yadyurappa
-
దర్శన్‌తో పాటు ఆ ముగ్గురిని ట్యాగ్ చేస్తూ హీరోయిన్ రమ్య కామెంట్
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో పలు కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరో దర్శన్, మాజీ సినీ నిర్మాత యడ్యూరప్ప, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ వంటి ప్రముఖులు నేడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరందరినీ ఉద్దేశించి కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య విమర్శలు ఎక్కుపెట్టారు.అనేక సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘించే ధనవంతులు, సెలబ్రిటీలు, ప్రభావవంతమైన వ్యక్తులు నేటి సమాజంలో ఉన్నారు. వారు చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఈ నేరాలను బయటపెట్టిన పోలీసులకు, మీడియాకు హ్యాట్సాఫ్. కేసులను సక్రమంగా విచారణ జరిగేలా న్యాయస్థానం చూడాలి. ఒక్కోసారి న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు న్యాయస్థానం ఏం సందేశం ఇచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది.' అని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్, లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణతో పాటు పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప పేరును తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. రమ్య పోప్ట్ చేయడం విశేషం.రేణుకాస్వామిని హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శన్ గురించి గతంలో ఆమె ఒక పోస్ట్ చేశారు. తప్పు చేసిన వారు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె కోరింది. దీంతో ఆమెపై ఆయన అభిమానులు విరుచకపడ్డారు. ట్రోల్స్ చేస్తూ రమ్యను బూతులు తిట్టడం ప్రారంభించారు. దానిని కూడా ఆమె తప్పబట్టారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న సమాజంలో జీవించడం సిగ్గుచేటు అని తెలిపారు. ఈ క్రమంలో చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆమె గుర్తుచేశారు. సెలబ్రిటీ అయితే సాధారణ ప్రజలను కొట్ట చంపేస్తారా..? అంటూ ఆమె స్వరాన్ని పెంచారు. ఇలాంటి కేసుల విషయంలో ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పోలీసులు పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. చట్టంపై ప్రజలు విశ్వాసం ఉంచుతారనే నమ్మకం ఉందని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.తెలుగు వారికి కూడా రమ్య పరిచయమే నందమూరి కళ్యాణ్‌రామ్ 'అభిమన్యు' సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య మెప్పించారు. 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో టాప్ హీరోయిన్గా చెరగని ముద్ర రమ్య వేశారు.The ones breaking the law who have been in the news are the rich and powerful and the ones at the receiving end of their violent actions are the poor, women & children. The common people of Karnataka. Hats off to the police and media for bringing these crimes out. Justice will…— Ramya/Divya Spandana (@divyaspandana) June 22, 2024 -
కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: ఒక్కసారిగా పదవి పోతే రాజకీయ నాయకులు నిరాశలో కుంగిపోతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత ఎస్.డీ.సోమశేఖర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను తన రాజకీయ గురువుగా చెబుతూ కాంగ్రెస్ తలుపు తట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్.డీ.సోమశేఖర్ గౌడ మాట్లాడుతూ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని సహకార శాఖలో నేను ఏదైనా సాధించానంటే అది అయన చలవేనని అన్నారు.అయన నాకు చాలా సహాయం చేశారు. మొదట్లో నాకు జేపీ నగర్ బ్లాకు ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఫీకే శివకుమార్ నన్ను జేపీనగర్ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అక్కడి నుండి ఆయన నాకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఉత్తరహళ్లి నియోజకవర్గం అభ్యర్థిగా నా పేరును ఆయనే ప్రతిపాదించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే ఆయన కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం చూస్తే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచి యాడ్యూరప్ప ప్రభుత్వానికి అండగా నిలిచిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సోమశేఖర్ కూడా ఒకరు. కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. బహుశా ఆయన ఎదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయనతో మాట్లాడితే సమస్య సర్దుకుంటుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
బీజేపీ ఘోర పరాభవంపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజార్టీ సాధిచడంలో విఫలమయ్యామని, ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తమ లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మై చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామన్నారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా ఫలితాలపై స్పందించారు. గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవవరం లేదన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరీశీలన చేసుకుంటామన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 135 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు బీజేపీ కేవలం 65 స్థానాల్లోనే ముందంజలో ఉంది. జేడీఎస్ 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైనా 6 మంత్రాలివే.. -
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన వయసు 80 ఏళ్లని ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈమేరకు ప్రకటన చేశారు. అయితే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని యడియూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీజేపీని మరోసారి అధికారంలోకి తెస్తానని పేర్కొన్నారు. రాష్ట్రానికే పరిమితం.. అలాగే తనకు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, కర్ణాటకకే పరిమితం అవుతానని యడ్డీ స్పష్టంచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తనను కేంద్రానికి రమ్మని అప్పుడే అడిగారని, కానీ తాను మాత్రం సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. తన ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారని, రాష్ట్ర నలుమూలలు తిరిగి బీజేపీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారని యడ్డీ వివరించారు. 140 సీట్లు ఖాయం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. రెండు సార్లు సర్వే చేసిన తర్వాత గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగలాండ్, త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. చదవండి: నా శవం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో వెళ్లదు -
సీఎం కుర్చీ నుంచి నన్నెవరూ దింపలేరు
బెంగళూరు: తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. సీఎం మార్పుపై కర్నాటకలో సాగుతున్న ప్రచారంపై శనివారం యడియూరప్ప స్పందించారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత ఏప్రిల్ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల ప్రకటన చేశాడు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు తనపై విశ్వాసం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప సవాళ్లతో సహవాసం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది. -
ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం
సాక్షి, హైదరాబాద్: సరిహద్దు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు విభిన్న ప్రకటనలు చేశారు. దీంతో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన చేసింది. దానిపై సోమవారం కర్ణాటక బీఎస్ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం స్పష్టం చేశారు. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు దురదృష్టకరం. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. కర్ణాటకలో కన్నడిగులు, మహారాష్ట్రీయులు సోదరులుగా ఐకమత్యంతో జీవిస్తున్నారు. ప్రజల్లో శాంతికి భంగం కలిగించేలా ఉన్న థాకరే వ్యాఖ్యలను ఖండిస్తున్నా. నిజమైన భారతీయుడిగా సమాఖ్య స్ఫూర్తికి థాకరే గౌరవం ఇవ్వాలి. వాటికి కట్టుబడి ఉండాలని’’ యడియూరప్ప సోమవారం ట్వీట్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఆదివారం ఓ ట్వీట్ రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉండగా ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకుంటామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. ఆ ప్రాంతాలు తమ రాష్ట్రానికి చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలని ఎన్నాళ్ల నుంచో మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. ఇదే డిమాండ్‌పై మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. అయితే 1956 జనవరి 17వ తేదీన ఈ ఉద్యమంలో జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ జనవరి 17వ తేదీని మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఆ ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని పేర్కొంది. -
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా తో భేటీ కానున్నారు. రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు. -
బెంగళూరు హింస : నష్టాన్ని వారి నుంచే రాబడతాం
బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి. అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హింసాకాండకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. హింసలో ఎలాంటి నష్టం వాటిల్లినా అల్లరి మూకల నుంచే రికవరీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హింసకు పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని, నష్టాలను అంచనా వేసి జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రికవరీ చేస్తామని చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బెంగళూరు హింసాకాండ వెనుక కుట్రను బహిర్గతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో మంగళవారం రాత్రి హింస చెలరేగింది. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి తెగబడటంతో పాటు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. డీజే హళ్లి పోలీస్ స్టేషన్లోకి చొరబడి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కాగా బెంగళూర్‌లో జరిగిన హింసాకాండకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు. చదవండి : బెంగళూరు అల్లర్లపై సీఎం సీరియస్ -
ఇది హృదయం లేని ప్రభుత్వం: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు : గృహహింసతో బాధలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు వసతి సౌకర్యం కల్పించిన సంత్వాన కేంద్రాలను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమని జనతాదళ్ సెక్యూలర్ పార్టీ (జేడీఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. దీనిపై ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంత్వాన కేంద్రాలను మూసివేయాలని ముఖ్యమంత్రి యాడియూరప్ప తీసుకున్న నిర్ణయం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ట్వీట్లో ‘‘లాక్డౌన్లో మహిళలపై దాడుల కేసులు పెరుగుతున్నప్పటికీ.. వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చిన రక్షణ కేంద్రాలను రద్దు చేయబోతున్నారు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. (కుమార కాషాయ రాగం) How ironic! The government has opened take away alcohol shops but shuts down Santhwana centres. Giving the bottle to the man while shutting down the care centres for victims of domestic violence. So very thoughtful! 1/3 — H D Kumaraswamy (@hd_kumaraswamy) May 15, 2020 ఇక ‘‘రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.. కానీ గృహ హింస బాధిత మహిళలను సంరక్షించిన సంత్వాన కేంద్రాలు మూసివేయబడుతున్నాయి’’ అని వరుస ట్వీట్లో ఎద్దేవా చేశారు. ‘‘ఓ వైపు పురుషుల చేతికి మద్యం సిసాలు అందిస్తూ.. మరోవైపు బాధిత మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలను మూసివేస్తానడం విడ్డూరంగా ఉంది’’ అన్నారు. ‘‘రెండు దశాబ్ధాలుగా గృహహింసతో తీవ్ర ఒత్తిడికి గురైన రాష్ట్ర స్థాయి మహిళలకు సహాయం అందించడంమే కాకుండా.. జిల్లా స్థాయిలోని మహిళలు, పిల్లలకు సంరక్షణ ఇవ్వడంలో సంత్వాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి రక్షణ కేంద్రాలను ఖచ్చితంగా హృదయం లేని ప్రభుత్వమే మూసివేస్తుంది’’ అంటూ ఆయన విమర్శించారు. Government's decision to shut down Santhwana Centres across the state is unbelievably stupid. Even as the cases of atrocities increase during lock down, an important redressal system is being abolished. 2/3 — H D Kumaraswamy (@hd_kumaraswamy) May 15, 2020 -
‘కన్నడ నాట ఇక సుస్థిర సర్కార్’
బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నానని సీఎం బీఎస్ యడియూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో ఇప్పుడు తమకు ఎలాంటి సమస్యలూ లేవనీ, ఇక ప్రజా అనుకూల, సుస్ధిర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆరు స్ధానాలను ఇప్పటికే కాషాయపార్టీ దక్కించుకోగా మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. విపక్ష కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఉప ఎన్నికల్లో కాషాయ ప్రభంజనంతో కన్నడ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం సమసిపోయినట్టయింది. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. యడ్డీ సర్కార్ మనుగడ కోసం ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధించాల్సి ఉండగా అంతకుమించిన సీట్లు కాషాయ ఖాతాలో పడనుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది. -
ఉపఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీబిజీ
సాక్షి, బెంగళూరు: మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలు బరిలో ఉండటంతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనర్హత ఎమ్మెల్యేల గెలుపుతో పాటు ప్రభుత్వ మనుగడకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం బెంగళూరులోని యశవంతపున నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్టీ సోమశేఖర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాల ప్రచారం అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. మాటల యుద్ధం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు.. తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా బహిరంగ ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు అనుచరులతో ముమ్మర సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు మఠాలు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎం యడియూరప్ప అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి వరాల హామీలు గుప్పిస్తున్నారు. హైఓల్టేజీ స్థానాలపై బెట్టింగ్? ఉప ఎన్నికలు జరిగే హొసకోటె, హుణసూరు, కృష్ణరాజపేటె, గోకాక్, యశవంతపుర, విజయనగర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ పార్టీ ఎక్కువ స్థానా ల్లో విజయం సాధిస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య పోటీ ఉందని.. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్– జేడీఎస్ మధ్యనే పోటీ ఉందని బెట్టింగ్ కాస్తున్నారు. చిక్కబళ్లాపుర, గోకాక్, శివాజీనగర స్థానా లపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. -
కర్ణాటకం : రెబెల్స్‌కు బంపర్ ఆఫర్
బెంగళూర్ : అనర్హత వేటుకు గురైన రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. డిసెంబర్ 5న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వారిని బీజేపీ తమ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హులుగా స్పీకర్ ప్రకటించిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక జేడీఎస్, కాంగ్రెస్ రెబెల్స్ మహేష్ కుమతల్లి, శ్రీమంతగౌడ పాటిల్, రమేష్ జర్కిహోలి, శివరాం హెబ్బర్, బీసీ పాటిల్, ఆనంద్ సింగ్, కే సుధాకర్, భైరతి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, కే గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, హెచ్ విశ్వనాధ్‌లు ఈసారి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వీరిపై అనర్హత వేటును సుప్రీం కోర్టు గురువారం సమర్ధిస్తూ 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెబెల్ ఎమ్మెల్యేలపై నిషేధం విధించిన స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయం వెలువడిన మరుక్షణమే తాము బీజేపీలో చేరుతామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎన్నికలు జరిగే 15 స్ధానాల్లో బీజేపీ గెలుపొందుతుందని వీరంతా కాబోయే ఎమ్మెల్యేలు, మంత్రులని వీరి త్యాగాల ఫలితంగానే తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందని ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. -
కర్ణాటకం : బీజేపీ గూటికి ఆ 17 మంది ఎమ్మెల్యేలు
బెంగళూర్ : అనర్హత వేటుకు గురైన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం బీజేపీలో చేరతారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో వారికి బీజేపీ టికెట్లను కట్టబెట్టనున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదించి వారికి టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్ధించిన సుప్రీం కోర్టు డిసెంబర్ 5న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అర్హులేనని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును స్వాగతించిన యడియూరప్ప రెబెల్ ఎమ్మెల్యేలు కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని చెప్పారు. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే 15 నియోజకవర్గాల్లో గురువారం నుంచి ఎన్నికల ప్రచారం చేపడతామని యడియూరప్ప తెలిపారు. అన్ని సీట్లలో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా బీజేపీకి ఏమాత్రం నైతిక విలువలు మిగిలిఉన్నా అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరాదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు వ్యాఖ్యానించారు. మరోవైపు తామంతా గురువారం బీజేపీలో చేరతామని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలి ధ్రువీకరించారు. ఇక కర్ణాటక ఉప ఎన్నికల నామినేషన్ల గడువును పెంచినట్టు ఈసీ పేర్కొంది, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీం తీర్పు నేపథ్యంలో వారు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తూ ఈ వెసులుబాటు కల్పించింది. ఈనెల 18 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారని ఈసీ పేర్కొంది. -
ఆయన సీఎం అయితే మరి యడ్డీ..?
బెంగళూర్ : కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తూ ఓ సభ్యుడు నోరుజారిన తీరు హాట్‌టాపిక్‌గా మారింది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మంగళవారం ఉదయం బీజేపీ నేత మధుస్వామి ప్రమాణ స్వీకారం చేస్తూ మంత్రిగా అనబోతూ ముఖ్యమంత్రి అని పొరపాటున పలకడంతో అందరూ విస్తుపోయారు. మధుస్వామి తడబడుతూ పొరపాటు పడినా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో సదరు మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. జులై 26న ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టిన మూడు వారాల అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా యడియూరప్ప ఉల్లాసంగా కనిపించారు. ప్రమాణస్వీకారం చేస్తూ పొరబడిన మంత్రి మధుస్వామిని నవ్వుతూ పలుకరిస్తూ కౌగిలించుకున్నారు. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలచే గవర్నర్ వజుభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, మంత్రుల జాబితాకు బీజేపీ అధిష్టానం ఆమోదముద్ర కోసం సీఎం యడియూరప్ప మూడు వారాల పాటు వేచిచూశారు. -
సమయం లేదు కుమార..
బెంగళూర్ : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని లేకుంటే తక్షణమే తప్పుకోవాలని బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేదని అన్నారు. సంకీర్ణ సర్కార్‌కు చెందిన 15 మందికి పైగా జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన క్రమంలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి కుమారస్వామి సమయం వృధా చేయకుండా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారని యడ్యూరప్ప గుర్తుచేశారు. కుమారస్వామి రేపు (సోమవారం) విశ్వాస పరీక్షను ఎదుర్కోవడమో, రాజీనామా చేయడమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ గూటికి చేర్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
కర్ణాటకం : గవర్నర్‌ను కలవనున్న యడ్యూరప్ప
బెంగళూర్ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెబెల్స్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ చిట్టచివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప మరికాసేపట్లో గవర్నర్‌తో సమావేశం కానున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ మైనారిటీలో పడిందని, తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీ శిబిరానికి చేర్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబైలో ఎమ్మెల్యేలు బసచేసిన హోటల్‌కు చేరుకున్నారు. కాగా తమను ప్రలోభపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని ఎవరూ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖపై ఎమ్మెల్యేలు శివరామ్ హెబ్బర్, ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, సోమశేఖర్, రమేష్ జర్కిహొలి, బసవ్‌రాజ్, గోపాలయ్య, విశ్వనాధ్, నారాయణ్ గౌడ, మహేష్ కుముతలి ఉన్నారు. -
‘కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి’
బెంగళూర్ : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో చోటుచేసుకున్న సంక్షోభంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచిచూడాలని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. పాలక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా వెనుక బీజేపీ ప్రమేయం ఉందని కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యల ఆరోపణలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుత సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. కాగా తనతో 5-6 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, దీనికి సంబంధించిన వివరాలు తాను ఇప్పుడే వెల్లడించలేనని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ పట్ల విధేయత కనబరుస్తున్నారని చెప్పారు. మరోవైపు ప్రస్తుత సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ట్రబుట్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడతో సంప్రదింపులు జరిపి బీజేపీ వ్యూహాలను చిత్తుచేయడంపై చర్చించారు. ముంబైలోని సోఫిటెల్ హోటల్లో బస చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చేందుకు డీకే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం -
అవాక్కవకుండా ఆన్సర్ చెప్పండి.!
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. -
డైరీ లీక్స్‌పై బీజేపీ ఎదురుదాడి
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పరస్పర ఆరోపణలు, దూషణల పర్వం తీవ్రస్ధాయికి చేరుకుంది. బీజేపీ అగ్రనేతలకు రూ 1800 కోట్ల ముడుపులు ముట్టాయని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్ నకిలీ డైరీ పత్రాలను చూపుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. యడ్యూరప్ప డైరీలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చిందని చెప్పారు. అసలు డైరీ ఒరిజినల్ పత్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మీడియా కథనాల ఆధారంగా కాంగ్రెస్ తమ పార్టీపై బురదజల్లుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. యడ్యూరప్పను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్ధించారు. కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. -
రచ్చవుతున్న వాయిస్ రికార్డింగ్
తమ ఎమ్మెల్యేకు యడ్యూరప్ప రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చారని సీఎం కుమారస్వామి బడ్జెట్‌కు ముందు ఆడియో టేపులు విడుదల చేయగా, అవి నకిలీవని, ఆయన రికార్డింగ్ అనుభవంతో వాటిని తయారు చేసి ఉంటారని యడ్డి మండిపడ్డారు. ఇందులో స్పీకర్ మీద కూడా ఆరోపణలు రావడం గమనార్హం. సాక్షి బెంగళూరు: జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసినట్లు సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో రికార్డులు నకిలీవని ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. శుక్రవారం ఆయన విధానసౌధ వద్ద మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపిస్తున్న సీఎం కుమారస్వామి రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘రాజీనామా చేసి వచ్చెయ్.. సభాధ్యక్షునితో నేను మాట్లాడుతా’ అని తాను ప్రలోభపెట్టినట్లు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. సభాపతి పదవిని సీఎం కుమారస్వామి అగౌరవ పరుస్తున్నారని విమర్శించారు. నకిలీ ఆడియో రికార్డులతో రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని, సీఎం కుమారస్వామి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. దేవదుర్గకు హెలికాప్టర్లో వెళ్లి వచ్చానని చెప్పారు. అంతేకానీ తాను ఎవరితో మాట్లాడలేదని చెప్పారు. ఆయన సినిమా రికార్డింగులు చేసిన వ్యక్తి ‘ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సినిమా వ్యక్తి. ఆయన ఎన్నో సినిమాలు నిర్మి ంచారు. రికార్డింగులు చేయించారు. ఈక్రమంలో ఈ రికార్డింగు కూడా అలాంటిదే’ అని యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్‌నే సీఎం కుమారస్వామి ప్రలోభపెట్టారన్నారు. జేడీఎస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్– జేడీఎస్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు ముఖం చాటేశారని, వీరిలో ఎంతమంది సర్కారుకు మద్దతు ఇస్తారో లేదో తెలియదన్నారు. కుమార ఆఫర్ ఇచ్చారు: సుభాష్ గుత్తేదార్ సీఎం కుమారస్వామి తనకు భారీ ఆఫర్ ప్రకటించారని ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఆరోపించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్లో బెర్తుతో పాటు తనకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని కుమారస్వామి ఆఫర్ ఇచ్చారన్నారు. తాను ఏ పార్టీలోకి మారనని స్పష్టం చేశానన్నారు. -
‘24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలుస్తాం’
సాక్షి, బెంగళూరు : మరో ఇరవై నాలుగు గంటల్లో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమేశ్ కట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలో బుధవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మాతో(బీజేపీకి) టచ్‌లో ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారు. కాబట్టి మరో ఇరవై నాలుగు గంటల్లో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. అలాగే వారం రోజుల్లోగా బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... యడ్యూరప్ప మాత్రం ప్రభుత్వ ఏర్పాటు గురించి భిన్నంగా స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇకపై కూడా అలాగే కొనసాగుతాము’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమాస్వామి ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజ్‌భవన్ ముందు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఉమేశ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ... దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఉమేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఆ బంగ్లా అంటే ఎందుకంత భయం!?
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వం కేటాయించిన భవనంలోకి వెళ్లడానికి కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప వెనకడుగు వేస్తున్నారట. బెంగళూరులోని కుమారకృపా అతిథి గృహంలోని 3వ నెంబరు భవనాన్ని కుమారస్వామి ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అయితే అందులోకి వెళ్లడానికి ఆయన ఇష్టపడటం లేదట. ఆ బంగ్లాకు వెళ్తే సీఎం పదవిలో ఉండలేమనే భావన, వాస్తుదోషం భయంతోనే యడ్యూరప్ప ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేసు కోర్సు రోడ్డులో ఉన్న రేస్ కోర్సు కాటేజీలోని భవనాన్ని తనకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. వాస్తుదోష భయం..! సీఎం కుమారస్వామి కూడా గతంలో ఇదే భవనంలో ఉండగా పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ భవనాన్ని వదిలి జేపీ నగర్లోకి తన నివాసాన్ని మార్చారు. కుమారస్వామి ఖాళీ చేసిన తర్వాత మాజీ స్పీకర్ డీహెచ్ శంకర్మూర్తికి ఈ భవనాన్ని కేటాయించారు. అయితే ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆ బంగ్లాకు రావడానికి యడ్యూరప్ప నిరాకరించడంతో ప్రస్తుతం మంత్రి మహేశ్‌కు కేటాయించారు. -
ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసింది
-
కుమారస్వామిని సీఎం చేసినందుకు..
సాక్షి, బెంగళూర్ : కాంగ్రెస్, జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని బీజేపీ నేత యడ్యూరప్ప అభివర్ణించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామి దిగజారారని, అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన రాజ్యాంగ ద్రోహి అని విమర్శించారు. కర్ణాటక శాసనసభలో శుక్రవారం కుమారస్వామి సర్కార్‌పై విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కుమారస్వామితో గతంలో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం రెండు పార్టీలూ దిగజారాయని ఆరోపించారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు డీకే శివకుమార్ చింతిస్తారని అన్నారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ప్రతిపక్షాలకూ అవకాశం ఇస్తారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. -
ఈ సర్కారు ఆరునెలలే
తనను గద్దె దించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్– జేడీఎస్ కూటమిపై యడ్యూరప్ప శాపనార్థాలు సంధించారు. పూర్తి మెజారిటీ వస్తేనే రైతు రుణమాఫీ అని కుమారస్వామి చెప్పడం సరికాదని, తక్షణం రైతు రుణాలను మాఫీ చేయకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శివాజీనగర: ఎన్నికలకు ముందు జేడీఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రైతుల రుణమాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలతో కలసి పోరాటం చేపడతామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప హెచ్చరించారు. బుధవారం నగరంలో ఆనందరావు సర్కిల్లోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నూతన సర్కారుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహించారు. కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రజా వ్యతిరేకమైనదని ఆరోపించారు. యడ్యూరప్ప మాట్లాడుతూ కొత్త కూటమి ప్రభుత్వం 6 నెలలకు మించి అధికారంలో ఉండకపోవచ్చని జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగిన కూడా తమ పార్టీ అధిక మెజారిటీతో అధికారం చేపడుతుందని ప్రకటించారు. మంత్రి మండలి విస్తరణ చేపడితే ఏమవుతుందోనని ఈ రెండు పార్టీల నాయకులకు భయం పట్టుకుందని యడ్డి విమర్శించారు. అందువల్లే ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మంత్రిమండలి విస్తరణే జరిగితే ఎలాంటి విభేదాలు తలెత్తుతాయనేది వేచి చూడాలని అన్నారు. రెండు పార్టీల్లో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలపాలని కోరారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైనా కూడా అవకాశవాద రాజకీయం చేస్తున్న కాంగ్రెస్–జేడీఎస్‌ల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. తక్షణమే రుణమాఫీ చేయాలి తక్షణమే రుణమాఫీ చేయాలని నూతన ముఖ్యమంత్రిహెచ్.డీ.కుమార్‌స్వామిని యడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉంటే రైతుల రుణమాఫీ చేసేవాడినని ఆయన చెప్పటం సరైన విధానం కాదని ఆక్షేపించారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న అన్నదాతకు అండగా నిలవడం తమ కర్తవ్యమని, దీనిని నిర్లక్ష్యం చేస్తే అన్నదాత వీధిన పడతాడని హెచ్చరించారు. పాము–ముంగిసలా ఆరోప–ప్రత్యాపరోణలతో దెబ్బలాడిన రెండు పార్టీలు ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఏనుగుతో ప్రేమ, కాంగ్రెస్‌తో పెళ్లి సీనియర్ నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ జేడీఎస్‌తో కలసినవారు ఎవరూ అభివృద్ధి చెందలేదని, గతంలో మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్, సిద్ధరామయ్యలకు ఏం జరిగిందన్నది తెలియనిది కాదని ధ్వజమెత్తారు. జేడీఎస్‌కు ఏనుగుతో ప్రేమ పుట్టింది, ఓవైసీతో డేటింగ్ అయింది, కాంగ్రెస్‌తో పెళ్లయింది.. అని హేళన చేశారు. ఈ ధర్నాలో లోక్‌సభ సభ్యులు శోభాకరంద్లాజె, పీ.సీ.మోహన్, ఎమ్మెల్యేలు ఎస్.ఆర్.విశ్వనాథ్, అశ్వథ్ నారాయణ, మాజీ మంత్రి కట్టా తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఉర్దూ న్యూస్ 19th May 2018
-
అంకెల గారడీలో విఫలమైన కమలదళం..!
-
సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా
-
కర్ణాటక అసెంబ్లీలో అనూహ్య దృశ్యం!
-
యడ్యూరప్ప మనుగడ ఏమిటో?
సాక్షి, బళ్లారి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప ఆ పదవిలో కొనసాగుతారా? లేదా? వైదొలిగిపోతారా? అన్న విషయాన్ని జనం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక వైపు జేడీఎస్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 117 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందామని, అందరం కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు విన్నవించిన నేపథ్యంలో మరో వైపు రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బలనిరూపణకు గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్, జేడీఎస్‌లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈనేపథ్యంలో శనివార సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగింది. 104 సంఖ్యాబలం ఉన్న బీజేపీకి మరో 8 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. జేడీఎస్, కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బళ్లారి జిల్లాకు చెందిన ఆనంద్‌సింగ్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అదే విధంగా రాయచూరు జిల్లాకు చెందిన ప్రతాప్‌గౌడ పాటిల్ కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇలా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అంతర్గతంగా బీజేపీకి టచ్‌లో ఉంటూ వారి క్యాంపుల్లో ఉంటున్నారని తెలుస్తోంది. బలనిరూపణ సమయంలో బీజేపీకి మద్దతు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడుతుందనే ప్రచారం ఓ వైపు సాగుతుండగా, ఎట్టి పరిస్థితుల్లో యడ్యూరప్ప సీఎంగా కొనసాగే అవకాశం ఉండదని కూడా చర్చ సాగుతోంది. మరి కొన్ని గంటల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారన్న విషయం తేలిపోనుందని చెప్పవచ్చు. -
సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయం
-
నేడు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
-
కాంగ్రెస్ పార్టీని కన్నడ ప్రజలు తిరస్కరించారు
-
పార్టీ అధిష్టానంతో మాట్లాడి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తా
-
కర్నాటక ఫలితాలపై నిజమైన యడ్యూరప్ప జోస్యం
-
మనసా రిలాక్స్
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీల నాయకులందరూ విశ్రాంతి స్థితిలోకి వెళ్లిపోయారు. మంగళవారం ఫలితాలు ఉండడంతో ఒత్తిళ్లన్నీ పక్కన పెట్టేసి కులాసాగా గడుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్, బీఎస్పీ నేతలు గత నెల రోజులుగా గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. శనివారం సాయంత్రం పోలింగ్ ముగియడం, ఎగ్జిట్ పోల్స్ కూడా తలోరకంగా ఫలితాలను పేర్కొనడంతో నాయకులు కూడా ఊరట చెందారు. ఇన్నిరోజులూ దూరంగా ఉన్న కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. పలువురు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని దేవాలయాలు, మఠాల్లో మొక్కుకున్నారు. మరికొందరు విహారయాత్రలకు పయనమయ్యారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో రిలాక్స్డ్గా ఉంటే మరికొందరు అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయనో అంచనాలు వేసుకుంటూ లాభ–నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తానే కాబోయే సీఎంనని ఆదివారం పునరుద్ఘాటించారు. ఎక్కడ ప్రమాణం చేయాలనేది కౌంటింగ్ రోజున ప్రకటిస్తామని చెప్పడం గమనార్హం. కుటుంబాలతో సరదా సరదా బెంగళూరు దాసరహళ్లి ఎమ్మెల్యే మునిరాజు తన పశువులకు ఆహారం వేస్తూ కనిపించారు. అఫ్జలపుర బీజేపీ అభ్యర్థి మాలికయ్య గుత్తేదార్ తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గం జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. ఇక పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య ఆదివారం తన మైసూరు జిల్లాలో సొంతింటిలో కుటుంబ సభ్యులతో గడిపారు. ప్రతిరోజు రామకృష్ణనగరలో ఉండే ఆయన నివాసం వద్ద బారులు తీరే జనం ప్రస్తుతం ఎవ్వరూ కనిపించకపోవడం గమనార్హం. చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల గెలుపోటములపై కాసేపు మద్దతుదారులతో చర్చించారు. ఒకటి రెండు పెళ్లిళ్లకు హాజరయ్యారు. జేడీఎస్ నేత కుమారస్వామి తన కుమారుడితో కలసి రెండు రోజుల విశ్రాంతి నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లారని పార్టీ వర్గాలు, లేదు.. బీజేపీతో మంతనాలు కోసం పయనమైనట్లు మరికొందరు ప్రచారం సాగిస్తున్నారు. -
కర్నాటక సీఎంగా నేనే ప్రమాణ స్వీకారం చేస్తా
-
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నేరం అవుతుంది: యడ్యూరప్ప
'సాక్షి, కోలారు : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది నేరం అవుతుంది.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజల విశ్వాసం కోల్పోయారు.. గత ఐదేళ్లుగా ప్రజలను వంచించింది మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. శ్రీనివాసపురం పట్టణంలో పరివర్తన యాత్రలో భాగంగా శనివారం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తినహొళె పథకంలో యంత్ర పరికరాలను, పైప్లైన్లను కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు ప్రజలను మోసం చేసి మభ్యపెడుతున్నారని, ఈ పథకాన్ని పూర్తిగా మూలన పడేశారని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రమేష్‌కుమార్ సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో సౌలభ్యాలు కరవయ్యాయన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో మామిడి అభివృద్ధి మండలికి నిధులు మంజూరు చేస్తే వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలో ఇప్పటి సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు. దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, కర్నాటకలో కూడా పుట్టగతులుండవని యడ్యూరప్ప హెచ్చరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, ఆర్.అశోక్, లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్, కేజీఎఫ్ ఎమ్మెల్యే వై.రామక్క, హెబ్బాళ ఎమ్మెల్యే వై.ఎ.నారాయణస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.పి.వెంకటమునియప్ప, మాజీ ఎమ్మెల్యేలు వై సంపంగి, ఎం.నారాయణస్వామి పాల్గొన్నారు. -
సొంత పార్టీ నేతలే కుట్ర పన్నుతున్నారు..!
సాక్షి, బెంగళూరు: నేను మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నా పై కుట్ర పన్నుతున్నారు. నన్ను కావాలనే ఇబ్బందులకు గురిచేసేలా ప్రయత్నిస్తున్నారు... అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. నగరంలోని డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసంలో మంగళవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌తో పాటు పార్టీ రాష్ట్ర నేతలు జగదీష్ శెట్టర్, ప్రహ్లాద్ జోషి, ఆర్.అశోక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. బీజేపీ-జేడీఎస్ సంయుక్త ప్రభుత్వం ఉన్న సమయంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో కళసా-బండూరి నాలా కార్యక్రమం అమలుకు రూ.100 కోట్లు కేటాయించాను. ఇందుకు అప్పటి సీఎం హెచ్.డి.కుమారస్వామి తీవ్ర అభ్యంతరం తెలియజేసినా నేను అదేమీ పట్టించుకోలేదు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రజలు నన్ను అభిమానిస్తారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు నా పై కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు సొంత ఆర్టీ నేతలే సహకారం అందిస్తున్నారు... అని పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే సమావేశంలో ఇటీవల కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంత్‌కుమార్ హెగ్డే చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాలను పార్టీ నేతల మెడకు చుడుతున్నారని కొందరు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనంత్‌కుమార్ హెగ్డేకు భాష మార్చుకోవాల్సిందిగా సూచించాల్సిందిగా నేతలు హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. -
రాష్ట్రంలో అరాచక పాలన
శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయంటూ స్వతహాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహిరంగంగా పేర్కొన్నారని, రాష్ట్రంలో అరాచక స్థితి నెలకొందని స్వాతంత్య్రం వ చ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదంటూ ముఖ్యమంతి సిద్దరామయ్యపై మాజీ సీఎం బీఎస్.యడ్యూరప్ప ఆరోపణలు గుప్పించారు. శనివారం దైవజ్ఞ కళ్యాణమంటపంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివమొగ్గ గ్రామాంతర విధానసభ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని యడ్యూరప్ప ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అన్ని విషయాల్లో విఫలమైన హోం మంత్రిని తొలగించి మరొకరిని నియమించాలని కోరారు. గుల్బర్గ ఎస్ఐ మల్లికార్జనబండె మృతిపై ముఖ్యమంత్రి పైనే అనువ ూనం ఉందన్నారు. స్వతహాగా బండె సతీమణి తమ భర్త చావుకు సీనియర్ పోలీసులే కారణమని ఆరోపించారు. బండె మృతి విచారణను సీబీఐకి అప్పగించడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదని, సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కుంటుబడిందని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. అభివృద్ధి కావాలంటే నరేంద్రమోడీ దేశ ప్రధాని కావాలన్నారు. ఈ సారి కూడా గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ.బానుప్రకాష్, రాజ్యసభ సభ్యుడు అయనూరు మంజునాథ్, మాజీ ఎమ్మెల్యే కేజీ.కుమారస్వామి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు సీ.శాంత తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితాపై రాజ్‌నాథ్‌తో చర్చిస్తాం
దావణగెరె, న్యూస్‌లైన్ : ఢిల్లీలో గురువారం జరుగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చిస్తామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో జరుగనున్న కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటున్నారని, అభ్యర్థుల ఎంపికపై సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. ఆ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్‌కు పూర్తి సమాచారం అందించి వారితో అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 70 శాతం మంది ప్రజల్లో నరేంద్ర మోడీయే తదుపరి ప్రధాని కావాలన్న అభిప్రాయం ఉందన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిపించాల్సి ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తనపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను కూడా పోటీ చేయాలని యోచిస్తున్నానన్నారు. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్ష స్థానానికి తాను రేసులో లేనన్నారు. కేజేపీ ఇక ముగిసిన అధ్యాయమన్నారు. మొదటి నుంచి తాను బీజేపీలో సంతృప్తిగా ఉన్నానన్నారు. ఇప్పుడిక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు. బండె మృతి మిస్టరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి ఇటీవల గుల్బర్గాలో పోలీసు అధికారి మల్లికార్జున బండె మృతి మిస్టరీగా మిగిలిందని, దీనిని చేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని యడ్యూరప్ప ఒత్తిడి చేశారు. బండెపైకి దూసుకొచ్చిన బుల్లెట్ ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. బండె భార్య కూడా తన భర్త మృతి వెనుక కుట్ర దాగి ఉందని, సీబీఐ దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని డిమాండ్ చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నా ఈ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. బండె భార్య సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ఒక వైపు ఒత్తిడి చేస్తుండగా, గ్యాంగ్‌స్టర్ మున్నా భార్య తన భర్త దగ్గర ఎలాంటి పిస్తోలు లేదని, ఇది నకిలీ ఎన్కౌంటర్ అని మరో వైపు ఆరోపిస్తోందని గుర్తు చేశారు. పోలీసులే పోలీసులను హతమార్చే సందర్భం వస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తేలికగా తీసుకోరాదన్నారు. ఈ మిస్టరీలో నిజాలు నిగ్గు తేలాలంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు ఎస్ఏ రవీంద్రనాథ్, ఎంపీ రేణుకాచార్య, విపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ ఏహెచ్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు మాడాళు విరుపాక్షప్ప, బీపీ హరీష్, బసవరాజ్ నాయక్, ఏ.చంద్రప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కేజేపీకి ‘విలీన’ కష్టాలు..!
= అడ్డుపడుతున్న వ్యవస్థాపక అధ్యక్షుడు = స్పీకర్‌ను కలిసిన పద్మనాభ = విలీన ప్రక్రియ ఆపడానికి సుప్రీం కోర్టుకు = మీడియా సమావేశంలో వెల్లడి సాక్షి, బెంగళూరు : కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పకు కంట్లో నలుసుగా తయారైన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మనాభ ప్రసన్న ‘విలీన’ ప్రక్రియకు అడ్డు పడుతున్నారు. కేజేపీ అధ్యక్ష స్థానం విషయమై కోర్టులో కేసు నడుస్తున్నందు వల్ల ఆ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి అంగీకరించకూడదనేది ఆయన వాదన. పద్మనాభ ప్రసన్న స్పీకర్ కాగోడు తిమ్మప్పను విధానసౌధలో శనివారం ఉదయం భేటీ అయ్యారు. కేజేపీ అధ్యక్షుడి విషయమై స్పష్టత వచ్చే వరకూ విలీన ప్రక్రియకు అంగీకరించకూడదని వినతి పత్రం సమర్పించారు. అంతేకాంకుడా విలీన ప్రక్రియపై స్టే కోరుతూ తాను సుప్రీం కోర్టులో సోమవారం కేసు వేస్తున్నట్లు కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర శాసన సభ బీజేపీ ఫ్లోర్ లీడర్ జగదీష్ శెట్టర్ తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ కాగోడు తిమ్మప్పకు శనివారం మధ్యాహ్నం 1:20 గంటలకు విధాన సౌధలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజేపీ బీజేపీలో విలీనం కావడానికి అంగీకరించాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఆ పార్టీకి చెందిన న లుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వల్ల శాసనసభలో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య జేడీఎస్ కంటే నాలుగుకు పెరుగుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందువ ల్ల బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా కల్పించాలని కూడా స్పీకర్‌ను కోరినట్లు శెట్టర్ మీడియాకు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోనున్నట్లు స్పీకర్ చెప్పారన్నారు. ప్రస్తుతం బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తాను కేజేపీ విలీనం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతానన్నారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈనెల 9న బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా పార్టీలోకి చేరుతారన్నారు. పద్మనాభ ప్రసన్న అభ్యంతరంపై తనకు పూర్తిస్థాయి సమాచారం లేదని శెట్టర్ పేర్కొన్నారు. పదిరోజుల్లోపు పూర్తి చేస్తా : స్పీకర్ కేజేపీ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలుగా గుర్తించే విషయంతోపాటు, బీజేపీకి ప్రధాన ప్రతిపక్షహోదా కల్పించే ప్రక్రియకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప పేర్కొన్నారు. అయితే గరిష్టంగా పదిరోజుల్లోపు ఈ రెండు ప్రక్రియలు పూర్తవుతాయన్నారు. కేజేపీ మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండువంతులు (ఆరుగురు ఎమ్మెల్యేలలో నలుగురు) బీజేపీలో చేరడానికి అంగీకారం తెలపడం వల్ల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కేజేపీ ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీ అన్నారు. అందువల్ల విలీన ప్రక్రియకు అనుమతించడం లేదా నిలిపి వేయడం అన్నది ఎన్నికల కమిషన్ పరిధికి వస్తుందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి సంవత్సరానికి 60 రోజుల పాటు తప్పకుండా చట్టసభలు నిర్వహిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు రూపొందించిన క్యాలెండర్‌ను ప్రభుత్వ అనుమతికి పంపించామని కాగోడు తిమ్మప్ప మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సవ ూధానమిచ్చారు. -
యెడ్డీకి బీజేపీ ఆహ్వానం
సాక్షి, బెంగళూరు: బీజేపీలో చేరాలంటూ మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతాపక్ష పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్పను కమలనాథులు గురువారం రాత్రి ఆహ్వానించారు. ఉదయం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాత్రి యెడ్డీని ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ అనంతకుమార్ కలసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక బీజేపీలో కేజేపీ విలీనానికి మార్గం సుగమమైందన్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఆయనకు అధికారిక సందేశం అందనుంది. ప్రస్తుతం ధనుర్మాసం కన ుక సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీలో చేరనున్నారు. భేటీ అనంతరం జోషి, కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఇక నుంచి యడ్యూరప్పతో కలిసి రాష్ర్టంలో పర్యటిస్తామని చెప్పారు. -
యడ్డికి నేడు బీజేపీ ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను బీజేపీలో చేర్చుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. పార్టీలో చేరాల్సిందిగా శనివారం ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందనుంది. నగరంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో యడ్యూరప్ప పునరాగమనానికి అంగీకారం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమాచారాన్ని ఆయనకు తెలియజేయడం ద్వారా పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, ఎంపీ అనంత కుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ ప్రభృతులు యడ్యూరప్పను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. చప్పట్లతో సమ్మతి కార్యవర్గ సమావేశంలో అనంత కుమార్ మాట్లాడుతూ పార్టీని వదలి వెళ్లిన నాయకులను తిరిగి ఆహ్వానించడానికి చప్పట్లు కొట్టడం ద్వారా అంగీకారం తెలపాలని సూచించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారంతా జోరుగా చప్పట్లు చరిచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ సమైక్యంగా ఎదుర్కొంటుందన్నారు. బయటకు వెళ్లిపోయిన వారంతా తిరిగి రావడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు నాయకులు పార్టీని వీడారని, వారిని తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను నెలకొల్పాలన్న పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అందరూ పార్టీ విజయం కోసం శ్రమించాలని ఆయన కోరారు. యడ్యూరప్ప సమాలోచనలు బీజేపీలోకి రావాలంటూ అధికారిక ఆహ్వానం అందనున్న నేపథ్యంలో యడ్యూరప్ప ఇక్కడి తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు. పార్టీలో చేరిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో ఎప్పుడు చేరేదీ నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. బీజేపీలో విలీనంపై పార్టీలో తన నిర్ణయమే అంతిమమని ఆయన వెల్లడించారు. -
త్వరలో బీజేపీలోకి యడ్డి రాక
సాక్షి, బళ్లారి : మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీలోకి రావడం నూటికి నూరు పాళ్లు ఖాయమని, ఆయన్ను పార్టీలోకి చేర్పించుకునే విషయంపై బీజేపీ హైకమాండ్ నేతలు అంగీకారం కూడా తెలిపారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని కోర్టు ఆవరణంలో విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్ప కూడా బీజేపీలోకి రావడానికి సుముఖత చూపారని, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాకను స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీ నుంచి విడిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారంలోకి రావడానికి సాధ్యమైందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు వారిద్దరిని బీజేపీకి రప్పించుకునేందుకు పార్టీ పెద్దలకు తెలియజేసినట్లు తెలిపారు. శ్రీరాములును కూడా బీజేపీలోకి పిలిపించుకోవాలని సూచించామని, హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తాము ఎందుకు ఓడిపోయామో ఆత్మావలోకనం చేసుకున్నామని, తిరిగి అలా జరగకుండా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, తమ బీజేపీ ప్రభుత్వం పాలన భేష్‌గా ఉండేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. సిద్ధరామయ్య అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నట్లు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కటి కూడా సరైనని లేవన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని కురుబలు, దళితులు ఓట్లు వే స్తే.. ఆ వర్గాల వారికి కూడా ఆయన చేసింది ఏమీ లేదన్నారు. గోహత్య నిషేధాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ లేనిపోని పథకాలను రూపొందిస్తోందని మండిపడ్డారు. అయితే ఆ వర్గాలు సిద్దూ పాలనను చీదరించుకుంటున్నట్లు గుర్తు చేశారు. తాము చేసిన తప్పులకు ప్రజలు గుణపాఠం చెప్పారని, అయితే కాంగ్రెస్ కూడా ఆ తప్పులే చేస్తోందని అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. లాటరీ ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ సుశీల్ నమోషి, నాయకులు రామలింగప్ప, గాదిలింగప్ప, యువమోర్చా నాయకులు సుధీర్ కుమార్ పాల్గొన్నారు.