ముంబై : మహారాష్ట్రలోని నాంధేడ్ తాలూకాలోనిఓ ఓ ఆశ్రమంలో ఇద్దరు సాధువులు శనివారం రాత్రి విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. మరణించిన సాధువును బాలబ్రహ్మచారి శివాచార్యగా గుర్తించారు. అదే ఆశ్రమంలో ఆయన శిష్యుడు భగవాన్ షిండే మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలోని ఇంటి బాత్‌రూం సమీపంలో ఇద్దరు సాధువుల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.
పాల్ఘర్ జిల్లా గడ్చించాలె గ్రామం వద్ద గత నెలలో ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్ మూక హత్యకు గురైన అనంతంరం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిందితులు దోపిడీకి మఠంలోకి ప్రవేశించగా అడ్డుకున్న సాధువులను కేబుల్ వైర్‌తో గొంతు బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను కారు డిక్కీలో దాచి అక్కడినుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా కారు మఠం గేటును ఢీకొనడంతో స్ధానికులు అక్కడి చేరుకుంటారనే భయంతో కారుతో సహా మృతదేహాలను అక్కడే ఉంచి నిందితులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు.
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ఈ కేసులో నిందితుడిని నిర్మల్ జిల్లా తానూరులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేయడంతో స్పందించిన స్ధానిక ఎస్‌ఐ రాజన్నఅనుమానాస్పదంగా కనిపిస్తున్న హంతకుడిని అదుపులోకి తీసుకుని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. డబ్బు, నగల కోసం తాను ఈ హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment