మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని వెల్లడించింది.
ఇటీవల మాలే నుంచి భారత మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
‘ఇరు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూడా ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. అంతలోపు మాల్దీవులలో ఉన్న భారత్ మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.
ఇక.. రెండోసారి జరిగిన అధికారుల సమావేశంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ దేశంలోని భారత్‌కు చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని సైనిక బలగాల్లో.. ముందుగా ఒక స్థావరంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని మార్చి 10 వరకు భర్తీ చేయాలని కోరింది.
మరో రెండు వైమానిక స్థావరాలోని మిలిటరీ బలగాల బదులుగా మాలేలో మే 10వరకు నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందని పంపిచాలని విజ్ఞప్తి చేసింది. ఇక.. మల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవలను అందించేందుకు భారత్ వైమానిక స్థావరాల్లో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది ద్వారా నిరంతరం కార్యకలాపాలు సాగించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్ల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment