CM house
-
పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..
యశవంతపుర: గర్భకోశం తొలగించిన మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం వైద్యుల అలసత్వం వల్ల ఖజానాకు తిరిగి వెళ్లిపోయింది. ఈ మహిళలకు సాయం చేయాలని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా ఆస్పత్రికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గర్భకోశం తొలగించుకున్నవారికి ఆస్పత్రిలోనే చెక్కు రూపంలో అందించాలి. కానీ వైద్యులు ఎవరికీ ఆర్థిక సాయాన్ని అందించలేదు. నిధులను వాడుకోకపోవడంతో సర్కారుకి తిరిగివెళ్లాయి. దీంతో బాధిత మహిళలు శిగ్గావిలోని సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటికి పాదయాత్రగా బయల్దేరారు. 8 ఏళ్ల నుంచి 1522 మంది మహిళలకు గర్భకోశం తొలగించారు. వారందరికీ మొండిచెయ్యి చూపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ శాంతపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. (చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్) -
సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ బెదిరింపుతో భద్రతను పెంచారు. చెన్నై గ్రీవెన్స్ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో సచివాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలు భద్రతా వలయంలోనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో తరచూ సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. మంగళవారం వచ్చిన బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం సైబర్ క్రైం గాలింపు చేపట్టింది. చదవండి: ఈ చేపలు కుట్టినా, వీటిని తిన్నా ప్రాణాలు పోతాయ్ -
‘గుడిని ముఖ్యమంత్రే తొలగించమన్నారు’
తాడేపల్లిరూరల్: రాజధాని ప్రాంతంలో నిన్న మొన్నటి వరకు నివాసాలు కూల్చేందుకు యత్నించిన అధికారుల దృష్టి నేడు సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో ఉన్న దేవాలయంపై పడింది. తుపానుకు రేకుల షెడ్డు నిర్మాణంలో ఉన్న దేవాలయం నేలమట్టం కావడంతో స్థానికులు చందాలు పోగు చేసి భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు దాన్ని కూల్చేందుకు శనివారం ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఆదివారం తిరిగి మరలా ఆ దేవాలయాన్ని కూల్చేందుకు ఇరిగేషన్ అధికారులు సంఘటనా స్థలం వద్దకు రాగా, స్థానికంగా ఉన్న మహిళలు, భక్తులు అడ్డుపడ్డారు. రెండు గంటల పాటు సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో హైడ్రామా నడిచింది. నిర్మాణం చేసేటప్పుడు కళ్లకు కనబడలేదా? నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చడమేంటంటూ స్థానికులు ప్రశ్నించడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సీఎం గారు తొలగించమన్నారని తెలియజేశారు. సీఎం ఉండే నివాసం కూడా అక్రమ కట్టడమే కదా, దాన్ని మీరు ఎందుకు తొలగించడం లేదు? దాన్ని తొలగించడానికి మీకు అధికారం లేదా అంటూ ఓ మహిళ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించింది. ఇళ్లను కూలదోసినా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోయినా ఎవరూ మాట్లాడలేదు, కనీసం దేవాలయం కూడా ఉంచరా? అని నిలదీశారు. మీరు కట్టిన ఎత్తిపోతల పథకం కనిపించడంలేదని దీన్ని కూలుస్తున్నారా? మీరు బిల్డింగ్ పడవేస్తే విగ్రహాలతో పాటు పుట్ట దెబ్బతింటుందని, దాన్ని పడేయడానికి వీల్లేదంటూ పుట్టచుట్టూ భక్తులు నిలబడ్డారు. ఇరిగేషన్ ఎస్ఈ చౌదరి సంఘటనా స్థలానికి వచ్చి భక్తులతో చర్చలు జరిపారు. చివరకు పుట్టకు, విగ్రహాలకు ఎటువంటి నష్టం జరగకుండా నిర్మాణాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయినాసరే వారు ఎలా తొలగిస్తారో మేము ఇక్కడే ఉండి చూస్తామని మొండికేసి బైఠాయించడంతో పుట్టచుట్టూ గడ్డర్లు ఏర్పాటు చేసి దానిపై పెద్ద పెద్ద రేకులు ఏర్పాటు చేసి, పొక్లెయిన్‌తో కూల్చేందుకు ప్రయత్నం చేశారు. అలా కూలిస్తే పుట్ట, విగ్రహాలు దెబ్బతింటాయని మరోసారి భక్తులు అటకాయించడంతో, చివరకు పొక్లెయిన్‌తో పనులు ఆపేసి, కూలీల చేత దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం ప్రారంభించారు. ఏదేమైనా ఎత్తిపోతల పథకం బకింగ్ హామ్ కెనాల్ హెడ్‌స్లూయిస్ నుంచి సరిగ్గా కనిపించడంలేదని ఆ బిల్డింగ్ తొలగించాలన్న కోరిక ఇరిగేషన్ అధికారులు తీర్చుకున్నారు. -
ఆ బంగ్లా అంటే ఎందుకంత భయం!?
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వం కేటాయించిన భవనంలోకి వెళ్లడానికి కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప వెనకడుగు వేస్తున్నారట. బెంగళూరులోని కుమారకృపా అతిథి గృహంలోని 3వ నెంబరు భవనాన్ని కుమారస్వామి ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అయితే అందులోకి వెళ్లడానికి ఆయన ఇష్టపడటం లేదట. ఆ బంగ్లాకు వెళ్తే సీఎం పదవిలో ఉండలేమనే భావన, వాస్తుదోషం భయంతోనే యడ్యూరప్ప ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేసు కోర్సు రోడ్డులో ఉన్న రేస్ కోర్సు కాటేజీలోని భవనాన్ని తనకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. వాస్తుదోష భయం..! సీఎం కుమారస్వామి కూడా గతంలో ఇదే భవనంలో ఉండగా పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ భవనాన్ని వదిలి జేపీ నగర్లోకి తన నివాసాన్ని మార్చారు. కుమారస్వామి ఖాళీ చేసిన తర్వాత మాజీ స్పీకర్ డీహెచ్ శంకర్మూర్తికి ఈ భవనాన్ని కేటాయించారు. అయితే ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆ బంగ్లాకు రావడానికి యడ్యూరప్ప నిరాకరించడంతో ప్రస్తుతం మంత్రి మహేశ్‌కు కేటాయించారు. -
ఇక చంద్రబాబు ఇంటికి నిధులు ఇవ్వలేం!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాలకు లెక్కలేనంతగా పారుతున్న నిధుల వరదకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబరు 65లో నూతనంగా నిర్మించిన సీఎం ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని రహదారులు, భవనాల శాఖ తేల్చింది. సీఎం ఇంటికి సీసీ కెమేరాల నిమిత్తం రూ. 20 లక్షలు కేటాయించాలని ఆర్‌అండ్‌బీకి ప్రతిపాదనలు అందాయి. ఈ ఫైల్‌ను ఆర్‌అండ్‌బీలోని ఎలక్ట్రికల్ విభాగానికి పంపించారు. అయితే ఇప్పటికే ఎలక్ట్రికల్ విభాగం నుంచి సీసీ కెమేరాలకు, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ. 12 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. లేక్ వ్యూ అతిధి గృహం, మదీనాగూడలోని ఫాం హౌస్, నాలుగేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లో అద్దెకున్న ఇంటికి, నారావారిపల్లెలోని ఇంటికి ఈ నిధులు ఖర్చు చేశారు. సాధారణంగా సీఎం చంద్రబాబు అధికారికంగా క్యాంపు కార్యాలయంగా ఉపమోగిస్తున్న దానికే నిధుల్ని ఖర్చు చేసేందుకే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తుంది. అధికారికంగా ఉండవల్లి కరకట్ట పక్కనున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే సీసీటీవీ కెమేరాలు బిగించేందుకు గాను రూ. కోటి ఖర్చు చేశారు. హైదరాబాద్‌లో లేక్ వ్యూ అతిధి గృహాన్ని మొట్ట మొదటిసారిగా క్యాంపు కార్యాలయంగా గుర్తించడంతో అక్కడ సీసీటీవీ కెమెరాలను బిగించేందుకు, ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 3 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత మదీనాగూడలో ఫాం హౌస్‌కు, అద్దెకున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–24లో నివాసాలకు సీసీకెమేరాలు బిగించాలని నిధులు కేటాయించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని నారావారిపల్లెకు రూ. 36 లక్షలు కేటాయించారు. అయితే సీసీటీవీలకు నిధుల కేటాయింపునకు అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఉన్నత స్థాయిలోనే జోక్యం చేసుకుని నిధుల విడుదలకు అనుమతులిప్పిచ్చారు. మళ్లీ హైదరాబాద్‌లోని సీఎం ఇంటికి సీసీ కెమెరాలకు గాను ఇప్పుడు రూ. 20 లక్షలకు ప్రతిపాదనలు పంపడంపై ఆర్అండ్బీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇంటికి నిధుల విడుదలకు ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే ఉద్ధేశంతో నిధుల మంజూరుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే నిధుల విడుదలకు సీఎంవో నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయని ఆర్అండ్బీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం విలాసవంతమైన ఖర్చులపై లేఖరాసి పొగాకు రైతు ఆత్మహత్య సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు, విలాసవంతంగా చేస్తున్న ఖర్చుపై గతంలో పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు లేఖ ద్వారా ప్రశ్నించి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో జాతీయ మీడియాలో సంచలనమైంది. సీఎం క్యాంపు కార్యాలయాల ఖర్చుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. -
కుమారస్వామికి కలిసివచ్చిన ఇల్లు..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నగరంలోని జేపీ నగరలోని తన నివాసం నుంచే పరిపాలన సాగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంలకు ప్రభుత్వం కేటాయించే బంగ్లాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రులు నివాసం ఉండటానికి బెంగళూరులో అనుగ్రహ, కావేరీ బంగ్లాలు ఉన్నాయి. జయనగర్ నివాసం సెంటిమెంట్‌గా కలిసి రావడంతో కుమారస్వామి అక్కడకు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అయితే సీఎం అధికారిక నివాసం కృష్ణ బంగ్లాను ప్రజలను కలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కలిసి వచ్చిన ఇల్లు... గతంలో 2007లో సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి జేపీ నగర్‌లోని ఇంటి నుంచి వేరే నివాసానికి మకాం మార్చారు. అయితే జోతిష్యుల సలహా మేరకు 2018 ఎన్నికల ప్రచారానికి ముందే జేపీ నగర్‌లోని ఇంటికి మరమ్మతులు చేయించి అక్కడికి మారిపోయారు. ఈ ఇంట్లో ఉండగా, ఆయన సినీరగంలో పంపిణిదారుడిగా, నిర్మాతగా రాణించారు. తరువాత సీఎం కూడా అయ్యారు. -
మా కాపురం నిలబెట్టండి...
గుంటూరు, తాడేపల్లి రూరల్: ఒకే గ్రామానికి చెందిన వారిరువురూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్ల తర్వాత తన అత్త పోలీసు కేసు పెట్టి తన భర్త నుంచి తనను వేరు చేయాలని చూస్తోందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నాయకురాలైన తన అత్త తమ జోలికి రాకుండా చూడాలని సీఎంకు విన్నవించుకునేందుకు చంటిబిడ్డతో సహా సీఎం ఇంటివద్దకు వచ్చి పడిగాపులు కాసింది. ఆమె గోడు వినే వారు ఎవరూ లేక తిరుగుముఖం పట్టింది. బాధితురాలైన పిల్లి మేరీ తెలిపిన వివరాల ప్రకారం పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన పిల్లి కోటయ్య, మేరీ మూడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కోటయ్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో మూడేళ్ల పాటు గుంటూరు చుట్టుగుంటలో నివాసం ఉన్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. మూడు సంవత్సరాల అనంతరం గ్రామంలో టీడీపీ తరఫున వార్డు మెంబరు అయిన అత్త పిల్లి లీల పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మేరిని, కోటయ్యను పిలిచి విచారించారు. తామిద్దరం ప్రేమించి, పెళ్లిచేసుకున్నామని చెప్పడంతో పోలీసులు కేసును మూసివేశారు. అయితే అత్త లీల అక్కడితో ఆగకుండా తన భర్తనుంచి తనను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీ నాయకురాలైన తన అత్త లీలకు నచ్చజెప్పి తన కాపురాన్ని నిలబెట్టాలని కోరేందుకు బుధవారం ఆమె సీఎం నివాసం వద్దకు వచ్చింది. ఆమె గోడు అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.చివరకు సీఎం భద్రతా సిబ్బంది కలుగజేసుకుని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి నంబర్ ఇచ్చి ఆమెను కలవాలంటూ సూచించి, అక్కడినుంచి పంపించివేశారు. -
సీఆర్డీఏలో ఆధిపత్య పోరు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పర్యవేక్షించే చీఫ్ ఇంజినీర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఆర్డీఏ ఇంజనీరింగ్ విభాగంలో మూడు కీలక ప్రాజెక్టులను చేపట్టిన వీరి మధ్య సమన్వయం లేకపోవడంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రాజధాని పనుల పురోగతి మందగించింది. ఉన్నతాధికారులు ఎవరి దారిలో వారు వెళుతుండడంతో కింది స్థాయి సిబ్బంది నలిగిపోతున్నారు. టెండర్ లేకుండానే సీఎం ఇంటివద్ద గ్రీవెన్స్ హాల్ సీఆర్డీఏ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొక్యూర్మెంట్, యుటిలిటీస్, హౌసింగ్లకు ముగ్గురు సీఈలను నియమించారు. ప్రొక్యూర్మెంట్, హౌసింగ్ సీఈల మధ్య విభేదాలు ముదరటంతో పలు ప్రాజెక్టుల పరిస్థితి గందరగోళంగా మారింది. పెద్దల మెప్పు కోసం హౌసింగ్ సీఈ నిబంధనలను పక్కనపెట్టి పని చేస్తుండడం ప్రొక్యూర్మెంట్ వింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్ నిర్మాణం విషయంలో వీరి మధ్య నెలకొన్న విభేదాలు గొడవపడే వరకూ వెళ్లాయి. సీఎం మౌఖిక ఆదేశంతో టెండరు పిలవకుండానే రూ.5.5 కోట్లతో ఓ కాంట్రాక్టర్ ద్వారా హాలు నిర్మాణాన్ని హౌసింగ్ సీఈ పూర్తి చేయించినట్లు సమాచారం. కాంట్రాక్టర్‌కు అనామతు ఖాతాలో బిల్లు చెల్లించే ప్రయత్నాలు చేశారు. కనీసం నామినేషన్ మీద పని ఇచ్చినట్లు కూడా చూపలేదు. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు పని అప్పగించినట్లు చూపేలా ప్రొక్యూర్మెంట్ సీఈపై ఒత్తిడి తెచ్చారు. అయితే అయిపోయిన పనికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసినట్లు తానెలా కాగితాలు సృష్టిస్తానని ఆయన నిలదీయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంపై హౌసింగ్, ప్రొక్యూర్మెంట్ సీఈల మధ్య సీఎం కార్యాలయంలోనే వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఎలాగోలా కాంట్రాక్టర్‌కు బిల్లు ఇప్పించేలా చూడాలని ఉన్నతాధికారులు ప్రొక్యూర్మెంట్ సీఈపై ఒత్తిడి తెచ్చినా ఆయన నిరాకరించినట్లు తెలిసింది. దీంతోపాటు పలు పనులకు సంబంధించిన టెండర్లలోనూ ఇద్దరు సీఈల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మందకొడిగా ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి టెండర్లు మరోవైపు పెద్ద బాధ్యతల్లో ఉన్న యుటిలిటీస్ సీఈని కొద్దికాలంగా పూర్తిగా పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంజనీరింగ్ విభాగాన్ని సమన్వయం చేయాల్సిన ఆయన ఆధిపత్య పోరులో వెనుకబడి నామమాత్రంగా మారిపోయారు. ఆయన పర్యవేక్షణలో ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదనే విమర్శలున్నాయి. -
హామీ అమలు చేయలేదని..
► సీఎం నివాసం వద్ద వికలాంగుడి ఆత్మహత్యాయత్నం ► చంద్రబాబును కలిసేందుకు సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం తాడేపల్లి రూరల్(గుంటూరు): ఇచ్చిన హామీ అమలుకాలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాలని వచ్చిన ఓ వికలాంగుడిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందే ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఒంగోలుకు చెందిన నారాయణ తనకు జీవనోపాధికి రుణం ఇప్పించాలంటూ ఇటీవల వెలగపూడి సచివాలయంలో సీఎంను కలసి తన బాధను వివరించాడు. రెండ్రోజుల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. ఇది జరిగి పది రోజులు గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో సీఎంను కలిసేందుకు నారాయణ మళ్లీ ఉండవల్లి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సీఎం నిద్రలేవలేదు, తర్వాత పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. మరో రెండు గంటల తర్వాత కూడా సిబ్బంది అదే సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన వికలాంగుడు దగ్గర్లో ఉన్న ఖాళీ మద్యం బాటిల్‌తో తలపై బాదుకున్నాడు. గమనించిన సిబ్బంది నారాయణను హడావుడిగా మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ‘ఒంగోలు జిల్లా అధికారులతో సీఎం పేషీ నుంచి మాట్లాడాం. నీకు న్యాయం చేస్తారు. ఇక వెళ్లు’ అంటూ అధికారులు బాధితుడిని ఒంగోలు పంపించివేశారు. -
సీఎం ఇంటి దారిలో 75 విద్యుత్ స్తంభాలు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లే దారిలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సీతానగరం బకింగ్ హామ్ హెడ్ స్లూయిజ్ నుంచి సీఎం ఇంటి వరకు కరకట్టకు ఆనుకుని దిగువ ప్రాంతంలో 75 స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ఆదివారం కాంక్రీట్ పనులను చేపట్టారు. మొత్తం 1.5 కిలోమీటర్ల పొడవున ఈ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. స్తంభానికి స్తంభానికి మధ్య 30 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇప్పటికే బకింగ్ హామ్ హెడ్ స్లూయిజ్ నుంచి సీఎం నివాసం వరకు 175 విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఉండవల్లి పంచాయతీకి రూ. 40 వేల కరెంటు బిల్లు వస్తోంది. మరలా ఈ 75 లైట్లను కూడా ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లు ఎంత వస్తుందోనని అధికారులు అంటున్నారు. -
సీఎం నివాసంలో వైఫై ఏర్పాటు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): కృష్ణాతీరంలోని ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సోమవారం అధికారులు ప్రసార సాధనాలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ ఫోన్, ఇంటర్ నెట్, వైఫై ప్యాకేజీకి సంబంధించిన సేవలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు సుమారు కిలోమీటరు మేర ఫైబర్ కేబుల్ సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం కేబుల్‌తోపాటు అవసరమైన కమ్యూనికేషన్ యంత్రాలు అమర్చేందుకు పది మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. -
చంద్రబాబు ఆ ఇంట్లో చేరడం న్యాయమా?
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని, ఆయన ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ రామకృష్ణ సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే రాష్ట్రంలో లక్షల ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు చంద్రబాబు తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థులకు శాపంగా మారిన 120 జీవో రద్దు చేయాలన్నారు. వివాదాస్పదంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు చేరడం న్యాయమా? అని రామకృష్ణ ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం అంతటి వ్యక్తే కృష్ణానది కరకట్టపై అక్రమ భవనాన్ని తన నివాసంగా మార్చుకుంటే ఇక అక్రమాలకు అడ్డు చెప్పేది ఎవరని, నదీ గర్భంలో అక్రమంగా భవనాలు నిర్మించారంటూ టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గగ్గోలు పెట్టారని, అక్రమ భవనాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని, తాను నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమమో, సక్రమమో సీఎం చెప్పాలన్నారు. రైతులు హాయిగా ఉన్నారంటూ చంద్రన్న రైతుయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
సీఎం నివాసానికి 'వంద'నం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం.. తాత్కాలిక నివాసం.. క్యాంపు కార్యాలయం.. ఇలా రకరకాల పేర్లు చెబుతూ ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సీఎం నివాసం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ఉంది. ఉండవల్లిలో కృష్ణానది కరకట్టన ఓ ప్రైవేటు భవనం సీఎం నివాసానికి ఎంపిక చేశారు. వీటన్నిటికీ చంద్రబాబు పదవిలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఈ ఖర్చు చేసినట్లు సమాచారం. ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్ సీఎం అధికారిక నివాసానికి ఎంపిక చేసినట్లుగా వార్తలకెక్కింది. ఇక్కడ ప్రత్యేక విద్యుత్తు సబ్‌స్టేషన్, సెల్ ఫోన్ టవర్లు, రహదార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 30 సెంట్ల స్థలంలో రూ. 5 కోట్ల వ్యయంతో విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు చకాచకా ప్రారంభించారు. సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రెండు టవర్లు ఏర్పాటు కానున్నాయి. ఒకటి బీఎస్‌ఎన్‌ఎల్‌ది కాగా, మరో టవర్ ఎయిర్టెల్, వోడా, ఐడియాలకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఒక టవర్ ఏర్పాటుకు రూ. 70-80 లక్షల మధ్య ఖర్చవుతుంది. ఈ రెండు టవర్లకు కలిపి రూ. 1.6 కోట్ల వరకు ఖర్చు కానుంది. భవిష్యత్తులో వీటి నిర్వాహణకు సైతం ప్రభుత్వం కొంత భరించాల్సి ఉంటుందని సెల్ ఫోన్ కంపెనీ వర్గాల సమాచారం. ఇక్కడి రహదారుల నిర్మాణానికి రూ. 48 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనా. కృష్ణానదిపై భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక బోట్లు, అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. వీటికి కూడా మరో రూ. 5 కోట్లకు పైగానే కేటాయించాల్సి రావచ్చంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అతిథి గృహం మరమ్మతులకు, అక్కడ వినియోగించే సామగ్రికి రూ. 5-7 కోట్ల మధ్య ఖర్చవుతున్నట్లు సమాచారం.