సీఎం నివాసంలో వైఫై ఏర్పాటు
Published Mon, Jul 25 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): కృష్ణాతీరంలోని ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సోమవారం అధికారులు ప్రసార సాధనాలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ ఫోన్, ఇంటర్ నెట్, వైఫై ప్యాకేజీకి సంబంధించిన సేవలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు సుమారు కిలోమీటరు మేర ఫైబర్ కేబుల్ సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం కేబుల్‌తోపాటు అవసరమైన కమ్యూనికేషన్ యంత్రాలు అమర్చేందుకు పది మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
Advertisement
Advertisement