![Father Suicide Along With Son Hanamkonda - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/2/CrimeNews.jpg.webp?itok=tbwKCK0J)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కాజీపేట: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ తండ్రి.. కుమారుడిని పాఠశాలలో దించివస్తానని వెళ్లి వడ్డెపల్లి ట్యాంక్‌బండ్ రిజర్వాయర్‌లో కొడుకుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలో శనివారం వెలుగులోకి వచ్చింది. వరంగల్ నగరంలోని కనకదుర్గ కాలనీకి చెందిన శిలమంతుల రవీందర్ (35) రెండేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్స తీసుకుంటున్నాడు.
శుక్రవారం ఉదయం కుమారుడు శ్రీచరణ్ (7)ను పాఠశాలలో దించి వస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన రవీందర్ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో భార్య దివ్య భర్త, కుమారుడు కనిపించట్లేదంటూ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం వడ్డెపల్లి ట్యాంక్‌బండ్‌లో రెండు మృతదేహాలు తేలినట్లు అందిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దివ్యను పిలిపించగా అవి భర్త, కుమారుడివేనని ఆమె గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment