
నాలుగు గంటలపాటు చర్చలు
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమా వేశమయ్యారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విర మణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌పై ఒక అంగీకారానికి వచ్చే విష యమై సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అధ్యక్షుడు పుతిన్‌తో విట్కాఫ్ నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారని, ఇవి ఫలవంతమయ్యా యని ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ చెప్పారు.
అమెరికా, రష్యాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చే ప్రక్రియ సాగుతున్నందున చర్చల్లో కీలక పురోగతి సాధించొచ్చన్న ఊహాగానాలు చేయవద్దని అంతకుముందు దిమిత్రియేవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ ఏడాదిలో పుతి న్, విట్కాఫ్‌ల మధ్య జరిగిన మూడో భేటీ ఇది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరిని శుక్ర వారం ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది మతిలేని యుద్ధం, వేలాదిగా జనం చ నిపోతున్నారు. కాల్పుల విరమణకు రష్యా ముందుకు రావాలి’అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీని విడదీసినట్లుగానే ఉక్రెయిన్ ను రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ దూత కీత్ కెల్లాగ్ ఖండించిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను బ్రిటన్, ఫ్రాన్సు బలగాలకు అప్పగించే ప్రతిపాదన ఉన్నట్లు కెల్లాగ్ తెలిపారని టైమ్స్‌లో ఓ కథనం వెలువడింది. అనంతరం దీనిని కెల్లాగ్ ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీ కరించారని చెప్పారు. కాల్పుల విరమణ అనంతరం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వీలుగా సైనిక మద్దతి వ్వాలని చెప్పానే తప్ప, విభజన గురించి మాట్లాడలేదన్నారు.