St. Petersburg
-
రష్యాపై డ్రోన్ల వర్షం.. మాస్కోకు సమీపంలో విధ్వంసం
కీవ్: డ్రోన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా జరిగిన దాడుల్లో దేశంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇంతకాలం ఉక్రెయిన్ సరిహద్దుల సమీపానికే పరిమితమైన దాడులు ఏకంగా రాజధాని మాస్కో సమీపం దాకా చొచ్చుకొచ్చాయి. ఒక డ్రోన్ మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టించింది! పలు డ్రోన్లను రష్యా పేల్చేసింది. మరోవైపు హాకింగ్ దెబ్బకు రష్యా టీవీ, రేడియో ప్రసారాలకు చాలాసేపు అంతరాయం కలిగింది. డ్రోన్ల కలకలంతో సెయింట్ పీటర్స్బర్గ్ విమానాశ్రయాన్ని గంటలపాటు మూసేయాల్సి వచ్చింది! ఈ దాడులన్నీ ఉక్రెయిన్ పనేనంటూ రష్యా మండిపడింది. తమపై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఎలాంటి దాడులకైనా పాల్పడే హక్కు తమకుందంటూ ఉక్రెయిన్ నర్మగర్భ వ్యాఖ్యలతో సరిపెట్టింది. రష్యా మిత్రదేశమైన బెలారస్లో ఓ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో రూ.2,737 కోట్ల విలువైన రష్యా నిఘా విమానంతో పాటు మరో సైనిక రవాణా విమానం, పలు వాహనాలు దెబ్బ తిన్నట్టు చెబుతున్నారు. ఇది స్థానిక ఉక్రెయిన్ మద్దుతుదారుల పనేనని అనుమానిస్తున్నారు. -
రష్యా రక్షణ శాఖ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వంలోని మరో ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందారు. రక్షణ శాఖలో పని చేస్తున్న 58 ఏళ్ల మరీనా యాంకినా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అపార్ట్మెంట్లో 16వ అంతస్తులో ఉన్న తన నివాసం కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయారా, ఆత్మహత్య చేసుకున్నారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 160 అడుగుల ఎత్తు నుంచి కిండ పడిపోవడంతో ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో ఉన్న మరీనాను ఆ మార్గం నుంచి వెళుతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై జరిపే యుద్ధంలో నిధుల సేకరణలో మరీనా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
తేలియాడే అణువిద్యుత్ కేంద్రం
రష్యా: అకడమిక్ లోమనోసోవ్ అనే ఈ నావలో ప్రపంచంలోనే తొలిసారిగా అణువిద్యుత్ కేంద్రాన్ని రూపొందించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డులో రష్యా ప్రభుత్వ అణుశక్తి కార్పొరేషన్ దీన్ని నిర్మించింది. చుక్టోకాలోని పోర్ట్ ఆఫ్ పెవెక్కు దీన్ని తరలిస్తున్నారు. చుక్టోకాకు వెళ్లాక ఇంధనాన్ని నింపి ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2019లో ప్రారంభమయ్యే ఈ కేంద్రం ద్వారా ఏటా 50వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించవచ్చు. -
రష్యా రైల్లో ‘ఉగ్ర’ పేలుడు
-
రష్యా రైల్లో ‘ఉగ్ర’ పేలుడు
9 మంది మృతి.. 20 మందికి గాయాలు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నడుస్తున్న రైల్లో దుశ్చర్య మరో ఘటనలో రైల్వే స్టేషన్లో పేలుడు పదార్థం.. నిర్వీర్యం చేసిన పోలీసులు - పేలుడు సమయంలో నగరంలో అధ్యక్షుడు పుతిన్ - బాధిత కుటుంబాలకు మోదీ సంతాపం సెయింట్ పీటర్స్బర్గ్: రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్ సోమవారం బాంబు పేలుడుతో అదిరిపడింది. నగరం నడిబొడ్డున ప్రయాణిస్తున్న సబ్వే మెట్రో రైల్లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద దాడి కావొచ్చని అనుమానిస్తున్నారు. టెక్నాలజిచెస్కీ ఇన్స్టిట్యూట్, సెన్నాయా స్క్వేర్ స్టేషన్ల మధ్య సొరంగ మార్గంలో వెళ్తున్న రైల్లోని ఓ బోగీలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:40 గంటలకు పేలుడు జరిగింది. డ్రైవర్ రైలును సొరంగంలో ఆపకుండా పక్క స్టేషన్‌కు తీసుకెళ్లి నిలిపేశాడు. దీంతో ప్రాణనష్టం భారీగా తప్పిందని అధికారులు చెప్పారు. పేలుడు ధాటికి బోగీ తలుపు ధ్వంసమైంది. స్టేషన్లో రక్తసిక్త మృతదేహాలతోపాటు పలువురు గాయాలతో నెత్తురోడుతూ, సాయం కోసం అర్థిస్తూ కనిపించారు. క్షతగాత్రుల్లో పలువురు బాలలు ఉన్నారు. ఇప్పటివరకు 9 మంది చనిపోయారని, క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు. బోగీలో ఓ వ్యక్తి సూట్‌కేసును వదిలిపెట్టి పక్క బోగీ ఎక్కాడని, తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలోనే సూట్‌కేస్ వదలిపెట్టిన బోగీలో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రైల్లో బాంబు పెట్టినట్లు భావిస్తున్న వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. మరోపక్క.. నగరంలోని వోస్తానియా స్క్వేర్ అనే మరో మెట్రో స్టేషన్లో పేలుడు పదార్థం దొరికింది. భద్రతా సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. అంతకుముందు.. మాస్కో ప్రజా రవాణా వ్యవస్థపై దాడుల కోసం ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని భద్రతా వర్గాలు చెప్పాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అన్ని మెట్రోస్టేషన్లను మూసేసి ప్రయాణికులను ఖాళీ చేయించారు. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. బెలారస్ అధ్యక్షుడితో చర్చల కోసం నగరానికి వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్ పుతిన్ స్వస్థలం. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. పేలుళ్లకు కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడా, మరో దాడా అన్నది దర్యాప్తులో తేలుతుందని, మొదట ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఉగ్రదాడి అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా దర్యాప్తు కమిటీ కూడా పేర్కొంది. పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని మాస్కోలోని మెట్రో నెట్‌వర్క్‌కు భద్రతను పటిష్టం చేశారు. దేశవ్యాప్తంగా రవాణా కూడళ్లలో నిఘా పెంచారు. ఢిల్లీలో హైఅలర్ట్: రష్యా పేలుడు నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో హైఅలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులను చేతులతో తడిమి తనిఖీ చేశారు. సాధారణ భద్రతను పటిష్టం చేయాలని మెట్రో రక్షణ బాధ్యతలు చూస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సంబంధిత సిబ్బందిని ఆదేశించింది. సెయింట్ పీటర్స్బర్గ్ పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. గతంలోనూ దాడులు.. రష్యాలో ప్రజా రవాణా వ్యవస్థలపై గతంలోనూ దాడులు జరిగాయి. 2013లో వోల్గోగ్రాడ్‌లో ఆత్మాహుతి దాడు ల్లో 34 మంది బలయ్యారు. 2011లో మాస్కో విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడిలో 34 మంది చనిపోయారు. చెచెన్యా తిరుగుబాటుదారులతోపాటు పలు ఉగ్ర సంస్థలు రష్యాలో దాడులకు తెగబడుతున్నాయి. గత నెల 24న చెచెన్యాలోని నేషనల్ గార్డ్ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు రష్యన్ సైనికులు చనిపోయారు. సిరియాలో ఐసిస్ఉగ్ర సంస్థపై రష్యా దాడుల నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
సెయింట్ పీటర్స్ బర్గ్ కు వరల్డ్ ట్రావెల్ అవార్డ్
యూరప్ లోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా ఎంపికైన సెయింట్ పీటర్స్ బర్గ్ వరల్డ్ ట్రావెల్ అవార్డును గెలుచుకుంది. ఈ రష్యన్ పోర్ట్ నగరం గత సంవత్సరం కూడా ప్రపంచ రికార్డును సాధిచింది. నేవా నది ఒడ్డుపై, ఫిన్లాండ్ బాల్టిక్ సముద్రం ఒడ్డున ఉన్న సెయింట్ పీటర్స్ బర్గ్ ను 1703 లో పీటర్ ది గ్రేట్ నిర్మించాడు. యూరప్ లోనే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా సెయింట్ పీటర్స్ బర్గ్ వరుసగా రెండోసారి అవార్డును సంపాదించినట్లు వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. 2016 లో సుమారు పది లక్షలమంది యాత్రికులు, టూరిస్ట్ ఎక్స్ పర్ట్ లు సెయింట్ పీటర్స్ బర్గ్ ను బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ఓటు వేసి ఎన్నుకున్నారు. పీటర్స్ బర్గ్ ప్రముఖ సందర్శనా స్థలంగా ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందడానికి యాత్రికులకు ఇక్కడ కల్పించే మౌలిక సదుపాయాలు, భద్రత, హోటల్స్ కారణమని గ్జిన్హువా న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది. మొట్టమొదటిసారి వరల్డ్ ట్రావెల్ అవార్డును 1993 లో ప్రారంభించగా 2015 నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ ను భారీగా విదేశీ యాత్రికులు సందర్శిస్తుండటంతో వరుసగా రెండోసారి కూడా ఈ నగరం ట్రావెల్ అవార్డును కైవసం చేసుకుంది. -
కనిపించని కామెడీ
మిస్సింగ్ మాధవ్ శింగరాజు లైఫ్‌లో సీరియస్ విషయాలు కొన్ని భలే కామెడీగా టర్న్ తీసుకుంటాయి. ఎవరి లైఫ్‌లో? ‘ఎవరి’ ఏంటి? ఒక్కొక్కరికీ ఒక్కో లైఫ్ ఉండే కాలంలో ఉన్నామా మనం! అందరికీ ఒక్కరే నరేంద్ర మోదీ. అందరికీ ఒక్కరే బరాక్ ఒబామా. ఇక వేర్వేరుగా ఎలా ఉంటాయి జీవితాలు? ఇవాళ మీ ఇంట్లో వంకాయ, మా ఇంట్లో బెండకాయ. అంతమాత్రాన మన జీవితాలు ఎవరివి వారివై పోతాయా? టీవీలో అక్కడ మీకు కనిపిస్తున్నదీ, ఇక్కడ మాకు కనిపిస్తున్నదీ అదే మోదీలు, అదే ఒబామాలే అయినప్పుడు ఎవరి జీవితం వారికి సపరేట్గా ఏ రైతు బజార్ నుండి వస్తుంది చెప్పండి? అందుకే లైఫ్ అంటే ఇప్పుడు మనమూ మన కరెంట్ బిల్లులే కాదు. ఇరుగుపొరుగిళ్ల కరెంట్ అఫైర్స్ కూడా. 12, తుగ్లక్ రోడ్డు నివాసంలో రాహుల్‌గాంధీ, క్రెమ్లిన్ భవనంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొంతకాలంగా కనిపించడం లేదు! ప్రస్తుతం ఇదే మన జీవితాల్లోని పెద్ద కామెడీ. ఎవరైనా ‘కనిపించకపోవడం’ సీరియస్ విషయం కదా. కామెడీ ఎలా అవుతుంది? అయింది! ఫిబ్రవరి 23న పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచీ మన దగ్గర రాహుల్ గాంధీ కనిపించడం లేదు. రష్యాలో పుతిన్ కూడా పది రోజులుగా కనిపించడం లేదు. ఇద్దరూ ఏమైనట్టు? రాహుల్‌కి పార్లమెంటులో పెద్దగా పనేమీ లేదనుకుందాం. మరి పుతిన్‌కి ఏమైంది? కజఖ్‌స్తాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్లినట్టు? దక్షిణ అస్సెటియా నుంచి తన సంతకాల కోసం మాస్కో వస్తున్న ఒప్పందాల బృందానికి... ‘‘కంగారేం లేదు, మెల్లిగానే రండి’’ అనే సమాచారాన్ని ఆఖరి నిముషంలో పంపించి ఆయన ఎటు వెళ్లినట్టు? అతి కీలకమైన రష్యా ఇంటెలిజెన్స్ సమావేశానికి కూడా అందుబాటులో లేకుండా ఆయన ఏమైపోయినట్టు? ఎక్కడ ఉన్నట్టు? ఏవేవో వినిపిస్తున్నాయి. పుతిన్‌కి ఫ్లూ... అందుకే బయటికి రావడం లేదు! పుతిన్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. అక్కడ ప్రియురాలు ఎలీనా కబేవా ప్రసవిస్తే తన బిడ్డను చూడ్డానికి వెళ్లారు! పుతిన్‌కి గుండెపోటు! పుతిన్‌పై తిరుగుబాటు! పుతిన్ క్రెమ్లిన్‌లో బందీగా ఉన్నాడు! పుతిన్ చనిపోయారు! ఇవన్నీ ఇక్కడితో ఆగలేదు. పుతిన్‌ని ఏలియన్స్ తీసుకెళ్లినట్లు ఓ పత్రికలో కార్టూన్. సమాధిలో లెనిన్ పక్కనే పుతిన్ మృతదేహం కూడా ఉన్నట్లు ఇంకో కార్టూన్. పుతిన్‌ని ఎవరో పాతిపెట్టి వెళుతున్నట్లు యూట్యూబ్‌లో వీడియో! దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తనకై తానే పుతిన్ చనిపోయాడని ఇంకో సెటైర్. రాహుల్ మీద ఇంత జరగలేదు. ‘‘ఈ మనిషి ఎక్కడి కి పోయినట్టూ...’’ అని మాత్రం అనుకున్నారంతే. అయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు రాహుల్ ఇంటికి వెళ్లి, ఆయన గురించి అక్కడి వాళ్లను ఆరా తీయడం కామెడీ అయింది. రాహుల్జీ ఇంట్లో ఉన్నారా? చూడ్డానికి ఆయన ఎలా ఉంటారు? ఎంతెత్తు ఉంటారు? ఒడ్డూపొడవు ఎలా ఉంటుంది? ఒంటి రంగేమిటి? మనిషిలో కొట్టొచ్చినట్లు కనిపించేవేమైనా ఉన్నాయా? ఆయన కళ్ల రంగేమిటి? కళ్లద్దాలు పెట్టుకుంటారా? నడిచే తీరు ఎలా ఉంటుంది? మనిషి ఆనవాళ్లేమిటి? ఏ భాష మాట్లాడతారు? ఎలాంటి బట్టలు వేసుకుంటారు? ఏ టైప్ షూజ్ వాడతారు? మీసం ఉంటుందా? గెడ్డం ఉంటుందా? ఆయన సన్నిహితులెవరు? వాళ్ల ఫోన్ నెంబర్లు, అడ్రెస్లు ఏమిటి?... ఇన్ని ప్రశ్నలు వేశారు. ఇదంతా ప్రముఖుల సెక్యూరిటీ సర్వేలో భాగంగా జరిగిన వివరాల సేకరణ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పినప్పటికీ, కనిపించని మనిషిని వెతికి పట్టుకునేందుకు అడిగిన ప్రశ్నల్లానే ఉన్నాయి అవన్నీ. ఈ కామెడీ ఇలాగే కంటిన్యూ అవాలని పడీపడీ కోరుకునేవారు కొన్నాళ్లపాటు టీవీని స్విచాఫ్ చెయ్యడం తెలివైన పని. రాహుల్ అయినా, పుతిన్ అయినా ఇవాళో, రేపో రాకమానరు, టీవీలో కనిపించకా మానరు కాబట్టి. (పుతిన్ ఆల్రెడీ వచ్చేశారు! నిన్న సోమవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యక్షమయ్యారు). టీవీ స్విచాఫ్ చెయ్యడం వల్ల ఇంకో ప్రయోజనం... తిరిగి ఎవరి లైఫ్‌లు వాళ్లకొచ్చేస్తాయి. మోదీ, ఒబామా కూడా కనిపించరు కాబట్టి. -
న్యూయార్క్ వర్సిటీలో భారత శాస్త్రవేత్తకు ఉన్నత పదవి
న్యూయార్క్: ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ కాటేపల్లి శ్రీనివాసన్ న్యూయార్క్ యూనివర్సిటీలోని పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన నవకల్పనల పీఠానికి(ఈజెన్ క్లీనర్ చైర్) అధిపతిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్సిటీ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ డీన్‌గా ఉన్నారు. ఆయన విద్య, సాంకేతిక రంగాల్లోనే కాకుండా శాస్త్రీయ ఆవిష్కరణల్లో కూడా కృషి చేశారు. భారత్‌లో జన్మించిన శ్రీనివాసన్ గతంలో మేరీలాండ్, యేల్ వర్సిటీల్లో పనిచేశారు.