గణేశ్‌ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు | strong arrangements For Ganesh immersion: Telangana | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

Published Tue, Sep 17 2024 6:04 AM | Last Updated on Tue, Sep 17 2024 6:03 AM

strong arrangements For Ganesh immersion: Telangana

రాష్ట్రం మొత్తం విధుల్లో 35వేల మంది..

డీజీపీ ఆఫీస్, కమాండ్‌ కంట్రోల్‌ రూంల నుంచి పర్యవేక్షణ 

‘సాక్షి’తో డీజీపీ జితేందర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ జితేందర్‌ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 35వేల మంది పోలీస్‌ సిబ్బందిని నిమజ్జన బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిధిలోనే 25వేల మంది విధుల్లో ఉంటారని తెలిపా రు. 

నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో, బంజారాహిల్స్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో .. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement