బెంగళూరు: ఒక్కసారిగా పదవి పోతే రాజకీయ నాయకులు నిరాశలో కుంగిపోతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత ఎస్.డీ.సోమశేఖర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను తన రాజకీయ గురువుగా చెబుతూ కాంగ్రెస్ తలుపు తట్టే ప్రయత్నం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఎస్.డీ.సోమశేఖర్ గౌడ మాట్లాడుతూ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని సహకార శాఖలో నేను ఏదైనా సాధించానంటే అది అయన చలవేనని అన్నారు.అయన నాకు చాలా సహాయం చేశారు. మొదట్లో నాకు జేపీ నగర్ బ్లాకు ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఫీకే శివకుమార్ నన్ను జేపీనగర్ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అక్కడి నుండి ఆయన నాకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఉత్తరహళ్లి నియోజకవర్గం అభ్యర్థిగా నా పేరును ఆయనే ప్రతిపాదించారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే ఆయన కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం చూస్తే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచి యాడ్యూరప్ప ప్రభుత్వానికి అండగా నిలిచిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సోమశేఖర్ కూడా ఒకరు.
కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. బహుశా ఆయన ఎదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయనతో మాట్లాడితే సమస్య సర్దుకుంటుంది అని అన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే..
Comments
Please login to add a commentAdd a comment