Palghar
-
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
రైలుకు ఎదురెళ్లి తండ్రికొడుకుల...
ముంబయి: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో పాపం.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం(జులై 8) ఉదయం 9.30 గంటలకు దూసుకొస్తున్న లోకల్ రైలుకు ఎదురుగా నిల్చొని ప్రాణాలు వదిలారు. ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ట్రాక్‌పై నిల్చున్నపుడు రైలు వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతి చెందిన వారిలో తండ్రి హరీశ్ మెహతా(60), కొడుకు జే(35)గా గుర్తించారు. తండ్రి, కొడుకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహారాష్ట్రలో మరో మూక దాడి.. యువకుడు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో 23 ఏళ్లు యువకుడిని సామూహికంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే నలసోపారాలోని వెలై పాడా ప్రాంతంలో 10 మంది గుంపుగా చేరి విజయ్ అలియాస్ అభిషేక్ జోగిందర్ సోనీ బంధించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో విజయ్ అక్కడ సంచరిస్తున్నాడని ఆరోపిస్తూ, కర్రలతో విజయ్‌పై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా పాల్ఘర్లో మూక హత్యల ఉదంతం వెలుగు చూసింది. నాటి ఘటనలో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్ హతమయ్యారు. 2020, ఏప్రిల్ 16న పాల్ఘర్ జిల్లాలోని గడ్చించలేలో ఇద్దరు సాధువులను, వారి కారు డ్రైవర్‌ను దొంగలుగా అనుమానించిన స్థానికులు మూకుమ్మడిగా వారిపై దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 201 మందిని అరెస్టు చేశారు. -
Kiran Kamdar: కిచిడీ బామ్మ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది. అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్‌పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.కిచిడి ముద్దపాల్ఘర్లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్‌ని కలిసి ‘నేను మీ హాస్పిటల్‌లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్డీ బ్యాంక్’ ఆలోచన.రోజూ 100 మందిఅంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.అదే వైద్యంపార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్లా చిరాయువు పొందుతారు. -
రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
ముంబై: మహారాష్ట్ర పాల్ఘర్లో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై గుంతను తప్పించబోయిన ఓ కారు ముందున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఫంక్షన్‌కు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు వాగన్ఆర్. పాల్గర్లోని చరోతి సమీపంలో ఉన్న బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతులను నరోత్తమ్ ఛనా రాథోడ్(65), కేతన్ నరోత్మ రాథోడ్(35), ఏడాది బాలుడు ఆర్వి దీపేశ్ రాథోడ్‌గా గుర్తించారు. వీరంతా భిలాడ్‌లో ఓ శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గాయపడ్డ నలుగురిని వేదాంత ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వృద్ధ మహిళలే టార్గెట్.. హత్యలతో హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్ -
పాల్ఘర్లో మరో విమానాశ్రయం..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాల్ఘర్లో మరో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముంబైలోని విమానాశ్రయం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండగా, నవీ ముంబైలో నిర్మిస్తున్న విమానాశ్రయం కూడా భవిష్యత్ అవసరాలను తీర్చలేదని, అందుకే పాల్ఘర్లో మూడో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కరోనా కోరల్లో నలుగుతున్న సమయంలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు విధానపరమైన నిర్ణయాలెన్నో తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ‘పర్యటన్ పరిషద్’అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముంబైలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 50 మీటర్ల వరకు నిర్ధారించామని, కొంకణ్ ప్రాంతం విషయంలో కూడా జనవరి వరకు శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ముంబై, ఠాణే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, మరాఠ్వాడా, విదర్భతో సహా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరిచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముంబైతో పోల్చితే పాల్ఘర్లో మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉందని, కాబట్టి ఈ ప్రాంతం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ముంబై, నవీ ముంబైలోని విమానాశ్రయాల సేవలు సరిపోవని, అందుకే పాల్ఘర్లో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక విమానాశ్రయాన్ని నిర్మించేందుకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు 24 గంటల పాటు తెరిచే ఉంటున్నాయని, దాంతో ఆయా నగరాలు, ప్రభుత్వాల ఆదాయం పెరిగిందని చెప్పారు. ముంబైలో కాల్‌సెంటర్ లాంటి వ్యాపారాలు 24 గంటలు కొనసాగుతున్నాయని, కానీ, హోటల్స్ మూసివేయడం వల్ల ఆ సంస్థల్లో పనిచేసేవారికి రాత్రిపూట ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముంబై విశ్వనగరంగా మారి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రకృతి, సాగర తీరం, గడీలు, ఖిల్లాలు, ఆరోగ్య, ధార్మిక రంగాలకు చెందిన పలు పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని, ఆయా ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఉత్పత్తి రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అదేవిధంగా సేవారంగంలోనూ అభివృద్ధి సాధించి ఉపాధి అవకాశాల్ని పెంచాలని పేర్కొన్నారు. పర్యాటక, హోటల్ రంగాలకు కావాల్సిన అనుమతులను 80 నుంచి 10కి తగ్గించామని, ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాలీవుడ్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ పర్యాటకాన్ని పెంచేందుకు ద్రాక్ష, సంత్ర లాంటి తోటల్లో మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసే విధానాన్ని రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
బంగారు చేప: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు
Ghol Fish Price In Mumbai: నీలి విప్లవంతో మత్య్సకారుల బతుకులు కొంత బాగుపడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో మత్స్యకారులు బిజీగా మారారు. ఇలా చేపలు పడుతూ ఒక్కరోజే ఏకంగా కోటీశ్వరుడిగా ఓ వ్యక్తి మారాడు. ఆయన పట్టిన చేపలు అరుదైనవి.. పైగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో విపరీతమైన డిమాండ్ వచ్చింది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తులు భారీ ధరకు ఆ చేపలను కొనుగోలు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం) మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన చంద్రకాంత్ థారె మత్స్యకారుడు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని రోజులుగా నిలిపివేసిన చేపల వేటను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో చంద్రకాంత్ ఆగస్టు 28వ తేదీన సముద్ర తీర ప్రాంతం వద్వాన్‌కు హర్బా దేవీ బోటులో తన బృందంతో కలిసి వెళ్లాడు. చేపల వేట సాగించగా పెద్ద ఎత్తున చేపలు పడ్డాయి. వాటిలో సముద్రపు బంగారంగా పిలిచే అత్యంత అరుదుగా లభించే చేపలు ‘గోల్ ఫిష్’ భారీగా పడ్డాయి. 157 చేపలు పడడంతో వాటిని తీసుకుని వచ్చాడు. మార్కెట్‌కు తీసుకెళ్లగా ఆ చేపలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యాపారస్తులు ఆ చేపలను ఏకంగా 1.33 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్కో చేప విలువ రూ.85 వేల దాక పలికింది. అంతగా ఆ చేపను కొనుగోలు చేయడానికి కారణం ఉంది. ఆ చేపల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.గోల్ ఫిష్ చేప శాస్త్రీయ నామం ‘ప్రొటనిబి డయాకాంతస్’. ఈ చేపకు హంకాంగ్, మలేసియా, థాయిలాండ్, ఇండోనేసియా, సింగపూర్, జపాన్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా అరుదుగా లభించే ఈ చేపను వైద్య పరిశోధనలకు వినియోగిస్తారు. పైగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చేప. ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆ చేపలు అంతగా లభించడం లేదు. -
తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తోంది: ఎంపీ
ముంబై : పాల్ఘర్ ఎంపీ రాజేంద్ర గేవిట్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎంపీకి చెందిన గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ మహిళ శుక్రవారం నవ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆర్థిక సహాయం చేస్తానంటూ ఎంపీ గేవిట్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. గత నవంబర్‌లో తోటి సిబ్బంది ముందే తనను వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ఇంకా ఆ ఫిర్యాదులో .. ‘‘నేను ఎంపీ గేవిట్, ఆయన భార్యకు చెందిన గ్యాస్ ఏజెన్సీలో 2004నుంచి పనిచేస్తున్నాను. అంతంత మాత్రంగా ఉన్న నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని జీతం పెంచుతానంటున్నాడు. తనకు సహకరిస్తే దానికి ప్రతిఫలంగా ఏం అడిగినా చేస్తానన్నాడు. ఓ ఫ్లాట్, నా కుమారుడి చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తానన్నాడు. ( పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు) నేను కుదరదని చెబుతూ వచ్చాను. ఆ తర్వాత చాలా రకాలుగా నన్ను వేధింపులకు గురిచేశాడు’’ అని తెలిపింది. అయితే, ఎంపీ గేవిట్ సదరు మహిళ చేస్తున్న లైంగిక ఆరోపణలను ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఆ మహిళతో పాటు మరి కొంతమంది 1.24 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారు. దీంతో నేను నవంబర్ 26వ తేదీ అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. దీంతో ఆమె నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తోంది. నేను ఏ విచారణనైనా ఎదుర్కోవటానికి సిద్ధం’’ అని అన్నారు. -
పాల్ఘర్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
పాల్ఘర్ : మహారాష్ర్టలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు మరణించారు. గతరాత్రి జరిగిన ఈ పేలుడు ఘటనలో మరో నలుగరు తీవ్రంగా గాయపడగా, ఆ సమయంలో 20 మంది కార్మికులు ఫ్యాక్టరీ లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలను ముమ్మరం చేయడంతో ప్రాణహాని తగ్గిందని అధికారులు అంచనా వేశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. (ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు) కర్మాగారంలో సుగంధ రసాయనాలు, ఔషదాలును తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. రియాక్టర్ పేలుడు శబ్ధం దాదాపు 10 కిలోమీటర్ల దాకా వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే రియాక్టర్లో నీటి పీడనం పెరగడం వల్ల పేలుడు సంభవించిందని ప్లాంట్‌లోని సందీప్ సింగ్ అనే ఆపరేటర్ పోలీసులకు తెలిపారు. ఈ ఏడాది ఎంఐడిసి ప్రాంతంలో జరిగిన రెండో పేలుడు ఇదేనని అధికారులు తెలిపారు. కంపెనీ ఉపయోగించే కొన్ని రసాయనాలు ప్రమాదకరమైనవిగా గుర్తించారు. ఇదే యూనిట్లో గతంలోనూ ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వివరించారు. (విచారణకు సిట్ ఏర్పాటు) -
పాల్ఘర్ ఘటన మరువకముందే..
ముంబై : మహారాష్ట్రలోని నాంధేడ్ తాలూకాలోనిఓ ఓ ఆశ్రమంలో ఇద్దరు సాధువులు శనివారం రాత్రి విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. మరణించిన సాధువును బాలబ్రహ్మచారి శివాచార్యగా గుర్తించారు. అదే ఆశ్రమంలో ఆయన శిష్యుడు భగవాన్ షిండే మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలోని ఇంటి బాత్రూం సమీపంలో ఇద్దరు సాధువుల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. పాల్ఘర్ జిల్లా గడ్చించాలె గ్రామం వద్ద గత నెలలో ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్ మూక హత్యకు గురైన అనంతంరం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిందితులు దోపిడీకి మఠంలోకి ప్రవేశించగా అడ్డుకున్న సాధువులను కేబుల్ వైర్‌తో గొంతు బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను కారు డిక్కీలో దాచి అక్కడినుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా కారు మఠం గేటును ఢీకొనడంతో స్ధానికులు అక్కడి చేరుకుంటారనే భయంతో కారుతో సహా మృతదేహాలను అక్కడే ఉంచి నిందితులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఈ కేసులో నిందితుడిని నిర్మల్ జిల్లా తానూరులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేయడంతో స్పందించిన స్ధానిక ఎస్ఐ రాజన్నఅనుమానాస్పదంగా కనిపిస్తున్న హంతకుడిని అదుపులోకి తీసుకుని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. డబ్బు, నగల కోసం తాను ఈ హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. చదవండి : మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి -
సాధువుల హత్యకేసు; లాయర్ మృతి
ముంబై : పాల్గర్ జిల్లా మూకదాడి కేసులో హత్యకు గురైన సాధువుల తరపున వాదిస్తున్న జూనియర్ న్యాయవాది దిగ్విజయ్ త్రివేది బుధవారం రోడ్డు ప్రమదంలో మరణించారు. ఈ కేసు విషయమై కోర్టుకు వెళుతున్న ఆయన ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో దిగ్విజయ్‌తో పాటు ఓ మహిళ కూడా ఉంది. అయితే లాయర్ త్రివేది అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలతో ఆమెను ఆసుపత్రిలో చేర్చించారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య ) కారు ప్రమాదంపై బీజేపీ నాయకుడు సంబిత్ పత్రా అనుమనాలు వ్యక్తం చేశారు. పాల్గర్ మూకదాడి కేసులో సాధువుల తరుపున వాదిస్తున్న లాయర్‌పై ఎవరైనా కుట్ర పన్ని ఈ ఘాతానికి తెగ బడ్డారా లేక ఇది యాదృచ్ఛికమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇది వరకే ఫాల్గర్ కేసును లేవనెత్తిన వారిపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ప్రమాదంపై ఆర్టీఓ నుంచి నివేదిక వచ్చాకే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని పాల్గర్ కేసులో త్రివేదితో పాటు వాదిస్తున్న మరో లాయర్ పిఎన్ ఓజా పేర్కొన్నారు. (101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు ) ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ముగ్గురు సాధువులు హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పాల్గార్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం మీదుగా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు సాధువులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో సాధువులను ఉద్దేశ పూర్వకంగానే చంపేసినట్లు బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా ) -
సీఎం యోగికి ఉద్ధవ్ ఫోన్.. అందుకేనా?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వెలిబుచ్చారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్లో మాట్లాడాను. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వ్యక్తపరిచాను. మేము మీతో ఉంటామని ఆయనతో చెప్పాను. ఇలాంటి కేసులో మేము వ్యవహరించినట్టుగానే కఠినంగా ఉండాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సూచించాను. దీనికి మతం రంగు పూయొద్దని కోరాన’ని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా, సాధువుల హత్యపై యూపీ సీఎంకు ఠాక్రే ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలోని పాల్గాఢ్ జిల్లాలో సాధువుల హత్య జరిగిన సందర్భంలో ఉద్ధవ్‌కు సీఎం యోగి ఫోన్ చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయనకు సూచించారు. సరిగ్గా ఇదేవిధంగా ఇప్పుడు ఆదిత్యనాథ్‌కు ఠాక్రే ఫోన్ చేశారు. పాల్గాఢ్ ఘటనకు మతం రంగు పూయాలని బీజేపీ నాయకులు ప్రయత్నించగా ఉద్ధవ్ సర్కారు సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల ఫోన్ సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన సీనియర్ సంజయ్ రౌత్ కూడా బులందర్‌షహర్ సాధువుల హత్యకు మతం రంగు పులమకుండా జాగ్రత్త పడాలని ట్విటర్లో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బులందర్‌షహర్ జిల్లా పగోనా గ్రామంలోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. (దేవుడు కోరాడనే సాధువులను చంపేశా) -
ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశారు. గత వారం రాష్ట్రంలోని పాల్గాఢ్ జిల్లాలో చోటుచేసుకున్న మూక హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 100 మందిని అరెస్టు చేశారని తెలిపారు. ‘‘ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో కొంత మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు’’అని హోం మంత్రితో పేర్కొన్నారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య) కాగా పాల్గాడ్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్(35), వారి డ్రైవర్ నీలేశ్ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో బాధితులకు తప్పక న్యాయం చేస్తామంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన అధినేతకు విజ్ఞప్తి చేశారు.(మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా..: యోగి) -
సముద్ర తీరాన సరదా; భయానక అనుభవం
సముద్ర తీరాన సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ బృందానికి భయానక అనుభవం ఎదురైంది. కారుతో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేద్దామనుకున్న వారు ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు. చివరికి స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కొంతమంది వ్యక్తులు కారులో సముద్ర తీరానికి వచ్చారు. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కారుతో వివిధ రకాల విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో కారు ఇసుకలో చిక్కుకుపోయింది. ఇంతలోనే భారీ అలలు వారిని ముంచెత్తాయి. దీంతో కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించినప్పటికీ అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో.. వారు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ కాసేపటి తర్వాత అలల ఉధృతి తగ్గడంతో సమీపంలో ఉన్న ట్రాక్టరు సహాయంతో కారును బయటికి తీశారు. -
డిప్రెషన్‌తో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి ఆత్మహత్య
ముంబై : మహారాష్ట్రాలోని పాల్గర్ జిల్లాలో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. జెట్ ఎయిర్వేస్లో పని చేసే సీనియర్ టెక్నీషియన్ శైలేష్ సింగ్(45) నల్సోపోరాలో తాను నివాసముంటున్న నాలుగంతస్తుల బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శైలేష్ సింగ్ క్యాన్సర్‌తో బాధపడేవారని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా శైలేష్ తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిప్రెషన్లో ఉండేవారని సహోద్యోగులు తెలిపారు. క్యాన్సర్ కారణంగా తరుచు కీమోథెరపీ చేపించుకోవాల్సి వచ్చేదని, ఇటీవల కాలంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవ్వడంతో డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. జెట్‌ఎయిర్‌వేస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు జీతాలు అందక చాలా రోజులుగా ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన జెట్ ఎయిర్‌లైన్ దిగ్గజం బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 మంది భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో 16,000 మంది డైరెక్ట్ ఉద్యోగులు కాగా, మరో 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. -
మాజీ ప్రియురాలిపై యువకుడి ఘాతుకం
సాక్షి, ముంబై : మాజీ ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు... పాల్గఢ్లో జిల్లాలోని బైసార్ గ్రామానికి చెందిన ఫైజల్ సైఫీ(23) అనే యువకుడు ప్రేమించాలంటూ గతంలో ఓ యువతి వెంటపడ్డాడు. ఈ క్రమంలో అతడి ప్రేమను అంగీకరించిన సదరు యువతి క్రమేణా సైఫీ ప్రవర్తనలో మార్పు రావడంతో అతడికి దూరంగా ఉంది. దీంతో వారిద్దరు 2017లో విడిపోయారు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్న సైఫీ.. గతంలో తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కాగా తన బెదిరింపులకు సదరు యువతి లొంగకపోవడంతో తాను చెప్పిన చోటుకు వస్తే ఫొటోలు, వీడియోలను డెలీట్ చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆమె ఆదివారం సైఫీతో పాటు బయల్దేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లిన దుండగుడు.. అక్కడే బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 24 గంటల తర్వాత ఆమెను విడిచిపెట్టడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో పోలీసులు సైఫీని అరెస్టు చేశారు. -
ఈసీకి శివసేన లేఖ
సాక్షి, ముంబై: పాల్ఘడ్ లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓటర్లకి డబ్బులు పంచుతుందని శివసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార బలంతో బీజేపీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. బీజేపీ ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తోంది. బీజేపీ అభ్యర్థి రాజేందర్ రావిట్‌ను అనర్హుడిగా ప్రకటించాలి’ అని శివసేన ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది. బీజేపీ డబ్బులు పంచడం తమ కార్యకర్తలు చూశారని, ఎన్నికల సంఘం అధికారుల తనిఖీలో కూడా బీజేపీ నేతలు పట్టబడ్డారని శివసేన ఎమ్మెల్యే అమిత్ ఘోడా ఆరోపించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శివసేన, బీజేపీ ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కుటమి నుంచి బయటకు వచ్చిన శివసేన పాల్ఘడ్ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వురుగా అభ్యర్థులను నిలిపిన విషయం తెలిసిందే. -
జాక్‌పాట్: పైలట్‌తో వేలకోట్ల ఒప్పందం!
ముంబై: ఓ ప్రైవేట్ పైలట్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఏకంగా రూ.35,000 కోట్ల బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన అమోల్ యాదవ్ ఓ పైలట్. ఆయన థ్రస్త్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్నారు. సహ భాగస్వామిగానూ సేవలు అందిస్తున్నారు. 2016లో ముంబైలో జరిగిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్ (చిన్నసైజు విమానం) మోడల్‌ను పైలట్ అమోల్ ప్రవేశపెట్టారు. అమోల్ యాదవ్ సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందిస్తున్నారన్న విషయం ఆ ఈవెంట్ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది. ఏడాది అనంతరం కేవలం తన ఇంటి టెర్రస్ మీదనే ఎయిర్‌క్రాఫ్ట్ కు కావలసిన విడి భాగాలను సమకూర్చుకున్నారు. 2017 నవంబర్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు యాదవ్ రూపొందించనున్న ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను అప్రూవ్ చేశారు. కానీ ఇప్పటివరకూ దాన్ని పరీక్షించలేదు. కొన్ని రోజుల్లో విడి భాగాలను అమర్చి ఎయిర్‌క్రాఫ్ట్ ను అందిస్తానని యాదవ్ ధీమాగా ఉన్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎయిర్‌క్రాఫ్ట్‌ను టెస్ట్ చేయున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పైలట్, కంపెనీ సభభాగస్వామి అయిన అమోల్ యాదవ్‌ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భారీ ఒప్పందం చేసుకున్నారు. పాల్ఘర్ జిల్లాలోని కెల్వే ప్రాంతంలో ఎయిర్‌క్రాఫ్ట్స్ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ఆరుసీట్ల సామర్థ్యం ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లు రూపొందించేందుకు థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్తో వేలకోట్ల ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాల్ఘర్ ని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఫడ్నవీస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం ముడిసరుకు, ఇతరత్రా సౌకర్యాలను కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
భూమికోసం వివస్త్రను చేసి మహిళపై దాడి
పాల్ఘర్: భూతగాదా నేపధ్యంలో పాలఘర్ లో 45 ఏళ్ల మహిళపై ఐదారుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆమెను వివస్త్రను చేసి హింసించి, లైంగికంగా వేధించి, దారుణంగా కొట్టారు. దాడికి పాల్పడినవారిలో నరేశ్ దోడి అనే కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిసర్ అనే మండలంలోని దాండి పాడా అనే గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళకు కొంత భూమి ఉంది. దీనిని డెవలప్ మెంట్ కు ఇవ్వాల్సిందిగా నరేశ్ దోడీ అడగగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను జుట్టుపట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డుపైనే అందరు చూస్తుండగా చిత్రహింసలు పెట్టారు. కర్రలతో బాదారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆమె ఆరు నెలల కిందటే ఆ భూమిని నరేశ్ దోడీ నుంచి కొనుగోలు చేయగా దానిని తనకే అభివృద్ధి చేసేందుకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడట. -
కొత్తజిల్లాకు పచ్చజెండా
సాక్షి, ముంబై: సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు ఠాణే జిల్లా విభజనకు కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో 36వ జిల్లాగా పాల్ఘర్ ఆవిర్భవించనుంది. కొత్తగా ఏర్పడనున్న ఈ జిల్లాలో ఎనిమిది తాలూకాలుంటాయి. పాల్ఘర్, జవహర్, మొఖాడా, తలసారి, వసయి, వాడా, డహణు, విక్రమ్‌గఢ్ తాలూకాలు పాల్ఘర్ జిల్లాలో ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇక ఠాణే జిల్లా ఏడు తాలూకాలకే పరిమితం కానుందని, ఠాణే, కల్యాణ్, అంబర్నాథ్, ఉల్హాస్నగర్, భివండీ, ముర్బాద్, షాహాపూర్ తాలూకాలు ఠాణే జిల్లాలో ఉండనున్నాయని, పాల్ఘర్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు కేటాయించనుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు కానున్న పాల్ఘర్ జిల్లా ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండున్నర నెలల సమయం పడుతుందన్నారు. జిల్లాల విభజన అంశం శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినా మిగతా జిల్లాల విభజన జోలికి పోకుండా కేవలం ఠాణే జిల్లా విభజనకే సమావేశాలను పరిమితం చేశారని, ఇతర నిర్ణయాలేవీ తీసుకోలేదన్నారు. ఉపాధి హామీ పథకం అమలు మంత్రి నితిన్ రావుత్ ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో లేవనెత్తగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుపరిపాలనకు మార్గం సులభం... కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో పాల్ఘర్ పరిసర తాలూకాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఇప్పటిదాకా ఏ అవసరం పడినా జిల్లా కేంద్రమైన ఠాణే వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా పాల్ఘర్లోనే అన్ని అవసరాలు తీరే అవకాశముంది. పైగా ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు రూ. 450 కోట్లు కేటాయించనుండడంతో పాల్ఘర్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల స్వరూపమే మారిపోయే అవకాశముంది. ఠాణే జిల్లాను విభజించాల్సిన అవసరం ఎంతైన ఉందని 1985లో అప్పటి ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పటి నుంచి శాసనసభ ఎన్నికలు సమీపించగానే ఈ అంశం తెరమీదకు వచ్చేది. ఆ తరువాత అటకెక్కేది. కాని ఠాణే జిల్లాకు వలసలు పెరిగిపోవడం, ఉపాధి కారణంగా జనాభా విపరీతంగా పెరిగిపోవడం మొదలైంది. దీంతో 9,558 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ జిల్లాను విభజించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అనేక ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు జరిగాయి. కొందరైతే దీన్ని మూడు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం రాష్ట్రప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకొని 2013 మే ఒకటో తేదీ వరకు విభజిస్తామని ప్రకటించింది. కాని కాంగ్రెస్, మిత్రపక్షమైన ఎన్సీపీ మధ్య నెలకొన్న విభేదాల కారణంగా విభజన అంశం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత 2014 ఆగస్టు 15లోపు ఠాణేను విభజించి తీరుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. దీంతో విభజన ప్రక్రియ పనులు వేగం పుంజుకున్నాయి. ఇదిలావుండగా సభాపతి శివాజీరావ్ దేశ్‌ముఖ్ అధ్యక్షతన ఇటీవలే అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్కరించడంతో మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్ సమావేశంలో విభజన ప్రక్రియకు ఆమోదముద్రవేశారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన ప్రక్రియను ఏ రాజకీయ పార్టీ అడ్డుకునే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో త్వరలో పాల్ఘర్ 36వ జిల్లాగా అవతరించనుంది. కాగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో విభజన కీర్తి దక్కించుకునేందుకు అధికార పార్టీలు, ప్రతిపక్షం ప్రచార సభల్లో పోటీ పడనున్నాయి. రైతుల విద్యుత్ బకాయిలు సగం మాఫీ: సర్కార్ విద్యుత్ బకాయిల విషయంలో రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు రైతుల విద్యుత్ బిల్లులో సగం మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా సగం చెల్లించినవారు ఇకపై చెల్లించనక్కరలేదని, అసలు చెల్లించనివారు సగం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిమానాలతో కలిపి వర్తిస్తుందని, చెల్లించలేని స్థితిలో ఉన్నవారు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలపాటు మూడు వాయిదాల్లో చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రా న్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే ఆరోపించారు.