Basavaraj Bommai
-
కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: ఒక్కసారిగా పదవి పోతే రాజకీయ నాయకులు నిరాశలో కుంగిపోతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత ఎస్.డీ.సోమశేఖర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను తన రాజకీయ గురువుగా చెబుతూ కాంగ్రెస్ తలుపు తట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్.డీ.సోమశేఖర్ గౌడ మాట్లాడుతూ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని సహకార శాఖలో నేను ఏదైనా సాధించానంటే అది అయన చలవేనని అన్నారు.అయన నాకు చాలా సహాయం చేశారు. మొదట్లో నాకు జేపీ నగర్ బ్లాకు ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఫీకే శివకుమార్ నన్ను జేపీనగర్ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అక్కడి నుండి ఆయన నాకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఉత్తరహళ్లి నియోజకవర్గం అభ్యర్థిగా నా పేరును ఆయనే ప్రతిపాదించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే ఆయన కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం చూస్తే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచి యాడ్యూరప్ప ప్రభుత్వానికి అండగా నిలిచిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సోమశేఖర్ కూడా ఒకరు. కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. బహుశా ఆయన ఎదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయనతో మాట్లాడితే సమస్య సర్దుకుంటుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
పోరాడినా గెలవలేకపోయాం ఓటమిని విశ్లేషించుకుంటాం..
-
బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ...
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల రహస్య, బహిరంగ భేటీలో తాజాగా రాజకీయాల్లో కుతూహలానికి కారణమయ్యాయి. దావణగెరె కాంగ్రెస్ వృద్ధ నేత శామనూరు శివశంకరప్పని బీజేపీ నాయకుడు బసవరాజ బొమ్మై కలవడంపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అదేరీతిలో డీసీఎం శివకుమార్‌తో బీజేపీ నేత రేణుకాచార్య భేటీ అయ్యారు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాషాయనేతలు సీటీ రవి, ప్రతాపసింహా మండిపడడం రెండు పారీ్టల్లో కలకలం రేపింది. కర్ణాటక: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రేణుకాచార్య బుధవారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ను భేటీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేణుకాచార్య ఓడిపోయాక మౌనంగా ఉంటున్నారు. ఈ తరుణంలో డీకేని కలవడం రాజకీయ రంగంలో చర్చకు కారణమైంది. భేటీ తరువాత రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ డీకే తనకు మంచి స్నేహితుడని, అందుకే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. హొన్నళ్లిలో జరిగే వ్యవసాయ మేళాకు ఆహా్వనించానన్నారు. కుమ్మక్కుపై వారినే అడగండి కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ, బీజేపీ సీనియర్‌నేత సీటీ రవి ఆరోపణలు చేసిన సమయంలో ఈ భేటీ జరగడం విశేషం. ఈ ఆరోపణలపై రేణుకాచార్య స్పందిస్తూ కుమ్మక్కుపై సీటీ రవి, ప్రతాపసింహనే అడగాలని, తనకు సమాచారం లేదని, ఏ అర్థంలో చెప్పారనేది తెలియదని అన్నారు. ప్రతాపసింహ, సీటీ రవి ఏమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం గాని, ఆరోపణలు చేయటం గాని చేయటం లేదు. అనేక మంది సీనియర్ నాయకులు సీఎం సిద్దరామయ్యతో కుమ్మక్కయ్యారని ఎంపీ ప్రతాప్ సింహ, సీటీ రవి ఆరోపణలు చేశారు. రెండు పారీ్టల నాయకులు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీజేపీ నాయకులను బెదిరింపులకు గురిచేశారని వారు ఆరోపించారు. అది మామూలు భేటీనే: బొమ్మై బీజేపీ మాజీ సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శామనూరు శివశంకప్పను రహస్యంగా భేటీ కావటంపై రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై బుధవారం బొమ్మై స్పందిస్తూ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. నా రాజకీయ వైఖరిలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన ట్విట్టర్లో అన్నారు. ఆయన తనకు బంధువు అని, తరచూ ఇళ్లకు వెళ్లి వస్తుంటామని, దీనికి రాజకీయాలు పూయడం సరికాదన్నారు. వారి మనమళ్లకు పెళ్లి సంబంధాల గురించి చర్చ జరిగింది, ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదన్నారు. మరోవైపు శివశంకరప్ప స్పందిస్తూ ఎన్నికలు జరిగిననాటి నుంచి తాము కలవలేదు. అందుకే కలిశామన్నారు. మాకు బంధుత్వం ఉంది, కొన్ని విషయాలు చెప్పేందుకు సాధ్యపడదన్నారు. -
సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజులు పనిచేసిన 'బసవరాజు బొమ్మై' ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగానే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ 136 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం 65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారం కోల్పోయింది. కన్నడ నాట ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. అయితే ఎవరు కర్ణాటక కొత్త ముఖ్యమత్రి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. -
బీజేపీ ఘోర పరాభవంపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజార్టీ సాధిచడంలో విఫలమయ్యామని, ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తమ లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మై చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామన్నారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా ఫలితాలపై స్పందించారు. గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవవరం లేదన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరీశీలన చేసుకుంటామన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 135 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు బీజేపీ కేవలం 65 స్థానాల్లోనే ముందంజలో ఉంది. జేడీఎస్ 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైనా 6 మంత్రాలివే.. -
కర్ణాటక బీజేపీ ఆఫీస్‌లో కింగ్ కోబ్రా.. సీఎం బసవరాజ్ బొమ్మై పక్కనే..
బెంగళూరు: కర్ణాటక శిగ్గావ్లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్‌లో కింగ్ కోబ్రా కన్పించడం కలవరపాటుకు గురిచేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆఫీస్‌లో ఉన్న సమయంలో కోబ్రా కన్పించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. అయితే కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. #WATCH Karnataka CM Basavaraj Bommai reaches the BJP camp office in Shiggaon, a snake found in the building compound slithers away The snake was later captured and the building compound secured pic.twitter.com/FXSqFu0Bc7 — ANI (@ANI) May 13, 2023 #WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt — ANI (@ANI) May 13, 2023 కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 60-65 స్థానాలకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మంచి 130 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. అటు కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్ కేవలం 22 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
బీజేపీ ఓటమి.. బసవరాజు బొమ్మై ఫస్ట్ రియాక్షన్..!
-
కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఇక, కర్ణాటకలో పార్టీల గెలుపుపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో, హెచ్డీ కుమారస్వామి జేడీఎస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమారస్వామితో టచ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. దాదాపు 150 స్థానాల్లో గెలుస్తాము. నేను నా అంచనాలకు మార్చుకోను. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం లేదు. జేడీఎస్‌తో మేము ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల సందర్బంగా మా పార్టీకి చెందిన జాతీయ నేతలు, సిద్ధరామయ్య ఇతర నేతలు తీవ్రంగా కృషి చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటుతామన్న నమ్మకం నాకుంది. అయితే, కర్ణాటక సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నపై డీకే స్పందించారు. సీఎం ఎవరుతారనే అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేసులో సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. అటు బీజేపీలో కూడా సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచి సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో పాటుగా మాజీ సీఎం యడియూరప్ప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం బొమ్మై నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష -
Karnataka Exit Polls: ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బొమ్మై రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. హాంగ్ దిశగా అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించాయి ఈ నేపథ్యంలో కుమారస్వామి జేడీఎస్ మరోసారి కీలక కానుంది. ఎగ్జిట్‌పోల్స్ జేడీఎస్‌కు దాదాపు 20 స్థానాలకు పైగానే గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. ఈ క్రమంలో ఎగ్జిట్‌పోల్స్‌పై కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై స్పందించారు. తాజాగా బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ ఫలితాలు కాదు. కర్ణాటకలో మేమే గెలుస్తాం. రిసార్ట్ పాలిటిక్స్ అవసరం ఉండదు అని స్పష్టం చేశారు. #WATCH | Exit polls are exit polls, it can't be 100% correct. We are going to get a complete majority and form the government. I think we should wait till 13th May: Karnataka CM Basavaraj Bommai #KarnatakaAssemblyElection (ANI) pic.twitter.com/643rQa1pIM — Argus News (@ArgusNews_in) May 10, 2023 మరోవైపు.. సీఎం భార్య చెన్నమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. 150కిపైగా స్థానాల్లో విజయం మాదే. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ 50వేలకు పైగా మెజార్టీ విజయం సాధిస్తారు అని అన్నారు. ఇది కూడా చదవండి: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్.. -
karnataka Assembly Elections: హై ఓల్టేజ్ సీట్లలో అమీతుమీ!
సాక్షి, కర్ణాటక ఎలక్షన్ డెస్క్: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై అందరి దృష్టి నిలిచింది. సీఎం బసవరాజ బొమ్మై, సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ నేత డీకే శివకుమార్, యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర, కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌గౌడ తదితరుల నియోజకవర్గాల్లో గాలి ఎలా ఉందనేది చర్చనీయాంశమైంది. ప్రముఖులు కావడం, నియోజకవర్గాల్లో అన్ని విధాలా పట్టు ఉన్న మూలంగా వీరి విజయానికి ఢోకా లేకపోవచ్చనేది మెజారిటీ మాట. కానీ సమయం అనుకూలించకపోతే ఎవరికై నా పరాజయం తప్పదని అనేకసార్లు ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. శిగ్గావ్లో సీఎం బొమ్మైకు పరీక్ష హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం బసవరాజ్ బొమ్మై పోటీలో ఉన్నారు. బొమ్మై గత మూడు పర్యాయాలు 2008లో 12వేలు, 2013లో 9,600, 2018 ఎన్నికల్లో 9,200 మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ బరిలో ఉన్నారు. బొమ్మైకి లింగాయత్ వర్గాల ఓటర్ల బలముంటే, కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది. చెన్నపట్టణలో కుమారకు పోటీ రామనగర జిల్లా చెన్నపట్టణ నుంచి జేడీఎస్ తరఫున మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా చెన్నపట్టణను చెబుతారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సీపీ యోగేశ్వర్ 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. యోగేశ్వర్ ఒకసారి స్వతంత్ర, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, నాల్గోసారి ఎస్పీ నుంచి విజయం సాధించారు. 2018లో జేడీఎస్ తరఫున పోటీ చేసిన కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వరుణలో సిద్దుకు తేలికేనా? మైసూరు జిల్లా వరుణలో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎదురు లేదు. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018లో తనయుడు యతీంద్రను పోటీ చేసి గెలిపించారు. అయితే పక్క నియోజకవర్గమైన చాముండేశ్వరిలో నిలబడిన సిద్ధరామయ్య ఓడిపోయారు. ఈసారి వరుణ నుంచే బరిలో ఉన్నారు. ఆయనకు మంత్రి వి.సోమణ్ణ పోటీ చేస్తున్నారు. కనకపురలో ఇద్దరు దిగ్గజాలు కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓడిపోయింది లేదు. ఇక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. బీజేపీది మూడో స్థానమే. గతంలో జేడీఎస్ నుంచి డీకేశిపై పోటీ చేసి ఓడిన నారాయణగౌడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి సీనియర్ మంత్రి ఆర్.అశోక్ డీకేను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు, సమ ఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనేద ఉత్కంఠ నెలకొంది. రామనగరలో తనయుని కోసం.. రామనగర నుంచి మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు. రామనగరలో 2004 నుంచి నాలుగుసార్లు హెచ్డీ కుమారస్వామి గెలుస్తూ వచ్చారు, గత ఎన్నికల్లో భార్య అనితకు అప్పజెప్పారు. ఉప ఎన్నికల్లో ఆమె కూడా గెలిచారు. ఈసారి తనయుడు పోటీలో ఉన్నాడు. దంపతులిద్దరూ కొడుకు కోసం ప్రచార వ్యూహాల్లో మునిగారు. విజయేంద్రకు ఢోకా లేదా! శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ టికెట్‌తో పోటీలో ఉన్నారు. శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప యడియూరప్ప గెలుపొందారు. శికారిపుర అంటే యడియూరప్పే అనే పేరు వచ్చింది. ఈసారి వారసున్ని బరిలోకి దింపారు. గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
బొమ్మై నామినేషన్.. హాజరైన నడ్డా, సుదీప్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్‌గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు. మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం -
బీజేపీ హైకమాండ్ ఆయనకు బిగ్ ఆఫర్ ఇచ్చింది: సీఎం బొమ్మై
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ సీనియర్లు, సిట్టింగులను కాదని కొత్త ముఖాలకు బరిలోకి దింపింది. ఈ క్రమంలో సీనియర్లు కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. ఆ పార్టీకి గుడ్ బై చెపారు. ఇక, ఆయన రాజీనామా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మాట్లాడుతూ.. మా పార్టీ హైకమాండ్ జగదీష్ షెట్టర్‌కు ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. షెట్టర్ కర్నాటకలో సీనియర్ నాయకుడు, కీలక నేత. అందుకే ఆయనకు పెద్ద పదవి ఇస్తామని జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మేము మూడో జాబితాపై చర్చించాము. మా సిఫార్సులను పార్లమెంటరీ బోర్డుకు పంపించాము. అభ్యర్థులను వారే ఖరారు చేస్తారు. ఈ సందర్బంగా జగదీష్ షెట్టర్‌కు సీటుపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక, అంతకు ముందు.. బీజేపీ పెద్దలు మాజీ సీఎం షెట్టర్‌ను కలిసి గవర్నర్ లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను షెట్టర్ తిరస్కరించారు. తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నానని, పెద్ద పదవిపై ఆశ లేదని అన్నారు. ఇక, నాటకీయ పరిణామాల మధ్య జగదీష్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షెట్టర్.. కర్నాటకలోని కొందరు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంత మంది తమ స్వలాభం కోసం పార్టీని తప్పుగా నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై తప్పుగా నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, తాను కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. #KarnatakaElections2023| "We have discussed the third list, shortly it is going to come out. We've sent our recommendations to Parliamentary board & they will take a call...we've not discussed about Jagadish Shettar", says Karnataka CM Basavaraj Bommai after the BJP meeting over… pic.twitter.com/1GSjZnRFob — ANI (@ANI) April 16, 2023 -
సొంత వాహనం లేని ముఖ్యమంత్రి.. రూ.5.79 కోట్లు అప్పు ఉందట..!
బనశంకరి: సీఎం బొమ్మై నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో మొత్తం రూ.5.98 కోట్ల చరాస్తులు, రూ.22.95 కోట్ల స్థిరాస్తి కలిగి ఉన్నట్లు ప్రకటించారు. సొంత వాహనం లేదని, అయితే రూ.5.79 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక సతీమణికి ఎలాంటి స్థిరాస్తి లేదని, రూ.1.14 కోట్ల విలువచేసే చరాస్తి ఉన్నట్లు తెలిపారు. కుమార్తె పేరుతో రూ.1.28 కోట్ల చరాస్తులు ఉన్నాయి. తన చేతిలో రూ.3 లక్షల నగదు, భార్య వద్ద రూ.50,000 నగదు, కుమార్తె అదితి బొమ్మై వద్ద రూ.25,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బొమ్మై పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.40 లక్షలకు పైగా డిపాజిట్లు, భార్య పేరుతో రూ.27.7 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. పలు కంపెనీల్లో రూ.3.23 కోట్లు పెట్టుబడి పెట్టగా, భార్య రూ.7 లక్షలు, కుమార్తె రూ.23 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. బొమ్మై వద్ద రూ. 1.50 కోట్ల బంగారు నగలు బొమ్మై వద్ద రూ.1.50 కోటికి పైగా విలువచేసే బంగారు నగలు, భార్య వద్ద రూ.78.83 లక్షల విలువ చేసే నగలు, కుమార్తె వద్ద రూ.53.84 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. బొమ్మై పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5.79 కోట్లు రుణం తీసుకున్నారు. బెంగళూరు యలహంక, హుబ్లీలో తలా ఎకరా వ్యవసాయేతర భూమి ఉంది. హుబ్లీలో 4 పొలం ఉంది, పలు నగరాల్లో వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. బెంగళూరు ల్యావెల్లి రోడ్డులో, ఆర్టీ.నగరలో ఇళ్లు కూడా ఉన్నాయి. -
కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ
-
సీఎం వెంట కాంతార రిషబ్.. బీజేపీ తరపున ప్రచారం చేస్తారా?
యశవంతపుర: సీఎం బొమ్మై రాష్ట్రంలో దేవస్థానాల సందర్శన చేపట్టారు. గురువారం కొల్లూరు మూకాంబిక దేవస్థానాన్ని సతీసమేతంగా దర్శించారు. ఈ సమయంలో కాంతార నటుడు రిషబ్‌శెట్టి కూడా సీఎం వెంట ఉండడం విశేషం. తరువాత సీఎం విలేకరులతో మాట్లాడుతూ రిషబ్‌శెట్టి అనుకోకుండా కలిశారని చెప్పడం గమనార్హం. సీఎం వెంట మంత్రి కోట శ్రీనివాస పూజారి, ప్రమోద్ మధ్వరాజ్‌లున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు గైరాజరయ్యారు. కాగా, ఉడుపి జిల్లా శిరూరు వద్ద సీఎం హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అక్కడికి వంద మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ యథావిధిగా టేకాఫ్ అయ్యింది. కాగా ఇటీవల సినీనటుడు కిచ్చా సుదీప్ బహిరంగంగానే సీఎం బసవరాజ్ బొమ్మై, బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీని తర్వాత సీఎం బసవరాజ బొమ్మైతో కాంతారావు నటుడు రిషబ్ శెట్టి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. కిచ్చా సుదీప్ లాగా కాంతారావు కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్! ఎన్నికల్లో పోటీపై నటుడి క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపే, జేడీఎస్ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు. పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు. ‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ.. -
Video: సీఎం బొమ్మై కారును అడ్డగించిన అధికారులు.. ఆకస్మిక తనిఖీలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆలయానికి వెళ్తుండగా బొమ్మై వాహనాన్ని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆపింది. సీఎం కారులో కారులో తనిఖీలు చేపట్టింది. బొమ్మై కారును అధికారులు తనిఖీ చేస్తన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలవ్వడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ క్రమంలో బొమ్మై తన అధికారిక వాహనాన్ని అధికారులకు సరెండర్ చేశారు. శుక్రవారం ఓ ప్రైవేటు కారులో ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్తుండగా హోసహుద్య చెక్‌పోస్టు వద్ద అధికారులు ఆపారు. అయితే బొమ్మై కారులో అభ్యంతరకరమైనవేవి గుర్తించలేదని అధికారులు తెలిపారు. సాధారణ తనిఖీ అనంతరం ఆయన వాహనం వెళ్ళడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. #WATCH | Karnataka CM Basavaraj Bommai's car checked by the Flying Squad team of the Election Commission as he was on his way to Sri Ghati Subramanya Temple in Doddaballapur Model Code of Conduct is enforced in the State in view of the May 10 Assembly elections. pic.twitter.com/esBkFcIMAL — ANI (@ANI) March 31, 2023 కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బుధవారం ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 10న ఎన్నికలు జరుగనుండగా.. మే 13న కౌంటింగ్ ఉండనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. -
కాంగ్రెస్‌కే జై కొడుతున్న కన్నడిగులు.. సీఎంగా మాత్రం ఆయనే కావాలట..!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 10 న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. స్థానిక పార్టీ జేడీఎస్ కూడా సత్తా చాటి కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే అంచనాలున్నాయి. కానీ సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 26.8 శాతం మంది ఆయన పాలన బాగుందన్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80, జేడీఎస్‌కు 23-35 సీట్లు వస్తాయని సీఓటర్ సర్వే తెలిపింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం (29.1 శాతం) మౌలిక సదుపాయాల కల్పన(21.5శాతం)పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా ఆయనే.. ఈ ఒపీనియన్ పోల్‌లో కర్ణాటక తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంపైనా ఓటింగ్ నిర్వహించారు. 39.1శాతం మంది కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. బసవరాజ్ బొమ్మై కావాలని 31.1 శాతం మంది తెలిపారు. హెచ్డీ కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చాలా కాలంగా బలమైన పార్టీగా ఉంటోంది. 2008 ఎన్నికల్లో ఓడిపోయి 80 సీట్లే గెలిచిన ఆ పార్టీ.. 2013లో తిరిగి పుంజుకుని 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో మళ్లీ 80 సీట్లే గెల్చుకుంది. అయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏడాదికే ఈ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తనకు 80 ఏళ్లు దగ్గరపడుతున్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మాత్రం తనవంతు కృషి చేస్తానన్నారు. కాగా.. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇటీవలే కన్నడ వార్త పత్రిక సర్వేలో తేలిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది ఫేక్ అని తేలింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్‌బొమ్మైతో పాటు ఇతర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేపై మండిపడ్డారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
కర్ణాటకలో మూడు ముక్కలాట!
అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి 40 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని తహతహలాడుతూ బీజేపీ.. కన్నడ నాట పార్టీ జెండా ఎగురవేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్.. కన్నడ ఆత్మగౌరవ నినాదాన్ని మరింత రాజేసి కింగ్‌మేకర్ స్థాయి నుంచి కింగ్‌గా మారాలని జేడీ(ఎస్).. పార్టీ ల వ్యూహ ప్రతివ్యూహాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి సాక్షి, నేషనల్ డెస్క్ : కర్ణాటక ఓటర్లు ప్రతీసారి ఒకే తీర్పు ఇవ్వడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1985 నుంచి ఏ పార్టీ కూడా వరసగా రెండోసారి గెలవలేదు. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగుతుందా, అధికార బీజేపీకి మళ్లీ పట్టం కడతారా అన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను ప్రధాని మోదీ ఇమేజీతో ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనంగా ఉన్న పాత మైసూరు (ఉత్తర కర్ణాటక)లో బలపడటంపై దృష్టి పెట్టింది. 89 స్థానాలున్నా ప్రాంతంలో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అంతగా బలంగా లేకపోవడం, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్నే వారు నమ్ముకున్నారు. 100 సీట్లలో కీలకమైన లింగాయత్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. బీజేపీ ఇలా కేంద్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే, కాంగ్రెస్‌కు స్థానిక నాయకత్వమే బలంగా ఉంది. పీసీసీ చీఫ్ డి.కె శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల రద్దు, ధరల పెరుగుదల, హిజాబ్ వంటివాటిపై పార్టీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకుంటోంది. జేడీ(ఎస్) కన్నడ ఆత్మగౌరవ నినాదంతో ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి అంతా తానై నడుపుతున్నారు. ముక్కోణ పోరులో విజయం ఎవరిదోనన్న ఉత్కంఠ నెలకొంది.... బీజేపీ.. అనుకూలం.. ♦ ప్రధాని మోదీ ఇమేజ్. కేంద్ర నేతలు చేస్తున్న పర్యటనలు. డబుల్ ఇంజిన్ నినాదం. ♦ సంఘ పరివార్ సంస్థాగత బలం. ♦లింగాయత్ సామాజిక వర్గం మద్దతు, వక్కలిగ అనుకూల వైఖరితో మైసూర్ ప్రాంతంలో పెరుగుతున్న పట్టు. ♦ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు. ♦ డిజిటల్ మీడియా ప్రచారంలో పార్టీ కున్న పట్టు. వ్యతిరేకం.. ♦ ప్రభుత్వ వ్యతిరేకత, బొమ్మై ♦ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు. ♦ 40% కమీషన్ల ప్రభుత్వమన్న విపక్షాల ఉధృత ప్రచారం. ♦ ఎన్నికలకు ముందు మైనార్టీ ల ఓబీసీ కోటా రద్దుతో ముస్లింలు పార్టీకి మరింత దూరం. ♦ టికెట్ దక్కే అవకాశం లేని ఆశావహుల అసమ్మతి. జేడీ(ఎస్) అనుకూలం.. ♦ వక్కలిగ సామాజిక వర్గం మద్దతు. ♦ కన్నడ ఆత్మగౌరవం నినాదం మిన్నంటుతున్న వేళ ప్రాంతీయ పార్టీ గా ఉన్న ఇమేజ్. ♦ రైతు అనుకూల విధానాలతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు. ♦ హంగ్ వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరికైనా మద్దతివ్వగల వైఖరి. వ్యతిరేకం.. ♦ కుటుంబ పార్టీ ముద్ర. ♦ వక్కలిగ మినహా మిగతా సామాజిక వర్గాల ఆధిపత్యమున్న ప్రాంతాల్లో ఎదగకపోవడం. ♦ సొంత బలంపై పార్టీ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోవడం.. చాలాచోట్ల గెలుపు గుర్రాలు లేకపోవడం. ♦ 2018 నుంచి పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు. కాంగ్రెస్ అనుకూలం ♦ బలమైన స్థానిక నాయకత్వం. ♦ బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న అహిండా (మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల) సోషల్ ఇంజనీరింగ్ విధానంతో. తద్వారా వర్గాల ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం. ♦ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై పేసీఎం, 40% కమీషన్ అంటూ చేస్తున్న ప్రచారం. ♦ కర్నాటకకు చెందిన దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం. ♦ గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు రూ.3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,000 ఆర్థిక సాయం వంటి హామీలు. వ్యతిరేకం ♦ శివకుమార్, సిద్దరామయ్య వర్గాల మధ్య పోరు. ♦ జి.పరమేశ్వర, హెచ్.కె.పాటిల్, కె.హెచ్.మునియప్ప వంటి నేతల్ని పక్కన పెట్టడంతో అసమ్మతి. కీలకమైన లింగాయత్ సామాజిక వర్గంలో ఓటు బ్యాంకును పెంచుకోలేకపోవడం. ♦ ప్రధాని మోదీ ఇమేజ్‌కి దీటైన కేంద్ర నాయకత్వం లేకపోవడం. ♦ ఆశావహులు ఎక్కువవటంతో అసమ్మతి భగ్గుమనే ఆస్కారం. కాంగ్రెస్‌దే అధికారం..! కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే విడుదలైన ఏబీపీ–సీఓటర్ ఎన్నికల సర్వే కాంగ్రెస్ పార్టీ యే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు వస్తాయని, బీజేపీ 68–80 సీట్లు గెలుచుకుంటే జేడీ (ఎస్) 23–25 సీట్లతో సరిపెట్టుకుంటుందని సీ ఓటర్ సర్వేలో తేలింది. బసవరాజ్ బొమ్మై పరిపాలన అసలు బాగోలేదని సర్వేలో పాల్గొన్న ఏకంగా 50.5%మంది తేల్చి చెప్పారు. 57శాతం మంది ప్రస్తుత ప్రభుత్వం మారిపోవాలని అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది. -
కన్నడనాట రిజర్వేషన్ల రగడ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు... ఏం జరిగింది? కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు. కాంగ్రెస్ ఏమంటోంది? ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది. ► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి. ► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ, కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది. ► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. -
బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై.. కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది?
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బాబురామ్ చించనసూర్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఇక, మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ నేతలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావ్ చించనసూర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబూరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని(ఎమ్మెల్యే) నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిర్ణయానికి నో చెప్పడంతో పార్టీని వీడినట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీని బాబూరావ్.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితమే బీజేపీ నేత పుట్టన్న కాషాయ పార్టీని వీడారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కర్నాటకలో బస్వరాజు బొమ్మై సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బొమ్మై ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, మరో మూడు నెలల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ జోరుగా ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్ జాబితా -
నేనెందుకు రాజీనామా చేయాలి? : సీఎం బొమ్మై
హుబ్లీ: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతానికి మహారాష్ట్ర సర్కారు నుంచి నిధులు కేటాయిస్తే తానెందుకు రాజీనామా చేయాలని సీఎం బొమ్మై ప్రశ్నించారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే.శివకుమార్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.54 కోట్లను విడుదల చేసిన అంశంపై కేపీసీసీ అధ్యక్షులు డీకే.శికుమార్ తన రాజీనామాకు డిమాండ్ చేసిన విషయంపై సీఎం పైవిధంగా స్పందించారు. తాము కూడా మహారాష్ట్రలోని పండరాపుర, తులజాపుర వెళ్లిన కర్ణాటక వారికి నిధులు విడుదల చేశామన్నారు. మహారాష్ట్ర సర్కారు ఏ నిధులు మంజూరు చేసిందో పరిశీలిస్తానన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలను ఏ విధంగా ఎదుర్కోవాలో సమీక్షిస్తానన్నారు. నేల, నీరు, భాష సరిహద్దు రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన హుబ్లీకి వచ్చి స్వగ్రామంకమడొళ్లిలోని బంధువులను, స్నేహితులను కలిసి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. -
కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. -
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?
బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు. చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం ఆమోదం.. -
వ్యక్తిగత ఫొటోల దుమారం.. సర్కార్ సీరియస్
బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారిణులు.. ప్రస్తుతం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలకు దిగడంపై కర్ణాటక ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇద్దరిపై చర్యలకు సిద్ధమని ప్రకటించింది ప్రభుత్వం. ‘సామాన్యులు కూడా ఇంతంగా విమర్శించుకోరు. వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం ఉన్నా.. మీడియా ముందు ఇలా ప్రవర్తించడం సరికాదు. వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటాం’ అని కర్ణాటక హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు పోలీస్ చీఫ్‌తోనూ చర్చించింది హోం శాఖ. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఘర్షణ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సింధూరి భర్త వెల్లడించారు. గతంలో జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో.. ఒక రెస్టారెంట్లో రోహిణీ సింధూరి దిగిన చిత్రం వైరల్ అయింది. ఒక ఐఏఎస్ అధికారిణికి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం ఏముందని ఆ సమయంలో ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ ప్రశ్నించారు. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది. ఇక ఆదివారం సింధూరికి చెందిన వ్యక్తిగత ఫొటోలను, రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ చిత్రాలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే అవినీతి ఆరోపణలూ చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రి బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై రోహిణి ఘాటుగా స్పందించారు. రూపా తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా పరువుకు భంగం కలిగించేందుకు ఆమె నా సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సేకరించారు. నేను వీటిని కొందరికి పంపినట్లు ఆమె అంటున్నారు. ఆ వ్యక్తులెవరో చెప్పాలని కోరుతున్నాను. మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య. వైద్యుల సహకారంతో దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్నవారు ఆ అనారోగ్యం పాలైతే.. అది మరింత ప్రమాదకరం’ అని మండిపడ్డారు. అలాగే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం రూప.. కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా సింధూరి విధులు నిర్వర్తిస్తున్నారు. -
చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా ఇతర ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. బీజేపీ గత బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 2018 మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను 'కివిమెలెహూవ'గా అభివర్ణించారు. అంటే ప్రజలను ఫూల్స్ చేస్తోందని అర్థం. Congress MLAs in Karnataka attended budget session with flower on their ears as a mark of protest. They call it Kivi mele hoova protest. pic.twitter.com/Kx5kdIrbrQ — Nagarjun Dwarakanath (@nagarjund) February 17, 2023 సీఎం బొమ్మై ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఆరోపించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వెనక్కితగ్గకుండా నిరసనలు కొనసాగించారు. సీఎం మాత్రం యథావిధిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. రామనగరలో రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తరచూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలం పార్టీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇస్తే వాటిలో 10 శాతం మాత్రమే అమలు చేసిందని ధ్వజమెత్తారు. చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్ -
స్వామీజీ నుంచి మైక్ లాక్కున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాగేసుకున్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. తాను అందరిలా కాదని, ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేసి తీరుతానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు. వారి ఇబ్బందులను ఎవరూ తీర్చడం లేదని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్న సీఎం స్వామీజి నుంచి మైక్ లాగేసుకుని మధ్యలో మాట్లాడారు. తాను ఇతర నాయకుల్లా కాదని, ఏదైనా చెబితే చేసి తీరుతానని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పారు. #WATCH | Karnataka CM takes mic from seer Eshwaranandapuri Swami during an event to respond to his criticism on civic issues in Bengaluru, y'day CM said that he isn't one who only gives assurances but has released funds to find a solution to these problems pic.twitter.com/R3v3rAhfJz — ANI (@ANI) January 27, 2023 కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గుంతల రోడ్లు, ఇతర సమస్యలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు వరదల్లో మునిగిపోతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలనే స్వామీజి ప్రస్తావించగా సీఎం మైక్ లాక్కుని మధ్యలో జోక్యం చేసుకున్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్‌పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్‌కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్‌కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై
సరిహద్దు విషయమై మహారాష్ట్ర తీసుకున్న తాజా చర్యపై కర్ణాట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర నాయకులు ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి అర్థం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టి, విభజిస్తామని బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. 1956లో తీసుకువచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థికరణ చట్టాన్నిఆమోదించి దశాబ్దాలు గడిచాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని బొమ్మై అన్నారు. అలాంటి తీర్మానాన్ని ఆమోదించి మహారాష్ట్ర రాజకీయ జిమ్మిక్కులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మేము మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెగేసి చెప్పారు. అలాగే కర్ణాటకలో ఒక్క అంగుళం కుడా మహారాష్ట్రకు వెళ్లదని కరాఖండీగా చెప్పారు. అయినా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడూ అలాంటి తీర్మానాన్ని ఎలా ఆమోదించారని గట్టిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కర్ణాటక కూడా మహారాష్ట్ర వివాదంపై ఇటీవలే తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో బొమ్మై తమ తీర్మానానికి చాలా భిన్నంగా ఉందంటూ మహారాష్ట్రపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కన్నడ ప్రజలు, కన్నడం మాట్లాడే కమ్యూనిటీల ప్రయోజనాలను కాపాడతాం అని నొక్కి చెప్పారు. ఆ తీర్మానంలో మా కర్ణాటకలోని భూమిని లాక్కుంటామని చెబుతున్నారని, కానీ తాము సుప్రీ కోర్టుని విశ్వసిస్తున్నాం కాబట్టి తమ భూమీని కచ్చితంగా కోల్పోమని బొమ్మై ధీమాగా చెప్పారు. (చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం) -
సరిహద్దుపై మహారాష్ట్రతో ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇటీవల తారస్థాయికి చేరింది. తమ భూభాగాన్ని ఇచ్చేదే లేదంటూ ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదంపై కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరిహద్దు వివాదాన్ని మహారాష్ట్రనే సృష్టించిందని ఖండించింది. ఈ తీర్మానాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. ‘కర్ణాటక భూభాగం, నీళ్లు, భాష, కన్నడ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కర్ణాటక ప్రజలు, అసెంబ్లీ సభ్యుల మనోభావాలు ఈ అంశంలో ఒకటి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి మనమందరం ఐక్యంగా రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి కట్టుబడి ఉన్నాం. అనవసరంగా సరిహద్దు వివాదాన్ని సృష్టిస్తున్న మహారాష్ట్ర ప్రజల తీరును ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు సిద్ధమని తెలిపే ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.’ అని సభలో తీర్మానాన్ని చదవి వినిపించారు సీఎం బసవరాజ్ బొమ్మై. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో సరిహద్దు వివాదంపై మాట్లాడారు సీఎం బొమ్మై. అది కర్ణాటక ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఒక్క అంగుళం కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ లక్షణాలివే.. -
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. రంగంలోకి కేంద్రం
బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే వారం భేటీ కానున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం మీడియాకు ఈ విషయం చెప్పారు. ‘‘వివాదంపై తమ ప్రభుత్వ వైఖరి, వాస్తవాలను షాకు ఫోన్లో వివరించా. దీనిపై అఖిలపక్షం కూడా నిర్వహిస్తాం’’ అన్నారు. మహారాష్ట్రలో విపక్ష కూటమి మహావికాస్ అగాడీ ఎంపీలు అమిత్ షాను కలవడం తెలిసిందే. ‘‘కర్నాటక బీజేపీ ఎంపీలు సోమవారం అమిత్ షాను కలవనున్నారు. నేనూ ఆయనతో మాట్లాడా. ఇరువురు సీఎంలతో సమావేశం నిర్వహిస్తానని షా చెప్పారు. డిసెంబర్ 14, లేదా 15 తేదీల్లో భేటీ ఉంటుంది’’ అని బొమ్మై వివరించారు. ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
మళ్లీ సరిహద్దు రగడ
బెంగళూరు/ముంబై/బెళగావి: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తంగా మారుతోంది. బెళగావి నగరంలో మంగళవారం ఇరు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలపై పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకితీసుకున్నారు. మహారాష్ట్ర మంత్రులు, నేతలు తలపెట్టిన బెళగావి పర్యటనను నిరసిస్తూ కన్నడ సంఘాల సభ్యులు రోడ్లపైకి వచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు, పోస్టర్లు, కన్నడ జెండాలను ప్రదర్శిస్తూ మహారాష్ట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెళగావిలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తిరుగుతున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటి నెంబర్ ప్లేట్లపై నల్లరంగు పూశారు. కన్నడ సంఘాల నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ‘కర్ణాటక రక్షణ వేదిక’ ప్రకటించింది. మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభూరాజ్ దేశాయ్ మంగళవారం బెళగావిలో పర్యటించి, మహారాష్ట్ర ఏకీకరణ సమితి సభ్యులకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. కొన్ని కారణాలతో వారి పర్యటన వాయిదా పడింది. శివసేన నాయకులు కూడా బెళగావి పర్యటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. బెళగావి జిల్లా కలెక్టర్ నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని పుణేలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన కార్యకర్తలు కర్ణాటక వాహనాలపై రంగు చల్లారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నడిగుల ప్రయోజనాలు కాపాడుతాం: సీఎం బొమ్మై మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కోరారు. కన్నడిగులు ఎక్కడున్నా సరే వారి ప్రయోజాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయ పోరాటంలో తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా దాడులు ఆపాలి: పవార్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై కారణమని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులను 24 గంటల్లోగా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతిభద్రతలు దిగజారాయని, ఇందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. తమ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నా కేంద్రం, మహారాష్ట్ర సర్కారు నోరుమెదపడం లేదని పవార్ మండిపడ్డారు. బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆక్షేపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. ఏమిటీ వివాదం? రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. -
Honey Trap: వలపు వలలో చిక్కిన సీఎం బొమ్మై పీఏ!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సీఎం బొమ్మై సంతకాలతో కూడిన కీలకమైన పత్రాలను అతను ఓ ముఠాకు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదు వివరాలను పోలీస్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. సీఎం బసవరాజ బొమ్మై పీఏ(పర్సనల్ అసిస్టెంట్) హరీష్.. హనీట్రాప్‌కు గురయ్యాడు!. ఈ మేరకు విధానసౌధ పోలీస్ స్టేషన్లో జన్మభూమి ఫౌండేషన్ అధ్యక్షుడు నటరాజ్ శర్మ ఫిర్యాదు చేశారు. శాసన సభ నుంచే ఈ వలపు వల వ్యవహారం జరిగినట్లు ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. విధానసౌధ డీ-గ్రూపు మహిళా ఉద్యోగి ద్వారా ఓ ముఠా ఈ హనీట్రాప్‌కు పాల్పడినట్లు సమాచారం. హరీష్‌ను ట్రాప్ చేసిన ఆమె.. అతనితో ఏకాంతంగా గడిపింది. ఆ వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. హరీష్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు ఆ ముఠా సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పత్రాలు ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లినట్లు ఫిర్యాదులో నటరాజ్ ప్రస్తావించారు. బెంగళూరు కనకపుర దగ్గర కోట్లు విలువ చేసే భూముల్ని సదరు మహిళా ఉద్యోగిణి పేరిట హరీష్ కొనుగోలు చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీఎం పీఎం మాత్రమే కాదు.. చాలా మంది నేతలు, బ్యూరోక్రట్లపై కూడా హనీ ట్రాప్ జరిగిందని ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హరీష్‌ను పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్గానీ, సీఎం కార్యాలయంగానీ, రాజకీయ పార్టీలుగానీ ఈ హనీ ట్రాప్ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. -
పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు.. ( వైరల్ ఫొటోలు )
-
జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. బొమ్మై మెడకు మరో వివాదం!
బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంఓ స్వీట్ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్ మినట్ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. జర్నలిస్టులకు క్యాష్ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్ పలు మీడియా సంస్థల చీఫ్ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలు.. జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్ చేసిన లంచం కాదా? ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విటర్లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
విషాదం.. బీజేపీ సీనియర్ నేత ఆనంద్ కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) మధుమేహ వ్యాధిలో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో షుగర్ వ్యాధి కారణంగా లివర్ ఇన్ఫెక్షన్కు గురైంది. దీంతో, ఆనంద్‌ను బెంగళూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆనంద్ మమణి.. కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను తమిళనాడులోకి చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం.. మళ్లీ బెంగళూరుకు తీసుకువచ్చారు. ರಾಜ್ಯ ವಿಧಾನ ಸಭೆಯ ಮಾನ್ಯ ಉಪ ಸಭಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಆನಂದ ಮಾಮನಿ ಅವರು ನಿಧನರಾದ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನ ಮಣಿಪಾಲ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಪ್ರಾರ್ಥಿವ ಶರೀರದ ದರ್ಶನ ಪಡೆದು, ಕುಟುಂಬದ ಸದಸ್ಯರಿಗೆ ಸಾಂತ್ವನ ತಿಳಿಸಿದೆನು. ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/DMcLOzC49d — Basavaraj S Bommai (@BSBommai) October 22, 2022 కాగా, తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆనంద్ తుదిశ్వాస విడిచారు. ఇక, ఆనంద్ మమణి.. బెలగావి జిల్లాకు చెందిన సవదట్టి నియోజకవర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం.. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు.. ఆనంద్ మమణి మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. సీఎం బొమ్మై ట్విట్టర్ వేదికగా.. “మా పార్టీ ఎమ్మెల్యే, గౌరవనీయులైన రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనంద చంద్రశేఖర మామణి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ నివాళులు అర్పించారు. ನಮ್ಮ ಪಕ್ಷದ ಶಾಸಕರು, ರಾಜ್ಯ ವಿಧಾನಸಭೆಯ ಮಾನ್ಯ ಉಪ ಸಭಾಧ್ಯಕ್ಷರಾದ ಆತ್ಮೀಯ ಶ್ರೀ ಆನಂದ ಚಂದ್ರಶೇಖರ ಮಾಮನಿ ಅವರು ನಿಧನರಾದ ವಿಷಯ ತಿಳಿದು ಅತೀವ ದುಃಖವಾಗಿದೆ. ದೇವರು ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ನೀಡಿ, ಈ ನೋವನ್ನು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಅವರ ಕುಟುಂಬ ವರ್ಗಕ್ಕೆ ಕರುಣಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/PQq96zMKPI — Basavaraj S Bommai (@BSBommai) October 22, 2022 -
ఓపికపట్టండి! క్యాబినేట్ విస్తరణపై ఉత్కంఠ
బెంగళూరు: కేబినేట్ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ విషయమై కేంద్రంలోని బీజేపీతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఐతే కేబినేట్లో ఎవరిని చేర్చుకోవాలనే దానిపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు. సీనియర్లకు అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అని మీడియా ప్రశ్నించగా... రాజకీయ పరిస్థితుల కారణంగా ఆలస్యమవుతుందే తప్ప ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కొత్తమంది మంత్రులు పలు ఆరోపణలతో ఆయా మంత్రిత్వ శాఖలకు రాజీనామా చేశారు. మళ్లీ వాళ్లని చేర్చకుంటారా అని పలు ప్రశ్నలను సీఎం బొమ్మైపై సంధించింది మీడియా. దీనికి బొమ్మే స్పందనగా.. ఆశావాహులందరూ ప్రయత్నిస్తారు, కానీ చివరకు హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని కరాఖండిగా చెప్పరు. అందువల్ల అందరూ మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఓపికతో చూడాల్సిందేనని సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి తాజా ముఖాలకు చోటు కల్పించే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగకపోవడంతో సీఎం బొమ్మైపై గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయడం లేదా కొన్నింటిని తొలగించడం ద్వారా కొత్తవారికి అవకాశం ఇచ్చే నివేదికలు వచ్చినప్పటికీ... ఎలాంటి కార్యరూపం దాల్చే లేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు నాయకులు ఇది చాలా ఆలస్యం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ) -
‘రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. మళ్లీ ప్రయోగిస్తారేంటి?’
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాహుల్ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర పేరుతో మరోమారు ఫెయిల్డ్ మిసైల్‌ను కాంగ్రెస్ ప్రయోగిస్తోందని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఏకమైందని, ఫెడరలిజాన్ని నమ్ముతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు అర్థరహితమని దుయ్యబట్టారు. ‘దేశం బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలోనే రాహుల్ గాంధీ అనే మిసైల్ విఫలమైందని నేను చెప్పాను. ఇప్పుడు, మళ్లీ ఆయన్నే కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. దానిని పక్కనబెడితే.. అసలు ఈ యాత్రకు అర్థమే లేదు.’ అని పేర్కొన్నారు బొమ్మై. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్న తరుణంలో క్రమంలో దేశాన్ని ఏకం చేస్తామనేందుకు అసలు అవకాశమేలేదన్నారు బొమ్మై. జీ7తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. భారత్ 7 శాతం వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయి.. అందుకే పాదయాత్రకు ఆ పేరు.. -
‘నేను అవినీతి ఉద్యోగిని కాను’.. అని బోర్డు పెట్టి..
బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పే సీఎం అభియాన్ పేరుతో అవినీతి ఆరోపణలు గుప్పించడంతో బొమ్మై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. పేసీఎంకు సమాధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ వ్యతిరేక ప్రచారోత్సవం చేపట్టనుంది. నాకు ఎవరూ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అవినీతి ఉద్యోగి/ అధికారిని కాదు అనే నినాదంతో అక్టోబరు 2 నుంచి 20వ తేదీ వరకు అభియానను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పై నినాదంతో అన్ని ఆఫీసుల్లో బోర్డులు పెట్టాలని తెలిపారు. కాగా ఇటీవల యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోన్ని ముద్రించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుంది. ఈ ఫోటోని క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్ల లా ప్రింట్రింగ్ చేసి బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభిన సంగతి తెలిసందే. చదవండి: కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్లో నటుడి ఫోటో.. కోర్టుకెళ్తానని వార్నింగ్ -
'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ '40 శాతం కమీషన్ సర్కార్' పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించిన విషయం తెలిసిందే. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఓ పోస్టర్లో కాంగ్రెస్ తన ఫోటోను వాడుకుందని కన్నడ నటుడు అఖిల్ అయ్యర్ ఆరోపించాడు. తన అనుమతి లేకుండా తనకు సంబంధం లేని వ్యవహారంలో తన చిత్రాన్ని వాడటంపై అభ్యంతరం తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్‌ను షేర్ చేసి, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్‌ను హెచ్చరించాడు అఖిల్. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్‌ను ట్యాగ్ చేశాడు. I am appalled to see that my face is being used illegally and without my consent for "40% Sarkara" - an @INCIndia campaign that i have nothing to do with. I will be taking legal action against this.@RahulGandhi @siddaramaiah @INCKarnataka request you to please look into this pic.twitter.com/y7LZ9wRXW9 — Akhil Iyer (@akhiliy) September 23, 2022 'అవినీతి ఆకలితో ఉన్న ఈ 40శాతం కమీషన్ సర్కార్ 54,000 మంది విద్యార్థుల కెరీర్‌ను దోచుకుంది. ఇంకా మీలో చలనం రాదా?' అని కాంగ్రెస్ ఓ పోస్టర్‌ను రూపొందించింది. ఇందులో నటుడు అఖిల్ ఫోటోను ఉపయోగించింది. దీనిపైనే ఆయన అభ్యంతరం తెలిపాడు. చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా -
పేటీఎం తరహాలో ‘పేసీఎం’.. క్యూఆర్ కోడ్‌తో నేరుగా..!
బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభించింది. కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్‌ను ఎత్తిచూపేలా ఈ వెబ్సైట్, పోస్టర్లను డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్‌తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ -
CM Basavaraj Bommai: తెలంగాణ సర్కార్‌పై కర్ణాటక సీఎం ఆగ్రహం
బెంగళూరు: ‘40 పర్సెంట్ ప్రభుత్వానికి సుస్వాగతం’అని కర్ణాటక సీఎం గురించి హైదరాబాద్‌లో వేసిన ఫ్లెక్సీలపై సీఎం బసవరాజ బొమ్మై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనడానికి బొమ్మై హైదరాబాద్‌కు వస్తారని తెలిసి ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆదివారం బెంగళూరులో బొమ్మై మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అస్తవ్యస్తంగా మారతాయని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిని కర్ణాటకలో ప్రస్తావిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రశ్నించారు. ఇదొక పథకం ప్రకా రం చేసిన కుట్ర, ఇలాంటి వాటితో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు నాశనమ వుతాయని, ఎవరూ కూడా ఇలా చేయరాదని సూచించారు. ఒక రాష్ట్రంపై ఆధార రహిత ఆరోపణలను చేయటం సరికాదన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తాము ఫ్లెక్సీ వేస్తే ఎలా ఉంటుందని బొమ్మై ప్రశ్నించారు. కాగా, కర్ణాటకలో అన్ని పనుల్లో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. చదవండి: (మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు) -
గుండెపోటుతో మంత్రి హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో బెంగుళూరు డాలర్స్ కాలనీలోని తన ఇంటిలో కుప్పకూలిపోయాడు. వెంటనే మంత్రిని బెంగుళూరులోని రామయ్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రికి స్పృహ లేకపోవడం, శ్వాస తీసుకోకపోవడంతో.. వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించకపోవడంతో మంగళవారం అర్థరాత్రి 11.40 నిమిషాలకు మంత్రి ఉమేష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఉమేష్ కత్తి మృతి పట్ల సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. ఉమేష్ తనకు తమ్ముడు లాంటి వాడని, అతని మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘నా సన్నిహిత మిత్రుడిని కోల్పోయాను, నాకు తను సోదరుడు, తనకు కొన్ని గుండె జబ్బులు ఉన్నాయని తెలుసు. కానీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళతాడని ఊహించలేదు. తను రాష్ట్రానికి ఎంతో సేవలు చేశాడు. అనేక శాఖలను సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆయన మరణం రాష్ట్రానికి భారీ నష్టం. మాకు పెద్ద శూన్యతను మిగిల్చాడు, దీనిని పూరించడం చాలా కష్టం’ అని బొమ్మై అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఉమేష్ కత్తి స్వస్థలం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా, ఖడకలాట గ్రామం. ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహా ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అయిదుసార్లు మంత్రిగా సేవలందించాడు. ప్రస్తుతం అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు. చదవండి: అమిత్ షా యాక్షన్ ప్లాన్.. ఢిల్లీలో మెగా మీటింగ్ -
వరదలపై సమీక్షా సమావేశం.. నిద్రపోయిన మంత్రి
బెంగళూరు: అకాల వర్షాలతో బెంగళూరు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలో వరద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐతే ఆ సమావేశంలో కర్ణాటక మంత్రి ఆర్ ఆశోక్ నిద్రపోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేస్తూ.... విమర్శల దాడికి దిగింది. రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలతో మునిగిపోతుంటే.... మంత్రి నిద్రమత్తులో మునిగిపోతున్నారంటూ కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. వాస్తవానికి కర్ణాటక మంత్రి ఆశోక్ కుమార్ కూడా సోమవారం, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగిన వరద సమీక్ష సమావేశానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో పంచుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు జిల్లాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాదు ఆ సమావేశంలో బెంగళూరు ప్రజలను వరదల పరిస్థితి నంచి గట్టేక్కించేందుకు ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందించే నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేయాలని సీఎం బొమ్మె నిర్ణయించినట్లు పేర్కొన్నారు కూడా. ಮುಳುಗುವುದರಲ್ಲಿ ಹಲವು ವಿಧಗಳಿವೆ! ರಾಜ್ಯದ ಜನ ಮಳೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ, ಸಚಿವರು ನಿದ್ದೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ! ಪ್ರವಾಹ ಪರಿಶೀಲನೆಯ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ನಲ್ಲಿ ಸಚಿವ @RAshokaBJP ಅವರ ಭರ್ಜರಿ ನಿದ್ದೆ. 'ಹಲಾಲ್ ಕಟ್' ಎಂದರೆ ಥಟ್ನೆ ಎಚ್ಚರಾಗುತ್ತಾರೆ! 'ಚಿಂತೆ ಇಲ್ಲದವಗೆ ಸಂತೆಲೂ ನಿದ್ದೆ' ಎಂಬ ಮಾತು ಸಚಿವರಿಗೇ ಹೇಳಿದ್ದೇನೋ! pic.twitter.com/e11pzCibwZ — Karnataka Congress (@INCKarnataka) September 6, 2022 ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರೊಂದಿಗೆ ಪ್ರವಾಹ ಪೀಡಿತ ಜಿಲ್ಲೆಗಳ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ ನಡೆಸಿ, ರಕ್ಷಣೆ ಮತ್ತು ಪರಿಹಾರ ಕಾರ್ಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ ನಡೆಸಲಾಯಿತು. @BSBommai @BJP4India @CMofKarnataka pic.twitter.com/e7BEd6wwRt — R. Ashoka (ಆರ್. ಅಶೋಕ) (@RAshokaBJP) September 5, 2022 (చదవండి: బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు) -
బెంగళూరు వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై
వరదల్లో బెంగళూరు.. ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. తాగునీటి-విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్నారు నగరవాసులు. ఈ తరుణంలో సహాయక చర్యలపైనా రాజకీయ విమర్శలు రావడంతో.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. బెంగళూరు వర్షాలు-వరదలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవ పరిస్థితి. దానిని దాచలేం. అయితే ఈ స్థితికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలూ ఓ కారణమే. అంతేకాదు నగరం ఇలాంటి దుస్థితిని ఎదుర్కొవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా కారణమని ఆరోపిస్తున్నారు ఆయన. నగరం ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం గత ప్రభుత్వ తీరే. తలాతోక లేకుండా పాలించారు వాళ్లు. ఎటు పడితే అటు కట్టడాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. చెరువుల నిర్వాహణను ఏనాడూ పట్టించుకోలేదు. పైగా అవినీతితో చెరువు, కుంటలల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. అందుకే నగరం ఇవాళ నీట మునిగింది. అయినప్పటికీ ఆటంకాలకు దాటుకుని ఎలాగైనా నగరంలోని పరిస్థితులను పునరుద్ధరిస్తాం. అలాగే మునుముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతాం అని పేర్కొన్నారాయన. కర్ణాటక.. ప్రత్యేకించి బెంగళూరులో ఈ తరహా వర్షాలు మునుపెన్నడూ కురిసింది లేదు. గత 90 ఏళ్లలో రికార్డు స్థాయిలో వానలు కురవడం ఇదే. చెరువులన్నీ నిండిపోయాయి. నాలాలు నింగి.. వరద నీరు ఓవర్‌ఫ్లో అయ్యింది. కొన్ని కట్టలు తెగిపోయాయి. చిన్నచిన్న ప్రాంత్లాలో నాలాల సంఖ్య ఎక్కువగా ఉండడం, అక్రమకట్టడాలు కూడా ఇందుకు కారణాలయ్యాయి. దాదాపు ప్రతీ రోజూ కురుస్తుండం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పారాయన. బెంగళూరు వరదలను ఛాలెంజ్‌గా తీసుకుని.. అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు నిరంతరాయం పని చేస్తున్నట్లు వెల్లడించారాయన. పరిస్థితి చక్కబడగానే అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారాయన. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వరదల విషయంలో ప్రభుత్వందే తప్పని విమర్శిస్తోంది. ఈ మేరకు వరద నీళ్లలోనే నిరసనలు తెలుపుతున్నారు అక్కడి నేతలు. ఇదీ చదవండి: స్కూటీ స్కిడ్ అయ్యి పోల్ పట్టుకుంది.. విద్యుద్ఘాతంతో యువతి మృతి -
భారీ వర్షాలకు బెంగళూరు జలమయం.. వాగుల్లా మారిన రోడ్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వీధులు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపుర రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఅవుట్ ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మారథహళ్లిలోని స్పైక్ గార్డెన్లో ద్విచక్ర వాహనాలు వరదనీటిలో పడవల్లా కొట్టుకుపోయాయి. మారథహళ్లి సిల్క్ బోర్డు జంక్షన్లో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని సహాయ బృందాలు రక్షించాయి. #bangalorerain #bangaloretraffic #Bangalore Scene at 5:55am outside Village Super Market, Spice Garden, Marathahalli. 2-wheelers floating. Road from Spice Garden to Whitefield completely blocked pic.twitter.com/x4oWokLP4P — Ishkaran Talwar (@Ishkaran) September 5, 2022 #bangalorerain #rohan #Waterfall #societywaterfall #flood #Bangalore Bangalore rains has reached its heights. Even premium societies are facing flooding for the first time. @CMofKarnataka : Please help us. pic.twitter.com/ydxkge0Eem — ansu jain (@ansujain) September 4, 2022 #WATCH | Karnataka: A man was rescued by local security guards after he was stuck on a waterlogged road near Marathahalli-Silk Board junction road in Bengaluru pic.twitter.com/gFnZtzk6mu — ANI (@ANI) September 5, 2022 నీటమునిగిన ప్రాంతాల్లో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సహాయక బృందాలను రంగంలోకి దించి జలదిగ్భంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరదలకు సంబంధించిన ఫోటోలను నగరవాసులు సామాజిక వేదికగా షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు చరిత్రోలనే తొలిసారి ప్రీమియం సొసైటీల్లో కూడా వరద నీరు చేరిందని పేర్కొన్నారు. సాయం అందించాలని సీఎం బసవరాజ్ బొమ్మైని విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Karnataka | Several parts of Bengaluru remain inundated due to severe waterlogging after heavy rainfall. Visuals from Eco space area on Marathahalli - Silk Board junction road pic.twitter.com/kfcsAVn7U7 — ANI (@ANI) September 5, 2022 మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 10 నిమిషాలు వర్షం పడితే బెంగళూరులో పరిస్థితి ఇలా ఉంటుందా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక పన్నులు కడుతున్న తమకు సరైన మౌళిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేరా? అని ప్రశ్నించారు. భారీ వర్షాల ధాటికి ఐటీ పార్కులను అనుసంధానించే ఔటర్ రింగ్ రోడ్డుపై వరద నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్ 9 వరకు బెంగళారులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చికమగళూరు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. చదవండి: భళా.. బాలకా.. 15 ఏళ్లకే చెన్నై నుంచి లేహ్‌కు సైకిల్ యాత్ర -
నేను కీలుబొమ్మను కాదు.. కర్నాటక సీఎం సంచలన వ్యాఖ్యలు
శివాజీనగర: రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం నూతన ముఖ్యమంత్రి అన్వేషణలో ఉందనే వార్తలను కర్నాటక సీఎం బసవరాజ బొమ్మై తోసిపుచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, రానున్న ఎన్నికలు తన నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ పూర్తి సహకారం ఇచ్చిందని, పరిపాలనలో ఏ సీనియర్ నాయకుల జోక్యం లేదని, తాను ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప ప్రతిరోజు పరిపాలనలో మార్గదర్శనం చేస్తారు, అంతే తప్ప నిత్యం వేలు పెడతారనే విమర్శలు నిరాధారమైనవని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న హిందుత్వ, హత్య, అల్లర్లకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానలే కారణమని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ చేసే అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు, వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ కాంట్రాక్టర్ల సంఘం నేతలందరూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మార్పిడి చట్టం అవసరమని, పార్టీ ఎమ్మెల్యే తల్లి మతం మారింది. అందువల్ల ఈ చట్టం అనివార్యమైందని, చట్టం వచ్చాక మత మార్పిళ్లు తగ్గాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు -
‘బొమ్మై’ ప్రభుత్వంలో ‘అవినీతి’ అందలం.. ప్రధానికి 13,000 స్కూల్స్ ఫిర్యాదు!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ సుమారు 13,000 పాఠశాలలు.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాయి. ‘ద అసోసియేటెడ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్’, ‘ద రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్’.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశాయి. విద్యాసంస్థలకు గుర్తింపు పత్రం జారీ కోసం రాష్ట్ర విద్యాశాఖ లంచం డిమాండ్ చేసిన ఘటనను పరిశీలించాలని కోరాయి. ‘అశాస్త్రీయమైన, అహేతుకమైన, వివక్షణ లేని, పాటించని నిబంధనలు అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. భారీ అవినీతి జరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, వాటిని పక్కనపెట్టేశారు. బీసీ నగేశ్ రాజీనామా చేయాలి. మొత్తం వ్యవస్థలోని దుర్భర పరిస్థితులను అర్థం చేసుకోవటం, సమస్యలను పరిష్కరించటంలో విద్యాశాఖ అలసత్వం వహిస్తోంది. పాఠశాలల బడ్జెట్‌కు ఇద్దరు బీజేపీ మంత్రులు తీరని నష్టం చేకూరుస్తున్నారు. మరోవైపు.. వారి విద్యాస్థల్లోకి భారీగా పెట్టుబడి దారులను ఆహ్వానిస్తూ విద్యార్థుల నుంచి అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.’ అని లేఖలో పేర్కొన్నాయి పాఠశాలల యాజమాన్యాలు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం సూచించిన పుస్తకాలు పాఠశాలలకు చేరలేదని అసోసియేషన్స్ ఆరోపించాయి. తల్లిదండ్రులు, విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆచరణాత్మకంగా అమలు చేయగల నిబంధనలను రూపొందించి.. నియంత్రణలను సరళీకరించడానికి విద్యాశాఖ మంత్రికి శ్రద్ధ లేదని పేర్కొన్నాయి. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని కర్ణాటక విద్యాశాఖ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరాయి. ఇదీ చదవండి: Jayalalitha Death Mystery: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు -
కర్ణాటక సీఎం అసమర్థుడు.. ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసమర్థుడని తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఎన్నుకోలేదని ఆరోపించారు. మైసూరులో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టారు ప్రతిపక్షనేత సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన లేవని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ మంత్రి మధుస్వామే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం 40శాతం కమీషన్ అడుగుతోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సమాఖ్య ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. మంత్రి మధుస్వామి టెలిఫోనిక్ సంభాషణ ఇటీవలే లీకైంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఏదో తామే అలా నెట్టుకొట్టుస్తున్నామని ఆయన అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అధికార బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. చదవండి: బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ -
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు.. సీఎం పోస్టుకు రూ. 2,500 కోట్లు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో ముఖ్యమంత్రి పోస్టు విలువ ఏకంగా రూ. 2,500 కోట్లు ధర పలుకుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడే చెప్పినట్లు అసెంబ్లీలో హరిప్రసాద్ అన్నారు. బీజేపీ సీనియర్ నేత చెప్పిన దాని ప్రకారం.. సీఎం పదవికోసం అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ప్రమేయం ఉంది. సీఎం కుర్చీ కోసం రూ. 2,500 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. అయితే ఆ బీజేపీ నాయకుడి పేరు మాత్రం ప్రతిపక్షనేత హరిప్రసాద్ ప్రస్తావించలేదు. చదవండి: ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. సస్పెన్షన్ వేటు కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మారనున్నారని గత నెల రోజులుగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం సీఎం పీఠంపై నుంచి బసవరాజ్ బైమ్మైను తొలగించి ఆయన స్థానంలో మరొకరిని కూర్చొబెట్టనున్నారని ప్రచారం సాగింది. దీనికి తోడు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్లో సభ్యుడిగా చేర్చడంతో బీజేపీ అధిష్టానం బొమ్మైకు ఉద్వాసన పలుకనుందని తాజా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లను బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తోసిపుచ్చారు. బొమ్మైను తొలగించే ప్రశ్నే లేదన్నారు. తన నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని. బొమ్మై తన పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని అన్నారు. అలాగే బొమ్మై నాయత్వంలోనే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. -
కర్ణాటక మంత్రి ఆడియో కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త చిక్కులు!
బెంగళూరు: కర్ణాటకలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండనుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర మంత్రి ఆడియో లీక్ కావటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ‘తాము ప్రభుత్వాన్ని నడపటం లేదు.. మేనేజ్ చేస్తున్నాం’ అంటూ న్యాయ, పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి జేసీ మధుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు బొమ్మై. ఆ వ్యాఖ్యలు వేరే ఉద్దేశంతో చేసినవిగా సీఎం పేర్కొన్నారు. కాగా మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలతో కొందరు మంత్రులు విమర్శలు గుప్పించారు. పదవి నుంచి మధుస్వామి తప్పుకోవాలని ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్నం సూచించారు. ఈ క్రమంలో మంత్రులతో తాను మాట్లాడనున్నట్లు సీఎం చెప్పారు. మధుస్వామిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన(మధుస్వామి) వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో మాట్లాడతాను. తన ఉద్దేశం వేరు. ఆ మాటలను తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు. పరిస్థితులు సరిగానే ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. ఇతర మంత్రులతోనూ మాట్లాడతాను.’ అని పేర్కొన్నారు. కర్ణాటక మంత్రి మధుస్వామి, చెన్నపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో శనివారం వైరల్‌గా మారింది. రైతుల సమస్యలను సూచిస్తూ కోఆపరేటివ్ బ్యాంకుపై భాస్కర్ ఫిర్యాదు చేసిన క్రమంలో..‘ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు, కేవలం మేనేజ్ చేస్తున్నాం. మరో 7-8 నెలలు లాక్కొస్తాం.’ అని మధుస్వామి పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు చేసేందుకు బీజేపీ ఆలోచిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ఆడియో లీక్ కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: బాలుడి హత్య.. కాంగ్రెస్‌లో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా -
కర్ణాటక సీఎం బొమ్మైకి పదవీ గండం.. మార్పు తప్పదా?
బెంగళూరు: కర్ణాటకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత.. మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందని బీజేపీలో చర్చ మొదలైంది. ఆగస్టు 15వ తేదీలోపు సీఎం బసవరాజ్ బొమ్మై స్థానంలో మరొకరిని కూర్చోబొట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్పులపై మాట్లాడిన వారిలో బీజేపీ లీడర్ బసనగౌడ పాటిల్ సైతం ఉన్నారు. ఆయన గతంలో బీఎస్ యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రి చేయనున్నారని అంచనా వేశారు. ఏడాది తర్వాత ఆయన అంచనాలే నిజమయ్యాయి. పాటిల్ తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీకి మేలు చేసే నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. ఆయన మాటలను బీ సురేశ్ గౌడ ఏకీభవించారు. దీంతో బొమ్మైకి వీడ్కోలు పలకక తప్పదనే సంకేతాలిచ్చారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ ఈ వాదనలను తోసిపుచ్చారు. బసవరాజ్ బొమ్మై తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లీలో బీజేపీ యూత్ వింగ్ నేత హత్య తర్వాత బొమ్మైకి మరిన్ని చిక్కులు వచ్చాయి. సొంత ప్రజలను కాపాడుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు.. సీఎం కానీ, రాష్ట్ర అధ్యక్షుడిని కానీ తొలగించే ఆలోచన లేదని, వారి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక. బొమ్మై కీలుబొమ్మగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయగా.. మీకు ప్రధాని మోదీ, అమిత్ షాలు చెప్పారా? అంటూ సమాధానమిచ్చారు అశోక. 2018లో జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే.. ఏడాది తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కూలదోసి బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు 2021, జూలైలో బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023, మేలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా తక్షణమే ఐసోలేషన్లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తనకు కరోనా సోకడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. I have tested positive for Covid-19 with Mild symptoms and have isolated myself at home. Those who came in touch with me in last few days, kindly isolate yourself and get urself tested. My trip to Delhi stands cancelled. — Basavaraj S Bommai (@BSBommai) August 6, 2022 అయితే బొమ్మై జులై 25, 26న ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన వివిధ శాఖల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్‌గా తేలడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. చదవండి: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన.. మోహన్ మార్కం, ఎందుకంటే? -
‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!
బెంగళూరు: భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత ప్రవీణ్ నెట్టార్‌ను పొట్టనబెట్టుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. దేశ వ్యతిరేకులు, మతతత్వ శక్తులను ఏరిపారేసేందుకు అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రవీణ్ హంతకులను ఎన్కౌంటర్ చేయాలని కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ్ అన్నారు. ప్రవీణ్‌ను దక్షిణ కన్నడ జిల్లాలోని ఆయన సొంతూరులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బైక్‌పై వెంబడించి దారుణ హత్య.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు ఈనెల 27న దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు. ఇదీ చదవండి: Karnataka BJP Leader Murder: అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్.. బైక్‌పై వెంబడించి మరీ బీజేపీ నేతను చంపారు -
అమర్నాథ్లో కన్నడిగులు క్షేమం: సీఎం
శివాజీనగర: జమ్ముకశ్మీర్‌లోని అమర్నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు సంభవించి పలువురు మరణించడం తెలిసిందే. దీంతో యాత్రను రద్దు చేశారు. అమర్నాథ్ పర్యటనలో వంద మందికి పైగా కన్నడిగులు ఉన్నారు. వారి రక్షణకు చర్యలు తీసుకున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై, రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు. శనివారం సీఎం మాట్లాడుతూ కన్నడిగులు అందరూ క్షేమమని, ఎలాంటి అవాంఛనీయాలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు. 15–20 మంది ఫోన్ చేసి తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పగా, అక్కడి అధికారులతో మాట్లాడి సాయం చేయాలని కోరామన్నారు. సహాయం అవసరమైతే సహాయవాణికి కాల్ చేయాలన్నారు. మైసూరు లాయర్లు సురక్షితం మైసూరు: అమర్నాథ్ వరద విపత్తు నుంచి మైసూరు నగరానికి చెందిన న్యాయవాదుల బృందం కొంచెంలో తప్పించుకుంది. వరదలో చిక్కుకున్న తమను సైనికులు కాపాడినట్లు తెలిపారు. మైసూరు తాలూకాలో మరటి క్యాతనహళ్లికి చెందిన ఎ.జె.సుధీర్, గుంగ్రాల్ శివరామ్, ఎస్.రఘు, మైసూరువాసి జి.కే.జోషి, హెబ్బాలవాసి కే.టి.విష్ణు. లోకేష్, తిలక్, ప్రదీప్‌కుమార్ తదితరులు జూలై నెల 4 వ తేదీన అమర్నాథ్లో పరమశివుని గుహ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఎగువన హిమాలయాల్లో ప్రచండమైన వరదలు రావడంతో గుహ వద్ద పెద్ద ప్రవాహం దూసుకొచ్చింది. కొండ చరియలు కూడాకొట్టుకొచ్చాయని తెలిపారు. ఇంతలో సైనికులు తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని ఫోన్లో తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్: 011–23438252, 011–23438253 కాశ్మీర్ హెల్ప్ లైన్: 0914–2496240 దేవాలయ పాలక మండలి సహాయవాణి:01914–2313149 కర్ణాటక కేంద్రం: 080–1070, 22340676 -
అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి) అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ అంచనా వేయడంతో కోస్తా కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు అధికారులు పూర్తిగా మూసేశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. సీఎం ఆదేశం రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, ముంపు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక, శాశ్వత పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమీషనర్లను తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. చదవండి: మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మూడు రోజులపాటు ఇలాగే 11.50 AM Update: Light SWM rains in Bannerghatta road.#Bangalorerains #Karnatakarains pic.twitter.com/zerxi4EbVR — Namma Weather (@namma_vjy) July 7, 2022 ఆస్తి నష్టం భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తీరప్రాంతాలు, మల్నాడు ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు నెకొరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. నదులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు వ్యవసాయ పొలాలును ముంచెత్తాయి. చదవండి: Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మంగళూరు జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని పంజికల్లు గ్రామం వద్ద బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో పొలంలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు మట్టిలో చిక్కుకున్నారు.వీరిలో ముగ్గురిని రక్షించగా, ఇద్దరు గురువారం ఉదయం మరణించినట్లు అధికారులు తెలిపారు. -
Sakshi Cartoon: సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు!
సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు! -
లైవ్ లోనే అందరి ముందు కంటతడి పెట్టిన బీజేపీ సీఎం
-
సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం
బెంగళూరు: భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. అందుకే ఆ ముఖ్యమంత్రి ఆ సినిమాను చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆయన అంతలా ఎమోషనల్ కావడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉందండోయ్. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తాజాగా రక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్. అయితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా ఏడ్చేశారు. బొమ్మై గతంలో స్నూబీ అనే కుక్కను పెంచారు. ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ శునకం కన్నుమూసింది. దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు. Okayyyyy…. I think I like our CM much more now. This is when they lost ‘Sunny’- their 14 year old family dog. #BasavarajBommai pic.twitter.com/4ECmQMdLA6 — Sangita (@Sanginamby) July 29, 2021 కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. షరతులు లేని ప్రేమ(అన్‌కండిషనల్ లవ్) గురించి మాట్లాడుతున్నాను. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది.. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారాయన. -
113 ఏళ్లలో.. నెల వర్షం ఒక్క రోజులోనే!
బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత కుమ్మరించింది. ఈ మంగళవారం 11.46 సెంటీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ కేంద్రం నమోదు చేసింది. సాధారణంగా మే నెలలో బెంగళూరులో సగటు వర్షపాతం 10.74 సెంటీమీటర్లు కాగా, మంగళవారం రాత్రి ఒక్కరోజులోనే ఆ వర్షం కురిసింది. గురువారం కూడా ముంపులోనే ఉన్న బెంగళూరులోని హొరమావు ప్రాంతం దీంతో గురువారంనాటికి కూడా అనేక ప్రాంతాలు ముంపులోనే మగ్గుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడానికి మార్గం లేదు. ఇళ్లు, అపార్టుమెంట్ల చుట్టూ వాననీరు, బురద మేటవేసింది. ఇలాగే కొనసాగితే ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలతో తలెత్తే ప్రమాదాలను తప్పించడానికి సుమారు రూ.1600 కోట్లతో బెంగళూరులోని కాలువలను అభివృద్ధి చేస్తామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. గురువారం నగరంలో వర్ష బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. డ్రైనేజీలు, భూగర్భ డ్రైనేజీలను మరమ్మతు చేసి వాననీరు సజావుగా వెళ్లేలా చేస్తామన్నారు. ఒకేసారి ఇంత భారీ వర్షం రావడంతో ఇళ్లలోకి చొరబడి ఇబ్బందులు సృష్టించిందన్నారు. ఇళ్లలోకి నీరుచేరి నష్టపోయిన వారికి రూ.25 వేలు పరిహారం అందిస్తాం, ఒకవారం పాటు ఆహారం అందిస్తామని తెలిపారు. నిర్ణీత అవధిలోగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. నగరోత్థాన పథకం, స్మార్ట్‌సిటీ పనుల్లో ఆలస్యం వద్దని ఆదేశించారు. పదేపదే పనులు ఆలస్యం చేయడంతో ప్రభుత్వానికి ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అసమాధానం వ్యక్తం చేశారు. సీఎం ముందు జనాగ్రహం జేసీ నగర లేఔట్లో పలువురు మహిళల వర్ష కష్టాలపై సీఎంకు ఏకరువు పెట్టారు. అక్కడ నుంచి కమలానగర మెయిన్‌రోడ్డు, శంకరమఠ దేవస్దాన, హెచ్ఆర్బీఆర్ లేఔట్ తదితర ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నగరంలో గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంపుప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం చేరినప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపట్టలేదని బాధిత ప్రజలు సీఎం ముందు ఆక్రోశం వెళ్లగక్కారు, తాగునీరు, విద్యుత్ లేవు, తినడానికి ఆహారం కూడా లేదు, అధికారులెవరూ మా వద్దకు వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు మండిపడ్డారు. మేము పాలికెకు పన్నులు చెల్లించడం లేదా, ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. బాధితులను సీఎం సమాధానపరిచారు. చదవండి: Viral Video: రోడ్డుపైనే జుట్టు పట్టుకొని తన్నుకున్న విద్యార్థినిలు -
Sakshi Cartoon: ఆయన ఎన్నికైన సీఎం కాదు, డబ్బిచ్చి సీఎం అయ్యారు-కాంగ్రెస్
ఆయన ఎన్నికైన సీఎం కాదు, డబ్బిచ్చి సీఎం అయ్యారు-కాంగ్రెస్ -
డబ్బులిచ్చి సీఎం పదవి కొన్న బొమ్మై: సిద్ధు సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదని, సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారనివిమర్శించారు. ఈ మేరకు బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొమ్మై నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారిందన్నారు. ‘డబ్బులిచ్చి ముఖ్యమంత్రి అయిన బొమ్మె ఎందుకు పనిచేస్తాడని, ఆయన్ను ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి వారి సూచనలను పాటించడం అతనికి సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, ఐదేళ్లపాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి 15 లక్షల ఇళ్లు కట్టించచినట్లు సిద్ధ రామయ్య తెలిపారు. చదవండి: కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్? కాగా రూ.2,500 కోట్లిస్తే సీఎం చేస్తామంటూ కొందరు తనను సంప్రదించారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ ఇటీవలే ఆరోపించడం తెలిసిందే. -
ఇది నయా భారత్...‘హద్దులు’ మీరితే అంతే
బెంగళూరు: ‘‘ఇది నయా భారత్. సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తోంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో ఉరి, పుల్వామాల్లో ఉగ్రవాదుల దాడులకు సర్జికల్ దాడులతో మర్చిపోలేని రీతిలో బదులిచ్చామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ భద్రతపై ఎన్నో విధాలుగా రాజీ పడిందని నిప్పులు చెరిగారు. పాక్ దన్నుతో ఉగ్రవాదులు దాడులకు దిగితే హెచ్చరిక ప్రకటనలతో సరిపెట్టేదన్నారు. కానీ మోదీ ప్రభు త్వం వచ్చాక పరిస్థితులన్నీ మారాయని చెప్పారు. మంగళవారం బెంగళూరులో నృపతుంగ వర్సిటీ ప్రారంభోత్సవం తదితరాల్లో షా పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370, 35–ఏ రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు అమలు వంటి పలు ఘనతలు మోదీ సర్కారు సొం తమన్నారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు చేస్తే రక్తపాతం తప్పదన్న బెదిరింపులను బేఖాతరు చేస్తూ కశ్మీర్‌ను మిగతా భారత్‌లో కలిపేశారు మోదీ’’ అన్నారు. బొమ్మైకి అమిత్ షా అభయం సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని మారుస్తారన్న వార్తలకు అమిత్ షా చెక్‌పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా బొమ్మై కొనసాగుతారని స్పష్టం చేసినట్లు తెలిసింది. సీఎం నివాసంలో విందులో షా పాల్గొన్నారు. పార్టీలో భిన్న స్వరాలు, అసమ్మతుల విషయం తాము చూసుకుంటామని సీఎంకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో ఆకస్మిక పర్యటన సొంత పార్టీతో పాటు అంతటా చర్చనీయాంశమైంది. అమిత్‌షా నేడు మంగళవారం జరిగే బసవ జయంతి ఉత్సవంలో పాల్గొంటారు. ఇందులో సీఎం బొమ్మై, పార్టీ అగ్రనేతలు, మంత్రులు కూడా ఉంటారు. అనంతరం అమిత్ షా ఆర్టీ నగరలోని సీఎం బొమ్మై ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం సీఎం నివాసంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. వరుస సమస్యల నేపథ్యంలో గత నెల రోజుల్లో రెండుసార్లు సీఎం బొమ్మై ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు సర్కారు సమస్యలను కూడా ఏకరువు పెట్టినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా బొమ్మై ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు సర్కారులోని లుకలుకలను పరిష్కరించడానికి ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగినట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరుతో ఆయన ఆకస్మిక పర్యటనకు నాంది పలికినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వరుసగా ఏదో ఒక కుంభకోణం బొమ్మై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. కొన్నినెలల కిందట బిట్‌కాయిన్ స్కాం, తాజా ఎస్ఐ పరీక్షల కుంభకోణం, ఆ మొన్న కాంట్రాక్టరు ఆత్మహత్య వల్ల సీనియర్ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయడం తదితరాలు పార్టీ హైకమాండ్‌ను ఆలోచనలో పడేశాయి. దీంతో మొదట ఇంటిని చక్కదిద్దుకోవాలని నిశ్చయించింది. పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన మార్పులు, కొత్తగా చేరికలు, ప్రచార కార్యక్రమాలపై అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఫలితంగా పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. పాలనలో మార్పులు తెస్తాం : సీఎం రానున్న రోజుల్లో పరిపాలనలో పెనుమార్పులు తీసుకొస్తామని సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం విధానసౌధలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ సామర్థ్య అభివృద్ధి సెమినార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి పథకాలు చేరాలి, అప్పుడే ప్రజాప్రభుత్వ ఆశయాలు నెరవేరుతాయన్నారు. కాగా, కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోకి చేర్చుకొంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పడం అవివేకమని విమర్శించారు. మహారాష్ట్రలో కన్నడభాషను అధికంగా మాట్లాడే ప్రాంతాలను గుర్తించి వాటిని కర్ణాటకలోకి చేర్చుకోవడంపై తాము కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు బొమ్మై చెప్పారు. (చదవండి: కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?) -
కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు?.. జోరుగా ప్రచారం..
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు, కాంట్రాక్టర్ ఆత్మహత్య వంటి వివాదాలు తెరపైకి రావడంతో సీఎం బొమ్మై సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టమని భావించిన బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు(సోమవారం) బెంగుళూరులో పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులతో చర్చించి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. దీనికితోడు బీజేపీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానికి ఉందంటూ గుజరాత్లో చేసినట్లే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా.. కొంతకాలానికే ఆయను తొలగించి బసవరాజ్ బొమ్మైని సీఎంగా అధిష్టానం నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు అవుతోంది. త్వరలోనే బొమ్మై తన కేబినెట్‌ను త్వరలో విస్తరించాలని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా బెంగళూరు వస్తుండటంతో, పార్టీ నాయకత్వ మార్పు గురించి చర్చిస్తారనే ప్రచారం ఊపందుకుంది. చదవండి: మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే స్పందించిన యడియూరప్ప కర్ణాటకలో సీఎం మార్పు అంటూ వస్తున్న పుకార్తపై మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప స్పందించారు. తనకు తెలిసినంత వరకు రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరిగే అవకాశం లేదని అన్నారు. సీఎం బొమ్మై అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ యడియూరప్ప కితాబు ఇచ్చారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో 150 అసెంబ్లీ సీట్లు సాధించే దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వ్యూహాలపై సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. -
ఫోర్త్ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు
బనశంకరి: కోవిడ్ నాలుగో దాడి పేరుతో అనవసరంగా ఎలాంటి ఆంక్షల్ని విధించరాదని, అవసరమైనంత వరకే నిబంధనలు ఉండాలని ప్రధాని మోదీ సూచించారు, ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకున్నామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. బుధవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సీఎంల వీడియో సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి గురించి చర్చించాను. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ నెల 9 తరువాత బెంగళూరులో పాజిటివ్ రేటు పెరిగింది అని చెప్పారు. ప్రతిరోజు 30 వేల కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేలకు పైగా పడకలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ను సిద్ధం చేశామన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం అనుమతించిందన్నారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని, అలాగే వసతులను పెంచాల్సి ఉందన్నారు. జూన్ మొదటివారం నుంచి కేసులు పెరగవచ్చు కరోనా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌తో పాటు కొన్ని కఠిన నియమాలను తెస్తారనే వార్తలను ఆరోగ్య మంత్రి సుధాకర్ తిరస్కరించారు. జూన్ మొదటి వారంలో కోవిడ్ వేవ్ రావచ్చునని నిపుణులు తెలిపారు, ముందు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వేస్తామని, 18 ఏళ్లు దాటినవారు వారికి రెండోడోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో టీకాను వేసుకోవచ్చన్నారు. కోవిడ్ కాంట్రాక్టు వైద్య సిబ్బంది సేవలను 18 నెలల వరకు పొడించాలని ఆర్థికశాఖను కోరినట్లు తెలిపారు. నాలుగో వేవ్‌కు బీబీఎంపీ సిద్ధం కోవిడ్ నాలుగో వేవ్ పంజా విసిరితే సమర్థంగా ఎదుర్కొనేందుకు బీబీఎంపీ సిద్ధమైంది. సిబ్బంది, ఆరోగ్యచికిత్స పరికరాలను సమకూర్చుకోవడంలో పాలికె అధికారులు నిమగ్నమయ్యారు. బెంగళూరులో నిత్యం 60 నుంచి 80 కేసులు వెలుగుచూస్తున్నాయి. బెళందూరు, గసంద్ర, కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, వర్తూరు, హూడి, కాడుగోడితోపాటు మొత్తం 10 వార్డుల్లో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ చికిత్సకు నాలుగు ఆసుపత్రుల్లో 1,365 సాధారణ పడకలు, ఐసీయు, వెంటిలేటర్ తో పాటు మొత్తం 2392 పడకలు సిద్ధం చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండోడోస్ వేసుకోనివారి ఆచూకీ కనిపెట్టి పోలీసుల సాయంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలని యోచిస్తున్నారు. 60 ఏళ్లు లోపు వారికి బూస్టర్ డోస్ అందించడం పట్ల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ విరుచుకుపడితే అధికంగా నష్టపోయేది బెంగళూరేనని మూడుసార్లు స్పష్టమైంది. (చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదంటున్న నిపుణులు..) -
పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..
యశవంతపుర: గర్భకోశం తొలగించిన మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం వైద్యుల అలసత్వం వల్ల ఖజానాకు తిరిగి వెళ్లిపోయింది. ఈ మహిళలకు సాయం చేయాలని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా ఆస్పత్రికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గర్భకోశం తొలగించుకున్నవారికి ఆస్పత్రిలోనే చెక్కు రూపంలో అందించాలి. కానీ వైద్యులు ఎవరికీ ఆర్థిక సాయాన్ని అందించలేదు. నిధులను వాడుకోకపోవడంతో సర్కారుకి తిరిగివెళ్లాయి. దీంతో బాధిత మహిళలు శిగ్గావిలోని సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటికి పాదయాత్రగా బయల్దేరారు. 8 ఏళ్ల నుంచి 1522 మంది మహిళలకు గర్భకోశం తొలగించారు. వారందరికీ మొండిచెయ్యి చూపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ శాంతపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. (చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్) -
విచారణ జరుగుతోంది, తొందరెందుకు? విపక్షాలపై సీఎం ఫైర్
బెంగళూరు: కే.ఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేసేది, లేనిది విచారణ అధికారుల నిర్ణయమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన శనివారం హంపీ సమీపంలోని కన్నడ విశ్వ విద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జార్జ్‌పై వచ్చిన ఆరోపణలపై అప్పటి సీఎం ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మంచిది కాదన్నారు. సంతోష్ పాటిల్ గదిలో క్రిమిసంహారక మందు దొరకడంతో విచారణ జరుగుతోందన్నారు. కాగా హొసపేటెలో బీజేపీ కార్యనిర్వాహక సభ భారీఎత్తున నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది? కాంగ్రెస్ హస్తం ఉందేమో ? సాక్షి,బళ్లారి/హొసపేట: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వారి హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్ కటిల్ పేర్కొన్నారు. శనివారం ఆయన హొసపేటలో విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ ఆత్మహత్య వెనుక మహానాయకుడు హస్తం ఉందని చర్చసాగుతోందని, ఆ దిశగా దర్యాప్తు కూడా చేయిస్తామన్నారు. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరిని అరెస్ట్ చేయాలో చట్టం చూసుకుంటుందన్నారు. -
కాంట్రాక్టర్ మృతి కేసు.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా!
కాంట్రాక్టర్ ఆత్మహత్యతో వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించిన ఈశ్వరప్ప.. గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశాడు. తనుకు మద్ధతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక రాజీనామా లేఖను ఈశ్వరప్ప శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి బసవరావ్ బొమ్మైకి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈశ్వరప్ప దిగిపోవాలంటూ విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప దిగిపోవాల్సిందేనని సీఎం బొమ్మై ఆదేశించినట్లు తెలుస్తోంది. Karnataka Minister KS Eshwarappa, whose name appeared in alleged suicide case of contractor Santosh Patil, says that he will handover his resignation to the Chief Minister tomorrow. Says, "Tomorrow I'm handing over the resignation letter to CM. I thank you all for co-operation." pic.twitter.com/vZFVrP4diI — ANI (@ANI) April 14, 2022 బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, బీజేపీ నేత సంతోష్ పాటిల్.. తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి పేమెంట్ క్లియర్ చేయడానికి.. 40 శాతం కమీషన్ కోసం తన పీఏ ద్వారా మంత్రి ఈశ్వరప్ప వేధించాడంటూ సదరు కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. అయితే దర్యాప్తు పూర్తయ్యేదాకా ఆయనపై చర్యలు ఉండబోవని సీఎం బొమ్మై చెప్పారు. ఈ లోపు కాంగ్రెస్ ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఇక.. తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఈశ్వరప్ప ఇదివరకే ఓ ప్రకటన చేశాడు కూడా. -
కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం
బెంగళూరు: పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఖాతాబుక్ సీఈఓ రవీష్ నరేశ్ చేసిన ఆవేదనా భరిత ట్వీట్ కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో అసౌకర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. అద్భుతమైన మౌలిక వసతులతో పాటు సామాజికంగానూ మెరుగైన పరిస్థితులు హైదరాబాద్ సొంతమని తెలిపారు. రాకపోకలకు ఈజీగా ఉండేలా ఎయిర్‌పోర్టు కూడా హైదరాబాద్ సొంతమని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక తమ ప్రభుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికగా సాగుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదమన్నారు సీఎం బవసరాజ్ బొమ్మై. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తుంటారని అన్నారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరేనని గుర్తు చేశారు. మూడేళ్లుగా రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందని అన్నారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్క వారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడడం సహజమని ఎద్దేవా చేసింది. ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది. -
Karnataka: సొంత ప్రభుత్వాన్ని ఏకిపారేసిన బీజేపీ సీనియర్ నేత
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదం తరువాత హిందు దేవాలయ ప్రాంగణంలో ముస్లిం వ్యాపారులను నిషేధించాలంటూ రైట్ వింగ్ సంస్థలు పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటక ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విశ్వనాథ్ ఆరోపించారు. ప్రభుత్వం తప్పక స్టాండ్ తీసుకోవాలని హితవు పలికారు. దీనిపై అభ్యంతరాలను ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చించినట్లు తెలిపారు. కాగా 2019లో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినవారిలో విశ్వనాథ్ ఒకరు. చదవండి: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం ‘ఇతర దేశాలలో కూడా ముస్లింలు నివసిస్తున్నారు. అక్కడ వారు ఆహారం, పువ్వులు అమ్ముతుంటారు.. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే వాళ్ల నుంచి ఏం తీసుకుకోకుండా ఉంటామా? వీళ్లంతా చిరు వ్యాపారులు, కాలే కడుపు కోసం పనిచేసుకునే వారు. వారికి మతాల పట్టింపు లేదు. ఇది బీజేపీ ప్రభుత్వం. మత సంస్థ కాదు’ అని ఎమ్మెల్సీ విశ్వనాథ్ నొక్కి చెప్పారు. అయితే రాష్ట్రం రైట్ వింగ్ ఒత్తిడికి లొంగిపోతోందా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ -
‘హిజాబ్ తీర్పు’ జడ్జిలకు బెదిరింపులు.. వై కేటగిరీ భద్రత
హిజాబ్ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోకి ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు తీర్పు హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన Tamil Nadu Thowheed Jamath (TNTJ) నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. జార్ఖండ్‌లో వాకింగ్‌కు వెళ్లిన ఓ జడ్జి దారుణ హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ వ్యక్తి తీసిన బెదిరింపు వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్ ఉమాపతితో పాటు మరికొందరు అడ్వొకేట్లు.. హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు సదరు వీడియోపై ఫిర్యాదు చేశారు. భగవద్గీత సిలబస్‌లో.. నైతిక విద్యలో భాగంగా కర్ణాటక స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చబోతున్నట్లు సీఎం బొమ్మై, శనివారం వెల్లడించారు. ఇదివరకే గుజరాత్ స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడెంట్స్‌కు షాక్ హిజాబ్ నిరసనల్లో భాగంగా పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేదే లేదని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. తీర్పు ముందు బహిష్కరించిన వాళ్లకే అవకాశం అని, తీర్పు వచ్చాక కొందరు పరీక్షలను బహిష్కరించారని, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. -
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్‌చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్‌ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్‌కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి, ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి, ప్రకాశ్‌రాజ్‌కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్‌కుమార్, హిందీలో రాజ్‌కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
నవీన్ మృతదేహం బెంగళూరుకి చేరనుంది: కర్ణాటక సీఎం
సాక్షి బెంగళూరు: ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ విద్యార్థి మృతదేహం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని కర్ణాటక సీఎం ట్విట్టర్లో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థి నవీన్ జ్ఞానగౌడర్ మార్చి 1న షెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు కూడా. ఈ మేరకు నవీన్ తండ్రి కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు కూడా . ప్రభుత్వ కూడా వారికి హామీ ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో షెల్లింగ్‌లో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ భౌతికకాయం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని శుక్రవారం తెలిపారు. నవీన్ మృతదేహానికి ఎంబామ్ చేసి ఉక్రెయిన్‌లోని మార్చురీలో ఉంచినట్లు బొమ్మై గతంలోనే తెలియజేశారు. (చదవండి: బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది మూకుమ్మడి దాడి) -
45 రోజుల్లో ఏడంతస్తుల భవనం
సాక్షి, బెంగళూరు: యుద్ధ విమానాల (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎంసీఏ) తయారీ కోసం బెంగళూరులో డీఆర్డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డీఆర్డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదో తరం మీడియం వెయిట్ డీప్ పెన్ట్రేషన్ ఫైటర్ జెట్‌కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, డీఆర్డీఓ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనానికి 2021 నవంబర్ 22వ తేదీన శంకుస్థాపన జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన వాస్తవ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్ ప్రీ కాస్ట్ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీవో ఈ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారన్నారు. -
'ఆర్ఆర్ఆర్' ప్రిరిలీజ్ ఈవెంట్ ఖరారు.. ముఖ్య అతిథిగా ఆ ముఖ్యమంత్రి !
Karnataka CM As Chief Guest In RRR Movie Promotional Event: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను భారీగానే ప్లాన్ చేసింది జక్కన్న టీం. స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రత్యేక ఈవెంట్లతో భారీగా సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ సాంగ్.. పూర్తి పాట వచ్చేసింది.. ఈ క్రమంలో మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్లో 'ఆర్ఆర్ఆర్' ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్లో మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కర్ణాటక సీఎంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌లు కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ వేడుకను దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు అంకితం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. చదవండి: 'ఆర్ఆర్ఆర్' దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల -
హిజాబ్ వ్యవహారం: అందుకే హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది
నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్ ఇయర్ మధ్యలో.. హిజాబ్ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్‌పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్ జనలర్ ప్రభూలింగ్ నవద్గి అభిప్రాయపడ్డారు. మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. HC verdict on Hijab row | Everyone should follow court order for benefit of children. It is a question of fate & education of our children. Necessary arrangements have been made to maintain law and order: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/5aw1GiKoX1 — ANI (@ANI) March 15, 2022 I welcome the HC's decision. Muslim students of the state faced problems for a long time. Someone had misguided them that's why there was this issue. Quality education should be given to all students, so everyone should accept the order: Karnataka Min KS Eshwarappa #HijabRow pic.twitter.com/R4Ni7mlSQn — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the judgment of the Karnataka High Court; it's a very important step towards strengthening the educational opportunities & rights of girl students, especially for those belonging to the Muslim community: BJP MP Tejasvi Surya pic.twitter.com/xBSTurLxiB — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the decision of the Karnataka High Court, as it is firstly not a religious practice, as per Quran. Secondly, when a student enters an institute, they must follow the rules & regulations...: Rekha Sharma, Chairperson, National Commission for Women pic.twitter.com/YDuu3JO9F1 — ANI (@ANI) March 15, 2022 -
ఉక్రెయిన్‌లో కర్ణాటక విద్యార్థులు.. సీఎం ఏమన్నారంటే!
సాక్షి బెంగళూరు: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్నత చదువులకు వెళ్లిన తమ పిల్లలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల భద్రత, క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మరో వైపు ఇండియా వచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకోగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశానికి ఎలా రావాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు. కాగా, కర్ణాటక వాసుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. దావణగెరెలోని భగత్‌సింగ్ నగర నివాసి షౌకత్ అలీ కుమారుడు అబీద్, చిక్కమగళూరు తాలూకా ఆల్దూరు హోసళ్లి ఇంద్రేశ్ కుమారుడు ప్రద్వీన్‌లు మెడిసిన్ చదువుతున్నారు. బెళగావి జిల్లా రాయబాగ తాలూకా కంకణవాడి గ్రామానికి చెందిన ప్రియా భగవంత నిడగుంది, గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి అమోఘ చౌగలె, బాగలకోటె జిల్లా విద్యాగిరికి చెందిన మనోజ్ కుమార్ చిత్రగార, అపూర్వలు తాము క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. కొప్పళ జిల్లాకు చెందిన విద్యార్థి, యలబుర్గా తాలూకా కల్లూరకి చెందిన సంగమేశ్, కలబురిగికి చెందిన జీవితలు ఉన్నత విద్య చదువుతున్నారు. రామనగర జిల్లాకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. చెన్నపట్టణ తాలూకా తిమ్మసంద్రకు చెందిన నివేదిత, రామనగర ఐజూరు గ్రామానికి చెందిన ఆయేషాలు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. మాజీ సీఎం కుమారస్వామి నివేదితతో మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. మంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి క్లాటన్ తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడింది. హుబ్లీ జిల్లా కుందగోళ తాలూకా యరగుప్పి గ్రామానికి యువతి చైత్ర, శివమొగ్గకు చెందిన ఒకరు, శివమొగ్గ తాలూచా సంతెకడూరు గ్రామానికి చెందిన తేజస్, హావేరి జిల్లాకు చెందిన 8 మంది, రాణిబెన్నూరు తాలూకాకు చెందిన ఏడుగురు, బ్యాడగి తాలూకాకు చెందిన మరొకరు, విజయపుర జిల్లా తాళికోటెకు చెందిన సుచిత్ర ఉక్రెయిన్‌లో ఉన్నారు. ధైర్యంగా ఉండండి : మంత్రి శ్రీరాములు బళ్లారి : ఉక్రెయిన్‌లో ఉంటున్న బళ్లారి జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులతో మంత్రి శ్రీరాములు మాట్లాడారు. గురువారం రాత్రి ఆయన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. బళ్లారి, సింధనూరుకు చెందిన విద్యార్థులతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ముందుగా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన విదేశాంగ శాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖ మంత్రులతో మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో వీడియో కాల్లో మాట్లాడుతున్న మంత్రి శ్రీరాములు -
బసవరాజ్ బొమ్మై (కర్ణాటక సీఎం) రాయని డైరీ
‘‘ముందింత పని పెట్టుకుని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణేంటి బొమ్మై.. ఎన్నికలు కానివ్వు..’’ అని విసుగ్గా ముఖం పెట్టారు అమిత్‌షా. నేను నవ్వుముఖం పెట్టాను. ఇచ్చేవాళ్లు ఏ ముఖమైనా పెట్టొచ్చు. అడిగి తీసుకోడానికి వెళ్లినవాళ్లు ముఖాన్ని సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ‘‘పీక్కుతింటున్నారు అమిత్జీ! ‘2023లో ఎలక్షన్స్ పెట్టుకుని ఇంకా ఎప్పుడు మంత్రి పదవులు ఇస్తారు? ఎప్పుడు మమ్మల్ని ప్రజాసేవ చేయనిస్తారు?’ అని అడుగుతున్నారు..’’ అన్నాను.. నవ్వుముఖంతోనే. ‘‘ఎవరు ఆ ప్రజాసేవకులు?’’ అని అడిగారు అమిత్‌షా. అసెంబ్లీలో అందరూ ప్రజా సేవకులే అయినప్పుడు నేను బసనగౌడ పేరో, రేణుకాచార్య పేరో ఎందుకు చెప్పాలి? ‘‘ముప్పై నాలుగులో నాలుగు ఖాళీగా ఉన్నాయి అమిత్జీ! ఆ నాలుగూ భర్తీ చేసి, పనిలో పనిగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లి, ఎవరి పనుల్లో వాళ్లు పడతారు’’ అన్నాను. ‘‘ఇప్పుడదా స్టేట్‌లో సమస్య బొమ్మై?!’ అన్నారు అమిత్‌షా. ‘‘ఇంకో సమస్య కూడా ఉంది అమిత్జీ! అయితే ఆ సమస్యని హైకోర్టు చూసు కుంటోంది. సుప్రీంకోర్టు చూసుకుంటా నంటోంది. ఇంకా.. ఒవైసీ చూసుకుంటు న్నారు. పాకిస్తాన్ మంత్రులు చూసు కుంటున్నారు. యూపీలో ప్రియాంకా గాంధీ చూసుకుంటున్నారు. ఢిల్లీలో కపిల్ సిబాల్ చూసుకుంటున్నారు. చెన్నైలో కమలహాసన్ చూసుకుంటున్నారు’’ అన్నాను. అమిత్‌షా చేతివాచీ చూసుకున్నారు. ‘‘సమస్యను మన దగ్గర్నుంచి ఎవరైనా లాగేసుకుంటే అది మన సమస్య కాకుండా పోతుందా బొమ్మై! పీక మీద రెండు సమస్యలు ఉన్నప్పుడు పీకకు ఏది ముఖ్యమైన సమస్యో నాయకుడికి తెలిసుండాలి. పీక మీద ఒకే సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్క సమస్యా పీకకు ఎందుకు ముఖ్యం కాదో తెలుసుకోగలిగి ఉండాలి..’’ అన్నారు! ‘‘అలాగే అమిత్జీ’’ అన్నాను. అమిత్ షా దగ్గర్నుంచి నేరుగా జేపీ నడ్డా దగ్గరికి వెళ్లాను. ‘‘అరె! ఇంతక్రితమే నడ్డాజీ ఉత్తరాఖండ్ వెళ్లారే..’’ అన్నారు ఢిల్లీ పార్టీ ఆఫీస్‌లో. నడ్డాకు ఫోన్ చేశాను. ‘‘హా.. బొమ్మైజీ! క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నాను. మీరెప్పుడన్నారూ.. ఢిల్లీకి వస్తున్నది?’’ అన్నారు!! నేను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పకుండా.. ‘‘ఢిల్లీ వచ్చే ముందు ఫోన్ చేస్తాను నడ్డాజీ..’’ అన్నాను. ‘‘అవునా. గుడ్ గుడ్’’ అన్నారు. ఆ వెంటనే.. ‘‘ఎలా ఉంది బొమ్మైజీ.. మీ స్టేట్‌లో ప్రాబ్లమ్?’’ అని అడిగారు.‘‘నో ప్రాబ్లమ్ నడ్డాజీ..’’ అన్నాను. బెంగళూరు తిరిగి వచ్చేటప్పటికి నాకోసం బసనగౌడ, రేణుకాచార్య ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు! ‘‘కబురేమైనా ఉందా బొమ్మై సర్?’’ అని రేణుకాచార్య, బసనగౌడ అడిగారు. ‘‘ఉంది. ‘రెండు సమస్యలు ఉన్నప్పుడు రెండింటిలో ఏది ముఖ్యమైన సమస్యో నాయకుడికి తెలిసుండాలి. ఒకటే సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్క సమస్య ఎందుకు ముఖ్యం కాదో తెలుసుకోగలిగి ఉండాలి..’ అని అమిత్‌షా నా భుజం తట్టి చెప్పారు..’’ అన్నాను. ‘‘ మరి.. రెండు సమస్యల్లో ఏది ముఖ్యమైనదో తెలిసి ఉండటం వల్ల, లేక.. ఉన్న ఒక్క సమస్యా అది ఎందుకు ముఖ్యమైనది కాదో తెలుసుకోగలిగి ఉండటం వల్ల మూడో సమస్య వస్తేనో..?’’ అన్నారు రేణుకాచార్య! ఒక నిర్ఘాంతపు దిగ్భ్రమతో ఆయన వైపు చూశాను.‘‘నడ్డాజీ ఏమైనా చెప్పారా బొమ్మై సర్?’’ అని బసనగౌడ. ‘‘చెప్పేవారేనేమో.. నా భుజం తట్టి చెప్పేంత దగ్గర్లో ఉన్నట్లయితే..’’ అన్నాను. -
హిజాబ్ వివాదం (Hijab Row): కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. I appeal to all the students, teachers and management of schools and colleges as well as people of karnataka to maintain peace and harmony. I have ordered closure of all high schools and colleges for next three days. All concerned are requested to cooperate. — Basavaraj S Bommai (@BSBommai) February 8, 2022 కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు హిజాబ్ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ ముదురుతున్న హిజాబ్ వివాదం కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలోని రెండు జిల్లాల్లో మంగళవారం హింసాత్మకంగా మారింది. ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్‌లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి. హిజాబ్ ధరించి ఓ విద్యార్థిని కాలేజ్‌కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు. యువతి తన స్కూటర్‌ను పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించిన వర్గం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. भेड़िये ! https://t.co/GnceytfDXL — Swara Bhasker (@ReallySwara) February 8, 2022 -
కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్ అంటూ నినదించారు. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. -
హిజాబ్ వర్సెస్ కండువా.. కర్ణాటక సర్కార్ కీలక ఉత్తర్వులు
కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం.. పార్టీల పరస్పర రాజకీయ విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వివాదం మరింత ముదరకముందే చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ్క్షలు జారీ చేసింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఉడుపి, చిక్మగళూరులో పరిణామాలు వాడీవేడిగా సాగాయి. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోగా.. ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ తరుణంలో.. కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో.. వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అయ్యింది. దీంతో శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది కర్ణాటక ప్రభుత్వం. ఎంపిక చేసిన డ్రెస్ కోడ్ కర్ణాటక విద్యా చట్టం-1983లోని సెక్షన్ 133 (2) ప్రకారం.. యూనిఫాం ఒకే తరహా దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తమకు నచ్చిన యూనిఫామ్‌ను ఎంచుకోవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్‌నే అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాంను ఎంపిక చేయని సందర్భంలో.. సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఆ ఉత్తర్వులు పేర్కొనడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థల్లో బాలబాలికలు తమ మతం ప్రకారం ప్రవర్తించడంతో సమానత్వం, ఐక్యత దెబ్బతింటున్నట్లు తాము గుర్తించామని ఈ సందర్భంగా విద్యాశాఖ పేర్కొంది. సమీక్షల అనంతరం.. ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించడంపై అభ్యంతరాలు(తరగతి గదుల్లో మాత్రం వద్దనే) వ్యక్తంగా.. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. మరోవైపు హిజాబ్ వ్యవహారం కోర్టు గడప తొక్కగా(హిజాబ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ.. ఐదుగురు బాలికల తరపున పిటిషన్ దాఖలైంది).. మంగళవారం(ఫిబ్రవరి 8న) పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. విద్యా శాఖతో, న్యాయ శాఖతో సంప్రదింపులు జరిపారు. శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బాలికలు తరగతుల్లో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ‘తాలిబనైజేషన్’ ప్రోత్సహించినట్లు అవుతుందంటూ బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హిజాబ్ విషయంలో బాలికలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఇక ఈ వ్యవహారంపై మాజీ సీఎంల స్పందన మరోలా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై మండిపడగా, హెచ్డీ కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు అనుమతించబడిన ప్రదేశాలలో హిజాబ్‌లను అనుమతించండి, ఈ మధ్య పర్మిషన్ ఇచ్చిన ప్లేసుల్లో మాత్రం నిషేధించండి’ అంటూ కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. We're ready for a change in the colour of the hijab in order to match it with the uniform but we cannot leave it. I wear hijab to the Assembly as well, they can stop me if they can. A memorandum will go to the CM & we'll protest in Udupi later: Congress MLA Kaneez Fatima pic.twitter.com/FwkgR3CbR3 — ANI (@ANI) February 6, 2022 -
కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ఉధృతి పెరగడంతో ప్రముఖులు పెద్దసంఖ్యలో వైరస్‌కు గురవుతున్నారు. సీఎం బొమ్మైకి కోవిడ్ సోకడం తెలిసిందే. ఆయన కుమారుడు భరత్, కోడలుకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. మంత్రి మాధుస్వామి, ఆయన కుమారునికి, అలాగే మరో ఎమ్మెల్యే హెచ్.ఎం.రేవణ్ణ, కాంగ్రెస్ నేత ఇబ్రహీంకి కోవిడ్ నిర్ధారణ అయింది. సీఎం కొడుకు, కోడలు మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు. ఇంట్లోనే సీఎం క్వారంటైన్ సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఇంట్లోనే చికిత్స కొనసాగించాలని సూచించారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ కరోనా లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్టీ నగరలోని నివాసంలోనే వారంరోజులు క్వారంటైన్లో ఉంటారు. అక్కడి నుంచే పరిపాలనా పనులు నిర్వహిస్తారు. చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు -
ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు
బెంగుళూరు/పాట్నా! భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు సాధారణ పౌరులపై కోవిడ్ పంజా విసురుతుంటే మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మంది నాయులు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కరోనా సోకగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు సీఎం తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగేఉందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తననుకలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకొని హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్జప్తి చేశారు. చదవండి: కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి I have tested positive for COVID -19 today with mild symptoms. My health is fine, I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. — Basavaraj S Bommai (@BSBommai) January 10, 2022 మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చదవండి: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా.. జేపీ నడ్డాకు కరోనా బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపిన నడ్డా.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించారు. माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार कोरोना जाँच में पॉज़िटिव पाये गए हैं। चिकित्सकों की सलाह पर वह होम आइसोलेशन में हैं। उन्होंने सभी से कोविड अनुकूल सावधानियां बरतने की अपील की है। — CMO Bihar (@officecmbihar) January 10, 2022 -
సీఎం ఎదుటే కొట్టుకున్నంత పనిచేసిన డిప్యుటీ సీఎం, ఎంపీ.. వైరల్ వీడియో
సాక్షి, బెంగుళూరు: కర్ణాటకలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వేదికపైనే వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే కొట్టుకున్నంత పనిచేశారు. రామనగరలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బెంగుళూరు నగర నిర్మాత నడప్రభ కెంపెగౌడ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరింది. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ మాట్లాడుతుండగా.. జనంలో నుంచి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అశ్వత్ నారాయణ్.. డీకే సురేష్‌పైనా, కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారు. సురేష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య మాటామాట పెరిగింది. ఇరు వర్గాలవారు కూడా వారికి తోడవడంతో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పాలని ప్రయత్నించగా.. స్టేజ్‌పైనే ఎంపీ డీకే సురేష్ ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ రవి మరో అడుగు ముందుకేసి అశ్వత్ నారాయణ్ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. (చదవండి: గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ కరోనాదే.. టాప్ 10 జాబితా ఇదే!) చివరకు పోలీసులు, సెక్కురిటీ సిబ్బంది గుమిగూడిన ఇరు వర్గాలవారిని వారి వారి స్థానాల్లోకి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం సీఎం బొమ్మై ప్రసంగిస్తూ అంబేడ్కర్, కెంపెగౌడ గౌరవార్థం చేపట్టిన కార్యక్రమంలో రాజకీయ గందరగోళం నెలకొనడం దురదృష్టకరమన్నారు. అందరం కలిసికట్టుగా అభివృద్ధి సాధిద్దామని పిలుపునిచ్చారు. కాగా, నేతల ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: Viral: ఈ ఫోటోలో చిరుత దాగి ఉందా.. గుర్తు పట్టడం చాలా కష్టమండోయ్..) #WATCH: Karnataka #Congress MP DK Suresh and #BJP Minister C. N. Ashwath Narayan creates ruckus in front of @CMofKarnataka Basavaraj Bommai at a government event in Ramanagara district. @IndianExpress pic.twitter.com/IyGXfurRWB — Darshan Devaiah B P (@DarshanDevaiahB) January 3, 2022 -
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
బెళగావి(కర్ణాటక): వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసన సభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా ‘కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు–2021’ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జేడీ(ఎస్) సైతం బిల్లును తప్పుబట్టింది. ఈ తరహా చట్టం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి పేర్కొన్నారు. బిల్లు.. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్భలంతో, తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడిలను అడ్డుకుంటుంది. చట్టవ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. -
కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు
బెంగళూరు: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఉవ్విళ్లూరతున్న కర్ణాటక వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడాన్ని నియంత్రిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. డీజేలు లేకుండా క్లబ్‌లు, రెస్టారెంట్లలో 50 శాతం కెపాసిటీతో మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. కోవిడ్ -19 టీకాలు వేసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మరో 5 ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో తాజాగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. ధార్వాడలో 54 ఏళ్ల వ్యక్తి, తీర్థహళ్లిలో 20 ఏళ్ల యువతి, ఉడుపిలో 82 ఏళ్ల వృద్దుడు, మంగళూరులో 19 ఏళ్ల యువకుడు ఒమిక్రాన్ బారిన పడ్డారు. (చదవండి: నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను) మరోవైపు బెంగళూరులో ఒమిక్రాన్ ప్రబలకుండా రద్దీ ప్రాంతాలైన కేఆర్ మార్కెట్లో మార్షల్స్‌ను పెంచారు. మాస్క్ ధరించకపోతే తక్షణమే జరిమానా విధిస్తున్నారు. బెళ్లందూరు, దొడ్డనెక్కుంది, బేగూరు, హగదూరు, హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డుల్లో నిత్యం 7కు పైగా కోవిడ్ కేసులు వస్తుండడంతో రెడ్ జోన్‌గా ప్రకటించారు. (చదవండి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా మూడోవేవ్..) -
ఏ పదవీ శాశ్వతం కాదు
హవేరి: ఏ పదవీ శాశ్వతం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. హవేరి జిల్లాలోని సొంత నియోజకవర్గమైన షిగగావ్లో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పదవులు, హోదాలతో సహా ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. జీవితమూ అంతేనన్నారు. ‘ఎంత కాలం ఉంటామో.. ఏ హోదాలో ఉంటామో ఎవరికీ తెలియదు. పదవులు, హోదాలు శాశ్వతం కాదు. ఈ వాస్తవం అనుక్షణం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అవతలి వారికి నేను సీఎంను కావొచ్చు. కాని షిగగావ్కు వస్తే మీ బసవరాజ బొమ్మైని మాత్రమే. బసవరాజ అనే పేరు శాశ్వతం. పదవులు కాదు’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. దాంతో బొమ్మై ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారనే ఊహాగానాలు కొన్నివర్గాల నుంచి మొదలయ్యాయి. బొమ్మై మోకాలి సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళతారని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సీఎంను మారుస్తారనే ఊహాగానాలు కొన్నివర్గాల్లో వినపడుతున్నాయి. -
సర్కారును మంత్రులే కూల్చేస్తారు: డీకే
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బీజేపీ సర్కారు బలహీనం కాగా, సీఎం బొమ్మై నిస్సహాయుడు అయ్యారు, మంత్రులే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు అని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ హేళన చేశారు. ఆయన సోమవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప ఏమో సీఎం మారతారని అంటారు, మరో మంత్రి మురుగేశ్ నిరాణి కొత్త సీఎం అవుతారంటారు. మంత్రుల వల్ల ఈ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుంది. ప్రతిపక్ష పార్టీల పాత్ర ఇందులో ఉండదు అని జోస్యం చెప్పారు. మాజీ సీఎం యడియూరప్పపై బీజేపీ ఐటీ దాడులు చేయించి, బలవంతంగా రాజీనామా చేయించడంతో ఆయన కన్నీరు కార్చారని చెప్పారు. బీజేపీలోకి చేరలేదని తనను తీహార్ జైలుకు పంపారని ఆరోపించారు. -
తన మార్కు చూపించేలా సీఎం ప్లాన్.. 8 మంది మంత్రులు ఇంటికేనా?
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): తనదైన మార్కు చూపించేలా మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని సీఎం బసవరాజ బొమ్మై భావిస్తున్నారు. ఆయన సీఎం పీఠమెక్కి నాలుగు నెలలైంది. కేబినెట్లో సుమారు 8 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండాలని అనుకుంటున్నారు. పరిషత్ ఎన్నికల ముగియగానే ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు 14న వెల్లడిస్తారు. ఆ వెంటనే కేబినెట్లో మార్పులు చేర్పులు చేపట్టే అవకాశముంది. మొన్నటి సీఎం ఢిల్లీ పర్యటనలోనూ మంత్రుల మార్పు గురించి హైకమాండ్‌తో చర్చించారు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలనేదానిపై నాయకత్వం నుంచి సూచనలు రాగానే పని ప్రారంభిస్తారు. పార్టీలో బలమైన నేతగా ఉన్న బీఎస్ యడియూరప్పను బుజ్జగించేలా ఆయన తనయుడు బీవై విజయేంద్రకు మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆలోచన ఉంది. చదవండి: ‘సినిమాలు తప్ప బాలకృష్ణకు ప్రజా సమస్యలపై ధ్యాసేలేదు.. ఆరు నెలలకోసారైనా..’ -
2023 వరకు సీఎం మార్పు ఉండదు: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): రాష్ట్రంలో 2023 వరకు సీఎం మార్పు ఉండదని, ముఖ్యమంత్రిగా బొమ్మై కొనసాగుతారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి ఈశ్వరప్ప సీఎం మార్పు వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు. అదే విధంగా ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవెగౌడల కలయిక సాధారణమేనని, హాసన్ ఐఐటీ తదితర విషయాలపై మాట్లాడారని అన్నారు. పొత్తు విషయం తనకు తెలియదన్నారు. -
‘లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ’
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): సీఎం బొమ్మై ఆర్ఎస్ఎస్కు చెందినవారు కాదు. యడియూరప్పను తొలగించినప్పుడు లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ లభించింది. బొమ్మైను సాగనంపాలని మంత్రి ఈశ్వరప్ప యత్నిస్తున్నారు అని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. ఆదివారం బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకాలో కాంగ్రెస్ భేటీలో మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌వారు గాడ్సే వంశీకులని ఆరోపించారు. కాంగ్రెస్‌పై సీఎం విసుర్లు బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బు బలంతో గెలవాలని యత్నిస్తోందని సీఎం బసవరాజు బొమ్మై ఆరోపించారు. ఆదివారం బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలె వద్ద బీజేపి అభ్యర్థి గోపినాథ్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య పదేపదే బీజేపీ డబ్బులతో అధికారంలోకి వస్తోందని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు కోటీశ్వరులకు టికెట్లు ఇస్తే, బీజేపీ సామాన్యులను పోటీలో నిలిపిందన్నారు. -
టీకా వేసుకుంటేనే మాల్స్‌లోకి.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం
బెంగుళూరు/జైపూర్: కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు రెండు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మాల్స్, సినిమా హాల్స్, స్కూళ్లు, కాలేజీలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలి. కోవిడ్ సర్టిఫికెట్ చూపించాలి. 500 మంది కంటే ఎక్కువ మంది ఒకే కార్యక్రమానికి హాజరుకాకూడదని సర్కార్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం మంత్రులు, వైద్యనిపుణులు, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి కఠినమైన నిబంధలు తీసుకురావాలని నిర్ణయించారు. మరోవైపు, కర్ణాటకలో ఒమిక్రాన్ బారినపడ్డ వైద్యుడి భార్యకూ కరోనా సోకింది. ఆమె కంటి వైద్యురాలు. ఆమెకు సోకిన వేరియెంట్‌ను కనుగొనేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరుకి వచ్చిన 10 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియట్లేదని వార్తలొచ్చాయి. వారిని కనిపెట్టి కరోనా పరీక్షలు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఒమిక్రాన్ సోకిన వృద్ధుడు ఐసోలేషన్ నుంచి మూడ్రోజులకే బయటికొచ్చి దుబాయ్‌కి అనుమతిలేకుండా వెళ్లిపోయాడు. దీనిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి రాజస్తాన్‌లో జైపూర్‌లో ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి కరోనా సోకింది. ఆ కుటుంబంలో నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని వెంటనే రాజస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి తరలించారు. కుటుంబంలో 14 మందికి పరీక్షలు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్ నుంచి తమిళనాడుకి వచ్చిన ముగ్గురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. -
పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Karnataka CM Announce Karnataka Ratna Award To Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ నటించినవి మొత్తం 29 చిత్రాలే అయినా తన మరణాన్ని జీర్ణించుకోలేని తన అభిమానులు 21 మంది గుండెలు ఆగిపోయాయి. తన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు తనకు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కర్ణాటకలో ఆయన నామస్మరణ జరుగుతుంది. ప్రతి రోజూ లక్షలాది మంది వచ్చి పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించుకుంటున్నారు. అంతే కాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమ జంటలు ఆయన సమాధి దగ్గర పెళ్లి చేసుకుంటున్నారంటే కర్ణాటకలో పునీత్ పేరు ప్రఖ్యాతులు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పునీత్ ఉన్నా లేకపోయినా తను చేస్తున్న సేవా కార్యక్రమాలు మాత్రం ఆగకూడదని కొన్నేళ్ల కిందే తన ట్రస్టులో 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దీని తర్వాత అక్కడి ప్రజలకు పునీత్‌పై అభిమానం మరింత పెరిగింది. ఇలాంటి మంచి మనిషిని దేవుడు ఎందుకు ఇంత చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయాడు అంటూ కన్నడిగులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం పునీత్‌కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. అత్యుత్తమ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల అభిమానం పొందిన అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చే పురస్కారం కర్ణాటక రత్న. ఇది కన్నడిగులకు మాత్రమే ఇచ్చే పురస్కారం అని తెలుస్తుంది. అయితే దీనితో పాటు పునీత్‌కు బసవ శ్రీ బిరుదు కూడా ఇవ్వాలని అభిమానులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. దాని గురించి కూడా ఆలోచిస్తామని ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం. -
పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అప్పు ( పునీత్ రాజ్ కుమార్) మరణాంతరం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించనున్నారు. కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. "State Government has decided to honour late Sri Puneet Rajkumar with Karnataka Ratna award posthumously": Chief Minister @BSBommai. — CM of Karnataka (@CMofKarnataka) November 16, 2021 రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక ఆయన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్‌కు మంచి డిమాండ్ ఉండేది. తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎలాంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు. -
బిట్‌కాయిన్ కుంభకోణం: సీఎంకు మాజీ సీఎం.. అభయం..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంతో సతమతమవుతున్న సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్పను ఆశ్రయించారు. హైకమాండ్‌తో చర్చిస్తానని యడ్డి అభయం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో బిట్‌కాయిన్ స్కాం వెలుగుచూడడంతో కాంగ్రెస్‌పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీని ఇరుకునపెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీకి వెళ్లి మరీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇది ముఖ్యమంత్రి కుర్చీకి నీళ్లు తేవచ్చని బొమ్మై ఆదుర్దాతో ఉన్నారు. మంత్రులు, పార్టీ సహాయం తీసుకుని ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వాలని యడియూరప్ప సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎక్కడికక్కడ మంత్రులు బిట్‌కాయిన్ స్కాంలో ప్రత్యారోపణలతో దాడి చేయాలని సీఎం ఆదేశించారు. -
ఓ ప్రత్యేక ఈవెంట్లో పునీత్ రాజ్ కుమార్ వేడుకలు.. ఎప్పుడంటే..?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వేడుకలను ఒక ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించబోతున్నారు. కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు దివంగత నటుడి వేడుకలను నవంబర్ 16న జరపనున్నారు. ఈ రోజంతా కన్నడ చిత్ర పరిశ్రమ రోజంతా మూసివేస్తారు. 3 గంటలపాటు జరిగే ఈ ఈవెంట్లో ఎవరెవరూ హాజరవుతాలో చూడాలి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో పాటు శాండల్ వుడ్ ఫిల్మ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలు 'పునీత్ నామన' పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. అయితే కొవిడ్ కారణంగా అతిథుల జాబితాలో పరిమితులు ఉండనున్నట్లు సమాచారం. నిర్వాహకులు పొరుగు రాష్ట్రాలు, వారి చిత్ర పరిశ్రమ, ఛాంబర్ల నుంచి సభ్యులను కూడా ఆహ్వానించారు. పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి 1500 మంది హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కన్నడ సినీ పరిశ్రమ సభ్యులు పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి నాగేంద్ర ప్రసాద్ రచించగా, గురుకిరణ్ స్వరపరచిన ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మరణించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30,000 మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి. -
సొంత పార్టీలోనే అసమ్మతి సెగ.. బీజేపీ సీఎంపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): సీఎం బసవరాజ బొమ్మైకి సొంత పార్టీలో అసమ్మతి రేగుతోందని తెలుస్తోంది. గత 100 రోజుల పరిపాలనలో గొప్ప సాధనలు లేవని, సొంత నిర్ణయాలు శూన్యమని పలువురు నేతలు గుసగుసలాడుతున్నారు. ఇటీవల సింధగి, హానగల్ అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల సమయంలో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని మరికొందరు గుర్రుగా ఉన్నారు. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా కష్ట పడిన వారిని సీఎం పట్టించుకోవడం లేదంటున్నారు. ఆ ఇద్దరు మంత్రులపైనే ఆధారం బిట్ కాయిన్ స్కాం ఆరోపణలను గట్టిగా తిప్పకొట్టలేకపోయారని, పరిపాలనలో ఇద్దరు మంత్రులపై ఆధారపడ్డారని ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన సింధగి, హానగల్ ఉప ఎన్నికల బాధ్యతను కూడా ఆ ఇద్దరు మంత్రులకే అప్పజెప్పారనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా కానీ ఆ ఇద్దరు మంత్రుల తీర్మానమే సీఎం నిర్ణయం అనే వదంతులున్నాయి. హానగల్‌లో బీజేపీ ఓటమి, బిట్‌కాయిన్ స్కాం ఆసరాగా ఆయన ప్రత్యర్థులు అసమ్మతిని తీవ్రం చేయాలనే యోచనలో ఉన్నారు. సీఎం మార్పు ఉండదు: హోరట్టె జోస్యం.. సీఎంగా బొమ్మై ఉత్తమ పాలన అందిస్తున్నారని, ఇప్పట్లో సీఎం మార్పు ఉండబోదని జేడీఎస్ నేత, విధాన పరిషత్తు చైర్మన్ బసవరాజ్ హోరట్టె జోస్యం చెప్పారు. శనివారం ఆయన ధారవాడలో మీడియాతో మాట్లాడారు. బిట్ కాయిన్ కేసును అధికారులు చూసుకుంటారన్నారు. -
ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రధానితో చర్చించా: సీఎం బొమ్మై
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ ఆరోపణల గురించి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించగా దీని గురించి పట్టించుకోరాదని, ప్రజల కోసం సమర్థంగా పనిచేయాలని సలహా ఇచ్చారని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సుమారు అర్దగంటకు పైగా సమావేశమై పలు అంశాలను చర్చించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. బిట్‌కాయిన్ కేసు గురించి ప్రధాని వద్ద ప్రస్తావించగా, దీని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదని సలహా ఇచ్చారన్నారు. డిసెంబరులో నాలుగు కార్యక్రమాల ప్రారంభానికి రాష్ట్రానికి ప్రధానిని ఆహ్వానించానని, సమయం చూసుకుని తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. సీఎంగా వందరోజుల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి తెలియజేశానని, సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. జేపీ నడ్డాతో చర్చలు.. పార్టీ అధినేత జేపీ నడ్డాను ఆయన నివాసంలో సీఎం బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషితో వెళ్లి అర్ధగంట పాటు చర్చించారు. మీడియా దృష్టికి రాకుండా ఈ సమావేశం జరగడంతో కుతూహలం నెలకొంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, త్వరలో జరిగే 25 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు, బీబీఎంపీ, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు చర్చకు వచ్చాయి. సీఎం బెంగళూరుకు తిరిగివచ్చాక రాజకీయంగా పలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని సమాచారం. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు మారే చాన్సుందని పార్టీ వర్గాల కథనం. నా కొడుకు ఉన్నా వదలద్దు: కోళివాడ.. బిట్‌కాయిన్ స్కాంలో ఎంత పెద్దవారున్నా వదలవద్దని, కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కేబీ కోళివాడ డిమాండ్ చేశారు. ఆయన గురువారం రాణి బెన్నూరులో విలేకర్లుతో మాట్లాడుతూ బిట్‌కాయిన్ అనేది పెద్ద నేరం. ఈ నేరంలో నా కొడుకు, సీఎం కొడుకులు ఉన్నా విడిచిపెట్టవద్దు, కఠినంగా శిక్షించాలి. నిందితులు ఏ పార్టీ వారు అన్నది చూడవద్దు అని చెప్పారు. ఈ దందాలో కోళివాడ కుమారుని పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో స్పందించారు. మాపై బురదచల్లే పని: డీకే.. శివాజీనగర: బిట్‌కాయిన్ స్కామ్‌లో కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారు. మా వద్దా ఆధారాలున్నాయి. తగిన సమయంలో బహిరంగ పరుస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ తెలిపారు. విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్కామ్‌లో కాంగ్రెస్‌వారి పిల్లలు ఉంటే అరెస్టు చేయాలన్నారు. -
పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!
బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రలు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కన్నడ సూపర్‌స్టార్ ఇటీవల అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మాట్లాడుతూ" పునీత్ రాజ్‌కుమార్ జీవించి ఉన్నప్పుడే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, అయితే దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో మరణానంతరం ఇవ్వాల్సిందే. నేను అతని అభిమానినే. పునీత్‌కి నటుడిగానే కాకుండా, సమాజానికి అందించిన సేవల కోసమైన ఇవ్వాల్సిందే. పైగా అతనికి ఆ అర్హత ఉంది. అని అన్నారు. అంతేకాదు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ మాట్లాడుతూ.. 'పునీత్ రాజ్‌కుమార్ మానవాళికి సేవ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను సామాజిక సేవలో ఉన్నప్పుడు పల్స్ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మాతో కలిశాడు. ఆయనకు పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి " అని అన్నారు. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... “పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఏకగ్రీవ సిఫార్సు అవుతుందేమో. ఏదిఏమైన ప్రభుత్వ పరంగా అన్నీ విషయాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) -
కర్ణాటక సీఎం చేతిపై మహిళ ముద్దుల వర్షం..వీడియో వైరల్
బెంగళూరు: సాధారణంగా అభిమానులు.. తన మనస్సుకు నచ్చిన నాయకులు కనిపించగానే తన ప్రేమను ఒక్కొరకంగా వ్యక్తపరుస్తారు. కొందరు తమ నాయకుడికి పూలమాల వేస్తే.. మరికొందరు శాలువాలతో సత్కరించడం, ప్రేమతో ఆలింగనం చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై గుట్టహళ్లిలో జనసేవక్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆ ప్రాంతమంతా, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలతో నిండి ఉంది. బొమ్మైచుట్టు వందల మంది కార్యకర్తలు, ప్రజలు గుమిగూడి ఉన్నారు. ఈ క్రమంలో ఒక మహిళ.. బసవరాజ బొమ్మై చేతిని పట్టుకుని అభిమానంతో ముద్దులు పెట్టడం మొదలు పెట్టింది. ఈ సంఘటనతో సీఎం బొమ్మై ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా సదరు మహిళ.. సీఎం చేతిని తన ముఖంపై ఉంచి ఆయన దీవెనలు తీసుకుంది. ఆమె చర్యలపై పక్కనే ఉన్న మంత్రి అశత్థనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు
సాక్షి, బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక విషయాన్ని ప్రకటించారు. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను,యాప్‌ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్‌ను లాంచ్ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్త్నుట్లు ఆయన ప్రకటించారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు) కాగా శుక్రవారం తమిళనాడులోని గాజనూరులో పునీత్ రాజ్‌కుమార్ పర్యటించాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు పునీత్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అప్పూ ఇక లేడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచేసింది. మరోవైపు పునీత్ భౌతిక కాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచి కడసారి దర్శించు కునేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పునీత్‌కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) On Thursday, he (#PuneethRajkumar) had asked me to release a website regarding Karnataka tourism. I would have launched his app on Nov 1 but he's not between us. It is so shocking. State, cinema, and youths will miss him: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/TfLOCrT4Am — ANI (@ANI) October 30, 2021 Karnataka CM Basavaraj Bommai announces postponement of actor Puneeth Rajkumar’s funeral to Sunday, 31 October. Postponement taking into consideration the sentiment of fans who are still flocking in to pay homage. @TheQuint pic.twitter.com/eSKpHu5xEU — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 -
పునీత్ మృతి.. అభిమానులు శాంతంగా ఉండాలి: బొమ్మై
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్ శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. (చదవండి: తారక్ నా సోదరుడు: పునీత్ పాత వీడియో వైరల్) పునీత్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడారు. పునీత్ రాజ్‌కుమార్ యూత్ ఐకాన్ అన్నారు. ఈ సమయంలో ఆయన అభిమానులు శాంతించాలని సీఎం బొమ్మై విజ్ఞప్తి చేశారు. పునీత్‌ను కాపాడటానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు. చిన్నవయసులోనే హార్ట్ ఎటాక్ రావడం చాలా అరుదు అన్నారు బొమ్మై. (చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు) ఈ నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్ పార్థీవ దేహాన్ని కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. శనివారం తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పునీత్ కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటన ఆమె ఇండియా బయలుదేరారు. చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం -
వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి..
బెంగళూరు: నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చాలంటూ ఏడేళ్ల బాలిక కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకెళ్తే.. తుమకూరు జిల్లా తిప్టూర్ మండలం హెగ్గనహళ్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2వ తరగతి విద్యార్థిని ధవణి నగరంలో గుంతల తొలగింపు కోసం తాను పొదుపు చేసిన పాకెట్ మనీని ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో ద్వారా వివరించింది. 73 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'సీఎం తాతా.. మన బెంగుళూరులో రోడ్లు సరిగా లేవు. కొందరు కుటుంబ సభ్యులు పనికి వెళ్తారు. ఇంట్లో మిగిలిన వారు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే, మా నాన్న క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని నేను వేచి ఉంటాను. దయచేసి గుంతలను పూడ్చి వారి ప్రాణాలను కాపాడండి' అని కోరింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తన తల్లికి కాలు విరిగిపోయి కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుకు చేసుకుంది. ఇటీవల పశ్చిమ బెంగళూరులో జరిగిన ఓ ప్రమాదంలో 65 ఏళ్ల దివ్యాంగుడు మరణించిన ఘటన కలిచివేసినట్లు చెప్పుకొచ్చింది. తాత, ఈ కుటుంబాలు వారి మరణాలను ఎలా ఎదుర్కోవాలో దయచేసి మాకు చెప్పండి' అంటూ ధవణి దీనంగా అడుగుతోంది. అయితే ఈ విషయంపై ధవణిని సంప్రదించగా.. 'అనేక మంది గుంతల కారణంగా బైక్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోవడం తను వీడియో తీసినట్లు వివరించింది. లైబ్రరీలో వార్తా పత్రికలు చదువుతున్నప్పుడు రోడ్లు సరిగా లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కూడా తను తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది. వీటిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే.. తనే ఒక్కొక్కటిగా పూడ్చడం ప్రారంభిస్తానని' ధవణి చెప్తోంది. చదవండి: (అమిత్ షా బర్త్‌డే రోజు ట్రెండ్ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్ ట్వీట్) -
కర్ణాటకలోనూ ఇంటికే రేషన్!
‘అధికారం కేవలం విధానసౌథకే పరిమితం కాకుండా పంచాయతీల పరిధిలోనే ప్రజలకు అన్ని సేవలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటాం. అభివృద్ధే ప్రజల వద్దకు వచ్చేలా పాలన సాగాలి. జనవరి 26 తరువాత రేషన్ సరుకులను ఇంటివద్దే అందించే యోచన చేస్తున్నాం. అతి త్వరలో కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తాం. ఇదే కాకుండా పింఛన్లు లాంటి సామాజిక భద్రత సేవలు కూడా ఇంటివద్దే అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం’ – ఇటీవల దావణగెరె జిల్లా సభలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహాలోనే పలు పథకాలను ఇంటివద్దే లబ్ధిదారులకు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. ప్రధానంగా రేషన్ సరుకులను ఇంటివద్దే డోర్ డెలివరీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించింది. ‘అన్నభాగ్య’ పథకం కింద లబ్ధిదారులకు ఇంటివద్దే రేషన్ సరుకులను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి వద్దే రేషన్ సరుకులను అందచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంపై కర్ణాటక పౌర సరఫరాల శాఖ అధికారులు నిశితంగా అధ్యయనం చేశారు. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో తదనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తైన కంప్యూటరైజేషన్.. కర్ణాటకలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేశారు. ప్రస్తుతం అక్కడ 10,89,445 అంత్యోదయ, 1,15,02,798 బీపీఎల్, 21,44,006 ఏపీఎల్ కార్డులతో కలిపి మొత్తం 1,47,36,249 రేషన్ కార్డులున్నాయి. 19,963 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల బీపీఎల్, ఏపీఎల్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏపీఎల్ కార్డుదారులకు కేజీ రూ.15 చొప్పున 10 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అనుసరించడం ద్వారా వీరందరికి ఇంటి వద్దే రేషన్ సరుకులు అందనున్నాయి. కొత్త విధానం ఇలా.. ఆయా రేషన్ దుకాణాల నుంచి లగేజ్ ఆటో ద్వారా సరుకులు తరలిస్తారు. ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేసేందుకు ఇద్దరు సిబ్బందిని నియమిస్తారు. సరుకుల బరువు తూచే తూకం యంత్రం తదితరాలు ఆటోలో ఉంటాయి. -
అధిక ఉద్యోగాలిస్తే ప్రోత్సాహకాలు: సీఎం
శివాజీనగర: రాష్ట్రంలో ఉద్యోగ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం నగరంలోని ప్యాలెస్ మైదానంలో పరిశ్రమల, వాణిజ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పరిశ్రమల అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. విధానం సిద్ధమైందని, త్వరలోనే అమల్లోకి వస్తుందని, ఏ పారిశ్రామికవేత్త అధికంగా ఉద్యోగాలను ఇస్తారో వారికి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను ఇస్తుందని తెలిపారు. దేశంలో కర్ణాటకను పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో పరిశ్రమల రంగం ముందంజలో ఉందంటే ఇక్కడున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ నిరాణి సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ
బెంగళూరు: దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు పరిష్కారం తేవాలనుకుంది. ఇందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల బింధు అనే యువతి దావణ్‌గెరె జిల్లాలోని హెచ్ రాంపురాలో టీచర్‌గా పనిచేస్తోంది. తమ గ్రామంలో రోడ్లు బాగోలేక పోవడం వల్ల గ్రామంలోని యువతకు పెళ్లిళ్లు కావడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది. ఇందులో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది. రోడ్లు బాగోలేవని, వీలైనంత తొందరగా వాటిని పునురద్దరించాలని కోరింది. అలాగే రోడ్ల మరమ్మత్తులు చేపట్టేవరకు వివాహం చేసుకోనని స్పష్టం చేసింది. చదవండి: వైరల్: బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్ ‘మా గ్రామానికి మంచి రోడ్డు కనెక్టివిటీ లేదు. గ్రామం ఎంతో వెనుకబడి ఉంది. మాలో చాలా మందికి వివాహ సంబంధాలు అందడం లేదు. ఎందుకంటే ఇక్కడి పిల్లలు విద్యను అభ్యసించలేకపోతున్నారు. రోడ్డు బాగాలేని కారణంగా బయటి గ్రామాల వాళ్లు హెచ్ రాంపూర్‌లోని వారితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. మా ఊరికి బస్సు లేదు. అంతేకాదు గతుకులు, మట్టిరోడ్డు.. ఈ రోడ్డులో ప్రయాణిస్తే వెన్నుముక విరిగిపోవడం ఖాయం.హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది’ బిందు పేర్కొన్నారు. చదవండి: karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన కాగా బిందు లేఖకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అంతేగాక గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్ శాఖను తక్షణమే పనులు చేపట్టాలని.. జరుగుతున్న పనుల గురించి వారికి తెలియజేయాలని సీఎంఓ ఆదేశించింది. దీని మీద బిందు మాట్లాడుతూ ‘ఈ రోడ్డును బాగు చేయడానికి మా ప్రజాప్రతినిధులకు కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పారు. అందుకే అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను”అని పేర్కొంది. -
మటం మరిస్వామికి గుబ్బి వీరణ్ణ పురస్కారం
సాక్షి, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన హార్మోనియం విద్వాంసుడు, సంగీత సామ్రాట్ బిరుదాంకితుడు మటం మరిస్వామిని మరో విశిష్ట పురస్కారం వరించింది. కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారాలలో ఒకటైన గుబ్బి వీరణ్ణ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా మరిస్వామి అవార్డుతోపాటు రూ.5లక్షల నగుదును అందుకున్నారు. ఆయన తన స్వగ్రామం మదిరకు గురువారం చేరుకున్నారు. కళాకారులు, బంధుమిత్రులు పెద్దఎత్తున ఆయన్ను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో స్వర మాంత్రికుడిగా ఖ్యాతి గడించిన పండిట్ పుట్టరాజ గవాయి ప్రియశిష్యుల్లో మరిస్వామి ఒకరు. తన 13వ ఏట నుంచే గవాయి నాటక కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన వందలాది నాటక ప్రదర్శనలకు ఆయన ఆరేళ్లపాటు అద్భుతమైన సంగీతం సమకూర్చి పుట్టరాజ గవాయిచే ప్రశంసలు అందుకున్నారు. -
Covid Third Wave: 2 శాతం పాజిటివిటీ దాటితే మళ్లీ లాక్డౌన్..?
సాక్షి, బెంగళూరు: కరోనా మూడో ఉధృతి వ్యాప్తి భయాలు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన నిపుణులు, అధికారులతో కీలక సమావేశం జరిగింది. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే లాక్డౌన్ తరహా ఆంక్షలను విధించక తప్పదని నిర్ణయించారు. కఠినతరం చేస్తాం: సీఎం.. సమావేశ అనంతరం సీఎం బొమ్మై మీడియాతో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ అవసరం లేదు. కొత్త నిబంధనల బదులు ఉన్న వాటినే కఠినతరం చేస్తాం. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు కాబట్టి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపారు. తాజా నిబంధనలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండబోవని చెప్పారు. ఆంక్షలకే నిపుణుల సిఫార్సు.. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటిన ప్రాంతాల్లో లాక్డౌన్ చేస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలను నిషేధించాల్సిందేనని ఈ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి సెప్టెంబరు వరకు వేచి ఉంటే మేలు అని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ బదులు వారాంతపు కర్ఫ్యూ అమలు చేయడం ఉత్తమం. పండుగలు, జాతరల్లో జన సమ్మర్దాన్ని నివారించాలి. ఇతర రాష్ట్రాలవారికి నెగిటివ్ రిపోర్టు వస్తేనే అనుమతించాలి. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షలను పెంచడంతో పాటు అందరికీ టీకా అందేలా చూడాలి అని అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రత పెరిగిన చోట ఈ నిబంధనలు విధిస్తారు అంత్యక్రియలకు 10 మందే హాజరు కావాలి. పబ్‌లు, బార్లు, జిమ్‌లు, యోగా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల బంద్ దేవస్థానాల్లో భక్తుల ప్రవేశం నిషేధం. ర్యాలీ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేదు. జన రద్దీ మార్కెట్లను తాత్కాలికంగా మూసేయాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల విక్రయాలు వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం 7 నుంచి మొదలవుతుంది. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అవకాశం. ఒకవేళ పాఠశాలల్లో కేసులు నిర్ధారణ అయితే వారం రోజుల పాటు బంద్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ ఉండదు. పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. దాటితే నిబంధనల్లో మార్పు ఉంటుంది. -
కర్ణాటక: తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ ఎస్.బొమ్మైకి అసంతృప్త మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులతో తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి. ఇటీవల ఏర్పాటైన కొత్త కేబినెట్, శాఖల కేటాయింపులపై అసమ్మతి గళాలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం సీఎం బొమ్మై, తాజా మాజీ సీఎం యడియూరప్పతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరగంటపాటు యడియూరప్ప నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు అసమ్మతి అంశంతోపాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు బొమ్మై సన్నిహిత వర్గాలు తెలిపాయి. పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్, మునిసిపల్ పరిపాలన, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రి ఎన్.నాగరాజ్ తమకు కేటాయించిన శాఖలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపనులు, రవాణా శాఖల వంటివి తనకు అప్పగించాలని నాగరాజ్ డిమాండ్ చేస్తుండగా అప్రాధాన్య శాఖను కేటాయించారంటూ అలిగిన ఆనంద్ సింగ్ బళ్లారి జిల్లా హోస్పేటలోని తన కార్యాలయాన్ని మూసివేశారు. మాజీ సీఎం యడియూరప్పతో, అనంతరం సీఎం బొమ్మైతో సమావేశమై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. అనంతరం సీఎం, రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ కలిసి ఆనంద్ సింగ్‌ను బుజ్జగించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ..తనకు సింగ్‌తో ఎలాంటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ, పార్టీ నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ప్రాధాన్యం కలిగిన శాఖను ఆనంద్ సింగ్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించడం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ఏ రామదాస్, ఎమ్మెల్సీ సీపీ యోగీశ్వర కూడా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారు సీఎం బొమ్మైతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి సీల్డ్ కవర్లో ఒక లేఖను అందజేసినట్లు అనంతరం రామదాస్ మీడియాకు తెలిపారు. ‘తీరిక సమయంలో ఆ లేఖను చదవాలని సీఎం బొమ్మైను కోరాను. రాష్ట్రం, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను అందులో వివరించాను’ అని ఆయన వెల్లడించారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ యోగీశ్వర మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రితో రెండుసార్లు సమావేశ మయ్యాను. అయితే, వీటికి కారణాలంటూ ఏమీ లేవు. నాకెలాంటి అసంతృప్తి లేదు. నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా’ అని తెలిపారు. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా రెండు రోజుల అనంతరం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
పదవి రాని వారితో పాటు వచ్చిన వారూ పేచీ: సీఎంకు తలనొప్పి
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు రోజురోజుకూ అసమ్మతుల బెడద పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మంత్రి పదవులు రానివారితో పాటు, వచ్చినవారు కూడా శాఖ బాగాలేదని పేచీలందుకున్నారు. మొదట గళమెత్తిన పర్యాటక మంత్రి ఆనంద్‌సింగ్ తన శాఖను మార్చకపోతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అసంతృప్తి బాటలో ఇంకొందరు.. బి.శ్రీరాములు, ఎంటీబీ నాగరాజు కూడా శాఖలపై అసంతృప్తితో ఉన్నారు. ఇంధన శాఖపై ఆశ పెట్టుకున్న ఆనందసింగ్‌కు పర్యాటక శాఖను, హోంశాఖ ఆశించిన ఎంటీబీ నాగరాజుకు పరిపాలన శాఖ ఇచ్చారు. ప్రజాపనుల శాఖ కావాలన్న బి.శ్రీరాములుకు రవాణా శాఖ ఇవ్వడంతో కినుక వహించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ రాలేదని మంత్రులు వి.సోమణ్ణ, ఆర్.అశోక్‌లలోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది. వారిని చల్లార్చడానికి శాఖలను మార్చే అవకాశం లేకపోలేదు. ఆనందసింగ్‌తో మాట్లాడుతా: సీఎం మంత్రి ఆనంద్‌సింగ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. త్వరలోనే అన్నీ సద్దుమణుగుతాయని బుధవారం అన్నారు. ఆనంద్‌సింగ్ రాజీనామా చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మంత్రి ఆఫీసుపై బోర్డు తొలగింపు.. హొసపేటె: మంత్రి ఆనంద్‌సింగ్‌కు హొసపేటెలోని రాణిపేటలో ఉన్న ఆఫీసుకు మంగళవారం రాత్రి ఆకస్మికంగా తాళం వేశారు. ఆఫీసు ముందు ఉన్న బోర్డును కూడా జేసీబీతో తొలగించారు. పర్యాటకశాఖ ఇష్టం లేక ఇలా చేశారా అని నగరంలో చర్చనీయాంశమైంది. చదవండి: వాహనదారులకు తీపి కబురు -
అలిగిన వారిని బుజ్జగిస్తానన్న సీఎం; కేబినెట్ హోదా వద్దన్న యడ్డీ
సాక్షి, బెంగళూరు: మంత్రి మండలి ఏర్పాటు, శాఖల పంపిణీ తరువాత అధికార బీజేపీలో భిన్నస్వరాలు పెరగడంతో సీఎం బసవరాజ బొమ్మై ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో చర్చించడానికి ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కావేరిబంగ్లాలో మాజీ సీఎం యడియూరప్పను కలిశారు. అర్ధగంటకు పైగా రహస్యంగా చర్చలు జరపడం కుతూహలానికి దారితీసింది. మంత్రులు ఆనంద్ సింగ్, ఎంటీబీ నాగరాజ్, వి.సోమణ్ణ. శశికకళా జొల్లె తదితరులు తమ శాఖలపై అలకలతో ఉన్నారు. పదవులు రాని పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇలా జరుగుతుందని ఊహించని బొమ్మై యడ్డిని కలిసి పరిష్కారానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అలిగినవారిని బుజ్జగిస్తా: సీఎం శాఖల పంపిణీలో అసంతృప్తికి గురైన మంత్రులతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని సీఎం బొమ్మై తెలిపారు. విధానసౌధ ముందు పునఃప్రతిష్టించిన నెహ్రూ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. మాజీ సీఎం ఎస్.నిజలింగప్ప వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తరువాత మాట్లాడుతూ కోరిన శాఖ లభించలేదని మంత్రి ఆనందసింగ్ తనను కలిసి మాట్లాడారన్నారు. రాబోయే రోజుల్లో ఆయన వినతికి గౌరవమిచ్చేలా చూస్తానని, అలాగే మంచి శాఖ లభించలేదని అసంతృప్తితో ఉన్న ఎంటీబీ నాగరాజ్‌ను కూడా పిలిపించి మాట్లాడుతానని తెలిపారు. కేబినెట్ హోదా వద్దన్న యడ్డి మాజీ సీఎం యడియూరప్ప తనకు కేబినెట్ హోదా వద్దని, దానిని రద్దు చేయాలని సీఎంకి లేఖ రాశారు. మంత్రులకు శాఖల కేటాయింపు సందర్భంగా యడ్డికి కేబినెట్ హోదాను ప్రకటించడం తెలిసిందే. దీనిపై యడ్డి ఆదివారం సీఎంకు లేఖ రాస్తూ మాజీ సీఎంగా నాకు వచ్చే వసతులను మాత్రమే ఇవ్వండి. కేబినెట్ హోదా అవసరం లేదు అని కోరారు. చదవండి: కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర -
కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త కేబినెట్లో మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను మొదటిసారిగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. గత యడియూరప్ప ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను తిరిగి అవే శాఖలను అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీఎం బొమ్మై తన వద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ‘బెంగళూరు డెవలప్మెంట్’ శాఖను నగరానికి చెందిన సీనియర్ మంత్రికి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, పోటీదారులు ఎక్కువ కావడం వల్లే సీఎం ఎవరికీ ఈ పోస్టును కేటాయించలేదని భావిస్తున్నారు. కాగా, శాఖల కేటాయింపుపై ఆనంద్ సింగ్, ఎంటీ బీ నాగరాజ్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. కాగా, వీరిద్దరూ గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును వీడి, బీజేపీ సర్కారు ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన కేబినెట్లోని 29 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు. గత యడియూరప్ప కేబినెట్లోని 23 మందితోపాటు కొత్తగా ఆరుగురికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా కీలకమైన హోం శాఖను కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. మొదటిసారిగా కేబినెట్లో చోటు దక్కిన జ్ఞానేంద్రకు ఈ విధంగా జాక్‌పాట్ తగిలింది. అదేవిధంగా, ముఖ్యమైన విద్యుత్ శాఖతోపాటు కన్నడ, సాంస్కతిక శాఖను వి.సునీల్‌కుమార్‌కు కేటాయించారు. పాత వారిలో 17 మందికి గత శాఖలనే కొనసాగించగా, వీరిలో 8 మంది కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. అరగా జ్ఞానేంద్ర, సునీల్ కుమార్ సహా కొత్తగా చేర్చుకున్న వారికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మిగతా నలుగురిలో.. కె.ఎస్. ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు, ఆర్–అశోకకు రెవెన్యూ, కోటా శ్రీనివాస పూజారికి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, బీసీ నగేశ్‌కు ప్రాథమిక, సెకండరీ విద్య దక్కాయి. -
బొమ్మై టీంకు పోర్ట్‌ఫోలియో ఖరారు: కీలక శాఖలు ఎవరెవరికంటే?
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతను చేపట్టిన బొమ్మై కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 29 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్న బొమ్మై తన కేబినెట్లో బీజేపీ ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేశారు. ఆర్థిక శాఖతోపాటు, బెంగళూరు అభివృద్ధి, కేబినెట్ వ్యవహారాల కీలక శాఖలను కూడా సీఎం స్వయంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆరగ జ్ఞానేంద్రకు హోం శాఖను, మొదటిసారి మంత్రి అయిన నగేష్ కు ప్రాథమిక విద్యాశాఖను కేటాయించారు. ఇంకా సునీల్ కుమార్‌కు ఎనర్జీ అండ్ పవర్ పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. రవాణా, ఎస్టీ సంక్షేమ శాఖను బీ శ్రీరాములకు కేటాయించగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఈశ్వరప్పకు, రెవిన్యూశాఖను ఆర్ అశోకాకు అప్పగించారు. గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల శాఖను లింగాయత్ నాయకుడు, వి.సోమన్నదక్కించుకున్నారు. మురుగేష్ నిరానీకి భారీ, మధ్యస్థాయి పరిశ్రమలశాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. అలాగే భువనేశ్వరి (కర్ణాటక దేవత) పేరుతో ప్రమాణం చేసిన ఆనంద్ సింగ్‌కు పర్యావరణ మరియు పర్యావరణ శాఖ, గోమాత పేరుతో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభు చవాన్‌కు పశుపోషణ శాఖను కేటాయించడం విశేషం. కాగా యడ్యూరప్ప రాజీనామా తరువాత గత వారం బీజేపీ శాసనసభా పక్ష నూతన నాయకుడిగా ఎన్నికైన బొమ్మై జూలై 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. Portfolios allocation in Karnataka | CM Bommai keeps Finance, cabinet affairs, Bengaluru development & all un-allocated portfolios. KS Eshwarappa gets Rural Development & Panchayat Raj Development. R Ashoka gets Revenue (except Muzarai). B Sriramulu gets Transport & ST Welfare pic.twitter.com/9OYs5fhAu7 — ANI (@ANI) August 7, 2021 -
కొలువుదీరిన బొమ్మై కొత్త టీం.. యడ్డీ కుమారుడికి నిరాశ
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేబినెట్లో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి.. చివరకు ఆయనకు మొండి చేయి ఎదురయ్యింది. కొత్త మంత్రలు జాబితాలో యడ్డీ కుమారుడి పేరు లేకపోవడం గమనార్హం. అలానే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు భావించినప్పటికి.. చివరికి ఒక్కరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన 29 మంది వీరే.. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గోవింద్ కరజోల్, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేశ్ కత్తి, ఎస్. అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, కోట శ్రీనివాస పూజారి, మురేగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్, సీఎస్ అశ్వథ్‌నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సీసీ పటేల్, ఆనంద్ సింగ్, ఎస్టీ సోమేశేఖర్, బీసీ పటేల్, బీఏ బసవరాజు, డాక్టర్ కె.సుధాకర్, కె.గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారయణ గౌడ, బీసీ నగేష్, వి.సునీల్ కుమార్, హాలప్ప ఆచార్, శంకర్ పాటిల్ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు. సామాజిక వర్గాల వారిగా.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితాను పరిశీలిస్తే.. అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బొమ్మై కేబినెట్లో ఎనిమిది మంది లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన వారు ఉండగా.. ఒక్కలిగల నుంచి ఏడుగురు, ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి చోటు దక్కింది. -
29 మంది మంత్రులు, నో డిప్యూటీ సీఎం : బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం నేతృత్వంలో కొత్త మంత్రులు ఇవాళ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాత, కొత్త మేలు కలయికతో కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం బొమ్మై ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం ఎవరూ ఉండకూడదని హైకమాండ్ నిర్ణయించిందని బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని కేబినెట్లో, ముగ్గురు డిప్యూటీ సీఎంలున్న సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జాబితా సిద్ధం చేసినట్టు సీఎం తెలిపారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో వేడుకకు హాజరయ్యే వారు మాస్క్ ధరించాలని, అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అలాగే ఎవరూ పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని కూడా చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. మరోవైపు మంత్రుల అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుదారులు తమ నాయకులను ఎంపిక చేయకపోవడంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ముఖ్యంగా హవేరి ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే యడ్యూరప్ప హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ఎమ్మెల్యే ఆనంద్ మమణి తనను మంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానంటూ బెదిరింపుకు దిగారు. కాగా జూలై 28 న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొమ్మై క్యాబినెట్‌పై నిర్ణయం తీసుకునే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనే ఐదు రోజులు గడపటం గమనార్హం. -
నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ?
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ బొమ్మై తన మంత్రివర్గాన్ని బుధవారం సాయంత్రం ఐదింటికి విస్తరించనున్నారని వార్తలొచ్చాయి. 26 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడంలో తుది నిర్ణయం కోసం సీఎం బొమ్మై మంగళ వారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలుసుకున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఆవరణలో హోం మంత్రి అమిత్ షాను సైతం బొమ్మై కలుసుకున్నారని సమాచారం. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని 20–25 మందిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
2-3 జాబితాలు ఇచ్చాను.. కేబినెట్ ఖరారు నేడే: సీఎం
సాక్షి బెంగళూరు: నూతన మంత్రుల జాబితాను మంగళవారం సాయంత్రం బీజేపీ హైకమాండ్ విడుదల చేసే అవకాశముంది. సోమవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అధినేత జేపీ నడ్డాతో సీఎం బసవరాజు బొమ్మై సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా చర్చించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ కూడా పాల్గొన్నారు. అనంతరం వివరాలను సీఎం మీడియాకు తెలిపారు. మంత్రివర్గ ఏర్పాటుపై చర్చించామని, హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 2– 3 జాబితాలు ఇచ్చానని, మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా ఎవరెవరు ఉండాలనేది హైకమాండ్ మంగళవారం సాయంత్రం తేల్చనుందని చెప్పారు. నేడు మరో దఫా చర్చలు జరుపుతామని, అధిష్టానం నుంచి అనుమతి రాగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ముహూర్తం వెల్లడిస్తానని సీఎం తెలిపారు. పార్టీలో ఎవరూ ఫిరాయింపుదారులు, వలసదారులు లేరని, అందరూ బీజేపీ నేతలేనని చెప్పారు. సీఎం ఢిల్లీ యాత్రలేల: సిద్ధు శివాజీనగర: కరోనా థర్డ్ వేవ్‌పై రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం కావాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య కోరారు. సోమవారం కారవారలో మాట్లాడుతూ సీఎం బొమ్మై మంత్రిమండలి ఏర్పాటుకు ఢిల్లీకి పదే పదే వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఒకసారి వెళ్లి రావాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు బెంగళూరులో మకాం వేసి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి వెళ్లి పని చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రోజువారి కరోనా సోకితుల సంఖ్య 2 వేలు దాటితే మూడో దశ మొదలైనట్లు అర్థమన్నారు. -
రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి పిలుపు !
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ విస్తరణ వ్యవహారంపై రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి తనకు పిలుపు రావచ్చని కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన శనివారం తిరిగి వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాలను కలిశారు. అయితే నడ్డాను శనివారం కలిసే అవకాశం రాలేదని, మళ్లీ పిలుపు రావచ్చని పేర్కొన్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్లి కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ రెండు దశల్లో జరగనుందా అని మీడియా ప్రశ్నించగా, ఆ విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. కొనసాగుతున్న లాబీయింగ్.. మంత్రులను ఎంపిక చేసే వ్యవహారంలో పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ప్రాంరభించారు. మాజీ మంత్రులు సైతం ఢిల్లీ వేదికగా తమ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, ఎంపీ రేణుకాచార్య, మునిరత్నలు మాజీ సీఎం యడియూరప్పను ఆయన నివాసంలో కలిశారు. బీజేపీ సీనియర్ నేత కె.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా యడియూరప్ప తొలగింపు జరిగాక తనను సీఎం చేయాల్సిందని, ఇప్పటికైనా తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందిగా పలువురి నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. నిర్ణయం హైకమాండ్ చేతుల్లో ఉందని అన్నారు. మా వర్గం నుంచి ఎవరూ లేరు.. హవేరీ ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ మాట్లాడుతూ.. రాబోయే కేబినెట్లో తనకు చోటు దక్కాలని తమ నియోజకవర్గ కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఓ అవకాశం రావడం ఇది మూడో సారి అని, నేతలు తనను దీవిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చాలవాడి వర్గం నుంచి ఇప్పటి వరకూ బీజేపీలో ఎవరికీ అవకాశం దక్కలేదని అన్నారు. కాంగ్రెస్‌లో తమ వర్గానికి గతంలో అవకాశం దొరికిందని అన్నారు. ఇప్పుడు అవకాశం రాకపోతే కాంగ్రెస్ వైపు వెళతారనే భయం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బీజేపీని కోరారు. ముఖ్యమంత్రి ఒక్కడే అన్ని వ్యవహారాలను నిర్వహించలేరని పేర్కొన్నారు. -
మంచి పాలన అందించండి
సాక్షి బెంగళూరు: ప్రజలకు ఉత్తమ పాలన అందించాలని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బసవరాజబొమ్మై తొలిసారిగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్ని విధాల సహకారం అందిస్తాం... ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మోదీ స్పందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. ఇదే సమయంలో వరద నష్ట పరిహారం అందించాలని, హుబ్లీ–ధారవాడ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, రాయచూరుకు ఎయిమ్స్ తరహాలో వైద్య సంస్థను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కలబురిగి ఈఎస్ఐ వైద్య కళాశాల, స్థానిక ఆస్పత్రిని ఎయిమ్స్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించి వారం రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలిపారు. -
కర్ణాటకం కోసం బీజేపీ కసరత్తు
కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మైతో పాటు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. బసవరాజ్ పేరుకు ముఖ్యమంత్రి అయినా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన కున్న అధికారం తక్కువ. పార్టీ ఢిల్లీ పెద్దలే మంత్రుల ఎంపికలో కీలకపాత్ర వహిస్తారు. ఈ పరిస్థితిని నిశి తంగా పరిశీలించిన వారికి ఇందిర హయాంలో కాంగ్రెస్ రాజకీయాలు గుర్తుకురాక మానవు. కర్ణాటకలో కొత్త తరం నాయకులను ప్రోత్సహిం చాలని బీజేపీ హైకమాండ్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, కనీసం మూడు దఫాలు ఎమ్మె ల్యేగా ఎన్నికవడాన్ని ప్రాతిపదికలుగా తీసుకుంటు న్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల కథనం. ఈ నేప థ్యంలో యడ్యూరప్ప కేబినెట్లో పనిచేసిన చాలా మందికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిం చడం లేదు. అయితే యడియూరప్ప రాజీనామా తరు వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించిన అరవింద్ బెల్లాడ్, బీపీ యత్నాల్‌కు తప్పకుండా చోటు దొరుకు తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సంఘ్ పరివార్‌కు సన్నిహితుడైన సురేష్ కుమార్, యడ్యూరప్ప శిబిరం నుంచి అశోక్‌కు మంత్రి పదవులు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారో లేదో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ సెట్టార్ నిరసన గళం వినిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేబి నెట్లో చేరే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. 2012లోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర జగదీశ్‌ది. అయితే 2019లో ఏర్పడ్డ యడియూరప్ప కేబినెట్లో ఎలాంటి భేషజాలకు పోకుండా పనిచేశారు. యడియూరప్ప తనకంటే వయసులోనూ, రాజకీయంగానూ సీనియర్ కావడంతో ఆయన కేబినెట్లో ఉన్నానన్నారు. బసవ రాజతో తనకెలాంటి గొడవలూ లేవనీ, ఆత్మ గౌర వాన్ని కాపాడుకోవడానికే తనకు సబ్ జూనియర్ అయిన బసవరాజ మంత్రివర్గంలో చేరదలుచుకోలే దనీ స్పష్టత ఇచ్చారు. ఇదిలావుంటే, బసవరాజ ప్రమాణ స్వీకారానికి బళ్లారి నేత బి. శ్రీరాములు డుమ్మా కొట్టారు. ఆయన్ని కొంతకాలంగా ఢిల్లీ పెద్దలు దూరం పెడుతున్నారు. దీంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సుష్మా స్వరాజ్ చనిపోయిన తరువాత శ్రీరాములు రాజకీయ జీవితం దాదాపుగా మసక బారిందనే చెప్పవచ్చు. ఇక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఉపముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. చాలా మంది మఠాధిపతులు తనను ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని మనసులోని మాటను బయటపెట్టారు. అయితే బీజేపీలాంటి సైద్ధాంతిక పార్టీలో ఇలాంటి బెదిరింపులు ఎవరూ పట్టించుకోరు. యడియూరప్ప మీద నమ్మకంతోనో, పదవులకు ఆశపడో గతంలో కాంగ్రెస్, జేడీ (ఎస్) నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారికి యడి యూరప్ప మంచి పదవులే కట్టబెట్టారు. ఇప్పుడు దళపతి మారడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన పడుతున్నారు. అయితే వీరిని దూరం చేసు కుంటే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చు. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువున్నారు. అంటే ఏడు గురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తే బసవరాజ సర్కార్ పడి పోవడం ఖాయం. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మె ల్యేలకు ఎలాంటి అన్యాయం జరగదని తాను భావి స్తున్నట్లు మాజీ మంత్రి బీసీ పాటిల్ అన్నారు. ఏమైనా ఎవరినీ నారాజ్ చేయకుండా అడుగులు వేస్తోంది బీజేపీ. బసవరాజ టీమ్‌తోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి యడియూరప్ప పునా దులు తవ్విన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే కొంతకాలంగా ఆయన పాలన గాడి తప్పిందన్న విమ ర్శలున్నాయి. యంత్రాంగంలో అవినీతి పెరిగింది. ప్రభుత్వ వ్యవహారాల్లో యడియూరప్ప పుత్రరత్నం జోక్యం పెరగడంతో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాగే కోవిడ్‌ను కట్టడి చేసే విషయంలోనూ యడియూరప్ప సర్కార్ విఫలం అయిందన్న విమర్శలు న్నాయి. దీంతో పాతవారిని పక్కనపెట్టి ప్రజలకు కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయాలని బీజేపీ నిర్ణయిం చుకున్నట్లు రాజకీయవర్గాల మాట. ఎస్. అబ్దుల్ ఖాలిక్ సీనియర్ జర్నలిస్ట్ ‘ మొబైల్ : 87909 99335 -
Karnataka: డిప్యూటీ సీఎంగా శ్రీరాములు, ఆయనేమన్నారంటే..
సాక్షి, బెంగళూరు: నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బళ్లారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు పాల్గొనక పోవడంతో మీడియాల్లో పలు కథనాలు రావడంతో ఆయన స్పందించారు. తనకు పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని, మూడుసార్లు మంత్రిని చేసిందని గుర్తు చేశారు. గురువారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... ఇంట్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశానని, ఎవరిపైన ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేది లేనిది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు విజయేంద్రను షాడో సీఎం అంటూ ప్రతిపక్షాలు మాట్లాడారని, ప్రస్తుతం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపడితే యడియూరప్పను షాడో సీఎం అంటూ సంభోదిస్తున్నారని మండిపడ్డారు. -
బసవరాజు బొమ్మై కేబినెట్: కుర్చీలాట షురూ..
సాక్షి, బెంగళూరు: కొత్త సీఎం ప్రమాణ స్వీకారంతో బీజేపీలో ఒక ఘట్టం ముగియగానే మరో ముఖ్య ఘట్టానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కేబినెట్లో పదవుల కోసం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలకు నాంది పలికారు. ఢిల్లీలోనూ మకాం వేసి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పాత కేబినెట్లో పది మందికి పైగా మంత్రులకు మొండిచేయి తప్పేలా లేదు. ఈసారి కొత్తవారికి అందులోనూ బీజేపీ మూలాలు ఉన్నవారికి మంత్రి పదవులు దక్కేలా ఉంది. యడియూరప్ప మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు అయిన కేఎస్ ఈశ్వరప్ప, సురేశ్ కుమార్, సీసీ పాటిల్, కోటా శ్రీనివాస పూజారి, శశికళా జొల్లె తదితరులకు చెక్ పడుతుందని సమాచారం. ఆ సీనియర్లకు భరోసా?.. గత కాంగ్రెస్– జేడీఎస్‌ల నుంచి వచ్చిన వలసదారుల్లో 15 మంది వరకూ యడియూరప్ప వద్ద మంత్రిగా ఉండేవారు. కొత్త మంత్రివర్గంలో 5–6 మందికి మాత్రమే మంత్రిభాగ్యం దక్కవచ్చని వినికిడి. సీనియర్ మంత్రులు, ఆర్.అశోక్, శ్రీరాములు, గోవింద కారజోళ, డాక్టర్ సీఎన్ అశ్వత్థ నారాయణ, లక్ష్మణ సవది, వి.సోమణ్ణ, మాధుస్వామి వంటి నేతల స్థానాలకు ఢోకా లేదని చెప్పుకుంటున్నారు. సభాపతి విశ్వేశ్వర హెగ్డే కాగేరికి చాన్సుంది. ఆదివారంలోగా నిర్ణయం ఆదివారంలోగా ఖరారు చేసి మంత్రిమండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కొత్త సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ కూర్పు మొత్తం బీజేపీ అధిష్టానం చేతుల్లో ఉంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే కేబినెట్ కూర్పు జరగనున్నట్లు తెలిసింది. యడియూరప్ప మాజీ సీఎం అయినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయనే పెద్దదిక్కుగా ఉన్నారు. ఆశావహులు యడియూరప్ప ఇంటికి పరుగులు పెడుతున్నారు. యడ్డి చెబితే మంత్రి పదవి వచ్చేస్తుందని ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎస్ఆర్ విశ్వనాథ్, అప్పుగౌడ పాటిల్, రేణుకాచార్య, మునేనకొప్ప, తిప్పారెడ్డి తదితరులు ఆయనను కలిసి చర్చించారు. -
Karnataka: టార్గెట్ 2023.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు
బెంగళూరు: గత కొద్ది రోజుల నుంచి కర్ణాటక రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు గురించి పలు ఊహాగానాలు వెలువడినప్పటికి మాజీ సీఎం యడియూరప్ప వాటిని ఖండించారు. కానీ దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలు పెట్టింది. యడ్డీ వారసుడిగా ఆయన మంత్రివర్గంలో పని చేసిన బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సీఎం బొమ్మై కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బొమ్మై, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాక అతని కేబినెట్లో ఆరు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి.. అందునా యువకులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బొమ్మై క్యాబినెట్లో గరిష్టంగా 34 మంది సభ్యులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 లో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో కూడిన జంబో బృందాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబినెట్ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు కర్ణాటక బీజేపీ సీనియర్ కార్యనిర్వాహక అధికారి ఒకరు తెలిపారు, ఎస్సీలు, ఎస్టీలు, వోక్కలిగాస్, లింగాయతులు, ఓబీసీ అనే ఐదు ప్రధాన సామాజిక వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 2008 నుంచి అసెంబ్లీ ఎన్నికలలో 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటడానికి బీజేపీ కష్టపడుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు బీజేపీ అధిష్టానం ఐదుగురు డిప్యూటీ సీఎంల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా, పార్టీ కేంద్ర నాయకత్వం మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో పాటు లింగాయత్ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచింది. ప్రస్తుతం వారు ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఒక్క దెబ్బకు... రెండు పిట్టలు
చాలాకాలంగా వినిపిస్తున్నదే నిజమైంది. కర్ణాటక పీఠంపై యడియూరప్ప స్థానంలో కొత్త నేత కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం పదవీ స్వీకారం చేయడంతో యడియూరప్ప పాత అధికార శకం ముగిసింది. దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. కన్నడనాట పార్టీ బలోపేతంలో, అధికారంలోకి తేవడంలో కీలక పాత్రధారి యడ్డీ తర్వాత ఎవరన్న చిరకాలపు చిక్కుప్రశ్నకు బీజేపీ జవాబిచ్చింది. యడ్డీ మంత్రివర్గంలో హోమ్ మంత్రి బొమ్మై ఇప్పుడు పార్టీనీ, ప్రభుత్వాన్నీ చక్కదిద్దాల్సిన బరువు భుజానికెత్తుకున్నారు. 1980లలో తొమ్మిది నెలల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్సార్ బొమ్మై వారసుడిగా నడక ప్రారంభించారు. ఇంజనీరింగ్ చదివి, టాటా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తూ, వ్యాపారవేత్తగా మారాలని బెంగళూరొచ్చి, అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన బసవరాజ్ సీఎం స్థాయికి ఎదగడం అనూహ్యమే. జనతాదళ్‌తో మొదలై, బీజేపీలో చేరడానికన్నా ముందు జేడీయూలో పనిచేసిన గతం బొమ్మైది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి, పెరుగుతున్న అసమ్మతితో యడ్డీ క్రమంగా పార్టీకి బరువవుతున్న సంగతిని అధిష్ఠానం చాలాకాలం క్రితమే గుర్తించింది. ఇప్పటిదాకా నాలుగు సార్లు సీఎం అయినా, ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని జాతకం యడ్డీది. 2012లోనైతే ఏకంగా అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే యడ్డీ... బీజేపీ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టి సత్తా చాటిన రోజులనూ అధినాయకత్వం మర్చిపోలేదు. ఈసారి పార్టీకి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా, అదే సమయంలో గౌరవంగా యడ్డీని సాగనంపాలని అధిష్ఠానం 4 నెలలుగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. అందుకే, ఆయనను కానీ, రాష్ట్రంలో దళితుల (23 శాతం) తరువాత రెండో అతి పెద్దదైన (17 శాతం) ఆయన లింగాయత్ సామాజిక వర్గాన్ని కానీ శత్రువుల్ని చేసుకోకుండా తెలివిగా వ్యవహరించింది. ఒక దశలో లింగాయత్‌ల బదులు మరో కీలక ఒక్కళిగల వర్గానికి చెందిన నేతను గద్దెపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం తర్జనభర్జన పడింది. కానీ, దక్షిణాదిన బలంగానూ, అధికారంలోనూ ఉన్న ఏకైక రాష్ట్రంలో అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్‌లకు జోల పాడింది. వయసు మీద పడ్డ 78 ఏళ్ళ యడ్డీ స్థానంలో తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బొమ్మై మెరుగు అనుకుంది. అలా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతకు సీఎం సీటు దక్కాలన్న ఆ ప్రాంతీయుల చిరకాల డిమాండ్‌ను కూడా తీర్చింది. వాజ్‌పేయి – అడ్వాణీల తరం నేతలను ఒక్కొక్కరిగా వదిలించుకుంటూ వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం ఆ క్రమంలోనే యడ్డీ స్థానంలో బొమ్మైని తెచ్చింది. అదే సమయంలో ‘దశాబ్దాలుగా మీరు చేసిన సేవలకు మాటలు సరిపోవు’ అంటూ ట్విట్టర్ సాక్షిగా యడ్డీపై ప్రశంసల వర్షమూ కురిపించింది. ఆచితూచి చేసిన ఈ మార్పుతో బీజేపీకి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దక్కాయి. ఒకటి – బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో, రాష్ట్రంలో తమ బలమైన ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా, కాపాడుకున్నట్టయింది. రెండోది – యడ్డీకి బొమ్మై నమ్మినబంటు కావడం వల్ల, నిష్క్రమిస్తున్న సీనియర్ నేత నుంచి అసమ్మతులు, కొత్త ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయింది. యడియూరప్ప సైతం నిష్క్రమణ సమయంలోనూ కోరుకున్న హిరణ్యాక్ష వరాలు దక్కించుకొని, పార్టీపై తన పట్టు సడలలేదని చాటుకున్నారు. పదవి పోయినా తానే తెర వెనుక సీఎం అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడైన తన చిన్న కొడుకు 45 ఏళ్ళ విజయేంద్ర ప్రాధాన్యానికి భంగం రాదన్న హామీ పుచ్చుకున్నారు. ఇక, యడ్డీ వారసుడిగా పీఠమెక్కిన బొమ్మైకి 20 నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న సమయం తక్కువ. సవాళ్ళు ఎక్కువ. కరోనా వేళ దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠను ఆయన పునరుద్ధ రించాల్సి ఉంటుంది. యడ్డీ అవినీతి, బంధుప్రీతి మరకలు పార్టీ విజయావకాశాలకూ, ప్రభుత్వ గౌరవానికీ భంగం కలిగించకుండా చకచకా చర్యలు చేపట్టాలి. యడ్డీ ఖాళీ చేయగానే సీఎం సీటులో కూర్చోవాలని ఆశపడ్డ ఆశావహులను బుజ్జగించి, కలుపుకొని పోవాలి. వ్యక్తిగత గురువైన యడ్డీని తోసిపుచ్చకుండానే, సొంతకాళ్ళపై నిలబడి పదవిని సుస్థిరం చేసుకొనేందుకు సమస్త ప్రయత్నాలూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా... పార్టీలో సమస్యల పరిష్కర్తగా, సౌమ్యుడిగా, మధ్యేవాదిగా ఇప్పటి దాకా తనకున్న పేరును కాపాడుకుంటూనే, యడ్డీ లాంటి జననేతగా ఓటర్ల గుండెల్లో గూడు కట్టుకోవాలి. 2018 ఎన్నికలలో గెలిచినా – ఎమ్మెల్యేలపై యడ్డీ వేసిన ‘ఆపరేషన్ కమల్’ మంత్రంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు తిరిగి బలం పుంజుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికే అధిష్ఠానం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రుల్ని చేస్తోందన్న వార్తలొచ్చాయి. అంటే, బొమ్మైకి ఆది నుంచే ఆట మొదలైపోయింది. మరి, స్వతహాగా క్రికెట్ వీరాభిమాని, గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చైర్మన్ అయిన బొమ్మై తన కెప్టెన్సీలో కర్ణాటక బీజేపీ టీమ్‌ను ఎంత సమన్వయంతో, సమర్థంగా నడిపిస్తారో చూడాలి. నిండా రెండేళ్ళయినా దూరం లేని 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సిక్సర్ కొడతారా? రోజుకో రకంగా మారే రాజకీయాలలో అధిష్ఠానం ఆశలు, ఆలోచనల్ని నిజం చేస్తారా? ఇప్పుడే తెర తీసిన కర్ణాటకంలో కొత్త అంకానికి స్వాగతం. -
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ తొలి కేబినెట్ సమావేశం
-
బొమ్మై కేబినెట్ తొలి సమావేశం.. కీలక నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బసవరాజ్ బొమ్మై బుధవారం తొలిసారిగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా... వితంతు, వికలాంగుల పింఛన్‌ను 600 రూపాయల నుంచి 800 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రైతు బిడ్డల కోసం ప్రత్యేక ఉపకార వేతన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల నిధిని కేటాయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలో ఈ మేరకు బొమ్మై మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కోవిడ్-19, వరదలు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వీటిని అధిగమించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. అదే విధంగా పేద, రైతుల అభ్యున్నతికి తోడ్పడుతూ.. వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కర్ణాటక ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటాను’’ అని సీఎం బొమ్మై తెలిపారు. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఇంత వరకు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ను కలిసినపుడు.. ఢిల్లీ వెళ్లిన తర్వాత అంశంపై చర్చిద్దామని చెప్పారు’’ అని సీఎం బొమ్మై సమాధానమిచ్చారు. -
కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై
-
కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ శాసనసభాపక్ష కొత్త సారథిగా మంగళవారం ఎన్నికైన బసవరాజ బొమ్మై(61) బుధవారం కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. బుధవారం ఉదయం బెంగళూరు రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్.. బసవరాజ చేత సీఎంగా ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మై దేవుని మీద ప్రమాణంచేసి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ప్రమాణస్వీకారోత్సవం కేవలం మూడు నిమిషాల్లోనే ముగిసింది. తాజా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణంచేసిన రోజున ‘రైతు ప్రభుత్వం’కు సూచికగా ఆకుపచ్చ శాలువా ధరించారు. బొమ్మై మాత్రం కాషాయ రంగు శాలువాను ధరించారు. పార్టీ పెద్దల సూచన మేరకు ఒకే విడతలో పూర్తిస్థాయిలో త్వరలోనే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తానని కొత్త సీఎం బసవరాజ వెల్లడించారు. ప్రమాణోత్సవానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు శివాజీనగర: కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణం చేసిన బసవరాజకు ప్రధాని మోదీ శుభాభినందనలు తెలిపారు. ‘సుదీర్ఘమైన శాసన, పరిపాలనా అనుభవం బొమ్మై సొంతం’అని మోదీ ట్వీట్ చేశారు. ‘కర్ణాటక అభివృద్ధిలో మాజీ సీఎం యడియూరప్ప సేవలు అపారమైనవి. దశాబ్దాలుగా కృషి చేసి కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను తయారు చేయడంలో ఆయన అపార శ్రమ దాగి ఉంది’అని యడియూరప్పను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బసవరాజ్ బొమ్మై ప్రస్థానం: ► బసవరాజ్ బొమ్మయ్ జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ► 1995లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► 1996-97 వరకు అప్పటి సీఎంగా ఉన్న జేహెచ్ పటేల్ వద్ద రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన బొమ్మయ్ ► 1998,2008 ధారవాడ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక ► 2007లో ధారవాడ నుంచి 232 కిలోమీటర్లు రైతుల కోసం పాదయాత్ర ► 2008లో బీజేపీలో చేరిన బసవరాజ్ బొమ్మయ్ ► 2008లో షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 జూన్ 7 - 2013 మే 13 వరకు జలవనరుల మంత్రిగా విధులు ► 2019 సెప్టెంబర్ 27 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకు సహకార మంత్రిగా విధులు ► 2019 ఆగస్టు 26 నుంచి 2021 జులై 26 వరకు.. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన బసవరాజ్ బొమ్మయ్ ► వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిన బసవరాజు బొమ్మయ్ ► మెకానికల్ ఇంజనీర్, పారిశ్రామికవేత్తగా బసవరాజు బొమ్మయ్‌కు గుర్తింపు