మాలె: భారత భద్రతా బలగాలపై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి, మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ నేత అబ్దుల్లా షాహిద్ ఖండించారు. వేల సంఖ్యలో భారత భద్రత బలగాలు మాల్దీవులలో ఉన్నారని అధ్యక్షుడు మొయిజ్జు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు విదేశాలకు చెందిన సాయుధ మిలిటరీ బలగాలు మాల్దీవులలో ఎవరూ లేరని తెలిపారు.
పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫును అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మొయిజ్జు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతోంది. అప్పటి నుంచి భారత భద్రతా బలగాలు విషయంలో అబద్ధాలు చేబుతున్నారని విమర్శించారు. తాజాగా వేలల్లో భారత భద్రత బలగాలు మాల్లీవులలో ఉన్నారంటూ మరో కొత్త అబద్ధానికి తెరతీశారని అబ్దుల్లా షాహిద్ దుయ్యబట్టారు.
విదేశి భద్రత బలగాల సంఖ్య విషయంలో నిర్దిష్టమైన సమాచారాన్ని అందిచటంలో ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా తెలుస్తోందని ఎద్దేవా చేశారు. పారదర్శకత చాలా ముఖ్యమని.. నిజం గెలవాలని అన్నారు. ప్రస్తుతం 70 మంది భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉన్నారు. అయితే.. మాల్దీవుల నుంచి భారత భద్రత బలగాల ఉపసంహరించుకోవాలనే నినాదంతో మహ్మద్ మొయిజ్జు పార్టీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇక.. భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా.. భారత దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని భద్రతా బలగాల్లో ఒక స్థావరం సిబ్బందిని మార్చి 10 వరకు, మరో రెండు స్థావరాల సిబ్బందిని మే 10 వరకు భారత్ వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుడు మొయిజ్జు కోరారు. ఇక..ఇటీవల భారత్ మాల్దీవులలో ఉన్న భద్రతా బలగాల బదులు నైపుణ్యం ఉన్న సిబ్బందని అక్కడికి బదిలీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment