Karnataka CM As Chief Guest In RRR Movie Promotional Event: Ram Charan-Jr NTR - Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్‌ఆర్ఆర్' సినిమా కోసం ఆ రాష్ట్ర సీఎం !

Published Wed, Mar 16 2022 1:42 PM | Last Updated on Wed, Mar 16 2022 3:14 PM

Karnataka CM As Chief Guest In RRR Movie Promotional Event - Sakshi

Karnataka CM As Chief Guest In RRR Movie Promotional Event: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను భారీగానే ప్లాన్ చేసింది జక్కన్న టీం. స్పెషల్‌ ఇంటర్వ్యూలు, ప్రత్యేక ఈవెంట్లతో భారీగా సన్నాహాలు చేస్తున్నారు. 

చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' సెలబ్రేషన్స్‌ సాంగ్‌.. పూర్తి పాట వచ్చేసింది..

ఈ క్రమంలో మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రిరిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌లో మూవీ ప్రమోషన్స్‌ కోసం ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కర్ణాటక సీఎంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి, సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌లు కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ వేడుకను దివంగత నటుడు పునీత్ రాజ్‌ కుమార్‌కు అంకితం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. 

చదవండి: 'ఆర్​ఆర్​ఆర్'​ దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement