భారత్-మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత భద్రత బలగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ దేశ సార్వభౌమాధికారంలో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని భారత్‌ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం గమనార్హం. తమ ద్వీపదేశం నుంచి భారత్‌కు చెందిన భద్రతా బలగాలు మే 10 తేదీ వరకు వెనక్కి వెళ్లడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు.
మూడు బృందాలుగా ఉన్న భారత్ భద్రతా బలగాల్లో మొదటి బృందం మార్చి 10 తేదిన మాల్దీవుల నుంచి వెళ్లిపోనుందని తెలిపారు. అదేవిధంగా మిగిలిన రెండు సైనిక బృందాలు సైతం మే10లోగా పూర్తిగా మాల్దీవుల నుంచి వైదొలుగుతాయని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. తమ దేశ అంతర్గత విషయాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలను భారత్‌తో ఇక మీదట పునరుద్దరించబోమని వెల్లడించారు. తమ దేశ సార్వభౌమాధికంలోకి ఏ ఇతర దేశం జోక్యం చేసుకోరదని.. అలా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోదని స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన 80 మంది భద్రతా బలగాలు.. మాల్దీవుల దేశంలో మానవతా సాయం, వైద్య అత్యవసర సాయం అందించటంలో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక.. మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై ఇక్కడి ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి కొనసాగతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంనే ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్లు పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేశాయి. కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే పార్లమెంట్ సమావేశాలకు హజరుకాగా.. 56 మంది గైర్హాజరు అయ్యారు. ఇటీవల పార్లమెంట్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో ఓ దశలో.. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేపెట్టడానికి కూడా సిద్ధపడ్డ విషయం తెలిసిందే.
చదవండి: UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్
Comments
Please login to add a commentAdd a comment