వొడాఫోన్ ఐడియా 'వై-ఫై కాలింగ్' సేవలు ప్రారంభం | Vodafone Idea Launches Wi Fi Calling Service in India | Sakshi
Sakshi News home page

వొడాఫోన్ ఐడియా 'వై-ఫై కాలింగ్' సేవలు ప్రారంభం

Published Tue, Dec 15 2020 8:30 PM | Last Updated on Tue, Dec 15 2020 9:06 PM

Vodafone Idea Launches Wi Fi Calling Service in India - Sakshi

వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వై-ఫై కాలింగ్' లేదా 'వోవీ-ఫై' సేవను నేడు ప్రారంభించింది. ప్రస్తుతం వీ 'వై-ఫై కాలింగ్' కాలింగ్ సేవలు మహారాష్ట్ర & గోవా, కోలకతా వంటి సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఇండియా దశలవారీగా ఇతర సర్కిల్‌లలో ఈ సేవను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఏడాది క్రితమే వై-ఫై కాలింగ్ సేవలను ప్రారంభించాయి. టెలికాం టాక్ నివేదిక ప్రకారం, వై వై-ఫై కాలింగ్ ప్రారంభించినట్లు కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీం ట్విట్టర్‌లో ధృవీకరించింది. ఎయిర్టెల్ ప్రారంభించిన VoWi-Fi కాలింగ్ సేవల మాదిరిగానే ఈ సేవలు ఉండనున్నాయి. వోడాఫోన్ ఇండియా గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవలను పరీక్షించింది. వాస్తవానికి, 2019 ప్రారంభంలో వీ వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను ఇతర టెల్కోల కంటే ముందుగానే ప్రారంభించనున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే, వోడాఫోన్- ఐడియా యొక్క నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది.(చదవండి: వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement