
సాక్షి,నిజామాబాద్ జిల్లా:జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో శనివారం(అక్టోబర్5) విషాదఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోని అప్పుల పాలు కావడంతో తల్లి తండ్రితో పాటు హరీష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.
కొడుకు హరీష్ ఆన్‌లైన్‌లో రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం.ఈ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు పొలం కూడా అమ్మారని, అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
Comments
Please login to add a commentAdd a comment