free calling
-
ఆదివారం ఉచిత కాలింగ్ ఆఫర్ పొడిగింపు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎన్ఎన్ఎల్) తన సబ్స్క్రైబర్లకు ఆదివారం ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను పొడిగించింది. ల్యాండ్‌లైన్‌కు, కోంబోకు, ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లకు 2016 నుంచి అందిస్తున్న ఈ ప్రయోజనాలను మరోసారి పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ సండే కాల్స్ ఆఫర్‌ను క్లోజ్ చేయాలని గత జనవరిలో బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. కానీ ఫిబ్రవరిలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మరో మూడు నెలల పాటు ఈ ప్రయోజనాలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అంటే ఏప్రిల్ 30తో ఈ ఆఫర్ ప్రయోజనాల గడువు పూర్తి కాబోతోంది. ప్రస్తుతం మరోసారి ఈ ఆఫర్‌ను మే 1 నుంచి పొడిగించనున్నామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే ఎంతకాలం పాటు ఈ ప్రయోజనాలను అందించనున్నదో తెలుపలేదు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఈ ఉచిత కాలింగ్ ప్రయోజనాలను బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు ఆదివారం రోజు ఉచితం దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం ఉచిత కాలింగ్ ఆఫర్‌ను పొడిగించడమే కాకుండా.. రాత్రి పూట అందించే వాయిస్ కాలింగ్ సమయాలను మార్చింది. అంతకముందు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అందించే వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రస్తుతం రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 6 గంటలకు మార్చింది. అయితే బీఎస్ఎన్ఎల్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో కూడా రూ.349తో డేటా, వాయిస్ కాలింగ్‌తో కొత్త ప్రీపెయిడ్ మొబైల్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. అదనంగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో రూ.99, రూ.319 ప్లాన్లను ప్రవేశపెట్టింది. -
వొడాఫోన్.. ఉచిత కాలింగ్ ఆఫర్
ముంబై: దేశంలో రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అరుున ‘వొడాఫోన్’ తాజాగా ప్రి-పెరుుడ్ కస్టమర్లకు ఉచిత కాలింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు కొత్త ప్యాక్‌లను ఆవిష్కరించింది. 28 రోజుల వాలిడిటీతో కూడిన ఈ ప్లాన్లు 2జీ, 3జీ, 4జీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ప్లాన్ ధరలు ఒక్కొక్క సర్కిల్లో ఒక్కో రకంగా ఉంటారుు. ఆ రెండు ప్లాన్ల వివరాలు... ⇔ రూ.144-149 ప్లాన్: ఈ ప్లాన్‌లో కస్టమర్లు వొడాఫోన్ కనెక్షన్లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అదే 4జీ హ్యాండ్సెట్ యూజర్లు అరుుతే 300 ఎంబీ డేటాను పొందొచ్చు. ఇక నేషనల్ రోమింగ్‌లో ఇన్కమింగ్ ఫ్రీ. ⇔ రూ.344-349 ప్లాన్: ఈ ప్లాన్ యూజర్లు ఏ నెట్‌వర్క్‌కై నా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అదే 4జీ హ్యాండ్సెట్ యూజర్లు అరుుతే 1 జీబీ డేటాను పొందొచ్చు. నేషనల్ రోమింగ్‌లో ఇన్కమింగ్ ఫ్రీ. -
రూ. 49కే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్
విజయవాడ (మధురానగర్) : నెలకు రూ. 49కే ల్యాండ్ లైన్ కనెక్షన్, ప్రీపెయిడ్ సిమ్, ఇన్స్టలేషన్ను అందించనున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలి పారు. బీఎస్‌ఎఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి దేశమంతా ఏ నెట్‌వర్క్‌కైనా రాత్రి 9నుంచి ఉదయం 7గంటల వరకు ఉచి తంగా మాట్లాడుకోవచ్చునని చెప్పారు. ఆదివారం 24 గంటలూ ఉచితంగా మాట్లాడుకోవచ్చన్నారు.మరిన్ని వివరాలకు బీఎఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్లలో సంప్రదించవచ్చు. -
ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి రాత్రివేళ ఫ్రీకాల్స్
బీఎస్ఎన్ఎల్ డీజీఎం శ్రీనివాసమూర్తి నల్లగొండ అర్బన్: ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్‌నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి రాత్రంతా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్‌ను అందిస్తున్నారని టెలికాం జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఆఫర్‌ను మే 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ నుంచి రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశంలో ఏ ప్రాంతానికైనా ఏ నెట్వర్క్ ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లకు ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చని తెలిపారు. అన్ని ల్యాండ్‌లైన్ పట్టణ, గ్రామీణ, సాధారణ ప్లాన్లు, స్పెషల్ ప్లాన్, కాంబోప్లాన్‌లకు బ్రాడ్‌బాండ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. అంతకంతకు తగ్గిపోతున్న ల్యాండ్లైన్ల కనెక్షన్లకు మళ్లీ గిరాకీ కనిపించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ల్యాండ్లైన్ల కోసం దగ్గరలో వున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసుల కోసం సంప్రదించాలని సూచించారు.18003451500 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఈ పథకం ఎంత కాలం కొనసాగించాలనే విషయాన్ని నిర్ధారించలేదని తెలిపారు. ఆరునెలల తరువాత ప్రగతిని సమీక్షించి సేవలను కొనసాగించే యోచన చేస్తారని అన్నారు. ఇదే కాకుండా బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లను కూడా అమలు చేస్తున్నదని వివరించారు. డాటా ప్లాన్ ఓచర్ స్కీం ద్వారా రూ. 3299 తీసుకునే వారికి డాటా కార్డు ఉచితంగా అందిస్తారని అన్నారు. బీపీవీ-229 తీసుకుంటే రూ.300 కే డాటా కార్డును ఇస్తారని, డీపీవీ-1251 తీసుకుంటే రూ. 600 డాటా కార్డును అందజేస్తారని తెలిపారు. రూ. 2వేల నుంచివెయ్యి వరకు, రూ. 1500 నుంచి రూ. 10వేల వరకు ఫుల్‌టాక్‌టైమ్ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు వేణుగోపాల్, వజీరుద్దీన్, జగన్మోహన్రెడ్డి, జేటీఓ శ్రీనివాస్ పాల్గొన్నార