Indian troops
-
Maldives: ‘అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చెప్పేవన్నీ అబద్ధాలే’
మాలె: భారత భద్రతా బలగాలపై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి, మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ నేత అబ్దుల్లా షాహిద్ ఖండించారు. వేల సంఖ్యలో భారత భద్రత బలగాలు మాల్దీవులలో ఉన్నారని అధ్యక్షుడు మొయిజ్జు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు విదేశాలకు చెందిన సాయుధ మిలిటరీ బలగాలు మాల్దీవులలో ఎవరూ లేరని తెలిపారు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫును అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మొయిజ్జు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతోంది. అప్పటి నుంచి భారత భద్రతా బలగాలు విషయంలో అబద్ధాలు చేబుతున్నారని విమర్శించారు. తాజాగా వేలల్లో భారత భద్రత బలగాలు మాల్లీవులలో ఉన్నారంటూ మరో కొత్త అబద్ధానికి తెరతీశారని అబ్దుల్లా షాహిద్ దుయ్యబట్టారు. విదేశి భద్రత బలగాల సంఖ్య విషయంలో నిర్దిష్టమైన సమాచారాన్ని అందిచటంలో ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా తెలుస్తోందని ఎద్దేవా చేశారు. పారదర్శకత చాలా ముఖ్యమని.. నిజం గెలవాలని అన్నారు. ప్రస్తుతం 70 మంది భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉన్నారు. అయితే.. మాల్దీవుల నుంచి భారత భద్రత బలగాల ఉపసంహరించుకోవాలనే నినాదంతో మహ్మద్ మొయిజ్జు పార్టీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక.. భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా.. భారత దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని భద్రతా బలగాల్లో ఒక స్థావరం సిబ్బందిని మార్చి 10 వరకు, మరో రెండు స్థావరాల సిబ్బందిని మే 10 వరకు భారత్ వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుడు మొయిజ్జు కోరారు. ఇక..ఇటీవల భారత్ మాల్దీవులలో ఉన్న భద్రతా బలగాల బదులు నైపుణ్యం ఉన్న సిబ్బందని అక్కడికి బదిలీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని వెల్లడించింది. ఇటీవల మాలే నుంచి భారత మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఇరు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూడా ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. అంతలోపు మాల్దీవులలో ఉన్న భారత్ మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఇక.. రెండోసారి జరిగిన అధికారుల సమావేశంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ దేశంలోని భారత్‌కు చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని సైనిక బలగాల్లో.. ముందుగా ఒక స్థావరంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని మార్చి 10 వరకు భర్తీ చేయాలని కోరింది. మరో రెండు వైమానిక స్థావరాలోని మిలిటరీ బలగాల బదులుగా మాలేలో మే 10వరకు నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందని పంపిచాలని విజ్ఞప్తి చేసింది. ఇక.. మల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవలను అందించేందుకు భారత్ వైమానిక స్థావరాల్లో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది ద్వారా నిరంతరం కార్యకలాపాలు సాగించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్ల సమాచారం. -
Maldives: ‘మేలో భారత్ బలగాలు వెనక్కి.. ఏ దేశ జోక్యం అనుమతించం’
భారత్-మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత భద్రత బలగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ దేశ సార్వభౌమాధికారంలో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని భారత్‌ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం గమనార్హం. తమ ద్వీపదేశం నుంచి భారత్‌కు చెందిన భద్రతా బలగాలు మే 10 తేదీ వరకు వెనక్కి వెళ్లడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. మూడు బృందాలుగా ఉన్న భారత్ భద్రతా బలగాల్లో మొదటి బృందం మార్చి 10 తేదిన మాల్దీవుల నుంచి వెళ్లిపోనుందని తెలిపారు. అదేవిధంగా మిగిలిన రెండు సైనిక బృందాలు సైతం మే10లోగా పూర్తిగా మాల్దీవుల నుంచి వైదొలుగుతాయని పార్లమెంట్లో పేర్కొన్నారు. తమ దేశ అంతర్గత విషయాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలను భారత్‌తో ఇక మీదట పునరుద్దరించబోమని వెల్లడించారు. తమ దేశ సార్వభౌమాధికంలోకి ఏ ఇతర దేశం జోక్యం చేసుకోరదని.. అలా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోదని స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన 80 మంది భద్రతా బలగాలు.. మాల్దీవుల దేశంలో మానవతా సాయం, వైద్య అత్యవసర సాయం అందించటంలో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక.. మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై ఇక్కడి ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి కొనసాగతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంనే ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్లు పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేశాయి. కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే పార్లమెంట్ సమావేశాలకు హజరుకాగా.. 56 మంది గైర్హాజరు అయ్యారు. ఇటీవల పార్లమెంట్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఓ దశలో.. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేపెట్టడానికి కూడా సిద్ధపడ్డ విషయం తెలిసిందే. చదవండి: UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్ -
భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు గాయాలు!
ఈటానగర్: సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటనలో రెండు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భారత్-చైనా బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా సైనికులే వాస్తవాధీన రేఖను చేరుకోవడంతో భారత బలగాలు ప్రతిఘటించినట్లు సమాచారం. దాదాపు 300 మంది చైనా సైనికులు 17,000 అడుగుల ఎత్తులోని భారత పోస్టును తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మన సైనికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు గొడవపడ్డాయి. ఈ ఘర్షణలో ఆరుగురు భారత సైనికులకు గాయలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం గువహటి ఆస్పత్రికి తరలించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో భారత సైనికుల కంటే చైనా సైనికులే ఎక్కువ సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. 2020 జూన్ 15న జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతం గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అనేక మార్లు చర్చల అనంతరం సరిహద్దులో బలగాల ఉపసంహరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా మరోమారు కయ్యానికి కాలు దువ్వుతోంది. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
డోక్లామ్‌లో భారత్ గస్తీ.. చైనా ఆగ్రహం
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా మీడియా మరికొన్ని కీలక విషయాలను వెల్లడించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారించుకోవాలని చైనా చెబుతూనే, వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో 53 మంది భారత సైనికుల బృందం ఓ యుద్ధట్యాంకుతో ఎందుకు గస్తీ కాస్తుందని ప్రశ్నించింది. డోక్లామ్ తమ పరిధిలోకి వస్తుందని చెప్పినా భారత్ వెనక్కి తగ్గకపోవడంపై చైనా విదేశాంగశాఖ సీరియస్‌గా ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్న చైనా మీడియా.. ఇందుకు సంబంధించి చైనా ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు తెలిపింది. యుద్ధం వస్తే అందుకు తాము సంసిద్ధంగా ఉన్నామంటూ 'డ్రాగన్' పదే పదే హెచ్చరిస్తున్నా.. వారి బెదిరింపులకు భారత్ వెనుకడుగు వేయలేదు. దాదాపు 50 రోజులుగా ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే దాదాపు ఆరు వారాల పాటు 350 మంది భారత ఆర్మీ బృందం డోక్లామ్‌లో ఉన్నదని, జూలై నెలాఖరుకు ఓ యుద్ధట్యాంకుతో 40 మంది సైనికులు కాపాలా ఉన్నట్లు చైనా మీడియా ప్రచురించింది. ఆగస్టు రెండో తేదీ నాటికి వీరి సంఖ్య 48కి చేరుకోగా, రెండు రోజుల కింద భారత సైనికులు 53 మంది డోక్లామ్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. భారత్ చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కశ్మీర్లోకి అడుగుపెట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఓ చైనా ప్రతినిధి.. డోక్లామ్ సమస్యకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదన్నారు. తమ భూభాగాలతో పాటు సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యం తమకు ఉందంటూ భారత్‌కు హెచ్చరికలు పంపింది. డోక్లామ్‌లో భారత బలగాలను వెనక్కి రప్పించాలని లేనిపక్షంలో యుద్ధానికి సమయం ఆసన్నమైందని, జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చైనా భావిస్తున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
భారత్ మా సైనికుల్ని చంపేసింది: పాక్ ఆర్మీ
-
భారత్ మా సైనికుల్ని చంపేసింది: పాక్ ఆర్మీ
ఇస్లామాబాద్: భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు చనిపోయారని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఆదివారం రాత్రి భారత దళాలు నియంత్రణ రేఖ వద్ద బీంబర్ సెక్టార్‌లోని తమ స్థావరాలపై దాడి చేసినట్టు పాక్ ఆర్మీ వెల్లడించింది. భారత సైనికుల కాల్పులకు ప్రతిగా తమ దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపింది. భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు పేర్కొంది. భారత సైనికులు చేస్తున్న దాడుల్లో ఎక్కువగా తమ పౌరులు చనిపోతున్నారని పాక్ ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. జమ్ము కశ్మీర్లో ఉడీఉగ్ర దాడి అనంతరం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనికులు సర్జికల్ దాడులు చేశారు. కాగా పాక్ వీటిని తోసిపుచ్చింది. ఆ తర్వాత పాక్ 100 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు భారత దళాలు పేర్కొన్నాయి. పాక్ దాడులకు భారత సైనికులు దీటుగా బదులిస్తున్నారు. -
ఆగని పాక్ కాల్పులు
జమ్మూలో 400 స్కూళ్ల మూసివేత జమ్ము: పాకిస్తాన్ బలగాలు బుధవారం కూడా సరిహద్దులో బాంబు దాడులకు తెగబడ్డాయి. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో పాక్ దళాల కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. రాజౌరీ జిల్లా బీజీ సెక్టార్‌లోనూ పాక్ కాల్పులు జరిపింది. భారత దళాలు దీటుగా జవాబిచ్చాయి. కాల్పుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో400 పైగా స్కూళ్లను ప్రభుత్వం మూసివేసింది. పాక్ జవాన్లు భారత్‌లోని జనావాసాలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ్ అన్నారు. భారత్ ఎన్నడూ పాక్ జనావాసాలపై దాడి చేయలేదని పేర్కొన్నారు. పాక్ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సాధ్యమైనవన్నీ చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన భారత్ ఆర్మీ
-
ఇరాక్ కు భారత సైన్యమా?
న్యూఢిల్లీ: ఇరాక్ లో సున్నీ, షియాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధ పోరును నియంత్రించడానికి భారత సేనల్ని పంపే అవకాశముందని వస్తున్న వార్తలను రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఇరాక్ కు భారత సేనాలా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను ఊహించడం లేదు కూడా మంత్రి జైట్లీ మీడియాతో అన్నారు. ఇరాక్ లో సున్నీ చొరబాటుదారుల దాడుల కారణంగా 120 మంది భారతీయులు చిక్కుకు పోయారని, ఇరాక్ లో 10 వేల మంది భారతీయులు ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. Follow @sakshinews -
అమరులైన సైనికులకు స్వస్ధలంలో ఘనంగా నివాళులు
-
భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులకు గాయాలు
భారత్, పాక్ సరిహద్దు ప్రాంతమైన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం జరిపిన కాల్పుల్లో బుధవారం ఇద్దరు పాకిస్థాన్ సైనికులు గాయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తాము ఎటువంటి చర్యలకు దిగకుండానే భారత్ సైనికులు తమపై కాల్పులు జరిపారని పాకిస్థాన్ మిలటరీ అధికారి ఆరోపించారు. అయితే ఎల్ఓసీని పాక్ దళాలు అతిక్రమించిన కారణంగానే తాము కాల్పులు జరపవలసి వచ్చిందని భారత సైనిక అధికారులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఐదుగురు భారతీయ సైనికులను హతమార్చిన పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుందని జమ్ముకాశ్మీర్‌లోని సీనియర్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. కాగా ఇరుదేశాల సరిహద్దుల వద్ద యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్న నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య చర్చలకు విఘాతం కలిగి అవకాశం ఉంది. గతంలో భారతీయ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరపాలని పాక్ భావించింది. అయితే ఈ ఏడాది మొదట్లో కాశ్మీర్లో పాక్ విధ్వంసానికి యత్నించింది. దాంతో ఆ చర్చల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చాయి.