కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో పలు కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరో దర్శన్, మాజీ సినీ నిర్మాత యడ్యూరప్ప, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ వంటి ప్రముఖులు నేడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరందరినీ ఉద్దేశించి కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య విమర్శలు ఎక్కుపెట్టారు.
అనేక సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘించే ధనవంతులు, సెలబ్రిటీలు, ప్రభావవంతమైన వ్యక్తులు నేటి సమాజంలో ఉన్నారు. వారు చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఈ నేరాలను బయటపెట్టిన పోలీసులకు, మీడియాకు హ్యాట్సాఫ్. కేసులను సక్రమంగా విచారణ జరిగేలా న్యాయస్థానం చూడాలి. ఒక్కోసారి న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు న్యాయస్థానం ఏం సందేశం ఇచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది.' అని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్, లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణతో పాటు పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప పేరును తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. రమ్య పోప్ట్ చేయడం విశేషం.
రేణుకాస్వామిని హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శన్ గురించి గతంలో ఆమె ఒక పోస్ట్ చేశారు. తప్పు చేసిన వారు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె కోరింది. దీంతో ఆమెపై ఆయన అభిమానులు విరుచకపడ్డారు. ట్రోల్స్ చేస్తూ రమ్యను బూతులు తిట్టడం ప్రారంభించారు. దానిని కూడా ఆమె తప్పబట్టారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న సమాజంలో జీవించడం సిగ్గుచేటు అని తెలిపారు.
ఈ క్రమంలో చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆమె గుర్తుచేశారు. సెలబ్రిటీ అయితే సాధారణ ప్రజలను కొట్ట చంపేస్తారా..? అంటూ ఆమె స్వరాన్ని పెంచారు. ఇలాంటి కేసుల విషయంలో ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పోలీసులు పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. చట్టంపై ప్రజలు విశ్వాసం ఉంచుతారనే నమ్మకం ఉందని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తెలుగు వారికి కూడా రమ్య పరిచయమే నందమూరి కళ్యాణ్‌రామ్ 'అభిమన్యు' సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య మెప్పించారు. 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో టాప్ హీరోయిన్‌గా చెరగని ముద్ర రమ్య వేశారు.
The ones breaking the law who have been in the news are the rich and powerful and the ones at the receiving end of their violent actions are the poor, women & children. The common people of Karnataka. Hats off to the police and media for bringing these crimes out. Justice will…
— Ramya/Divya Spandana (@divyaspandana) June 22, 2024
Comments
Please login to add a commentAdd a comment