ఇది సమాజం.. తలదించుకునే పనులు చేయకండి: సీఎం ఫడ్నవీస్‌ వార్నింగ్‌ | Chief Minister Devendra Fadnavis React To Allahbadia Comments Row | Sakshi
Sakshi News home page

ఇది సమాజం.. తలదించుకునే పనులు చేయకండి: సీఎం ఫడ్నవీస్‌ వార్నింగ్‌

Published Mon, Feb 10 2025 2:17 PM | Last Updated on Mon, Feb 10 2025 3:26 PM

Chief Minister Devendra Fadnavis React To Allahbadia Comments Row

ముంబై : భారత్‌లో ప్రముఖ యూట్యూబర్‌, బీర్‌ బైసెప్స్‌గా పాపులర్‌ అయిన కంటెంట్‌  క్రియేటర్‌  రణవీర్  అలహాబాదియాకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఇది సమాజం.. తలదించుకునేలా వ్యవహరించకండి అని సీఎం ఫడ్నవీస్‌ హెచ్చరించారు. ఇంతకి ఏం జరిగిందంటే?

ఇండియాస్ గాట్ టాలెంట్‌లో యూట్యూబర్ రణ్‌వీర్  అలహాబాదియా నోరు జారారు. దీంతో  అలహాబాదియాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌లో రణ్‌వీర్  అలహాబాదియా ఓ కంటెస్ట్‌తో రాయలేని భాషలో ఓ జోకు వేశాడు. ఆ జోక్‌తో  అలహాబాదియాతో సహా పక్కనే ఉన్న గెస్ట్‌లు, న్యాయనిర్ణేతలు సైతం పగలబడి నవ్వారు.  ఆ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కామెంట్స్‌  చెలరేగింది. పలువురు న్యాయవాదులు సైతం  అలహాబాదియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 అలహాబాదియా చేసిన కామెంట్స్‌పై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు.‘ అలహాబాదియా చేసిన కామెంట్స్‌ గురించి నాకు సమాచారం అందింది. అయితే నేను ఆ వీడియోను చూడలేదు. చాలా అసభ్యకరంగా మాట్లాడారని, అలా మాట్లాడటం తప్పే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ మనం ఇతరుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి. ఎవరైనా వాటిని దాటితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. 

అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్‌ క్షమాపణలు

ఓ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా క్షమాపణలు తెలిపాడు. నెట్టింట పెద్దఎత్తున విమర్శలు రావడంతోపాటు ముంబయిలో పోలీసు కేసు నమోదు చేశారు. హద్దులు దాటినవారిపై చర్యలు తప్పవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ హెచ్చరించిన 
క్రమంలో రణ్‌వీర్‌ అలహాబాదియా క్షమాపణలకు చెప్పక తప్పలేదు.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement