Personnel
-
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 35వేల మంది పోలీస్ సిబ్బందిని నిమజ్జన బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోనే 25వేల మంది విధుల్లో ఉంటారని తెలిపా రు. నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో .. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో సైనికుడు, పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల (సీఎఎఫ్) వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. Chhattisgarh | Two Chhattisgarh Armed Force (CAF) security personnel died and one was injured after the vehicle they were travelling in overturned in the Balrampur district. The civil driver of the pick-up vehicle was also injured in the incident. Both the injured are under… pic.twitter.com/xVlVowxnop— ANI (@ANI) June 20, 2024 -
మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని వెల్లడించింది. ఇటీవల మాలే నుంచి భారత మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఇరు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూడా ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. అంతలోపు మాల్దీవులలో ఉన్న భారత్ మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఇక.. రెండోసారి జరిగిన అధికారుల సమావేశంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ దేశంలోని భారత్‌కు చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని సైనిక బలగాల్లో.. ముందుగా ఒక స్థావరంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని మార్చి 10 వరకు భర్తీ చేయాలని కోరింది. మరో రెండు వైమానిక స్థావరాలోని మిలిటరీ బలగాల బదులుగా మాలేలో మే 10వరకు నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందని పంపిచాలని విజ్ఞప్తి చేసింది. ఇక.. మల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవలను అందించేందుకు భారత్ వైమానిక స్థావరాల్లో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది ద్వారా నిరంతరం కార్యకలాపాలు సాగించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్ల సమాచారం. -
భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రత్యేక దృష్టి సారించాయి. విద్యుత్ భద్రతపై ఇప్పటికే అనేక సూచనలను ప్రజలకు ఇచ్చినప్పటికీ ఇంకా అక్కడక్కడా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా కొంతమంది విద్యుత్ సిబ్బందితోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగిన తరువాత సమీక్షించుకోవడం కాకుండా వాటిని అరికట్టేందుకు పటిష్ట చర్యల్ని అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి. వినియోగదారులకు ప్రత్యేకంగా భద్రతా సూచనల్ని రూపొందించాయి. భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల యజమానులు, రైతు కూలీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనలను రూపొందించాయి. వీటిని అందరికీ తెలియజేసేందుకు ‘భద్రతా అవగాహనా రథం’ పేరుతో ప్రత్యేక ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్నాయి. విద్యుత్ సిబ్బందికీ జాగ్రత్తలు లైన్ క్లియర్ (ఎల్సీ) సరిగ్గా లేకుండా ఏ లైన్ మీద పని చేయరాదు. సమీపంలో వేరే లైన్ ఉంటే దానికి కూడా ఎల్సీ తీసుకోవాలి. విద్యుత్ లైన్ల నిర్వహణ, బ్రేక్ డౌన్ ఆపరేషన్స్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ చేసే సమయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్, రబ్బర్ గ్లవ్స్, గమ్ బూట్స్, సేఫ్టీ బెల్ట్స్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలి. అలాగే ఒక్కరే ఎప్పుడూ వెళ్లకూడదు. వేరొకరిని తోడు తీసుకువెళ్లాలి. పంట పొలాలకు అనధికార విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. అటువంటివి లేకుండా సిబ్బంది తరచూ తనిఖీలు చేపట్టాలి. సబ్ స్టేషన్ ఆవరణలో గొడుగు వేసుకుని వెళ్లకూడదు. కడ్డీలు, తీగలు వంటివి తగిన జాగ్రత్తలు లేకుండా తీసుకుపోకూడదు. కొత్త సర్విస్ ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు విద్యుత్ లైన్ కింద ప్రమాదకరంగా ఉంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 48, క్లాజ్ 63 ఆఫ్ రెగ్యులేషన్స్ 2010 ప్రకారం సర్వీసును తిరస్కరించి లైన్ షిఫ్ట్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు ఇవీ సూచనలు విద్యుత్ లైన్లు కింద ఎటువంటి నిర్మాణాలు చేయరాదు. విద్యుత్ స్తంభానికి సమీపంలో లేదా స్తంభానికి ఆనుకుని ఇల్లు, ఎలివేషన్, డూములు, మెట్లు నిర్మాణం చేయకూడదు. ఇనుప చువ్వలు, లోహ పరికరాలు విద్యుత్ లైన్లు కింద తప్పనిసరి పరిస్థితులలో ఎత్తినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జేసీబీలు, క్రేన్లు ఉపయోగించేటప్పుడు, బోర్లు డ్రిల్ చేస్తున్నప్పుడు వాటి లోహపు తొట్టెలు, పైపులు విద్యుత్ లైన్లకు తగిలి ప్రాణాపాయం సంభవించవచ్చు. ధాన్యం, ప్రత్తి, గడ్డి, ఊక, కొబ్బరి చిప్పలు, కలప వంటి వాహనాలు అధిక లోడుతో విద్యుత్ లైన్లు కింద వెళ్లడం ప్రమాదకరం. సామాన్య ప్రజలకూ హెచ్చరికలు విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే లైన్ల కింద చెట్టు కొమ్మలు తొలగించాలి. తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను తాకకూడదు. ఇల్లు, షాపు మీటర్‌కి పోల్ నుంచి తీసుకొనే సర్విస్ వైరుకి ఎటువంటి అతుకులు లేకుండా చూసుకోవాలి. సర్వీస్ వైరుకి సపోర్ట్ వైరుగా రబ్బరు తొడుగు గల జీఐ తీగలను వాడాలి. ఇంటి ఆవరణలో ఎర్తింగ్ తప్పనిసరి. డాబాల మీద విద్యుత్ లైన్లకి దగ్గరగా బట్టలు ఆరవేయరాదు. తడి బట్టలతో, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు. వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాన్ని,సపోర్ట్ వైర్లను ముట్టుకోకూడదు. అనధికారంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు వేయడం చట్టవిరుద్ధమే కాదు ప్రాణాలకు ప్రమాదం. అధిక సామర్థ్యం గల ఫ్యూజు వైర్లను వాడరాదు. వాటివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి గృహోపకరణాలు కాలిపోతాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పక్కన, విద్యుత్ లైన్లు క్రింద తోపుడు బండ్లు, బడ్డీలు పెట్టడం ప్రమాదకరం. ప్రచార రథాన్ని అందుబాటులోకి తెచ్చాం ఏపీ ఈపీడీసీఎల్ ముందుగా ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. భద్రత సూచనలకు సంబంధించిన ఆడియోలను తయారుచేసి సంస్థ పరిధిలోని అన్ని సెక్షన్ కార్యాలయాలకు ఇప్పటికే పంపించాం. ఇకనుంచి ప్రతినెలా 2వ తేదీన క్రమం తప్పకుండా విద్యుత్ భద్రతా అవగాహన కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోని సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశించాం. వినియోగదారులు అవసరమైతే టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్ -
చల్లార్చేదెలా?
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఉట్నూర్ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా ఆస్తులు బుగ్గిపాలు కావాల్సిందే. అలాగని అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణి అనుకుంటే పొరపాటే. మంటలు ఆర్పడానికి అవసరమైన నీటి సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం వస్తే చాలు ఫైరింజన్ తీసుకుని నీటి కోసం చెరువు బాట పట్టాల్సిందే. నీటి సమస్య ఒక్కటే కాదు.. అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేక, సిబ్బందికి మౌలిక వసతులు కరువై ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రెండు సార్లు నిధులు విడుదల చేసినా స్థల సమస్య కారణంగా వెనక్కి వెళ్లాయి. చెరువే దిక్కు.. అగ్నిమాపక కేంద్రం ఉన్న ప్రాంతంలో ఎలాంటి నీటి వసతులు లేవు. దీంతో ఎక్కడైన ప్రమాదం జరిగిందనే సమాచారం రాగానే నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మంటలు ఆర్పడానికి వెళ్లే క్రమంలో ఫైరింజన్ తిరుగు ప్రయాణంలో చెరువు కనిపిస్తే నీటిని నింపాల్సిన దుస్థితి నెలకుంటోంది. 4500 లీటర్ల సామర్థ్యం గల ఫైరింజన్లో నీటిని నింపడానికి సిబ్బంది పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో సిబ్బంది గాయాల పాలైన సంఘటనలూ ఉన్నాయి. చెరువు నీరు ఫైరింజన్లో నింపే క్రమంలో బురద రాకుండా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన రహదారి వెంట చేతిపంపు నీటితో అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలల ఉపయోగం కోసం కూడా నీటి సౌకర్యం లేదు. అగ్నిమాపక సిబ్బంది తిప్పలు సొంత భవనం లేక తిప్పలు.. సమస్యాత్మక మండలాలైన ఉట్నూర్, నార్నూర్, జైనూ ర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు) మండలాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 2004లో ఏజెన్సీ కేంద్రంగా కుమురం భీం ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం అధీనంలోని క్వార్టర్స్‌కు మార్చింది. నాటి నుంచి ఐదు మండలాల్లో ఎక్కడ ఏ అగ్నిప్రమా దం జరిగినా ఇక్కడి నుంచి ఫైరింజన్ వెళ్లాల్సిందే. తర్వాత కాలంలో సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలం కోర్టు కేసులో ఉండడంతో అగ్నిమాపక కేంద్రం నిర్మా ణం మరుగునపడింది. క్వార్టర్ శిథిలావస్థకు చేరిందని, అది వెంటనే ఖాళీ చేయాలని ఐదేళ్లుగా ఎంపీడీవో కార్యాలయం నోటీసులు జారీ చేస్తూనే ఉంది. మరోమార్గం లేక కార్యాలయం అందులోనే కొనసాగిస్తున్నారు. ఫైర్ సామగ్రి భద్రపర్చడం, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై కప్పు సరిగా లేక కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే ఉరువకుండా ఉండడానికి కవర్లు కప్పారు. నిధులు మంజూరు అవుతున్నా.. అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.35లక్షలు విడుదల చేసింది. గతంలో ఎంపీడీవో కార్యాలయ మైదానంలో కేటాయించిన స్థలం కోర్టు కేసులో ఉండడం, ఇతర చోట్ల స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు విఫలం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అదీగాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో మరోసారి ప్రభుత్వం రూ.70 లక్షలు అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి మంజూరు చేసింది. స్థల సేకరణలో భాగంగా ఉట్నూర్ ఆర్డీవో మండల కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఎకరం స్థలం గుర్తించారు. ఆ స్థలాన్ని అగ్నిమాపక కేంద్రానికి కేటాయించాలని ఫిబ్రవరి 2015లో కలెక్టర్‌కు అధికారులు నివేదించారు. ఐబీ ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్అండ్బీ శాఖకు చెందినదని, ఆ స్థల కేటాయింపు కలెక్టర్ పరిధిలో ఉండదని తేలడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మంజూరైన రూ.70లక్షలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎక్కడన్నది తేలకపోవడంతో బోర్‌వెల్స్ వేయడం, ట్యాంకుల నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరైనా ఖర్చు చేయలేని స్థితిలో కేంద్రం అధికారులు ఉన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిమాపక అధికారుల తిప్పలు నిత్యకృత్యం కానున్నాయి. స్థలం లేక నిధులు వెనక్కి.. ఇప్పటికి అగ్నిమాపక కార్యాలయం నిర్మాణానికి రెండుసార్లు నిధులు మంజురైనా స్థలం లేక వెనక్కి వెళ్తున్నాయి. ఫైరింజన్‌కు కావాల్సిన నీటి కోసం ప్రతి సారి ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. నూతన కేంద్రం నిర్మాణానికి ఇటీవల ఐబీ ప్రాంతంలో ఆర్డీవోతో కలిసి ఎకరం స్థలం గుర్తించినా ఫలితం లేకుండాపోయింది. ఎక్కడైనా ఎకరం స్థలం లభిస్తే నూతన భవన నిర్మాణానికి అవకాశం ఉంది. నీటి సమస్య పరిష్కారానికి రూ.10 లక్షలు మంజూరైనా సొంత భవనం లేక ఖర్చు చేయలేకపోతున్నాం. – టి.పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి ఉట్నూర్ -
కశ్మీర్లో ఆపరేషన్ ‘కామ్ డౌన్’
-
కశ్మీర్లో ఆపరేషన్ ‘కామ్ డౌన్’
లోయలో మంటలు చల్లార్చడానికి 4000 జవాన్లు శ్రీనగర్/న్యూఢిల్లీ: అట్టుడుకుతున్న హింస... ఉగ్రవాదుల కదలికలు... కల్లోలంగా మారిన కశ్మీర్‌ను కుదుట పరచడానికి భారత సైన్యం ఆపరేషన్ ‘కామ్ డౌన్’ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్లో 4,000 అదనపు జవాన్లను గుట్టుచప్పుడు కాకుండారంగంలోకి దింపింది. అయితే కనీస బలగాలను మాత్రమే ఉపయోగించాలని వారికి కచ్చితమైన ఆదేశాలున్నట్టు అధికారులు తెలిపారు. జనజీవనానికి విఘాతం కలిగిస్తున్న ఆందోళనకారులను కట్టడి చేయడానికి వీరిని నియోగించారు. పుల్వామా, షోపియన్, అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాల్లో బలగాలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సహకారంతో సైన్యం దక్షిణ కశ్మీర్‌ను జల్లెడ పడుతోంది. అల్లర్లను మరింతగా రెచ్చగొట్టడానికి వంద మంది ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్లోకి చొరబడినట్టు సమాచారం. బక్రీద్‌నాడు ఘర్షణలు... ఇద్దరు మృతి బక్రీద్‌నాడు లోయలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు యువకులు మరణించారు. అలర్ల నేపథ్యంలో 200 ఏళ్ల తరువాత జమా మసీద్ మూతపడింది. 1821 తరువాత ఇక్కడ బక్రీద్ ప్రార్థనలు జరగకపోవడం ఇదే తొలిసారి. బక్రీద్ కశ్మీరీల త్యాగాలకు అంకితం: నవాజ్ షరీఫ్ లాహోర్: బక్రీద్(ఈద్ ఉల్ అజా)ను కశ్మీరీల త్యాగాలకు అంకితమిస్తున్నానని పాక్ ప్రధాని నవాజ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి స్వాత ంత్య్రం కోసం మూడోతరం కశ్మీరీలూ మహోన్నతమైన త్యాగాలకు సిద్ధపడుతున్నారని బక్రీద్ సందేశంలో పేర్కొన్నారు. భారత్ వారిపై అణచివేతలకు పాల్పడుతున్నా ఎదురొడ్డి పోరాడుతున్నారన్నారు.