బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజార్టీ సాధిచడంలో విఫలమయ్యామని, ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తమ లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మై చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామన్నారు.
మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా ఫలితాలపై స్పందించారు. గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవవరం లేదన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరీశీలన చేసుకుంటామన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 135 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు బీజేపీ కేవలం 65 స్థానాల్లోనే ముందంజలో ఉంది. జేడీఎస్ 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైనా 6 మంత్రాలివే..
Comments
Please login to add a commentAdd a comment