Wi-Fi Calling
-
రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..
సాధారణంగా కాల్స్ చేయాలన్నా.. స్వీకరించన్నా తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. రీఛార్జ్ ప్లాన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో కొందరు సమయానికి రీఛార్జ్ చేసుకోలేరు. అలాంటి వారికి ఇప్పుడొక శుభవార్త. ఒక సింపుల్ ట్రిక్ పాటిస్తే.. రీఛార్జ్ చేసుకోకుండానే ఫ్రీగా కాల్స్ మాటాడొచ్చు. అదెలాగో ఇక్కడ చూసేద్దాం..ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా స్మార్ట్ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించే వినియోగదారు మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే కాల్స్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా?➤మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి, నెట్వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లండి.➤అక్కడ సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.➤మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును సెలక్ట్ చేసుకోండి.➤క్రిందికి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్ను ఎంచుకోవాలి.➤ఆ తరువాత వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.వైఫై కాలింగ్ యాక్టివేట్ అయిన తర్వాత.. మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు లేదా రీఛార్జ్ ప్లాన్ ముగిసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్ల కోసం ఆటోమాటిక్‌గా వైఫై ఉపయోగిస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!? -
వొడాఫోన్ ఐడియా 'వై-ఫై కాలింగ్' సేవలు ప్రారంభం
వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వై-ఫై కాలింగ్' లేదా 'వోవీ-ఫై' సేవను నేడు ప్రారంభించింది. ప్రస్తుతం వీ 'వై-ఫై కాలింగ్' కాలింగ్ సేవలు మహారాష్ట్ర & గోవా, కోలకతా వంటి సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఇండియా దశలవారీగా ఇతర సర్కిల్‌లలో ఈ సేవను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ వంటి సంస్థలు ఏడాది క్రితమే వై-ఫై కాలింగ్ సేవలను ప్రారంభించాయి. టెలికాం టాక్ నివేదిక ప్రకారం, వై వై-ఫై కాలింగ్ ప్రారంభించినట్లు కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీం ట్విట్టర్లో ధృవీకరించింది. ఎయిర్టెల్ ప్రారంభించిన VoWi-Fi కాలింగ్ సేవల మాదిరిగానే ఈ సేవలు ఉండనున్నాయి. వోడాఫోన్ ఇండియా గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవలను పరీక్షించింది. వాస్తవానికి, 2019 ప్రారంభంలో వీ వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను ఇతర టెల్కోల కంటే ముందుగానే ప్రారంభించనున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే, వోడాఫోన్- ఐడియా యొక్క నెట్వర్క్ ఇంటిగ్రేషన్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది.(చదవండి: వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్) -
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్.. దేశవ్యాప్తంగా వై–ఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా ఇతర వై–ఫై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకుని కాల్స్ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చని వివరించింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పైలట్ ప్రొజెక్ట్ కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేవలకు విశేష స్పందన లభించిందని, వై–ఫై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇటీవలే రిలయన్స్ జియో సైతం ఈ తరహా సేవ లను అందుబాటులోకి తెచ్చింది. -
ఎటి అండ్ టి బంపర్ ఆఫర్
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘ఏటీ అండ్ టీ’ బంపర్ ఆఫర్ ఇస్తోంది. అమెరికాకు ఇతర దేశాల నుంచి రోమింగ్ ఛార్జీలు లేకుండా ఉచితంగా వై ఫై కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు ఉన్న ప్రదేశంలో ఫోన్ సిగ్నల్ లేకున్నా.. బలహీనంగా ఉన్నాకూడా వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంటే చాలు.. యూఎస్‌లోని తమ స్నేహితులకు కాల్స్ చేసుకోవచ్చని ఏటీ అండ్ టీ సంస్థ వెల్లడించింది. అందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఫోన్లో సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు అమెరికాలోనూ ఈ సదుపాయం పనిచేస్తుందని వెల్లడించింది. యూఎస్ ఫోన్ నంబర్లకు కాల్ చేస్తేనే ఈ సదుపాయం వర్తిస్తుందట. అలాగే.. ఐఫోన్ 6.. 6ఎస్ ఫోన్లలోనూ, 9.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ఏటీఅండ్‌టీ తన సైట్లో పేర్కొంది. కొన్ని దేశాల్లో వై ఫై కాలింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవచ్చని వెల్లడించింది. ఒకసారి ఈ ఫీచర్ ను మొబైల్ లో యాక్టివేట్ చేసుకుంటే, విదేశాలలో ఉన్నప్పుడు కూడా తమ వై ఫై సేవలు నిర్విరామంగా పనిచేస్తాయని చెబుతోంది. దీనికోసం ఎలాంటి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది. మీరు ఒక నేలమాళిగలో ఉన్నా, ఎలివేటర్ లో ఉన్నా కూడా శక్తిమంతంగా పనిచేస్తుందని తెలిపింది.