కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్
బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్టు బెంగళూరులో ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిన విషయమే. ఆగస్టు 11న జరిగిన ఈ హింసాకాండ కేసులో సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు గతవారం ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. డీజే హళ్లి కార్పొరేటర్, మాజీ మేయర్ సంపత్‌రాజ్, పులకేశినగర వార్డు కార్పొరేటర్ అబ్దుల్ రాఖిద్ జాకీర్‌ను ప్రశ్నించారు. అయితే ఈ కేసులో కావాలని కాంగ్రెస్ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గురువారం కాంగ్రెస్ చీఫ్ శివకుమార్.. బెంగళూరు కమిషనర్ కమల్ పంత్‌పై ఆరోపణలు గుప్పించారు. (రాజుకున్న రాజధాని)
ముఖ్యమంత్రి యడియూరప్ప, బీజేపీ నేతలు రచించిన హింసాకాండలో కాంగ్రెస్ నాయకులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్‌ను బీజేపీ ఏజెంట్‌గా పరిగణించారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి, బీజేపీ నేత కె.సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎంతో నిజాయితీగా జరుగుతున్న ఈ విచారణకు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ను నిలదీశారు. ఎవరిని రక్షించడానికి బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌పై మాటల దాడికి దిగారని సూటిగా ప్రశ్నించారు. కాగా బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసులో ఇప్పటివరకు 415 మందిని అరెస్ట్ చేశారు. (ఏం చేశారు.. ఇద్దరు కార్పొరేటర్లు)
Comments
Please login to add a commentAdd a comment