రైలుకు ఎదురెళ్లి తండ్రికొడుకుల... | Father-Son Duo At Railway Track | Sakshi
Sakshi News home page

రైలుకు ఎదురెళ్లి తండ్రికొడుకుల...

Jul 10 2024 7:23 AM | Updated on Jul 11 2024 12:14 PM

Father-Son Duo At Railway Track

మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం​ కష్టం వచ్చిందో పాపం.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

ముంబయి: మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.  ఏం​ కష్టం వచ్చిందో పాపం.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం(జులై 8) ఉదయం 9.30 గంటలకు దూసుకొస్తున్న లోకల్‌ రైలుకు ఎదురుగా నిల్చొని ప్రాణాలు వదిలారు. 

ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ట్రాక్‌పై నిల్చున్నపుడు రైలు వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతి చెందిన వారిలో తండ్రి హరీశ్‌ మెహతా(60), కొడుకు జే(35)గా గుర్తించారు. తండ్రి, కొడుకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement