
ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఓ భవనం కుప్పకూలి ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అమరావతిలోని ప్రభాత్ సినిమా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. భవనం కూలిపోయిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.
ఇదీ చదవండి: తుపాకులతో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లిన దుండగులు