seer
-
జైనముని హత్య.. అట్టుడుకుతున్న కర్ణాటకం
శివాజీనగర(కర్ణాటక): బెళగావి జిల్లా చిక్కోడి వద్ద ఉన్న నంది ఆశ్రమం జైనముని కామకుమార నంది హత్యపై సోమవారం విధానసౌధలో ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. విధానసభ మొదలు కాగానే బీజేపీ నేత బసవరాజ బొమ్మై వాయిదా తీర్మానం కింద జైనముని హత్యపై చర్చించాలని స్పీకర్ యూ.టీ.ఖాదర్‌కు విన్నవించారు. చివరకు జీరో అవర్‌లో చర్చ ఆరంభమైంది. బీజేపీ సభ్యులు అభయ్ పాటిల్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్, శశికళా జొల్లె తదితరులు మాట్లాడుతూ జైనముని హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చరిత్రలోనే మునుపెన్నడూ జరగని సంఘటన ఇదని అన్నారు. జైన సముదాయానికి భంగం వాటిల్లింది, పోలీసులు సక్రమంగా విచారణ జరపలేరు, సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. హత్యలో తొలి నిందితుడైన నారాయణ మాళియను అరెస్ట్ చేసి, రెండో నిందితుడు హసేన్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మణ సవది ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు మరణశిక్ష విధించాలన్నారు. డబ్బు కోసమే హత్య జరిగిందనేది అవాస్తవమని వీరందరూ అన్నారు. జైనముని హత్య జరిగి మూడు రోజులు గడిచినా కూడా ముఖ్యమంత్రి సంతాపం తెలపలేదు, వేరే మతాలవారైతే చూస్తూ మౌనంగా ఉండేవారా? హిందువులకు భద్రత లేదా అని యత్నాళ్ ఘాటుగా ప్రశ్నించారు. నిందితులను దాచిపెడుతున్నారు సభాపతి యూటీ ఖాదర్ జోక్యం చేసుకుంటూ, జైనముని హత్య భయంకరమైనది. నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఇందులో రాజకీయం చేయరాదని సలహానిచ్చారు. బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ భయంకరమైన హత్యతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో మిగతా నిందితుల పేర్లను ఎందుకు బహిరంగపరచటం లేదు. ఎందుకు నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఇదే మాదిరిగా విధాన పరిషత్‌లో కూడా జైనముని హత్య కేసుపై గందరగోళం నెలకొంది. మంత్రులు హెచ్‌కే పాటిల్, ప్రియాంక్ ఖర్గేలు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు. మరోవైపు హత్యను ఖండిస్తూ చిక్కోడిలో జైనసంఘాల వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా హిరేకోడి ఆశ్రమం జైనముని కామకుమార నంది మహారాజ హత్యోదంతంపై రాజకీయ చేయరాదని, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన నగర విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరూ కూడా పక్షపాతం చూపరని అన్నారు. జైనముని అదృశ్యంపై ఫిర్యాదు నమోదైన తక్షణమే పోలీసులు అన్వేíÙంచారన్నారు. బావిలో వేసిన మృతదేహాన్ని కనుగొని చర్యలు తీసుకున్నారన్నారు, పోలీసులు బాగా పనిచేశారని అభినందిస్తున్నానన్నారు. హత్యపై నిరసనకు దిగిన జైనమునితో తాను కూడా మాట్లాడానని, వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చానన్నారు. హత్య కేసును సీబీఐకు అప్పగించాలన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించామని, ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: ఈ జైనమునిని ఎందుకింత కర్కశంగా హత్య చేశారు? -
స్వామీజీ నుంచి మైక్ లాక్కున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాగేసుకున్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. తాను అందరిలా కాదని, ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేసి తీరుతానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు. వారి ఇబ్బందులను ఎవరూ తీర్చడం లేదని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్న సీఎం స్వామీజి నుంచి మైక్ లాగేసుకుని మధ్యలో మాట్లాడారు. తాను ఇతర నాయకుల్లా కాదని, ఏదైనా చెబితే చేసి తీరుతానని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పారు. #WATCH | Karnataka CM takes mic from seer Eshwaranandapuri Swami during an event to respond to his criticism on civic issues in Bengaluru, y'day CM said that he isn't one who only gives assurances but has released funds to find a solution to these problems pic.twitter.com/R3v3rAhfJz — ANI (@ANI) January 27, 2023 కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గుంతల రోడ్లు, ఇతర సమస్యలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు వరదల్లో మునిగిపోతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలనే స్వామీజి ప్రస్తావించగా సీఎం మైక్ లాక్కుని మధ్యలో జోక్యం చేసుకున్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
కర్ణాటక మఠాధిపతి లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మఠాధిపతి శివమూర్తి మూరుగ లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తేలింది. టీనేజ్ బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఇందులో బాలికలపై అత్యాచారం జరిగినట్లు కనిపించలేదని.. వారి జననాంగాల్లో ఎలాంటి గాయాలు గుర్తించలేదని వెల్లడైంది. కాగా 2019 నుంచి 2022 వరకు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావు స్వామిజీ తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆయన ఆశ్రమంలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు ఆరోపించిన విషయం తెలిసిందే. బాలికల ఫిర్యాదు మేరకు మైసూరు పోలీసు స్టేషన్లో ఆగష్టు 26న శివమూర్తిపై పోక్సో కేసు నమోదైంది. తరువాత కేసును చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేసన్‌కు బదిలీ చేశారు. రాష్ట్రంలో మఠాధిపతికి వ్యతిరేకంగా తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చిత్రదుర్గ జిల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన రెండు రోజులకు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిత్రదుర్గలోని ఆశ్రమంలో తమపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించిన మైనర్ బాలికల స్టేట్మెంట్కు విరుద్ధంగా మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. తాజాగా ఆ నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు(ఎఫ్ఎస్ఎల్) పంపించారు. అయితే ఫైనల్ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ నివేదికపై ఆధారపడి ఉండనున్నట్లు వైద్య పరీక్షల నివేదికలో పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో మరో నలుగురు బాలికలు శివమూర్తిపై ఇవే ఆరోపణలు చేశారు. కానీ వారి వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. చదవండి: : డాక్టర్ నిర్వాకం..ప్రసవ వేదనతో వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి.. -
వలపు వలలో చిక్కి.. వేధింపులు భరించలేకే!
రామనగర(కర్ణాటక): జిల్లాలోని లింగాయత్ మఠాధిపతి ఆత్మహత్య ఉదంతంలో విస్మయానికి గురి చేసే కోణం ఒకటి వెలుగు చూసింది. హనీట్రాప్‌లో చిక్కుకుని ఆ బ్లాక్‌మెయిలింగ్‌ను భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. రామనగర జిల్లా కంచుగల్ బండ్ మఠానికి చెందిన బసవలింగ స్వామిజీ(45).. తన పూజా మందిరంలో కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతిగా తొలగించే యత్నాలు జరుగుతున్నాయని, ఆ వేధింపులను తట్టుకోలేకే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు. ఈ నోట్ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసుపై ఓ అంచనాకి వచ్చారు. అయితే.. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు.. ఇది హనీట్రాప్ కోణంతో ముడిపడి ఉందని గుర్తించారు. ఓ మహిళ సాయంతో ఆయన్ని అసభ్య కోణంలో చిత్రీకరించి.. ఆ వీడియోల ద్వారా ఆయనపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియదు.. కానీ, ఆమె వల్లే ఇదంతా అంటూ ఆయన లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మహిళతో ఆయన అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ మాట్లాడినట్లు.. అందుకు సంబంధించిన మొత్తం నాలుగు వీడియోలను పోలీసులు గుర్తించారు. మహిళ తన ఫోన్లోని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆ వీడియోలను రికార్డ్ చేసినట్లు ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ వీడియోల ద్వారా ఆయన్ని స్థానం నుంచి తప్పించాలనుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక కన్నడనాట మఠాలపై, మఠాధిపతులపై రాజకీయ ప్రభావం ఉండడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కంచుగల్ బండ్ మఠానికి బసవలింగ స్వామిజీ.. తన 20వ ఏట(1997లో) మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి కూడా. -
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం
భోపాల్: ద్వారకా పీఠాధిపతి స్వామి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి (99) ఆదివారం శివైక్యం పొందారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచినట్టు ఆయన ముఖ్య అనుచరుడైన స్వామి సదానంద మహరాజ్ తెలిపారు. ద్వారక, శారద, జ్యోతిష్ పీఠాలకు శంకరాచార్యుడిగా ఉన్న స్వామి స్వరూపానంద ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా డిఘోరిలో 1924లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు వీడారు. స్వాతంత్య్ర సమయంలో జైలు జీవితం గడిపారు. 1981లో ద్వారకపీఠాధిపతి అయ్యారు. స్వరూపనంద శివైక్యం చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति! — Narendra Modi (@narendramodi) September 11, 2022 द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। सनातन संस्कृति व धर्म के प्रचार-प्रसार को समर्पित उनके कार्य सदैव याद किए जाएँगे। उनके अनुयायियों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को सद्गति प्रदान करें। ॐ शांति pic.twitter.com/uPnv3JEull — Amit Shah (@AmitShah) September 11, 2022 -
లైంగిక ఆరోపణలు.. కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య!
బెలగావి: కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా.. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్‌కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది. అయితే.. తాజాగా ఇద్దరు కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది అక్కడ. అందులో లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంచలనం సృష్టించిన పోక్సో కేసు -
రాజకీయ అండ.. స్వామిజీ ముసుగులో విద్యార్థినులపై అత్యాచారం..
ఇటీవలే బెంగళూరులో ఓ నకిలీ స్వామి ఐదేళ్లుగా యువతిని బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం బయటపడడం తెలిసిందే. ఇంతలోనే ఓ నిఖార్సైన స్వామి, రాష్ట్ర, జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్న మఠాధిపతి లైంగిక దాడి కేసులో ఇరుక్కున్నారు. చిత్రదుర్గంలోని మఠంలోని విద్యాలయాల్లో చదివే బాలికలు స్వామి లీలలపై ఏకంగా మైసూరుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రముఖ మఠం పరువు బజారున పడింది. మైసూరు: చిత్రదుర్గలో ఉన్న ప్రసిద్ధి చెందిన మఠానికి చెందిన స్వామీజీ ఒక ఆ మఠంలో ఉన్న పాఠశాల, కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధిత బాలికలు మైసూరు జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో మఠాధిపతి అయిన స్వామీజీతో పాటు మొత్తం నలుగురిపై మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్వామీజీ మొదటి నిందితుడు, అక్కడి హాస్టల్ వార్డెన్ రశ్మి రెండవ నిందితురాలుగా ఉన్నారు. ఇక్కడైతే న్యాయం జరగదని.. వివరాలు... ఆ మఠం ఆధ్వర్యంలో పలు పాఠశాలలు, కాలేజీలు నడుస్తుండగా వందలాది మంది బాలికలు చదువుకుంటున్నారు. మఠం స్వామీజీ పలువురు బాలికల పైన లైంగిక దాడి చేశాడని, చిత్రదుర్గలో అయితే మాకు న్యాయం జరగదని అలోచించి మైసూరుకు వచ్చి ఒడనాడి సేవా సంస్థ ప్రతినిధులను ఆశ్రయించారు. వారితో కలిసి జిల్లా బాలల సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు. సమితి అధ్యక్షురాలు హెచ్.టి.కమల సెలవులో ఉండటంతో సీనియర్ సభ్యులు ధనంజయ, అశోక్, సవితా కుమారిలు బాధితుల సమస్యలను ఆలకించారు. తమతో పాటు అనేక మంది విద్యార్థినులకు తీరని అన్యాయం జరిగిందని వివరించారు. చిత్రదుర్గానికి కేసు బదిలీ ఈ కేసును చిత్రదుర్గ పోలీసులకు బదిలీ చేశారు. సంఘటన జరిగింది అక్కడే కాబట్టి స్థానిక పోలీసులే విచారణ చేయాలని తెలిపారు. బాధిత విద్యార్థినులు మైసూరు ఒడనాడి సంస్థలో ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ప్రసాదంలో మత్తు మందిచ్చేవారు హాస్టల్ వార్డెన్ రశ్మి తమను తీసుకుని వెళ్ళి స్వామీజీ వద్దకు వదిలేవారని, స్వామీజీ మా కష్టసుఖాలను తెలుసుకునే సాకుతో లైంగికంగా వాడుకొనేవారని, ఒకవేళ తాము ఒప్పుకోక పోతే బెదిరించే వారని బాలికలు తెలిపారు. ప్రసాదంలో మత్తు మందు కలిపి మత్తు వచ్చేలా చేసి ఆపైన అత్యాచారం చేసేవారని, ఈ విషయం బయటకి చెబితే చంపేస్తామని బెదిరించేవారని పోలీసులు ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ మాదిరిగా దౌర్జన్యానికి గురైన అనేక మంది బాలికలు అక్కడ ఉన్నారని, ప్రాణ భయంతో బయటకు రావడం లేదని చెప్పారు. కాగా, నజరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, స్వామీజీ, రశ్మి, మరికొందరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. #BREAKING | Two minors allege that #Lingayat Swami Shivamurthy Sharanaru sexually assaulted them for over 3 years; Mysuru Police registered a case @harishupadhya brings forth the details | @ridhimb pic.twitter.com/TFyJjbSyip — News18 (@CNNnews18) August 27, 2022 -
యాసిడ్ దాడి: ప్రేమోన్మాది కాస్త సన్యాసి అవతారంలో..
బెంగళూరు: ప్రేమ పేరుతో ఓ యువతిని విపరీతంగా వేధించిన వ్యక్తి.. చివరకు ఆమెపై పక్కా ప్లాన్‌తో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మరి చేసిన నేరానికి పోలీసులు దొరకబడతారు కదా!. అందుకే.. చిక్కకుండా ఉండేందుకు భలే స్కెచ్ వేశాడు. సన్యాసి అవతారం ఎత్తి పొరుగు రాష్ట్రంలో ఓ ఆశ్రమంలో సేదతీరుతుండగా.. వెంటాడి మరీ పట్టేసుకున్నాయి ఖాకీలు. ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు హెగ్గానహళ్ళి, సంజీవిని నగర్‌కు చెందిన నగేష్ అనే వ్యక్తి.. మాగడి రోడ్లో తన ఆఫీస్ బయట నిల్చున్న బాధితురాలి(25)పై యాసిడ్ పోశాడు. బాధితురాలి బంధువుల ఇంట్లోనే నగేష్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ ఏడేళ్ల పరిచయం ఉంది. అయితే గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ నగేష్ బలవంతం చేయగా.. ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకుని దారుణానికి తెగబడ్డాడు. దాడి అనంతరం అతను పారిపోగా.. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి పోలీసులు నగేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు. పక్కా స్కెచ్.. నగేష్ యాసిడ్ దాడి ఏదో క్షణికావేశంలో జరిగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దాడికి ముందు రోజు తన దగ్గరి బంధువులతో ‘నేను రేపు టీవీల్లో కనిపిస్తా’ అంటూ హింట్ కూడా ఇచ్చాడట. అంతేకాదు దాడికి ముందే తాను నడిపిస్తున్న బట్టల దుకాణాన్ని, అందులోని ఇతర సామాన్లను అమ్మేశాడు నగేష్. ఆ డబ్బుతో పాటే దాడి తర్వాత పారిపోయాడు. అయితే పారిపోయే క్రమంలో అతను చేసిన మరో పని.. సెల్‌ఫోన్‌ను ఉపయోగించకపోవడం. పోలీసులు ట్రేస్ చేస్తారనే ఉద్దేశంతో.. తన దగ్గరున్న రెండు ఫోన్లను, సిమ్ కార్డులను హోస్కోటే హైవేలో పడేసి వెళ్లిపోయాడు. పైగా ఆ ఫోన్లను ఫార్మట్ చేసి మరీ పడేశాడు. పది టీంలతో వెతుకులాట.. నగేష్ ఫొటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. అతని కోసం పది బృందాలతో గాలింపు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోపు మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు టీంలను పంపించారు. ఈలోపు తిరువణ్ణమలై దగ్గర ఓ ఆశ్రమంలో నగేష్ పోలికలతో ఓ వ్యక్తిని చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిచూసేసరికి.. తనకిప్పుడు దేని మీద ఆశ లేదని, అన్ని బంధాలను తెంచుకుని ఇక్కడికి వచ్చి సన్యాసిగా బతుకుతున్నానంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ, పోలీసులు ఊరుకుంటారా? పదహారు రోజుల తర్వాత మొత్తానికి సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి నెట్టారు మొత్తానికి. చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన క్రిమినల్!! -
కేశవానంద భారతి కన్నుమూత..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
పాల్ఘర్ ఘటన మరువకముందే..
ముంబై : మహారాష్ట్రలోని నాంధేడ్ తాలూకాలోనిఓ ఓ ఆశ్రమంలో ఇద్దరు సాధువులు శనివారం రాత్రి విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. మరణించిన సాధువును బాలబ్రహ్మచారి శివాచార్యగా గుర్తించారు. అదే ఆశ్రమంలో ఆయన శిష్యుడు భగవాన్ షిండే మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలోని ఇంటి బాత్రూం సమీపంలో ఇద్దరు సాధువుల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. పాల్ఘర్ జిల్లా గడ్చించాలె గ్రామం వద్ద గత నెలలో ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్ మూక హత్యకు గురైన అనంతంరం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిందితులు దోపిడీకి మఠంలోకి ప్రవేశించగా అడ్డుకున్న సాధువులను కేబుల్ వైర్‌తో గొంతు బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను కారు డిక్కీలో దాచి అక్కడినుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా కారు మఠం గేటును ఢీకొనడంతో స్ధానికులు అక్కడి చేరుకుంటారనే భయంతో కారుతో సహా మృతదేహాలను అక్కడే ఉంచి నిందితులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఈ కేసులో నిందితుడిని నిర్మల్ జిల్లా తానూరులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేయడంతో స్పందించిన స్ధానిక ఎస్ఐ రాజన్నఅనుమానాస్పదంగా కనిపిస్తున్న హంతకుడిని అదుపులోకి తీసుకుని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. డబ్బు, నగల కోసం తాను ఈ హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. చదవండి : మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి -
‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’
-
‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’
అహ్మదాబాద్: నెలసరితో ఉన్న విద్యార్థినుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన గుజరాత్‌లోని శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ఘటన వెనక ఓ స్వామిజీ నీచపు బుద్ధి ఉన్నట్టు తెలిసింది. పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని స్వామి నారాయణ్ భుజ్ మందిర్ మత బోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ తన అనుయాయులకు చెప్పినట్టున్న వీడియోలు కొన్ని బయటపడ్డాయి. శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌ను స్వామి నారాయణ్ టెంపుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రుతుక్రమంలో ఉన్న మహిళలు వండి పెట్టిన ఆహారం తిన్నవారెవరైనా వచ్చే జన్మలో ఎద్దులై పుడతారని స్వామిజీ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. అందుకే నెలసరి ఉన్న మహిళలు వంట చేయకూడదని స్వామీజీ సెలవిచ్చారు. ఒక వేళ శాస్త్రాలు పట్టించుకోకుండా నెలసరిలో ఉన్నా కూడా భర్తకు వండి పెడితే.. ఆ మహిళలు మరు జన్మలో కుక్కలై పుడతారని పేర్కొన్నారు. మగాళ్లంతా వంట నేర్చుకుని, నెలసరి సమయంలో మహిళలు ‘ధర్మం’ పాటించేలా చూడాలని అన్నారు. ఇక స్వామీజీ వ్యాఖ్యలపై స్థానిక మీడియా వివరణ కోరగా.. అక్కడి సిబ్బంది నిరాకరించారు. (చదవండి : 68 మంది విద్యార్థినుల లోదుస్తులు తొలగించాలంటూ..) నలుగురు అరెస్టు.. శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో నెలసరి సమయంలో విద్యార్థినిలు అందరితో కాకుండా వేరుగా తినాలనే నిబంధన ఉంది. అయితే, కొందరు దానిని పాటించలేదు. దాంతో అక్కడి హాస్టల్ యాజమాన్యం 60 మంది విద్యార్థినిలను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి లోదుస్తులు చెక్ చేశారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు నలుగురిని సోమవారం అరెస్టు చేశారు. ప్రిన్సిపల్ రీటా రనింగా, మహిళా సిబ్బంది రమీలాబెన్ హిరాణీ, నైనా గోర్సీయా, అనితా చౌహన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇక కాలేజీ యాజమాన్యం తీరుపై సీరియస్ అయిన జాతీయా మహిళా కమిషన్ 7 మంది సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఆదివారం కమిటీ సభ్యులు విద్యార్థులను కలిశారు. -
శివకుమార స్వామికి తుది నివాళులు
-
శివకుమార స్వామికి తుది నివాళులు
సాక్షి, బెంగళూర్ : లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన ఆథ్యాత్మిక గురు, సిద్ధగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. శివకుమార స్వామిని కడసారి వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు, సన్యాసులు తుంకూర్లోని మఠానికి తరలివచ్చారు. లింగాయత్‌ల ఆరాధ్యదైవంగా పేరొందిన స్వామిని నడిచే దేవుడిగా వారు భావిస్తుంటారు. శివకుమార స్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. స్వామి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి సాగించారని కొనియాడారు. -
చుక్కలకు చెయ్యి చూద్దాం
ఒక ఊళ్లో ఒక ‘కాలజ్ఞాని’ ఉండేవాడు. పగలంతా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. రాత్రంతా ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఉండేవాడు. ఏవో లెక్కల్ని వేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. ఈ లోకానికి ఏదో జరగబోతోందని నిరంతరం ఆందోళన చెందుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఊళ్లోని వాళ్లు వచ్చి, భవిష్యత్తులో తమకేం జరగబోతోందో చెప్పమని ఆయనను అడిగేవారు. చెప్పేవాడు! ఆయన చెప్పిన విషయాన్ని బట్టి ఆ వచ్చినవాళ్లు సంతోషంతోనో, విచారంతోనో వెళ్లిపోయేవారు. ఆ కాలజ్ఞాని నిజంగా కాలజ్ఞానో కాదో ఎవ్వరికీ తెలియదు. ఆయన మాత్రం తనని తాను కాలజ్ఞానిని అనుకునేవాడు. ఎప్పటిలాగే ఓ రోజు రాత్రి మసక చీకట్లో ఆ కాలజ్ఞాని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ, లెక్కల్ని వేసుకుంటూ ఊరి శివార్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. పైన చూస్తూ, కింద చూసుకోకపోవడంతో ఒక గొయ్యిలో పడిపోయాడు. పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ పట్టు దొరకలేదు. ‘ఎవరైనా ఉన్నారా? నన్ను పైకి లాగండి’ అని కేకలు వేస్తూ గొయ్యిలోనే ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత, అటుగా వస్తున్న గ్రామస్థులు కేకలు విని, కాలజ్ఞానిని బయటికి లాగి, తమ దారిన తాము వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ అనుకున్నారు.. ‘చుక్కల్లో భవిష్యత్తుని చూడగలిగాడు కానీ, కాళ్ల కింద ఉన్న వర్తమానాన్ని కనుక్కోలేకపోయాడు’.. అని! రేపటి గురించిన ఆలోచన, రేపేం జరగబోతోందీ అన్న ఆలోచన రెండూ ఒకటి కాదు. రేపటి గురించిన ఆలోచనలో ‘ముందు జాగ్రత్త’ ఉంటుంది. రేపేం జరగబోతోంది అన్న ఆలోచనలో కేవలం ‘ఊహ’ మాత్రమే ఉంటుంది. అది మంచిది కాదు. రేపటిని ఊహిస్తూ, నేడు చేయవలసిన పనుల్ని అలక్ష్యం చేస్తాం మనం. ఈలోపు ఆ రేపు.. నేడై వచ్చేస్తోంది.. తెల్లారే వాకిట్లోకి! అప్పుడు మళ్లీ నేటి గురించి పట్టించుకోకుండా రేపటిలోకి వెళ్లిపోతాం. అంటే ఎప్పుడూ మనం రేపటిలోనే ఉండిపోతున్నాం. నేటిని చేజార్చుకుంటున్నాం. ‘రేపు’ ఎలాగూ వస్తుంది. ‘నేడు’ చేజారి ‘నిన్న’ అయిపోయాక మళ్లీ వస్తుందా?! నిన్న అయినా, నేడు అయినా, రేపు అయినా ఎప్పటికప్పుడు జీవితం మెరుగవుతూ ఉండాలి. అంతవరకే ఆలోచన చెయ్యాలి. నిన్నటిని ఒక అనుభవంగా తీసుకుని, ఆ అనుభవంతో రేపటిని మరింత మెరుగ్గా మలుచుకోడానికి ఇవాళ మనం మన పనిలో శ్రద్ధపెట్టాలి. సవ్యంగా పూర్తి చెయ్యాలి. అప్పుడు చుక్కలే కిందికి చెయ్యి చాపుతాయేమో.. ‘గురూ.. కొంచెం మా ఫ్యూచర్ చూసి చెప్పు. ఎలా ఉండబోతోందో?’ అని! మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతుంటే ‘రేపు’ అనే గొయ్యిలో పడే ప్రమాదం ఉండదు. -
పందుల కాపరి.. దొంగ బాబా!
నిన్న మొన్నటి వరకు పందులను మేపుతూ బతికేవాడు. మూడేళ్ల క్రితం ఉన్నట్టుండి బాబా అవతారం ఎత్తాడు. అతగాడిది మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామం. పేరు ఎరుకల ఎల్లయ్య. ఇప్పుడు మాత్రం ఎల్లం బాబా. ఆశ్రమం కట్టాడు, ప్రచారం చేయించాడు అంతే.. వైద్యం ప్రారంభించాడు. అక్కడకు ఎవరైనా వస్తే చాలు.. చేతబడి సోకిందంటాడు. అది పోవాటంటే మంత్రాలు చెబుతున్నట్లుగా ఒళ్లంతా రుద్దేస్తాడు!! సమస్య తీవ్రంగా ఉందంటూ చికిత్స చేయాలంటూ రహస్య శరీర భాగాలపై చేతితో మర్ధన చేస్తాడు. నెమ్మదిగా మహిళలను లోబరుచుకుని కామ వాంఛ తీర్చుకుంటాడు. ఎదురుతిరిగితే ఇక ఇంతే సంగతులు, చేతబడి చేస్తానంటూ భయపెడతాడు. ఇంతకీ సదరు ఎల్లంబాబా ఇచ్చే మందు ఏంటో తెలుసా? లాలా జలం!! ఏరోగమైనా సరే ఇదే మందంటాడు. అతనికి అక్షరజ్ఞానం లేదు గానీ ఆరోగ్యాలను కాపాడే డాక్టరుగా చెలామణి అవుతున్నాడు. మొన్నటి వరకు పందులు కాసేవాడు కాస్తా, ఇప్పుడు ప్రాణాలు కాపాడే వైద్యుడినంటునంటున్నాడు. వైద్యం ముసుగులో ఆడవారి పై దారుణాలకు ఒడిగడుతున్నాడు. ''మీకు సంతానం లేదా, ఏవైనా సమస్యలతో బాధపడుతున్నారా... గ్రహబలం సరిగాలేక కష్టాలు పడుతున్నారా... మీ సమస్య ఎలాంటిదైనా సరే, తీర్చే బాధ్యత నాకు వదిలేయండి... ఒక్కసారి నా చేయి మీ ఒంటిపై పడిందంటే చాలు ఎంతటి జటిల సమస్య అయినా పటాపంచలు కావలసిందే" అంటూ చిత్రవిచిత్ర విన్యాసాలు, మోసాలు, ఘోరాలతో ప్రజలను నమ్మించి వంచిస్తున్న ఓ దొంగ బాబా బండారాన్ని సాక్షి బయటపెట్టింది. చింపిరి జుట్టుతో కుర్చీలో కూర్చుండి పిచ్చిగీతలు గీసే వ్యక్తే డాక్టర్ బాబా. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్య. ఇతడి దగ్గరకు వచ్చేవారిని చేతబడి, ఇతర పేర్లతో భయపెట్టి, నోటికొచ్చిన మంత్రాలు చదువుతూ ఒళ్లంతా రుద్దుతూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సమస్య తీవ్రంగా ఉంది, ఇంకా చికిత్స చేయాలంటూ ఆడవారి రహస్య భాగాలపై చేతితో మర్దన చేస్తాడు... ఇలా నీచంగా ప్రవర్తిస్తూ మహిళలను లోబరుచుకోని తన కామవాంఛ తీర్చుకుంటాడు . ఎల్లంబాబా తన వద్దకు వచ్చేవారికి ఇచ్చే దివ్యౌషధం తన లాలాజలం. ఏ రోగమైనా ఇదే మందంటాడు . కవర్లో గానీ, బాటిల్లో గానీ నీళ్లు తెప్పించి అందులో ఉమ్మి, రోజూ మూడు పూటలా తాగాలంటాడు. ఇతడి దారుణాలు అందరికీ తెలిసినా, శాపాలు పెట్టి క్షుద్ర పూజలు చేస్తాడేమోనని భయపడి ఎవరూ ధైర్యం చేయట్లేదు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు . సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సొంత గ్రామానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ దొంగబాబా దారుణాలు, అత్యాచారాలకు అడ్డుకట్టపడుతుందని ఆశిద్దాం.