యెడ్డీకి బీజేపీ ఆహ్వానం | BJP invites BS Yeddyurappa back into party; Karnataka Janata Paksha to merge with BJP | Sakshi
Sakshi News home page

యెడ్డీకి బీజేపీ ఆహ్వానం

Published Fri, Jan 3 2014 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

యెడ్డీకి బీజేపీ ఆహ్వానం - Sakshi

యెడ్డీకి బీజేపీ ఆహ్వానం

సాక్షి, బెంగళూరు: బీజేపీలో చేరాలంటూ మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతాపక్ష పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్పను కమలనాథులు గురువారం రాత్రి ఆహ్వానించారు. ఉదయం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాత్రి యెడ్డీని ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ అనంతకుమార్ కలసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక బీజేపీలో కేజేపీ విలీనానికి మార్గం సుగమమైందన్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఆయనకు అధికారిక సందేశం అందనుంది. ప్రస్తుతం ధనుర్మాసం కన ుక సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీలో చేరనున్నారు. భేటీ అనంతరం జోషి, కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఇక నుంచి యడ్యూరప్పతో కలిసి రాష్ర్టంలో పర్యటిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement