ భవంతులు, అపార్టుమెంట్లు నిర్మితమవుతున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 400 వరకు అపార్టుమెంట్లు ఉన్నాయి. మరో 80 వరకు నిర్మాణంలో ఉన్నాయి. మామూళ్ల మత్తులో నిబంధనల ఉల్లంఘన.. వరంగల్ మహా నగరంలో బహుళ అంతస్థుల నిర్మాణాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఏదైనా ఒక ప్రాంతంలో భవన నిర్మాణం చేపట్టే ముందు నిర్మాణ ప్లాన్ అమోదించేందుకు స్ట్రక్చరల్ ఇంజినీరు, సాయిల్ టెస్ట్(భూసార పరీక్షలు) చేయాలి. నిర్మాణ యోగ్యత కలిగిన నేలగా ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. అర్కిటెక్చర్ నిబంధనల మేరకు ప్లాన్, ఇతర పత్రాలను సమర్పించాలి. అపార్టుమెంటు, భవనం నిర్మించే స్థలం ఎన్ని టన్నుల సామర్థ్యాన్ని తట్టుకోగలదో నిర్ణయించి.. అ మేరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకున్నా అధికారులు.. బిల్డర్ల నుంచి ముడుçపులు తీసుకొని అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. నిర్మాణదారులు, బిల్డర్లు కూడా డబ్బులు మిగుల్చుకునేందుకు కక్కుర్తిపడుతున్నారనే ఆరోపణలున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై నిర్లక్ష్యపు ధోరణి వర్షం వస్తే చాలు.... పాత కాలం నాటి భవనాలు భయ పెడుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు ఏ క్షణంలో కూలుతాయోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఇంత జరుగుతున్నా ‘గ్రేటర్’ అధికారులు నోటీసుల జారీతోనే సరిపెడుతున్నారు. అదనపు అంతస్తే కొంపముంచిందా..? కాజీపేట భవానీ నగర్లో రిటైర్డ్ ఉద్యోగి పార్కింగ్ ప్లస్ మూడు అంతస్థులకు అనుమతి తీసుకున్నారు. అదనంగా మరో అంతస్తు నిర్మించారు. భూసార పరీక్షలు చేపట్టకుండా నిర్మించడం వల్ల నిర్మాణంలో ఉన్న భవనం భూమిలోకి కుంగిపోయి ఉంటుందనే వాదనలు వినవస్తున్నాయి. గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఈ ఘటనపై స్పష్టమైన వైఖరిని వెల్లడించడం లేదు. అదనపు అంతస్థుకు మామూళ్లు పుచ్చుకొని చూసీచూడనట్లుగా వ్యవహరించడమే ఘటనకు కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీ ప్లస్ 3 అనుమతి ఉంది భవానీ నగర్లో కుంగిపోయిన బిల్డింగ్‌కు సంబంధించి జీ ప్లస్ 3 భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరిగింది. నిబంధనల మేరకు ఓనర్, సర్వేయర్ ద్వారా అండర్ టేకింగ్ తీసుకొని అనుమతులు ఇచ్చాం. అదనపు అంతస్థు విషయం తెలియదు. - గణపతి, గ్రేటర్ డీసీపీ మట్టి పరీక్షలు తప్పనిసరి.. కాజీపేట అర్బన్: భవన నిర్మాణంలో భూసార పరీక్ష(సాయిల్ టెస్ట్ ) తప్పనిసరి అని నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అనేక చెరువులు, నీటి పారుదల కొనసాగించిన ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రమాదకరమని అన్నారు. సొంత ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం, కమర్షియల్ బిల్డింగ్‌ల నిర్మాణంలో తప్పనిసరిగా మట్టి పరీక్షలు నిర్వహించాలన్నారు. వరంగల్‌లో భద్రకాళీ చెరువుకు కుడి, ఎడమ వైపు భాగం, వడ్డెపల్లి, బంధం చెరువు, చిన్న వడ్డెపల్లి, మెట్టుగుట్టకు అనుకుని గిద్దె చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని ఓల్డ్ టెలియో చానల్స్ అంటారని తెలిపారు. అట్టి పాత టెలియో చానెల్స్‌పై నిర్మాణా ప్రమాదకరమని, అదే విధంగా నల్లరేగడిలో, బురద మట్టిలో ఒక అంతస్తు భవనాలు నిర్మించిన ఏడాదిలోపే భూమిలోకి కుంగిపోతాయని వివరించారు. ప్రస్తుతం కాజీపేటలోని భవానీనగర్‌లో నిర్మించిన జీ ప్లస్ 4 భవనం సైతం బురద మట్టిలో కట్టడం ద్వారానే కుంగిపోయిందన్నారు. హైదరాబాద్‌లో ఇలా భవనాలు కుంగిపోయినప్పుడు పర్యవేక్షణకు వెళ్లామని.. అక్కడ కూడా ఓల్డ్ టెలియో చానల్స్పైనే నిర్మాణాలు చేపట్టారన్నారు. సమగ్ర విచారణ జరిపిస్తాం కాజీపేట: భవానీనగర్‌లో భవనం కుంగిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ నరేందర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. బుధవారం వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. భవన శిథిలాల కింద చిక్కుకపోయిన భిక్షపతిని సజీవంగా కాపాడేందుకు ఫైర్ సెప్టీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శాయశక్తులా కృషి చేస్తాయన్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం మున్సిపల్ అనుమతులపై ఆరా తీశారు. భిక్షపతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ప్రమాదంపై విభిన్న కథనాలు.. ఇంటి యజమాని రవీందర్‌రెడ్డి ఇంజనీర్ పర్యవేక్షణ లేకుండా మేస్త్రీ మాటలను విశ్వసించి ఒక లెక్క, పద్ధతి లేకుండా పిల్లర్లను అతి తక్కువ సైజ్‌లో వేసి బహుళ అంతస్థుల భవనం నిర్మించడమే ప్రమాదానికి కారణమంటున్నారు చుట్టు పక్కల వారు. రెండంతస్థుల కోసం వేసిన పిల్లర్లపైనే పెంట్ హౌస్‌తో కలిసి ఐదంతస్తులు వేయడమే ప్రమాదానికి అసలు కారణం అయ్యి ఉంటుందని నిట్ అధికారులు భావిస్తున్నారు. అసలే నల్లరేగడి భూమి, దానికితోడు భవన నిర్మాణ స్థలం పెద్ద గోతులతో ఉంది.. అలాంటప్పుడు భూసార పరీక్షలు చేయించకుండానే యజమాని నేరుగా భవన కట్టడం కూడా ప్రమాదానికి కారణమంటున్నారు. విచారణ జరిపించాలి.. భవనం కుంగిపోయిన ఘటనపై అధికారులు సమగ్రమైన విచారణ జరిపించాలి. ఘటనకు బాధ్యుడైన భవన యజమానిపై కేసు నమోదు చేయాలి.భవిష్యత్‌లో ఇలాంటి సంఘటన జరుగకుండా చర్యలు తీసుకోవాలి - సందెల విజయ్, భవానీనగర్ సాయిల్ టెస్ట్ చేయించకుండానే... బహుళ అంతస్థుల భవన నిర్మాణం చేపట్టినప్పుడు తప్పని సరిగా సాయిల్ టెస్ట్ చేయించాలనే నిబంధన ఉన్నా.. ఇక్కడ పాటించినట్లుగా కనిపించడం లేదు. అసలే నల్లరేగడి భూమి కావడంతో భవనం కుంగిపోయింది. బి.జయరాజ్, భవానీనగర్ పక్క ఇళ్లకు పరిహారం ఇవ్వాలి.. భవనం కూలడం వల్ల పక్కనున్న మా ఇండ్లకు తీరని నష్టం వాటిల్లింది. నాలుగు ఇండ్లకుపైగా పనికిరాకుండా పోయే ప్రమాదం తలెత్తింది. వీటిని అధికారులు పరిశీలించి నష్టపరిహారం ఇచ్చేలా చూడాలి. తమకు న్యాయం చేయాలి. జి.గీత, స్థానికురాలు నాణ్యత లేని మెటీరియల్ వాడారు.. బహుళ అంతస్థుల భవనం నిర్మించేప్పుడు వాడాల్సిన స్టీలు, పిల్లర్ల నిర్మాణాలను బిల్డర్లు పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. పెడస్టల్ నిర్మాణం బాగా లేని కారణంగానే భూమిలోకి భవనం కుంగిపోయిందని కచ్చితంగా చెప్పొచ్చు. నాణ్యత లేని మెటీరియల్ వాడడం వల్లనే ఈ ఘటన జరిగింది. - తేలు సారంగపాణి, బిల్డర్ -
ఒక్కసారిగా కుప్పకూలిన భవనం
గుంటూరు: ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలగా తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. గుంటూరు నగరంలోని నందివెలుగు రోడ్డులో మణి హోటల్ వద్ద ఓ మూడంతస్తుల (జీ ప్లస్ 3) భవనం ఉంది. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ భవనం ముందు భాగాన్ని అధికారులు తొలగించారు. రోడ్డు విస్తరణలో శనివారం పొక్లైనర్లతో కాలువలు తీస్తుండగా మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మున్సిపల్ సిబ్బంది నోటీసులు ఇవ్వడంతో ఇంటి యజమానులు అప్పటికే ఇంటిని ఖాళీ చేయడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేదు. కాగా భవనం కూలిన దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వలస బతుకులు ఛిద్రం..
ఒక్కసారిగా కూలిన పైకప్పు.. ముగ్గురు దుర్మరణం పాత భవనాన్ని కూల్చివేస్తుండగా దుర్ఘటన మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో ఘటన మేడ్చల్/మేడ్చల్ రూరల్: నానక్‌రామ్‌గూడ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి 11 మంది కూలీలు మృత్యువాతపడిన ఘటనను మరువక ముందే గ్రేటర్ పరిధిలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం మేడ్చల్ మండల పరిధిలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో నూతన భవనం నిర్మించడానికి పాత భవనాన్ని కూల్చి వేస్తుండగా.. భవనం పైకప్పు కుప్పకూలి ముగ్గురు వలస కూలీలు మృతిచెందారు. మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గుప్తా గ్రామ పంచాయతీకి సమీపంలో ఉన్న పాత భవనాన్ని కొనుగోలు చేశాడు. దానిని నేలమట్టం చేసి నూతన భవనం నిర్మించాలని భావించి పనులు చేపట్టాడు. రామయ్య అనే కాంట్రాక్టర్‌కు కూల్చివేత పనులను అప్పగించాడు. బుధవారం నుంచి∙కూల్చివేత పనులు చేపట్టగా గురువారం ట్రాక్టర్ డ్రైవర్ లక్ష్మయ్య(45)తోపాటు వెంకటేశం(40), ముత్యాలునాయుడు(60), రాములు, విఠల్ అనే కూలీలు పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పైకప్పుకు ఉన్న సీకులను కట్ చేసి సమ్మెటలతో కొడుతూ భవనాన్ని కూల్చసాగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు జేసీబీని పిలిపించి శిథిలాలను తొలగించి కూలీలను బయటికి తీశారు. అయితే లక్ష్మయ్య అక్కడికక్కడే మర ణించగా.. వెంకటేశం, ముత్యాలునాయుడు చికిత్స పొందుతూ మరణించారు. రాములు, విఠల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతా వలస పక్షులే.. ఇక్కడ పనిచేస్తున్న కూలీలంతా వలస పక్షులే. పొట్టకూటి కోసం సొంత ఊరిని వదిలి గుండ్లపోచంపల్లికి వలస వచ్చినవారే. మెదక్ జిల్లా బండపోచారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య 25 ఏళ్ళ క్రితం గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరనారాయణ గ్రామానికి చెందిన ముత్యాలునాయుడు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలసి కొన్నేళ్ల క్రితం గుండ్లపోచంపల్లికి వలస వచ్చి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వెంకటేశం భార్య పార్వతి, కుమారుడు రాజు, కూతురు రత్నంతో కలసి ఇటీవలే గుండ్లపోచంపల్లికి వచ్చాడు. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భవనం కూలిన ఘటనలో లక్ష్మయ్య, ముత్యాలునాయుడు, వెంకటేశం మరణించడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. తీవ్ర గాయాలకు గురైన విఠల్, రాములు సైతం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామం నుండి వలస వచ్చినవారే. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్ భవనం కూల్చివేతలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఘటనాస్థలికి వచ్చి ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. మృతుల భార్యలకు వితంతు పింఛన్ మం జూరు చేయాలని అధికారులను ఆదేశించా రు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కాగా, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండా కూలీలతో పనులు చేయించి న భవన యజమాని శ్రీనివాస్‌గుప్తా, కాంట్రాక్టర్ రామయ్యపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
-
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: నగరంలోని నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గట్టు శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. మరోవైపు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ జగన్ సంతాపం భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
మృతుల వివరాలు ఇవీ..
నానక్‌రాంగూడ ప్రాంతంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతులను గుర్తించారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటలక్ష్మి (28), సాంబయ్య (38), గౌరి (18), పైడమ్మ (35). ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని రేఖ, ఆమె కొడుకు దీపక్‌గా గుర్తించారు. వీళ్లు కాక శిథిలాల కింద మరో ఏడుగురు చిక్కుకుని ఉన్నారు. వారిలో ఎందరు సజీవంగా ఉన్నారో ఇంకా తెలియాల్సి ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేఖ, ఆమె కుమారుడు దీపక్ -
ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం
-
మరో మృతదేహం వెలికితీత
-
బిల్డర్‌పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
-
మరో మృతదేహం వెలికితీత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, మరో 8మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా మృతులను శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరిగా గుర్తించారు. శివ తప్ప మిగతా వారంతా విజయనగరం జిల్లా వాసులుగా తేలింది. శిథిలాల కింద ఇరుక్కున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించగలిగింది. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు. ఎందుకు కూలిపోయింది? లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్ గుంత తీస్తుండడమే ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యజమాని గుడుంబా డాన్! నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూ సింగ్ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై సత్తూ సింగ్ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్ కుమారుడు అనిల్‌సింగ్ జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'
-
'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'
హైదరాబాద్: నానక్‌రాం గూడలో కుప్పకూలిన భవనానికి సరైన అనుమతులు లేవని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కూలిన భవనం అక్రమకట్టడం అని ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చామని మేయర్ తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని..భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చర్యలు తీసుకుంటామని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. -
బిల్డర్‌పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
హైదరాబాద్: నానక్‌రాం గూడలో భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం వెనుక సెల్లార్ కోసం తవ్వకాలు జరిపినందునే ఈ ప్రమాదం జరిగినట్లు హోం మంత్రి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భవన శిథిలాల కింద 12 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ అనే యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు వినిపిస్తుండటంతో పైపుల ద్వారా ప్రాణవాయువును పంపిస్తూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తక్కువ స్థలంలో ఆరు అంతస్థులతోపాటు పెంట్‌హౌస్ నిర్మించిన సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తుసింగ్పై అధికారులను బెదిరించిన ఘటనలకు సంబంధించి పలు పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. -
కుప్పకూలిన భవనం: పెరుగుతున్న మృతుల సంఖ్య
-
ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు శిథిలాల కింద నుంచి తమను రక్షించాలంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బాధితుల్లో బొబ్బిలికి చెందిన వాచ్ మెన్ సాంబయ్య, నేతేటి పైడమ్మ, వెంకటలక్ష్మీ, నారాయణమ్మ, పోలినాయుడు, మోహన్, దుర్గారావు, శంకర్లు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. జేసీబీల ద్వారా శిథిలాలను రెస్క్యూ టీం తొలగిస్తుంది. -
కూలిన బతుకులు
నగరంలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. 16 మంది మృతి చెందినట్లుగా అనుమానం నిర్మాణంలో ఉండగానే భారీ ప్రమాదం భవనంలోనే 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు! వేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు కేవలం 260 గజాల్లోనే ఏడంతస్తుల భవనం లోపభూయిష్టంగా, ఎలాంటి అనుమతులూ లేకుండానే నిర్మాణం భవన యజమాని సత్తూ సింగ్ పెద్ద గుడుంబా డాన్! సాక్షి, హైదరాబాద్ నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.. ఆ నిర్మాణంలోనే పనిచేస్తున్న పలువురు కూలీల కుటుంబాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరింత మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. భవన శిథిలాల కింద ఓ మహిళ, ఓ చిన్నారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో వారంతా భవనంలోనే ఉన్నారని, కొన్ని కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న అందరినీ కలచి వేస్తున్నాయి. ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు. ఎందుకు కూలిపోయింది? లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్ గుంత తీస్తుండడమే ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని సూచించారు. కారకులపై చర్యలు తీసుకుంటాం ‘‘అనుమతుల్లేని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొత్త బిల్డర్లు వచ్చి ఇష్టారాజ్యంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని వదిలిపెట్టం. అనుమతుల్లేని నిర్మాణా లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు..’’ –బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్ తక్షణ వైద్యసాయానికి చర్యలు ‘‘కూలిన భవనంలో చిక్కుకున్న క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు చర్యలు చేపట్టాం. సమీపంలోని ఆసుపత్రులను అప్రమత్తం చేసి అంబులెన్సులు రప్పించాం. వీలైనంతవ రకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం..’’ జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ యజమాని గుడుంబా డాన్! నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూ సింగ్ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై సత్తూ సింగ్ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్ కుమారుడు అనిల్‌సింగ్ జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మేయర్
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. వాచ్ మెన్ కుటుంబం, మరో నాలుగు కార్మికుల కుటుంబాలు ఇందులో నివసిస్తున్నాయి. బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నా ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు పర్మిషన్ ఐదు అంతస్తులకు తీసుకుంటే.. కట్టేది మాత్రం అంతకంటే ఎక్కువ అంతస్తులని, అధికారుల కళ్లుగప్పి అక్కడక్కడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఫిల్మ్ నగర్ సొసైటీలో ఇటీవల ఓ భవనం కూలిన ఘటనపై చర్యలు తీసుకోనందున ఇదే తరహాలో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిల్మ్ నగర్ సొసైటీ క్లబ్ వారికి ఇప్పటివరకూ మళ్లీ నిర్మాణం చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మేయర్ రాంమోమన్ మీడియాకు వివరించారు. -
మీరట్‌లో అక్రమ కూల్చివేతల్లో విషాదం
-
మీరట్‌లో అక్రమ కూల్చివేతల్లో విషాదం
మీరట్ : ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం నెలకొంది. మీరట్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో అక్రమంగా నిర్మించిన భవనాల తొలగింపు సందర్బంగా ఒక భవనం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. -
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
గుంటూరు (వినుకొండ) : వినుకొండ పట్టణంలోని కుమ్మరి బజార్లో ఓ నాలుగంతస్తుల భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఇల్లు ఒక వైపు ఒరిగినట్లు ఉండటంతో ఇంటి యజయాని రాజ్యం మంగళవారం ఉదయమే ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లర్ లేకుండా కట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇల్లు కూలి మరో మూడిళ్లపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
చెన్నైలో కూలిన 11అంతస్థుల భవనం
-
కూలిన11 అంతస్తుల భవనం : శిథిలాల్లో 50 మంది
చెన్నై: చెన్నైలో ఘోర ప్రమాదం సంభవించింది. మాన్‌గాడులో నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. శిథిలాల్లో 50 మంది వరకు కూలీలులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాలలో చిక్కుకున్న కూలీలు అందరూ తెలుగువారే. సాధారణంగా ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగువారే కూలీలుగా పని చేస్తుంటారు. వర్షం కురవడంతో భవనం పది అడుగుల లోపలకు కూరుకుపోయింది. భవనం కింద భూమి బలంగా లేనట్లు చెబుతున్నారు. 11 అంతస్తులు నిర్మించేందుకు అనుమతిలేకుండా ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇన్ని అంతస్తుల భవనం ఇంతకుముందు నిర్మించలేదు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. 15 అగ్నిమాపక దళాలు వచ్చి సహాయక చర్యలు చేస్తున్నారు. దాదాపు 200 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 21 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ భవనం నిర్మించే కాంట్రాక్టర్, యజమానులు అందుబాటులో లేరు. -
శిథిలాల నుంచి నాలుగు మృతదేహాలు వెలికితీత
న్యూఢిల్లీ ఇంద్రలోక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు నాలుగు మృతదేహలను వెలికి తీశారు. ఆ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హస్తినలోని ఇంద్రలోక్ ప్రాంతంలో శనివారం పురాతన భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ భవనంలో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరంగా చేశారు. -
మరొకటి నేలమట్టం
సాక్షి, ముంబై: ఠాణే సమీపంలోని కల్వా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భవనం కూలిపోయింది. అయితే పెళ్లి కారణంగా కొంతమంది మేలుకుని ఉండడంతో అందులో నివసిస్తున్న వారందరికీ పెనుగండం తప్పింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం భుసార్అలీ ప్రాంతంలో అన్నపూర్ణ అనే నాలుగు అంతస్తుల భవనం ఉంది. అందులో నివసిస్తున్న తెలంగే అనే వ్యక్తి ఇంట్లో సోమవారం ఉదయం పెళ్లి కార్యక్రమం ఉంది. దీంతో కుటుంబ సభ్యులందరూ మెలకువగా ఉన్నారు. ఇంతలో వారందరికీ ఏదో అలికిడి వినిపించింది. దీంతో కీడు శంకించిన వీరంతా ఆ భవనంలో అప్పటికి నిద్రావస్థలో ఉన్నవారిని మేలుకొలిపి నిద్రలేపి బయటకు వెళ్లాలంటూ బిగ్గరగా కేకలేశారు. దీంతో వారంతా భవనం నుంచి బయటికి వచ్చి కొద్దిదూరంలో నిలబడ్డారు. దీంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే భవనం కూలిపోవడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు. -
ఐదంతస్తుల భవనం నేలమట్టం
సాక్షి, ముంబై: ఠాణే ముంబ్రాలో బానో కాంప్లెక్స్‌లోని బానోపార్క్ అనే ఓ అయిదంతస్తుల భవనం శనివారం ఉదయం కుప్పకూలింది. రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో సాయంత్రం అయిదుగంటల వరకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తి మరణించగా, మరొక మహిళను సురక్షితంగా బయటికి తీశారు. మరణించిన వ్యక్తిని అనీస్ ఖాజీ (30)గా గుర్తించ గా ప్రాణాలతో బయటపడ్డ మహిళను షామీనా ఖురేషిగా గుర్తించారు. వారి ద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. ముంబ్రా రైల్వేస్టేషన్ సమీపంలోని జీవన్బాగ్ పరిసరాల్లో ఉన్న ఈ భవనంలో సుమారు 42 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏడు గంటలపాటు మృత్యువుతో పోరాటం.. భవనం కుప్పకూలిన తర్వాత షామీనా ఖురేషి శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఉదయం ఎనిమిది గంటలకు భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద ఇరుక్కుపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తూ ఏడు గంటలపాటు మృత్యువుతో పోరాడింది. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటికి తీయగలిగారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని కూడా ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. భవనం కూలిన సంఘటనలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బిల్డింగ్‌లో ప్రకంపనలతోపాటు శబ్దాలతో మట్టి కూలడం ప్రారంభమైంది. ఇది గమనించిన భవనంలో నివసించేవారందరూ తీవ్ర భయాందోళన లతో ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. అయితే ముందుగా కొంత మట్టి కూలడంతోపాటు శబ్దాలు రావడంతో అం దరూ బయటికి పరుగులు పెట్టడంతో భారీ ముప్పు తప్పిందని చెప్పవచ్చు. వారందరూ భవనంలోపలే ఉన్నట్టయితే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ సంఘటన అనంతరం పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిదేళ్ల కిందటే నిర్మాణం... బానోపార్క్ను తొమ్మిదేళ్ల కిందటే నిర్మించినట్లు తెలిసింది. స్థానికులు అందించిన వివరాల మేరకు 2005లో అఖిల్ షేఖ్ అనే బిల్డర్ బానో కాంప్లెక్స్‌ను నిర్మించాడు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం ఐదు భవనాలున్నాయి. వీటిలో ఒకటైన బానోపార్క్ శనివారం కూలిపోయింది. 2005లో ఈ భవన నిర్మాణాన్ని కేవలం ఒకటి రెండు నెలల్లోనే పూర్తి చేసినట్టు కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ భవనం నిర్మాణ సమయంలో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) నోటీసులు ఇవ్వడంతోపాటు రెండుసార్లు ఈ భవనంపై చర్యలు తీసుకుంది. ఒకసారి భవనాన్ని టీఎంసీ అధికారులు నేలమట్టం కూడా చేసినట్టు తెలిసింది. అయినప్పటికీ మళ్లీ ఈ భవనాన్ని పూర్తిచేశారు. నాసిరకం సామగ్రితో నిర్మాణం చేపట్టడమే ప్రస్తుత ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో బిల్డర్లు ఈ ఘటన అనంతరం ముంబ్రా పోలీసులు బిల్డర్ అఖిల్ శేఖ్, షకీల్ షేఖ్‌లను దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. -
భవనం కూలిన ఘటనపై విచారణ
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రిలో భవనం కుప్పకూలిన సంఘటనలో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. కూలిన భవనం స్థానే కొత్తది నిర్మించడంతో పాటు మృతులు ఆంజనేయులు, జస్వంత్ కుటుంబాల కు రూ.10 లక్షల వంతున పరిహారం చెల్లించాలన్నారు. ఇదంతా బిల్డర్ నుం చే వసూలు చేయాలని డిమాండ్ చేశా రు. బాధితులు కేవలం వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని, యజమాని మరణించడంతో ఆ కుటుంబం వీధిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ పసివాడు బలైపోయాడన్నారు. అవసరమైతే బాధితులకు మెరుగైన వైద్య సేవలు భవానీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విజయమ్మ దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం గుంటూరు వెళుతూ, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. సంఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా ప్రణాళికా విభాగం నగరంలో భవన నిర్మాణాల విషయంలో నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆదిరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శించారు. సంగటనపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను చర్యలు చేపడతానని, బాధితుల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. మరిన్ని ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సహాయక చర్యలు చేపట్టిన పోలీసు, ఫైర్ సిబ్బందిని ఆయన అభినందించారు