జాక్‌పాట్: పైలట్‌తో వేలకోట్ల ఒప్పందం! | Mumbai pilot built aircraft gets maha government deal | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్: పైలట్‌తో వేలకోట్ల ఒప్పందం!

Published Tue, Feb 20 2018 6:58 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Mumbai pilot built aircraft gets maha government deal - Sakshi

పైలట్ అమోల్ యాదవ్

ముంబై: ఓ ప్రైవేట్ పైలట్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఏకంగా రూ.35,000 కోట్ల బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన అమోల్ యాదవ్ ఓ పైలట్. ఆయన థ్రస్త్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్నారు. సహ భాగస్వామిగానూ సేవలు అందిస్తున్నారు. 2016లో ముంబైలో జరిగిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్ (చిన్నసైజు విమానం) మోడల్‌ను పైలట్ అమోల్ ప్రవేశపెట్టారు. అమోల్ యాదవ్ సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందిస్తున్నారన్న విషయం ఆ ఈవెంట్ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది.

ఏడాది అనంతరం కేవలం తన ఇంటి టెర్రస్ మీదనే ఎయిర్‌క్రాఫ్ట్ కు కావలసిన విడి భాగాలను సమకూర్చుకున్నారు. 2017 నవంబర్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు యాదవ్ రూపొందించనున్న ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను అప్రూవ్ చేశారు. కానీ ఇప్పటివరకూ దాన్ని పరీక్షించలేదు. కొన్ని రోజుల్లో విడి భాగాలను అమర్చి ఎయిర్‌క్రాఫ్ట్ ను అందిస్తానని యాదవ్ ధీమాగా ఉన్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎయిర్‌క్రాఫ్ట్‌ను టెస్ట్ చేయున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పైలట్, కంపెనీ సభభాగస్వామి అయిన అమోల్ యాదవ్‌ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భారీ ఒప్పందం చేసుకున్నారు.

పాల్ఘర్ జిల్లాలోని కెల్వే ప్రాంతంలో ఎయిర్‌క్రాఫ్ట్స్‌ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ఆరుసీట్ల సామర్థ్యం ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లు రూపొందించేందుకు థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్‌మెంట్‌తో వేలకోట్ల ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాల్ఘర్ ని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఫడ్నవీస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం ముడిసరుకు, ఇతరత్రా సౌకర్యాలను కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

           
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement