వొడాఫోన్.. ఉచిత కాలింగ్ ఆఫర్ | Vodafone introduces free calls, data and roaming packs | Sakshi
Sakshi News home page

వొడాఫోన్.. ఉచిత కాలింగ్ ఆఫర్

Published Sat, Dec 10 2016 1:04 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

వొడాఫోన్.. ఉచిత కాలింగ్ ఆఫర్ - Sakshi

వొడాఫోన్.. ఉచిత కాలింగ్ ఆఫర్

ముంబై: దేశంలో రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అరుున ‘వొడాఫోన్’ తాజాగా ప్రి-పెరుుడ్ కస్టమర్లకు ఉచిత కాలింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు కొత్త ప్యాక్‌లను ఆవిష్కరించింది. 28 రోజుల వాలిడిటీతో కూడిన ఈ ప్లాన్లు 2జీ, 3జీ, 4జీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ప్లాన్ ధరలు ఒక్కొక్క సర్కిల్‌లో ఒక్కో రకంగా ఉంటారుు.  ఆ రెండు ప్లాన్ల వివరాలు...

రూ.144-149 ప్లాన్: ఈ ప్లాన్‌లో కస్టమర్లు వొడాఫోన్ కనెక్షన్లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అదే 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లు అరుుతే 300 ఎంబీ డేటాను పొందొచ్చు. ఇక నేషనల్ రోమింగ్‌లో ఇన్‌కమింగ్ ఫ్రీ.

రూ.344-349 ప్లాన్: ఈ ప్లాన్ యూజర్లు ఏ నెట్‌వర్క్‌కై నా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అదే 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లు అరుుతే 1 జీబీ డేటాను పొందొచ్చు. నేషనల్ రోమింగ్‌లో ఇన్‌కమింగ్ ఫ్రీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement