సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ బెదిరింపుతో భద్రతను పెంచారు. చెన్నై గ్రీవెన్స్ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో సచివాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలు భద్రతా వలయంలోనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో తరచూ సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది.
మంగళవారం వచ్చిన బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం సైబర్ క్రైం గాలింపు చేపట్టింది. చదవండి: ఈ చేపలు కుట్టినా, వీటిని తిన్నా ప్రాణాలు పోతాయ్
Comments
Please login to add a commentAdd a comment