ఆ బంగ్లా అంటే ఎందుకంత భయం!? | Yeddyurappa Denies To Go Govt Allotted Bungalow | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 7 2018 10:19 AM | Last Updated on Sun, Oct 7 2018 10:20 AM

Yeddyurappa Denies To Go Govt Allotted Bungalow - Sakshi

సాక్షి, బెంగళూరు :  ప్రభుత్వం కేటాయించిన భవనంలోకి వెళ్లడానికి కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప వెనకడుగు వేస్తున్నారట. బెంగళూరులోని కుమారకృపా అతిథి గృహంలోని 3వ నెంబరు భవనాన్ని కుమారస్వామి ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అయితే అందులోకి వెళ్లడానికి ఆయన ఇష్టపడటం లేదట. ఆ బంగ్లాకు వెళ్తే సీఎం పదవిలో ఉండలేమనే భావన, వాస్తుదోషం భయంతోనే యడ్యూరప్ప ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేసు కోర్సు రోడ్డులో ఉన్న రేస్‌ కోర్సు కాటేజీలోని భవనాన్ని తనకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

వాస్తుదోష భయం..!
సీఎం కుమారస్వామి కూడా గతంలో ఇదే భవనంలో ఉండగా పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ భవనాన్ని వదిలి జేపీ నగర్‌లోకి తన నివాసాన్ని మార్చారు. కుమారస్వామి ఖాళీ చేసిన తర్వాత మాజీ స్పీకర్‌ డీహెచ్‌ శంకర్‌మూర్తికి ఈ భవనాన్ని కేటాయించారు. అయితే ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆ బంగ్లాకు రావడానికి యడ్యూరప్ప నిరాకరించడంతో ప్రస్తుతం మంత్రి మహేశ్‌కు కేటాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement