ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య | Man Murdered Due To Extra Marital Affair Of His Wife In Vikarabad Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య

Published Sat, Oct 5 2024 8:31 AM | Last Updated on Sat, Oct 5 2024 10:19 AM

Man Murdered Due to Extra Marital Affair

నలుగురు నిందితులకు రిమాండ్‌  

పరారీలో నిందితురాలు 

కేసు వివరాలు వెల్లడించిన సీఐ, ఎస్‌ఐ   

ధారూరు: ఓ వివాహిత ఇద్దరు ప్రియులతో నెరపిన వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలీ తాలూకా కుంచావరం పీఎస్‌ పరిధిలోని జడి మల్కాపూర్‌ జలపాతం వద్ద చోటు చేసుకుంది. ధారూరు సీఐ భీంకుమార్, కోట్‌పల్లి ఎస్‌ స్రవంతి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలం కౌంకుట్ల గ్రామానికి చెందిన అనితకు 15 ఏళ్ల క్రితం కోట్‌పల్లి మండలం అన్నాసాగర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈమె వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఏడాది క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

అన్నాసాగర్‌కు చెందిన శ్రీకాంత్‌(27), చౌట మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో అనిత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌ ఇద్దరినీ చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. వివాహితుడైన శ్రీకాంత్‌ను వదిలించుకోవాలని భావించిన అనిత మనల్ని చంపేస్తానంటున్నాడని మల్లేశంకు చెప్పింది. దీంతో మల్లేశం తన మిత్రులైన జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, కోట్‌పల్లికి చెందిన అంజప్పతో కలిసి శ్రీకాంత్‌ హత్యకు పథకం వేశారు. సెప్టెంబర్ 25న శ్రీకాంత్‌ను అనిత, మల్లేశం అతని మిత్రులు లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు.

తమ కారులో అందరూ కలిసి జడి మల్కాపూర్‌ జలపాతానికి చేరుకున్నారు. శ్రీకాంత్‌కు ఫుల్‌గా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు ఎస్‌ స్రవంతి దర్యాప్తు చేపట్టారు. కోట్‌పల్లి బందయ్య సమాచారం మేరకు అనుమానితులైన మల్లేశం అతని మిత్రులు మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, అంజప్పలను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను జలపాతం వద్దకు తీసుకెళ్లి శవం వెతికించినా వరద ప్రవహానికి లభ్యమవ్వలేదు. అనిత పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement