![How DO Free Calls Without Recharge Plans](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/free-calling.jpg.webp?itok=rFVKUDI5)
సాధారణంగా కాల్స్ చేయాలన్నా.. స్వీకరించన్నా తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. రీఛార్జ్ ప్లాన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో కొందరు సమయానికి రీఛార్జ్ చేసుకోలేరు. అలాంటి వారికి ఇప్పుడొక శుభవార్త. ఒక సింపుల్ ట్రిక్ పాటిస్తే.. రీఛార్జ్ చేసుకోకుండానే ఫ్రీగా కాల్స్ మాటాడొచ్చు. అదెలాగో ఇక్కడ చూసేద్దాం..
ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించే వినియోగదారు మొబైల్ నెట్‌వర్క్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే కాల్స్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా?
➤మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి, నెట్‌వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
➤అక్కడ సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.
➤మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును సెలక్ట్ చేసుకోండి.
➤క్రిందికి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్‌ను ఎంచుకోవాలి.
➤ఆ తరువాత వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
వైఫై కాలింగ్ యాక్టివేట్ అయిన తర్వాత.. మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా లేనప్పుడు లేదా రీఛార్జ్ ప్లాన్ ముగిసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్‌ల కోసం ఆటోమాటిక్‌గా వైఫై ఉపయోగిస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
Comments
Please login to add a commentAdd a comment