బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాగేసుకున్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. తాను అందరిలా కాదని, ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేసి తీరుతానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు. వారి ఇబ్బందులను ఎవరూ తీర్చడం లేదని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్న సీఎం స్వామీజి నుంచి మైక్ లాగేసుకుని మధ్యలో మాట్లాడారు. తాను ఇతర నాయకుల్లా కాదని, ఏదైనా చెబితే చేసి తీరుతానని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పారు.
#WATCH | Karnataka CM takes mic from seer Eshwaranandapuri Swami during an event to respond to his criticism on civic issues in Bengaluru, y'day
— ANI (@ANI) January 27, 2023
CM said that he isn't one who only gives assurances but has released funds to find a solution to these problems pic.twitter.com/R3v3rAhfJz
కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గుంతల రోడ్లు, ఇతర సమస్యలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు వరదల్లో మునిగిపోతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలనే స్వామీజి ప్రస్తావించగా సీఎం మైక్ లాక్కుని మధ్యలో జోక్యం చేసుకున్నారు.
చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment